🌹 . శ్రీ శివ మహా పురాణము - 670 / Sri Siva Maha Purana - 670 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 8 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహాత్ముడగు గణేశునకు శివుడు ఇట్లు చెప్పెను. అపుడు సమస్త దేవతలు, మహర్షులు (61). శివునకు ప్రియులగు సర్వగణములు 'అటులనే చేసెదము' అని పలికి గణేశుని శ్రద్ధతో యథావిధిగా పూజించిరి (62). అపుడు సర్వగణములు ఆ గణేశునకు ప్రణమిల్లి అనేక వస్తువులతో ఆదరముగా ప్రత్యేక పూజను చేసిరి (63). ఓ మహర్షీ! అపుడు పార్వతి పొందిన హర్షమును నేను నాల్గు ముఖములతోనైననూ వర్ణింపజాలను (64).
దేవదుందుభులు మ్రోగినవి. అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వశ్రేష్ఠులు గానము చేసిర. పుష్పవృష్టి కురిసెను (65). గణేశుడు ఈవిధముగా పురుజ్జీవుతడై పూజింపబడగా జగత్తు స్వస్ధతను పొందెను. గొప్ప ఉత్సవము జరిగెను. అందరి దుఃఖము తొలగిపోయెను (66).
ఓ నారదా! పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి సంతసించిరి. అంతటా సుఖకరమగు మంగళోత్సవము విస్తరముగా జరిగెను (67). అపుడు అచటకు విచ్చేసిన సమస్త దేవతా గణములు, మరియు బుషి బృందములు శివుని అనుమతిని పొంది తమ నెలవులకు వెళ్లిరి (68). పార్వతిని, గణేశుని చాల సార్లు ప్రశంసించి, శివుని స్తుతించి యుద్ధమును గురించి సవిస్మయముగా వర్ణిస్తూ వారు వెళ్లిరి (69).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 670🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴
🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 8 🌻
Brahmā said:—
61-62. When this was mentioned by Śiva to Gaṇeśa of great soul, O sage, the gods, the sages and the Gaṇas, favourites of Śiva said “So be it” and worshipped Gaṇeśa according to prescribed rules.
63. All the Gaṇas, particularly bowed to Gaṇeśa and adored him respectfully with various articles.
64. O great sage, how can I describe even with my four mouths the indescribable delight of Pārvatī.
65. The divine drums were sounded. The celestial damsels danced. The Gandharva chiefs sang. Flowers were showered upon him.
66. When Gaṇeśa was installed, the whole universe attained peace and normalcy. There was great jubilation. All miseries ended.
67. O Nārada, Pārvatī and Śiva rejoiced in particular. Good and plentiful auspiciousness was conducive to happiness everywhere.
68-69. The gods and the sages, who had come there, returned at the bidding of Śiva praising Pārvatī and Gaṇeśa again and again, eulogising Śiva and saying “O what a battle!”
Continues....
🌹🌹🌹🌹🌹
Comments