top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 676 / Sri Siva Maha Purana - 676


🌹 . శ్రీ శివ మహా పురాణము - 676 / Sri Siva Maha Purana - 676 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴


🌻. గణేశ వివాహోపక్రమము - 5 🌻


నాకు వెంటనే శుభవివాహమును జరిపించవలెను. లేదా, వేదశాస్త్రములు అసత్యమని చెప్పుడు (45).మీరు ధర్మస్వరూపులగు తల్లి దండ్రులు. ఈ రెండు పక్షములలో ఏది ఎక్కువ శ్రేష్ఠమైనది అను విషయమును చక్కగా విచారించి ప్రయత్నపూర్వకముగా అనుష్ఠించుడు (46).



బ్రహ్మ ఇట్లు పలికెను -


బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, మహాజ్ఞాని, మంచి స్ఫూర్తి గలవాడు, పార్వతీ తనయుడు అగు ఆ గణేశుడు ఇట్లు పలికి విరమించెను (47). జగత్తునకు తల్లి దండ్రులు, ఆది దంపతులు అగు ఆ పార్వతీ పరమేశ్వరులు గణేశుని ఈ వచనములను విని పరమాశ్చర్యమును పొందిరి (48). అపుడు పార్వతీ పరమేశ్వరులు బుద్దిమంతుడు, మరియు సత్యభాషియగు తమ పుత్రుని ప్రేమతో మిక్కిలి ప్రశంసించి ఇట్లు పలికిరి (49).

పార్వతీపరమేశ్వరులిట్లు పలికిరి - పుత్రా! మహత్ముడవగు నీకు స్వచ్ఛమగు బుద్ధి కలిగినది. నీవు చెప్పిన మాట యథార్థము. సందేహము లేదు (50). కష్టము వచ్చినప్పుడు ఎవని బుద్ధి పని చేయునో వాని కష్టము సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు తొలగిపోవును (51). బుద్ధి గల వానిదే బలము. బుద్ధి లేని వానికి బలమెక్కడిది? మదించిన సింహమును కుందేలు నూతిలో పడద్రోసినది (52). వేదశాస్త్ర పురాణములు పుత్రునకు ఏ ధర్మమును విధించినవో, నీవా ధర్మమును పూర్ణముగా పాలించితివి (53). నీవు చేసిన కర్మ ధర్మబద్ధమైనది. లోకములో ఎవరైననూ దానిని పాలించవలెను. నీవు చేసిన కర్మను మేమిద్దరము ఆదరించు చున్నాము. దీనిలో సందేహము లేదు (54). బ్రహ్మ ఇట్లు పలికెను - వారిద్దరు ఇట్లు పలికి బుద్ధిశాలియగు గణేశుని కొనియాడి, ఆతనికి మాట ఇచ్చి, అతనికి వివాహమును చేయవలెననే ఉత్తమమగు నిర్ణయమును చేసిరి (55). శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో గణేశ వివాహోపక్రమమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసెను (19). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 SRI SIVA MAHA PURANA - 676🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴 🌻 Gaṇapati’s marriage - 5 🌻 45. Let my auspicious marriage be celebrated and that too very quickly. Otherwise let the Vedas and Śāstras be declared false. 46. Of the two alternatives whatever is excellent shall be followed, O parents, embodied virtues! Brahmā said:— 47. Saying thus, Gāṇeśa of excellent intellect, of great wisdom and foremost among intelligent persons assumed silence. 48. On hearing his words, Pārvatī and Śiva, the rulers of the universe, were very much surprised. 49. Then, Śiva and Pārvatī praised their son who was clever and intelligent and spoke to him who had spoken the truth. Śiva and Pārvatī said:— 50. O son, you are a supreme soul and your thoughts are pure. What you have said is true and not otherwise. 51. When misfortune comes, if a person is keenly intelligent, his misfortunes perish even as darkness perishes when the sun rises. 52. He who has intelligence possesses strength as well. How can he who is devoid of intellect have strength? The proud lion was drowned in a well with a trick by a little hare.[2] 53. Whatever has been mentioned in the Vedas, Śāstras and Purāṇas for a boy, all that has been performed by you, namely, the observance of virtue. 54. What has been executed by you shall be done by anyone. We have honoured it. It will not be altered now. Brahmā said:— 55. After saying this and appeasing Gaṇeśa, the ocean of intelligence, they resolved to perform his marriage. Continues.... 🌹🌹🌹🌹🌹

0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page