top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 671 / Sri Siva Maha Purana - 671


🌹 . శ్రీ శివ మహా పురాణము - 671 / Sri Siva Maha Purana - 671 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴


🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 9 🌻


పార్వతి కోపమును విడనాడగానే శివుడు ఆమెను పూర్వము నందు వలెనే ప్రేమతో ఆదరించెను (70). శివుడు ఆత్మారాముడైన పరబ్రహ్మయే అయిన భక్తుల కార్యమును నెరవేర్చి లోకములకు హితమును చేయగోరి వివిధ సుఖముల ననుభవించెను (71). నేను, విష్ణువు పార్వతీ పరమేశ్వరులను భక్తితో సేవించి, శివును అనుమతిని పొంది మా ధామములకు చేరుకొంటిమి (72).


ఓ నారదా! మహర్షీ! పూజనీయా!నీవు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని గానము చేసి వారి వద్ద సెలవు తీసుకొని నీ భవనమునకు చేరుకొంటివి (73). నేనీ తీరున నీవు ప్రశ్నించగా పార్వతీ పరమేశ్వరుల యశస్సునకు విఘ్నేశ్వరుని కీర్తిని జోడించి సాదరముగా సర్వమును వివరించితిని (74) ఎవడైతే మనస్సును బాగుగా లగ్నము చేసి ఈ రమపవిత్ర గాథను వినునో, వాడు మంగళములనన్నింటినీ పొంది మంగళములకు నిధానమగును (75). పుత్రుడు లేని వారికి పుత్రుడు కలుగును. భార్యను గోరువాడు భార్యను పొందును. సంతానమును గోరువాడు సంతానమును పొందును (76).


రోగి ఆరోగ్యవంతుడగును. దురదృష్ట వంతుడు భాగ్యవంతుడగును. పోయిన పుత్రుని, ధనమును పొందును. స్త్రీ పరదేశమునందున్న భర్తను తిరిగి పొందును (77). శోకముతో బాధపడువాని శోకము తొలగిపోవును. దీనిలో సందేహము లేదు. ఈ గణేశోపాఖ్యానము ఎవని గృహము నందుండునో (78), వాడు నిత్యమంగళముగా నుండుననుటలో సందేహము లేదు. ప్రయాణకాలమునందు, పర్వదినముల యందు ఎవడైతే దీనిని సావదాన చిత్తుడై వినునో, వాడు గణశుని అనుగ్రహముచే ఇష్టఫలములనన్నింటినీ పొందును (79).


శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందలి కుమార ఖండలో గణశవ్రత వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (79).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 671🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴


🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 9 🌻


70. When Pārvatī became free from fury, Śiva and Pārvatī behaved as before.


71. With a desire for the welfare of the worlds, the great deity relaxing in his own soul and engaged in the activities of the devotees conferred different kinds of happiness.


72. Both Viṣṇu and I took leave of Śiva and after paying homage to both Pārvatī and Śiva returned to our abodes.


73. O holy sage Nārada, after singing the glory of Pārvatī and Śiva and taking leave of them you too returned to your abode.


74. Thus requested by you, I have narrated the glorious story of Pārvatī and Śiva along with that of Gaṇeśa with great reverence.


75. Whoever hears this narrative auspiciously with pure mind shall have everything auspicious and be the abode of auspiciousness.


76. The childless will get a son, the indigent wealth; the seeker of a wife will get a wife and the seeker of issues will get children.


77. The sick will regain health; the miserable will have good fortune. The sonless, impoverished, banished wife will be reunited with her husband.


78-79. The sorrowing will be relieved of sorrow, undoubtedly. The house that contains this story shall certainly be auspicious. He who listens to this narrative at the time of travel or on holy occasions, with a pure mind shall get all desires, thanks to the grace of lord Gaṇeśa.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

留言


Post: Blog2 Post
bottom of page