top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 673 / Sri Siva Maha Purana - 673


🌹 . శ్రీ శివ మహా పురాణము - 673 / Sri Siva Maha Purana - 673 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴


🌻. గణేశ వివాహోపక్రమము - 2 🌻


జగత్తునకు తల్లి దండ్రులగు ఆ దంపతులు వారి మాటలను విని ఆచ్చెరువునందరి. వారు లోకాచారముననుసరించుచుండిరి (13). ' ఏమి చేయవలెను ? వీరిద్దరి వివాహకార్యమును ఎట్లు నెరవేర్చవలెను?' అని ఆలోచించి వారిద్దరు ఒక అద్భుతమగు యుక్తిని పన్నిరి (14). ఆ యుక్తి ప్రకారంగా ఒకనాడు ఆ తల్లిదండ్రులు పుత్రులనిద్దరినీ పిలిచి ఇట్లు పలికిరి (15).



పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి -


మీకిద్దరికీ సుఖమును కలిగించే నియమము నొకదానిని మేము పూర్వము ఏర్పాటు చేసితిమి. ఓ పుత్రులారా! వినుడు. మీకు ప్రీతితో సత్యమును చెప్పదము (16). మీరిద్దరు పుత్రులు సద్గుణములలో సమానులు. మీలో భేదము లేదు. కావుననే మీకిద్దరికీ సుఖమునిచ్చే పోటీని ఒక దానిని నిశ్చయించితిమి (17). మీ ఇద్దరిలో ఎవరైతే భూమినంతనీ చుట్టి ముందుగా ఇచటకు చేరునో, వానికి మాత్రమే ముందుగా శుభకరముగు వివాహము ఏర్పాటు చేయబడగలదు (18).



బ్రహ్మ ఇట్లు పలికెను -


మహాబలుడగు కుమారస్వామి వారిద్దరి ఆ మాటను విని పృథివిని చుట్టి వచ్చుట కొరకై వెంటనే మందిరము నుండి బయలు దేరెను (19). బుద్ధిమంతుడు గణేశుడు అచటనే ఉన్నవాడై తెలివి తేటలను ఉపయోగించి మనస్సులో తీవ్రముగా ఆలోచించెను (20). ఏమి చేయవలెను? ఎచటకు వెళ్లవలెను? పెద్దల ఆదేశమును ఉల్లంఘించ శక్యము కాదు. నేను రెండు మైళ్ల కంటె అధిక రూరమును పయనించ జాలను (21).


పృథివినంతనూ ఎట్లు చుట్టి రాగలను? నేను ఈ పరీక్షలో ఎట్లు సుఖముగా గెలువవలెను? గణేశుడు ఇట్లు ఆలోచించి ఏమి చేసెనో చెప్పెదను. వినుము (22). ఆతడు స్నానమును చేసి స్వయముగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి యథోచితముగా నిట్లు పలికెను (23).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 673🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴


🌻 Gaṇapati’s marriage - 2 🌻


13. The couple, the rulers of the worlds, on hearing their words, were very much surprised, following the worldly conventions.


14. A wonderful expedient was devised by them after thinking about the course to be followed in the celebration of their marriage.


15. Once they called the sons to them and spoke as follows.



Śiva and Pārvatī said:—


16. O good sons, we have framed the rules conducive to your happiness. Listen lovingly. We shall tell you the truth.


17. Both of you are good sons and equal in our eyes. There is no difference. Hence a condition that is beneficial to both of you has been made.


18. The auspicious marriage will be celebrated of that boy who comes here first after going round the entire earth.



Brahmā said:—


19. On hearing their words, the powerful Kumāra started immediately from the fixed point in order to go round the earth.


20. Gaṇeśa of excellent intellect stood there itself after pondering in his mind frequently with his keen intellect.


21. “What shall be done? Where am I to go? I cannot cross the earth. At best it may be possible to go a Krośa. I cannot go beyond it.


22. What avails that happiness which is achieved after going round the earth?” Please listen to what Gaṇeśa did after thinking thus.


23. He performed the ceremonial ablution and returned, home. He then spoke to his father and mother.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page