🌹 . శ్రీ శివ మహా పురాణము - 665 / Sri Siva Maha Purana - 665 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 3 🌻
అపుడు గణేశుడు లేచి శివునకు, పార్వతికి, నాకు విష్ణువునకు (18), మరియు నారదాది బుషులందరికీ నమస్కరించి వారి ఎదుట నిలబడి ఇట్లు పలికెను : నా అపరాధమును మన్నించుడు. ఇట్టి అభిమానము (అహంకారము) ను కలిగియుండట మానవుల లక్షణము (19). నేను, శంకరుడు మరియు విష్ణువు అనే త్రిమూర్తులు ఉత్తమ వరములనిచ్చి ఒక్క సారిగా ప్రీతితో నిట్లు పలికితిమి (20). త్రిమూర్తులమగు మేము మల్లోకములలో ఎట్లు పూజింప బడుచున్నామో, అదే విధముగా సర్వులు ఈ గణనాథుని కూడా పూజించెదరు గాక! (21)
మేము ప్రకృతి నుండి పుట్టితిమి. ఇతడు కూడా ప్రకృతి నుండి పుట్టినాడు గాన నిశ్చయముగా పూజ్యుడు. గణేశుడు విఘ్నములను పారద్రోలి, కొర్కెలనన్నిటినీ ఈడేర్చును (22). మానవులు ముందుగా ఇతనిని పూజించి తరువాత మమ్ములను పూజించవలెను. ఇతనిని పూజించనిచో, మలో ఎవ్వరినైననూ పూజించినట్లు గాదు (23).
ఇతనిని పూజించకుండగా ఇతర దేవతలను పూజించినచో, ఆ ఫలము లభించదు. ఓ దేవతలారా! ఈ విషయములో సందేహించకుడు (24). ఇట్లు పలికి ముందుగా శివుడు, తరువాత విష్ణువు ఆ గణేశుని ఆదరముగా అనేక వస్తువలతో పూజించిరి (25).
సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 SRI SIVA MAHA PURANA - 665🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴 🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 3 🌻 18-19. Getting up and bowing to Śiva, Pārvatī, Viṣṇu and me, Gaṇeśa stood in front of Nārada and other sages and said—“My guilt shall be forgiven. Arrogance is the characteristic of Man’s nature.” 20. We three Śiva, Viṣṇu and I said to the gods simultaneously with pleasure, after granting him excellent boons 21. “O great gods, just as we three are worshipped in all the three worlds, so also he shall be worshipped by all of you.” 22. We are the offsprings of primordial nature. He is also the same and hence worthy of worship. He is the remover of all obstacles and the bestower of the fruits of all rites. 23. He shall be worshipped first and we shall be worshipped afterwards. If he is not worshipped, we too are not worshipped. 24. If the other deities are worshipped when he is not worshipped, the fruit of that rite will be lost. There is no doubt in this matter. 25. After saying this we worshipped him. Śiva worshipped Gaṇeśa with various articles of worship. Viṣṇu worshipped him afterwards. Continues.... 🌹🌹🌹🌹🌹
コメント