🌹 . శ్రీ శివ మహా పురాణము - 668 / Sri Siva Maha Purana - 668 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 6 🌻
ఉపవాసముండి దూర్వలతో పూజించవలెను. రాత్రి యొక్క మొదటి యామము నందు స్నానముచేసి మానవుడు పూజించవలెను (41). లోహమూర్తిని గాని, పగడముల మూర్తిని గాని, తెల్ల జిల్లెడుతో చేసిన మూర్తిని గతాని, మట్టితో చేసిన మూర్తిని గాని పూజించవలెను (42). మానవుడు అట్టి మూర్తిని ప్రతిష్ఠించి నానావిధములగు దివ్యచందనముతో మరియు సుగంధ ద్రవ్యములతో, పుష్పములతో శ్రద్ధగా పూజించవలెను (43). దూర్వలు పన్నెండు అంగుళముల పొడవు గలవై వ్రేళ్లు లేనివిగా ఉండవలెను. వాటికి ఉపాంగములు ఉండరాదు. దూర్వలు గట్టిగా నుండవలెను. నూట ఒక్క దూర్వాలతో ఆ ప్రతిమను పూజించవలెను (44).
గణనాయకుని ప్రతిమను ఇరవై ఒక్క పత్రములతో పూజించి ధూపదీపములను, వివిధ నైవేద్యములను సమర్పించవలెను (45). ఆ ప్రతిమయందు నిన్ను ఈ విధముగా తాంబూలముతో, పవిత్ర పూజాద్రవ్యములతో పూజించి ప్రణమిల్లి స్తుతించి బాలచంద్రుని కూడా పూజించవలెను (46). తరువాత బ్రాహ్మణులను చక్కగా పూజించి, మధుర పదార్ధములతో ఆనందముగా భోజనము నిడవలెను. తరువాత తాను కూడా ఉప్పులేని మధురమగు ఆహారమును భుజించవలెను (47). తరువాత వ్రత నియముములనన్నిటినీ విడిచి పెట్టి గణేశుని స్మరించినచో, ఈ శుభవ్రతము పూర్తియగును (48).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 668🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴
🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 6 🌻
41. He shall perform worship with the Dūrvā grass and observe fast. After a Prahara has elapsed in the night the devotee shall take bath and worship.
42-43. The idol shall be made of metal, coral, white Arka flowers or clay. It shall be installed and worshipped by the devotee with all purity, with scents of various kinds, divine sandal paste and flowers.
44-45. A handful of Dūrvā grass having three knots and without roots shall be used for worship. The shoots shall be hundred and one in number. With twentyone the idol shall be worshipped. Gaṇeśa shall be adored with incense, lamps and different kinds of food-offerings.
46. After worshipping you with various articles of worship like betel etc. and eulogising you with hymns, the devotee shall worship the crescent moon.
47. Afterwards, he shall feed the brahmins joyously with sweets with due honour. He himself shall take sweets and avoid salt.
48. Then the rites shall formally be dismissed. Then he shall remember Gaṇeśa. Thus the Vrata shall be concluded auspiciously.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments