🌹 . శ్రీ శివ మహా పురాణము - 669 / Sri Siva Maha Purana - 669 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 7 🌻
ఈ వ్రతమును మానవుడు ఆచరించి ఒక సంత్సరము తరువాత వ్రతపూర్తి కొరకై ఉద్యాపనమును అనుష్ఠించవలెను (49). దానియందు పన్నెండు గురు బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇది నా ఆజ్ఞ. ఒక కలశమును స్థాపించి నీ మూర్తిని పూజించవలెను (50). అపుడు వేద విధానము ననుసరించి అష్ట దళ పద్మములను ముగ్గువేసి అదే స్థలములో హోమమును చేయవలెను. ఈ వ్రతమును చేయుటలో దనలోభమును విడువవలెను (51).
మరియు అచట మూర్తి యెదుట ఇద్దరు స్త్రీలను, ఇద్దరు బాలకులను పూజించి ఆదరముతో యథావిధిగా భోజనమునిడవలెను (52). రాత్రి జాగరమును చేసి మరల ఉదయము పూజను చేయవలెను. తరువాత మరల మరల రావలెనని ప్రార్థించి ఉద్వాసన చెప్పవలెను (53). వ్రతము పూర్ణమగుట కొరకై ఒక బాలకునకు దోసెడు పువ్వులను సమర్పించి వాని నుండి ఆశీస్సులను గ్రహించి స్వస్తి మంత్రములను పఠించవలెను (54). తరువాత నమస్కరించి మిగిలిన కార్యముల నన్నిటినీ పూర్తి చేయవలెను. ఇట్లు వ్రతము చేసిన వానికి కోరిన ఫలము లభించును (55).
ఓ గణేశా! నిన్ను నిత్యము శ్రద్ధతో యథాశక్తి పూజించు వాని కోర్కెలన్నియూ ఈడేరును (56). గణేశుడవగు నిన్ను సిందూరము, గంధము, బియ్యము, మొగలి పువ్వులు మరియువివిధ ఉపచారములతో పూజించవలెను (57).
ఎవరైతే ఈ విధముగా నిన్ను భక్తితో అనేక ఉపచారములను సమర్పించి పూజించెదరో, వారికి సిద్ధి కలుగును. వారిని విఘ్నములు ఏనాడైననూ బాధించవు (58). అన్ని వర్ణములవారు, మరియు స్త్రీలు కూడ ఈ వ్రతమును ప్రత్యేకముగా చేయవలెను. అభివృద్ధిని గోరు రాజులు ఈ వ్రతమును విశేముగా చేయవలెను (59). ఎవరెవరు ఏయే కొర్కెలను కలిగి యుందురో వారు వారు నిన్ను నిత్యము పూజించి ఆయా కోర్కెలను నిశ్చితముగా పొందవచ్చును (60).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 669🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴
🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 7 🌻
49. When thus the Vrata is duly completed in a year, the devotee shall perform the rite of formal dismissal for the completion of the Vrata.
50. At my bidding twelve brahmins shall be fed. After placing a jar your image shall be worshipped.
51. After making the eight-petalled lotus diagram on the ground in accordance with Vedic injunctions a sacrifice shall be performed by the liberal people who have no disinclination to spend money.
52. Two women and two students shall be worshipped and fed in front of the idol duly.
53. The devotee shall keep awake at night and perform worship in the morning. After that the rites of formal dismissal with the mantra “Kṣemāya Punarāgamanāya Ca.” (For welfare and return again) shall be performed.
54. The benediction as well as good wishes shall be received from the boy. In order to make the Vrata complete, handfuls of flowers shall be offered.
55. After prostrations, various routines shall be carried on. He who performs Vratas like this can secure the desired fruits.
56. O Gaṇeśa, he who performs your worship upto his ability, with faith, shall derive the fruit of all desires.
57. The devotee shall worship you, the lord of Gaṇas with vermillion, sandal paste, raw rice grains and Ketaka flowers as well as with other services.
58. They who devoutly worship you with acts of service will achieve success. Their obstacles will be quelled.
59. These Vratas shall be performed by the people of all castes, particularly by women as well as kings aiming and beginning to be prosperous and flourishing.
60. He will certainly derive whatever he desires. Hence you shall always be served by him whoever he is who desires fruits.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments