🌹 . శ్రీ శివ మహా పురాణము - 663 / Sri Siva Maha Purana - 663 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 1🌻
నారదుడిట్లు పలికెను -
ఓ ప్రజాపతీ! పార్వతీ తనయుడు జీవించెను ఆమె తన పుత్రుని చూచెను. ఆ తరువాత అచట ఏమాయెను? అ విషయమును దయతో ఇప్పుడు చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! పార్వతీ తనయుడు జీవించెను. దేవి ఆతనిని చూచెను. ఆ తరువాత జరిగిన మహోత్సవమును గురించి నీకిపుడు చెప్పెదను (2).
ఓ మునీ! జీవించిన ఆ పార్వతీ పుత్రుడు చింత గాని, వికారము గాని లేకుండ నుండెను. అపుడా గజాననుని దేవతలు, గణనాయకులు అభిషేకించిరి (3). పార్వతీదేవి తన కుమారుని చూచి ఆనందముతో నిండిన మనస్సు గలదై ఆ బాలకుని చేతులతో దగ్గరకు తీసుకొని ఆ లింగనము చేసుకొనెను (4). ఆ జగన్మాత తన పుత్రుడగు ఆ గణేశునకు వివిధ వస్త్రములను, అనేక అలంకారములను ప్రీతితో ఇచ్చెను (5).
ఆ దేవి గణేశుని ఆదరించి అనేక సిద్ధులను ఇచ్చి దుఃఖములనన్నిటినీ పోగొట్టే తన చేతితో ఆతనిని స్పృశించెను(6). శాంకరీ దేవి కుమారుని ఆదరించి ముఖమును ముద్దాడి ప్రీతితో వరములనిచ్చెను. ఆమె ఇట్లు పలికెను : నాయనా! నీకు ఇపుడు పుట్టుటతోడనే ఆపద కలిగినది (7).
నీవు ధన్యుడవు కృతకృత్యుడవు. నిన్ను దేవతలందరు మున్ముందుగా పూజించెదరు. నీవు సర్వకాలముల యందు దుఃఖరహితుడవై ఉండెదవు (8). ఇపుడు నీ ముఖము నందు సిందూరము కనబడుచున్నది. కావున మానవులు నిన్ను సర్వదా సిందూరముతో పూజించెదరు (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 663🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴
🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 1 🌻
Nārada said:—
1. O lord of subjects, when the son of Pārvatī was resuscitated and seen by.the goddess, what happened then? Please narrate to me now.
Brahmā said:—
2. O great sage, when the son of Pārvatī was resuscitated and seen by the goddess, listen to what happened there. I shall narrate the jubilation that ensued.
3. O sage, that son of Pārvatī was resuscitated. He was free from distress and perturbation. Then he was crowned by the gods and the leaders of Gaṇas.
4. On seeing her son, Pārvatī was highly delighted. Taking him up with both her hands she embraced him joyously.
5. She then lovingly gave him different clothes and ornaments.
6. He was honoured by the goddess who bestowed all Siddhis on him and touched him with her hand that removes all distress.
7. After worshipping her son, and kissing his face, she granted him boons with affection and said—“You have had great distress since your very birth.
8. You are blessed and contented now. You will receive worship before all the gods. You will be free from distress.
9. Vermillion is visible on your face now. Hence you will be worshipped with vermillion by all men always.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments