🌹 . శ్రీ శివ మహా పురాణము - 659 / Sri Siva Maha Purana - 659 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 17 🌴
🌻. గణేశుడు మరల జీవించుట - 3 🌻
ఇపుడు గిరిజా దేవి ప్రసన్నురాలైనచో మనకు స్వస్థత చేకూరును. లేనిచో కోటి ప్రయత్నములను చేసిననూ ప్రయోజనము లేదు (20). శివుడు కూడా లోకపు పోకడను అనుసరించి దుఃఖితుడాయెను. అనేక లీలలను నెరపుటలో పండితుడగు శివుడు ఆ సమయములో అందరినీ మోహింపజేసెను (21). దేవతలందరి నడుము విరిగెను. క్రోధముతో మండిపడుతున్న పార్వతి యెదుట నిలబడుటకు వారెవ్వరూ సాహసించలేదు (22). ఓ మునీ! తనవాడు గాని, పరాయి వాడు గాని, దేవత గాని, రాక్షసుడు గాని, గణములు గాని, దిక్ పాలకుడు గాని, యక్షుడు గాని, కిన్నరుడు గాని, మహర్షి గాని, (23), విష్ణువు గాని, బ్రహ్మ గాని, శంకర ప్రభుడు గాని ఒక్కడైననూ గిరిజా దేవి యెదుట పిలబడుటకు సమర్ధుడు కాలేకపోయెను (24).
మండిపడుతూ సర్వమును కాల్చివేసే ఆ తేజస్సును చూచి వారందరు మిక్కిలి భీతిల్లి బహుదూరములో నిలబడిరి (25). ఓ నారదమునీ! ఇంతలో దివ్యమగు దర్శనము గల నీవు దేవతలకు, గణములకు సుఖమును కలిగించుట కొరకై అచటకు వచ్చితివి (26). బ్రహ్మనగు నాకు, శివునకు, విష్ణువునకు ప్రణమిల్లి దగ్గరకు వచ్చి నీవు అందరినీ కలిసి కర్తవ్యమును గూర్చి విచారించితివి(27). దేవతలందరు మహాత్ముడవగు నిన్ను సంప్రదించిరి. వారు నిన్ను ' ఈదుఃఖము శాంతిచు విధమెయ్యది?' అని ఏకకంఠముతో ప్రశ్నంచిరి(28).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 659🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 17 🌴
🌻 The Resuscitation of Gaṇeśa - 3 🌻
20. “Only when the goddess Pārvatī is pleased can there be a relief; not otherwise, even with our maximum efforts.
21. Even Śiva who is an expert in different sports and is deluding us all, seems distressed like an ordinary man.
22. When the hips of all the gods are broken and Pārvatī is fiery in rage, none of them dare stand before her.
23-24. Whether a person belonging to her or to others, whether a god, a demon, a Gaṇa, a guardian of the quarters, a Yakṣa, a Kinnara, a Sage, Brahmā, Viṣṇu or even lord Śiva himself, none could stand before Śiva.
25. On seeing her dazzling brilliance, burning all round, all of them were frightened and they stayed far away.
26. In the meantime, O sage Nārada, you of divine vision came there for the happiness of the gods and Gaṇas.
27. After bowing to me, Brahmā, Viṣṇu and Śiva and discussing jointly, he said—“Let us think and act together.”
28. The gods then discussed with you of noble soul “How could our misery be quelled.” They then said.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments