🍀🌹 02, JUNE 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 02, JUNE 2023 FRIDAY శుక్రవారం, భృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 379 / Bhagavad-Gita - 379 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 07 / Chapter 10 - Vibhuti Yoga - 07 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 226 / Agni Maha Purana - 226 🌹
🌻. దేవ సముదాయ సాధారణ ప్రతిష్ఠా కథనము. - 2 / Mode of consecration of other gods (sādhāraṇa-pratiṣṭhā) - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 091 / DAILY WISDOM - 091 🌹
🌻 31. వస్తువులు జడమైనవి, మరియు విషయమే చైతన్యం / 31. Objects are Inert, and it is the Subject that is Consciousness 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 356 🌹
6) 🌹. శివ సూత్రములు - 93 / Siva Sutras - 93 🌹
🌻 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 5 / 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 5 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 02, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 47 🍀*
*47. శ్రీఆదిలక్ష్మి శరణం శరణం ప్రపద్యే శ్రీఅష్టలక్ష్మి శరణం శరణం ప్రపద్యే ।*
*శ్రీవిష్ణుపత్ని శరణం శరణం ప్రపద్యే లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అహైతుక భక్తి - అహైతుక భక్తి మార్గంలో, ప్రతి దానినీ సాధనగానే మలచుకోవచ్చు. ఉదాహరణకు, సంగీత సాహిత్యాలు భక్తి భావాభివ్యక్తికే కాక, భక్తి అనుభూతికి సైతం సాధన భూతములౌతాయి. ధ్యానమనేది ఏకాగ్రతకు చేయు మానసిక పరిశ్రమ కావడానికి బదులు భక్తి ప్రేమల సహజ ప్రవాహంగా మారిపోతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 12:49:12 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: స్వాతి 06:53:48 వరకు
తదుపరి విశాఖ
యోగం: పరిఘ 17:10:28 వరకు
తదుపరి శివ
కరణం: తైతిల 12:44:12 వరకు
వర్జ్యం: 12:20:22 - 13:53:54
దుర్ముహూర్తం: 08:18:08 - 09:10:33
మరియు 12:40:15 - 13:32:40
రాహు కాలం: 10:35:44 - 12:14:02
గుళిక కాలం: 07:19:09 - 08:57:27
యమ గండం: 15:30:37 - 17:08:55
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 21:41:34 - 23:15:06
సూర్యోదయం: 05:40:51
సూర్యాస్తమయం: 18:47:13
చంద్రోదయం: 17:07:17
చంద్రాస్తమయం: 03:53:04
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: గద యోగం - కార్య హాని ,
చెడు 06:53:48 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 379 / Bhagavad-Gita - 379 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 07 🌴*
*07. ఏతాం విభూతిం యోగం చ మామ యో వేత్తి తత్త్వత: |*
*సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ: ||*
🌷. తాత్పర్యం :
*నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగ నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.*
🌷. భాష్యము :
*దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మికపూర్ణత్వము యొక్క అత్యున్నతదశ వంటిది. ఆ భగవానుని వివిధములైన దివ్యవిభూతుల యెడ స్థిరనిశ్చయము కలుగనిదే ఎవ్వరును సంపూర్ణముగా భక్తియోగమున నెలకొనలేరు. సాధారణముగా జనులు భగవానుడు గొప్పవాడని తెలిసియుందురుగాని అతడెంతటి గొప్పవాడనెడి విషయమును పూర్తిగా ఎరిగియుండరు. ఇచ్చట ఆ విషయములన్నియును సమగ్రముగా తెలుపబడినవి. శ్రీకృష్ణభగవానుడు ఎంతటి ఘనుడనెడి విషయము సమగ్రముగా తెలిసినపుడు సహజముగా మనుజుడు అతనికి శరణమునొంది భక్తియుతసేవలో నిమగ్నుడగును. భగవానుని దివ్యవిభూతులు యథార్థముగా అవగతమైనప్పుడు అతని శరణుజొచ్చుట కన్నను మనుజునకు వేరొక్క మార్గముండదు. ఇటువంటి వాస్తవమైన జ్ఞానమును భగవద్గీత, భాగవతము మరియు అటువంటి ఇతర వాజ్మయము ద్వారా తెలిసికొనవచ్చును.*
*ఈ విశ్వపాలనము కొరకు విశ్వమనదంతటను పలుదేవతలు కలరు. వారిలో బ్రహ్మ, శివుడు, సనకసనందనాదులు, ఇతర ప్రజాపతులు ముఖ్యమైనవారు. విశ్వజనులకు గల పలువురు పితృదేవతలు శ్రీకృష్ణుని నుండియే జన్మించిరి. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వపితృదేవతలకు ఆది పితృదేవుడై యున్నాడు. ఇవన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతుల యెడ విశ్వాసము కలిగినవాడు శ్రీకృష్ణుని శ్రద్ధతో శంకారహితముగా గ్రహించి, అతని భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. భగవత్సేవలో ఆసక్తిని మరియు శ్రద్ధను వృద్ధిపరచుకొనుటకు ఈ ప్రత్యేక జ్ఞానము అత్యంత అవసరమై యున్నది. శ్రీకృష్ణభగవానుని దివ్యఘనతను సంపూర్ణముగా నెరుగుటచే మనుజుడు శ్రద్ధాపూరితమైన భక్తియోగమున స్థిరుడు కాగాలనందున ఆ దేవదేవుడు ఎంతటి ఘనుడో తెలిసికొనుట యందు ఎవ్వరును ఉపేక్ష వహింపరాదు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 379 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 07 🌴*
*07. etāṁ vibhūtiṁ yogaṁ ca mama yo vetti tattvataḥ*
*so ’vikalpena yogena yujyate nātra saṁśayaḥ*
🌷 Translation :
*One who is factually convinced of this opulence and mystic power of Mine engages in unalloyed devotional service; of this there is no doubt.*
🌹 Purport :
*The highest summit of spiritual perfection is knowledge of the Supreme Personality of Godhead. Unless one is firmly convinced of the different opulences of the Supreme Lord, he cannot engage in devotional service. Generally people know that God is great, but they do not know in detail how God is great. Here are the details. If one knows factually how God is great, then naturally he becomes a surrendered soul and engages himself in the devotional service of the Lord. When one factually knows the opulences of the Supreme, there is no alternative but to surrender to Him. This factual knowledge can be known from the descriptions in Śrīmad-Bhāgavatam and Bhagavad-gītā and similar literatures.*
*In the administration of this universe there are many demigods distributed throughout the planetary system, and the chief of them are Brahmā, Lord Śiva and the four great Kumāras and the other patriarchs. There are many forefathers of the population of the universe, and all of them are born of the Supreme Lord, Kṛṣṇa. The Supreme Personality of Godhead, Kṛṣṇa, is the original forefather of all forefathers. These are some of the opulences of the Supreme Lord. When one is firmly convinced of them, he accepts Kṛṣṇa with great faith and without any doubt, and he engages in devotional service. All this particular knowledge is required in order to increase one’s interest in the loving devotional service of the Lord. One should not neglect to understand fully how great Kṛṣṇa is, for by knowing the greatness of Kṛṣṇa one will be able to be fixed in sincere devotional service.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 226 / Agni Maha Purana - 226 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 66*
*🌻. దేవ సముదాయ సాధారణ ప్రతిష్ఠా కథనము. - 2 🌻*
*పిదప నూట ఎనిమిది పలాశసమిధలను హోమము చేసి, పురుష సూక్తముతో అజ్యహోమము చేయవలెన. ''ఇరావతీధేనుమతీ'' అను మంత్రముతో తిలాష్టక హోమము చేసి బ్రహ్మవిష్ణు మహేశ్వరుల పార్షదులకు, గ్రహములకు, లోకపాలులుకు, మరల ఆహుతు లీయవలెన. పర్వత నదీసముద్రములకు కూడ హోమములు చేసి, మహావ్యాహృతులనుచ్చరించుచు, స్రువముతో మూడు పూర్ణాహుతు లీయవలెను. పితామహా! 'వౌషట్' చేర్చిన వైష్ణవ మంత్రముతో పంచ గవ్యములను చరువును ప్రాశనము చేసి, ఆచార్యునకు సువర్ణయుక్త తిలపాత్రము, వస్త్రములు, అలంకృతమగు గోవు దక్షిణగా నీయవలెను. ''భగవాన్ విష్టుః ప్రీయతామ్'' అని పలుకుచు ప్రతవిసర్జనము చేయవలెను.*
*ఇపుడు మరియొక మాసోపవాసాది విధిని చెప్పుచున్నాను. ముందుగా యజ్ఞముచే శ్రీహరిని సంతుష్టుని చేయవలెను. తిల - తండుల - నీవార - శ్యామాకములతో, శ్యామాకములకు బదులు యవలతో వండిన వైష్ణవ చరువును నేతితో కలిపి మూర్తిమంత్రముతో హోమము చేయవలెను. పిమ్మట మాసాధిపతులైన విష్ణ్వాదిదేవతల నుద్దేశించి మరల హోమము చేయవలెను. 'ఓం శ్రీవిష్ణవే స్వాహా' ఇత్యాది మంత్రములతో నేతిలో ముంచిన అశ్వత్థ సమిధలతో పండ్రెండు హోమములు చేయవలెను. ''విష్ణోరరాటమసి''అను మంత్రముతో కూడ పండ్రెండు హోమములు చేయవలెను. 'ఇరావతీ' ఇత్యాది మంత్రముతో పండ్రెండు చరు హోమములు చేయవలెను. 'తద్విస్రాసః' ఇత్యాది మంత్రముతో ఘృత హోమములు చేయవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 226 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 66*
*🌻Mode of consecration of other gods (sādhāraṇa-pratiṣṭhā) - 2 🌻*
11. Having made oblation of one hundred and eight twigs of the palāśa (tree) along with clarified butter, oblations should be done eight times with sesamum and water along with the puruṣasūkta[6].
12-13. Having offered oblations for Brahman, Viṣṇu, Īśa (Śiva), the attendant gods, the planets and the presiding deities of different worlds, oblations should be offered for the mountains, rivers, and oceans. Sacrificial spoon full of clarified butter should be offered thrice as the final oblation with the (recitation of) vyāhṛtīs (bhuḥ, bhuvaḥ, svaḥ).
14-15. O Brannan after having sipped the gruel along with the pañcagavya (five things got from a cow) with the vaiṣṇava mantra and the syllable vauṣaṭ, the priest should be paid fees, vessel containing sesamum along with gold, cloth and a cow well-adorned. The wise man should complete the austerity with (the utterance of) “May lord Viṣṇu be pleased!”
16-17. I shall describe in full about another mode of consecration other than that of fasting for a month. The lord of the celestials (Viṣṇu) should be worshipped and the gruel pertaining to Viṣṇu should be prepared out of sesamum, rice, nīvāra grains (rice growing unsown), śyāmāka or barley. After adding clarified butter and lifting it up, oblation should be made with that with the mantras relating to that form of the lord.
18. Oblation should be made to Viṣṇu and other gods who are the lords of different months then. Oṃ! oblations for Viṣṇu! Oblations to lord Viṣṇu, the ornament! Oblations to Lord Viṣṇu, the śipiviṣṭa (pervaded by rays) (an epithet of Viṣṇu)! Oṃ! oblations to Narasiṃha (man-lion form ofViṣṇu). Oṃ! oblations to Puruṣottama (the foremost) (an epithet of Viṣṇu)! Twelve twigs of the holy fig tree dipped in the clarified butter should be given as oblation.
19. Twelve oblations (should be made) with the mantra viṣṇo rarāṭa[7]. Twelve oblations with the gruel should be made with (the mantras) idam viṣṇu,[8] irāvatī[9].
20. Similarly, oblations should be made with clarified butter with (the mantra) tadviprāsa.[10] Having done the remaining oblation, three concluding oblations should be made.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 91 / DAILY WISDOM - 91 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 31. వస్తువులు జడమైనవి, మరియు విషయమే చైతన్యం 🌻*
*ఉనికి మరియు చైతన్యం కలిసి ఉంటాయి; వాటిని వేరు చేయలేము. మన చైతన్యం మన శరీరంతో ముడిపడి ఉంది, కాబట్టి మనకు తెలిసినదంతా ఈ చిన్న శరీరానికే పరిమితం అయి ఉంటుంది. మనము దానిని దాటి వెళ్ళలేము. మన 'ఉనికి' యొక్క చైతన్యం మన శరీరం యొక్క చైతన్యంతో సమానం. మనలో ఇంకేమీ లేదు. మన శరీరం చాలా పరిమితం అన్న విషయం మనకు తెలిసిందే. అందువల్ల, ఉనికి యొక్క విస్తరణ లేదా మన 'ఉనికి' యొక్క పరిమాణం, చైతన్యాన్ని కూడా కలిగే ఉంటుంది, ఎందుకంటే ఉనికి మరియు స్పృహ ఒకటే కాబట్టి. ఇది మనం చెప్పే ప్రార్థన ద్వారా సూచించబడుతుంది:అది తమసో మా జ్యోతిర్గమయ: నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు. ఈ ప్రపంచం చీకటి ప్రపంచం. ఇది కాంతి ప్రపంచం కాదు.*
*ఈ ప్రపంచంలో మనం చూసే కాంతి నిజంగా చీకటి రూపమే. అన్ని రకాల జీవితాలు మరణం యొక్క వేరే రూపాలు మాత్రమే అని ఈ ఉపనిషత్తు యొక్క పూర్వ భాగంలో అధ్యయనం చేసాము. అవి వాస్తవాలు కావు. సూర్యకాంతి నిజమైన కాంతి కాదు, ఎందుకంటే అది బుద్ధిమయం కాదు. ఇది సూర్యకాంతి యొక్క విలువను కూడా గ్రహించడానికి బాధ్యత వహించే మరొక మేధస్సు. కేవలం సూర్యకాంతి అర్థం చేసుకోదు, ఎందుకంటే అది బాహ్యవస్తువు. వస్తువులు జడమైనవి, విషయమే చైతన్యం. విషయంతో సంబంధం లేని ఏదైనా వస్తువు చీకటితో సమానం. ఇది నిర్జీవమైనది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 91 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 31. Objects are Inert, and it is the Subject that is Consciousness 🌻*
*Being and consciousness go together; they cannot be separated. Our consciousness is tied to our body, so that whatever we know is limited to this little body. We cannot go beyond. The consciousness of our ‘being’ is the same as consciousness of our body. There is nothing else in us. And the body is so limited, as we know very well. Hence, the expansion of ‘being’, or the dimension of our ‘being’, includes simultaneously consciousness, because ‘being’ and consciousness are one. This is indicated by the other prayer: Tamaso ma jyotir gamaya: Lead me from darkness to light. This world is a world of darkness. It is not a world of light.*
*The light that we see in this world is really a form of darkness, as we studied in an earlier portion of this Upanishad that all forms of life are forms of death only. They are not realities. The sunlight is not real light, because it is not intelligent. It is another intelligence that is responsible for apprehending the value of even sunlight. Mere sunlight cannot understand, because it is an object outside. Objects are inert, and it is the subject that is consciousness. Any object that is bereft of a relationship with the subject is equivalent to darkness. It is lifeless.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 356 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. వ్యక్తి మనసు నుండీ బయటపడితే కానీ ఆందోళన నుండి బయటపడడు. వ్యక్తి మనసును దాటి వెళ్ళాలి. అప్పుడే శాంతి. మనసంటే అశాంతి. మనను లేకపోవడమే శాంతి. 🍀*
*మనసు ఎపుడూ దేన్నో ఎంచుకోవాలన్న స్థితిలో వుంటుంది. ఆ ఎంచుకోవడం ఎపుడు సగమే అయి వుంటుంది. తక్కిన సగం ప్రతీకారం తీర్చుకుంటుంది. ఫలితంగా మనసులో ఆ వేగం ఆందోళన. మనసు ఎప్పుడూ శరీరంలో కానీ, ఆత్మలో కానీ భాగం కాలేదు. వ్యక్తి మనసు నుండీ బయటపడితే కానీ ఆందోళన నుండి బయటపడడు.*
*వ్యక్తి మనసును దాటి వెళ్ళాలి. అప్పుడే శాంతి. మనసు ప్రశాంతంగా వుండడం అన్నది ఎక్కడా వుండదు. జనం 'మానసిక ప్రశాంతి' గురించి మాట్లాడుతూ వుంటారు. అది నాన్సెన్స్. మనసంటే అశాంతి. మనను లేకపోవడమే శాంతి. కాబట్టి 'మనసు లేని శాంతి' అన్న మాటే సరైనది. అప్పుడు నీ నిజమైన అస్తిత్వ కేంద్రానికి చేరుతావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 093 / Siva Sutras - 093 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 5 🌻*
*🌴. భగవంతుని చైతన్యం యొక్క స్వచ్ఛమైన జ్ఞానం అప్రయత్నంగా పెరుగుతుంది. ఈ శివ స్థితి ఖేచరీ స్థితితో ఒకటిగా గ్రహించ బడుతుంది. 🌴*
*శివుని చైతన్యం సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు మరియు సర్వజ్ఞుడు. కానీ శివ చైతన్యం మాయ యొక్క ప్రభావాల కారణంగా వ్యక్తిగత స్వయం నుండి కప్పబడి ఉంటుంది, దీనికి మూలం శక్తి. ఈ సూత్రం ఏమి చెబుతుందంటే, ఒక వ్యక్తి, స్వచ్ఛమైన శివ చైతన్యం నుండి ఉత్పన్నమయ్యే ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆ శివ చైతన్య దశకు చేరుకోవాలి. ఆ స్థితికి చేరుకోవాలంటే తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని మెల్కొలపాలి. ఈ దశకు చేరుకోవడానికి, వామేశ్వరి యొక్క ఇతర మూడు ప్రత్యేక శక్తులను అధిగమించాలి. ఒక సాధకుడు శివచైతన్య స్థాయికి చేరుకున్నప్పుడు, 'నేను అదే అయి ఉన్నాను' అనే మంత్రం స్వయంచాలకంగా అభిలాషికి బహిర్గతమవుతుంది. ఆశించేవాడు శివుడు అయినప్పుడు, 'నేను అదే అయి ఉన్నాను ' అనేది ఒక సహజ స్థితి. *
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 093 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 5 🌻*
*🌴. The pure knowledge of God consciousness effortlessly rises and this state of Śiva is realized as one with the state of khecarī. 🌴*
*The consciousness of Śiva is omnipresent, omnipotent and omniscience. But the consciousness of Śiva is veiled from individual self by the effects of māyā, the source of which is Śaktī. This sūtra says, that one has to reach the stage of consciousness of Śiva to enjoy the bliss arising out His pure consciousness to attain liberation, by waking up his muted knowledge that is inherent in his self. To reach this stage, one has to transcend the other three exclusive powers of Vāmeśvarī. When an aspirant reaches the consciousness level of Śiva, the mantra “I am That” is automatically revealed to the aspirant. When the aspirant becomes Śiva, the reflex action is “I am That”.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments