top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 674 / Sri Siva Maha Purana - 674


🌹 . శ్రీ శివ మహా పురాణము - 674 / Sri Siva Maha Purana - 674 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴


🌻. గణేశ వివాహోపక్రమము - 3 🌻



గణేశుడిట్లు పలికెను -


తల్లిదండ్రులారా! మీ పూజ కొరకు ఇచట ఆసనము నేర్పాటు చేసినాను. మీరు ఇచట కూర్చుండి నా కోరికను నెరవేర్చుడు (24).

బ్రహ్మ ఇట్లు పలికెను - పార్వతీ పరమేశ్వరులు గణేశుని ఆ మాటను విని ఆతని పూజను స్వీకరించుటకై ఆ ఆసనమునందు కూర్చుండిరి (25). గణేశుడు అపుడు వారిని పూజించి ప్రణమిల్లి ఏడు ప్రదక్షిణములను చేసెను (26). వత్సా! అపుడు మహాబుద్ధి శాలియగు గణేశుడు చేతులు జోడించి ప్రేమతో నిండియున్న తల్లిదండ్రులను బహుతెరంగుల స్తుతించి ఇట్లు పలికెను (27).

గణేశుడిట్లు పలికెను - ఓ తల్లీ! ఓ తండ్రీ! మీరు నా యథార్థ వచనము నాలకింపుడు. మీరు నాకిప్పుడు శీఘ్రమే శుభకరమగు వివాహమును చేయవలెను (28). బ్రహ్మ ఇట్లు పలికెను- మహాత్ముడు, గొప్ప బుద్ధి శాలి యగు గణేశుని ఈ మాటలను విని ఆ తల్లిదండ్రులు ఆతనితో నిట్లనరి(29). పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి - నీవు వనములతో గూడియున్న భూమిని చుట్టి రావలెను. కుమార స్వామి అట్లు చేయుటకై వెళ్లినాడు. నీవు కూడ వెళ్లి భూమిని చుట్టి ఆతని కంటె మందు రమ్ము (30). బ్రహ్మ ఇట్లు పలికెను - తల్లి దండ్రుల ఈ మాటను విని గణపతి వెంటనే కోపమును పొందెను. కాని ఆతడా కోపమును నియంత్రించుకొని ఇట్లు పలికెను (31). గణేశుడిట్లు పలికెను - ఓ తల్లీ! ఓ తండ్రీ! మీరిద్దరు ధర్మ స్వరూపులు, సత్స్వరూపులు మరియు జ్ఞానులు అని అందరు ఎరుంగుదురు. నేను ధర్మబద్ధ మగు మాటను పలికెదను. సావధానులై వినుడు (32). నేను ఏడు సార్లు పృథివిని చుట్టి వచ్చితిని. మీరు తల్లిదండ్రులై యుండి ఇట్లేల పలుకుచున్నారు ? (33) సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 SRI SIVA MAHA PURANA - 674🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴 🌻 Gaṇapati’s marriage - 3 🌻 Gaṇeśa said:— 24. For your worship two seats have I placed here. Please be seated, dear parents. Let my desire be fulfilled. Brahmā said:— 25. On hearing his words, Pārvatī and Śiva sat on the seats for receiving worship. 26. They were worshipped by him and circumambulated seven times and bowed too seven times. 27. Joining his palms in reverence and eulogising his parents agitated by love and affection, many times, Gaṇeśa the ocean of intelligence, spoke thus. Gaṇeśa said:— 28. “O mother, O father, you please listen to my weighty words. My auspicious marriage shall be celebrated quickly.” Brahmā said:— 29. On hearing the words of the noble-minded Gaṇeśa, the parents spoke to him, the storehouse of great intellect. Śiva and Pārvatī said:— 30. You shall circumambulate the earth with all its forests. Kumāra has already gone. You too start and return first. Brahmā said:— 31. On hearing the words of his parents, Gaṇeśa spoke immediately and furiously but with some restraint. Gaṇeśa said:— 32. O mother, O father, you two are intelligent and embodied virtue. Hence O excellent ones, you may be pleased to hear my virtuous words. 33. The earth has been circumambulated by me frequently, for seven times. Why then, my parents should say thus? Continues.... 🌹🌹🌹🌹🌹

1 view0 comments

コメント


Post: Blog2 Post
bottom of page