top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 02, MAY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, బౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 02, MAY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, బౌమ వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 02, MAY 2023 TUESDAY మంగళవారం, బౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 364 / Bhagavad-Gita - 364 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 26 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 211 / Agni Maha Purana - 211 🌹

🌻. లక్ష్మీ స్థాపనము. - 1 / Mode of installation of the image of Goddess Lakṣmī - 1 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 076 / DAILY WISDOM - 076 🌹

🌻 16. సంపూర్ణమైనది పరిమాణం లేదా గుణం కాదు / 16. The Absolute is Neither a Quantity nor a Quality 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 341 🌹

6) 🌹. శివ సూత్రములు - 78 / Siva Sutras - 78 🌹

🌻2-01. చిత్తం మంత్రః - 5 / 2-01. Cittaṁ mantraḥ - 5 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 02, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 2 🍀*


*03. శివః శర్వః పరోఽవ్యక్తో వ్యక్తావ్యక్తో ధరాధరః |*

*పింగకేశః పింగరోమా శ్రుతిగమ్యః సనాతనః*

*04. అనాదిర్భగవాన్ దివ్యో విశ్వహేతుర్నరాశ్రయః |*

*ఆరోగ్యకర్తా విశ్వేశో విశ్వనాథో హరీశ్వరః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : వాంఛమయ ప్రేమ - ప్రాణమయకోశ మందలి ప్రేమ అహంభావ పూరితము, వాంఛమయమూ అయిన పక్షంలో అట్టి ప్రేమ దివ్య ప్రేమకు దోహదం చెయ్యజాలదు. ఎదుటి నుండి ఏమేమియో ఆపేక్షిస్తూ వుండడం దాని స్వభావం. అపేక్షించినది లభించకున్నా, లభించకున్నదని అనుకున్నా, శోకం, క్రోధం మొదలైన అవలక్షణాలకు అది ఆస్పదమై తుదకు నశించి పోతుంది. సాధకులు దీనికే మాత్రమూ చోటివ్వరాదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: శుక్ల ద్వాదశి 23:19:05 వరకు

తదుపరి శుక్ల త్రయోదశి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 19:42:29

వరకు తదుపరి హస్త

యోగం: వ్యాఘత 11:49:16 వరకు

తదుపరి హర్షణ

కరణం: బవ 10:46:02 వరకు

వర్జ్యం: 01:37:42 - 03:20:58

మరియు 28:32:15 - 30:13:15

దుర్ముహూర్తం: 08:23:12 - 09:14:19

రాహు కాలం: 15:24:51 - 17:00:41

గుళిక కాలం: 12:13:12 - 13:49:01

యమ గండం: 09:01:32 - 10:37:22

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38

అమృత కాలం: 11:57:18 - 13:40:34

సూర్యోదయం: 05:49:52

సూర్యాస్తమయం: 18:36:31

చంద్రోదయం: 15:46:19

చంద్రాస్తమయం: 03:33:03

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు : ధాత్రి యోగం - కార్య

జయం 19:42:29 వరకు తదుపరి సౌమ్య

యోగం - సర్వ సౌఖ్యం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 364 / Bhagavad-Gita - 364 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 26 🌴*


*26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి |*

*తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన: ||*


🌷. తాత్పర్యం :

*పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను, భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును.*


🌷. భాష్యము :

*నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనందనిధానమును అగు భగవద్దామమును పొందుటకు బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తి భావనాయుతుడై శ్రీకృష్ణభగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కావలెను. అట్టి అద్భుతఫలములను కలుగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. ఎటువంటి యోగ్యతలేని అతిదరిద్రునికి సైతము అది ఆచరణసాధ్యము. కేవలము శ్రీకృష్ణభగవానునికి శుద్ధభక్తుడగుటయే ఈ విషయమున వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మనుజుని దేశ,కాల పరిస్థితులతో దానికెట్టి సంబంధము లేదు. అతిసులభమైన ఈ పద్దతిలో మనుజుడు భక్తితో పత్రమునుగాని, జలమునుగాని, ఫలమునుగాని ఆ భగవానునకు ప్రేమతో అర్పింపవచ్చును. భగవానుడు అట్టి అర్పణమును ప్రియముతో స్వీకరింపగలడు. కృష్ణభక్తిభావన విధానము అత్యంత సులభము మరియు విశ్వజనీనమైనందున ఎవ్వరికినీ దీని యందు నిషేదము లేదు. అట్టియెడ ఈ సులభమార్గము ద్వారా కృష్ణభక్తిభావితుడై అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానపూర్ణమగు జీవనము పొంద వాంఛింపని అజ్ఞాని ఎవడుండును? శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాచించును గాని అన్యమును కాదు.*


*తన శుద్ధభక్తుల నుండి చిన్న పుష్పమునైనను స్వీకరించు అతడు అభక్తుల నుండి ఎత్వంటి దానిని కూడా అంగీకరింపడు. ఆత్మారాముడైన అతడు ఇతరుల నుండి కోరునదేదియును లేదు. అయినను అతడు భక్తులు ప్రేమానురాగభావముతో ఒసగుదానిని ప్రియముతో స్వీకరించును. అట్టి భక్తిభావనను వృద్దిపరచుకొనుటయే జీవితపు పూర్ణత్వమై యున్నది. భక్తి యొక్కటే శ్రీకృష్ణుని చేరుటకు ఏకైకమార్గమని కచ్చితముగా తెలుపుట కొరకే ఈ శ్లోకమున భక్తి యను పదము రెండుమార్లు వాడబడినది. అనగా బ్రహ్మణుడగుట, పండితుడు, ధనవంతుడగుట లేదా గొప్ప తత్త్వవేత్త యగుట వంటి ఇతర ఏ విధానము చేతను మనుజుడు తానొసగునది శ్రీకృష్ణుడు అంగీకరించునట్లుగా చేయజాలడు. మూలనియమమైన భక్తి లేనప్పుడు ఏదియును అతనిని అంగీకరింపజేయలేదు. కనుకనే భక్తి ఎన్నడును సామాన్యమైనది కాదు. ఆ విధానము నిత్యమైనది. అది పరతత్త్వమునకు ఒనర్చబడు ప్రత్యక్ష్యసేవ.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 364 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 26 🌴*


*26. patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati*

*tad ahaṁ bhakty-upahṛtam aśnāmi prayatātmanaḥ*


🌷 Translation :

*If one offers Me with love and devotion a leaf, a flower, a fruit or water, I will accept it.*


🌹 Purport :

*For the intelligent person, it is essential to be in Kṛṣṇa consciousness, engaged in the transcendental loving service of the Lord, in order to achieve a permanent, blissful abode for eternal happiness. The process of achieving such a marvelous result is very easy and can be attempted even by the poorest of the poor, without any kind of qualification. The only qualification required in this connection is to be a pure devotee of the Lord. It does not matter what one is or where one is situated. The process is so easy that even a leaf or a little water or fruit can be offered to the Supreme Lord in genuine love and the Lord will be pleased to accept it. No one, therefore, can be barred from Kṛṣṇa consciousness, because it is so easy and universal.*


*Who is such a fool that he does not want to be Kṛṣṇa conscious by this simple method and thus attain the highest perfectional life of eternity, bliss and knowledge? Kṛṣṇa wants only loving service and nothing more. Kṛṣṇa accepts even a little flower from His pure devotee. He does not want any kind of offering from a nondevotee. He is not in need of anything from anyone, because He is self-sufficient, and yet He accepts the offering of His devotee in an exchange of love and affection. To develop Kṛṣṇa consciousness is the highest perfection of life. Bhakti is mentioned twice in this verse in order to declare more emphatically that bhakti, or devotional service, is the only means to approach Kṛṣṇa. No other condition, such as becoming a brāhmaṇa, a learned scholar, a very rich man or a great philosopher, can induce Kṛṣṇa to accept some offering.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 211 / Agni Maha Purana - 211 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 62*


*🌻. లక్ష్మీ స్థాపనము. - 1 🌻*


*హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు సామూహికరూపమున దేవతాదిప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. మొదట లక్ష్మీస్థాపన గూర్చియు, పిదప ఇతరదేవతాస్థాపన గూర్చియు చెప్పెదను. మండప-అభిషేకాదు లన్నియు వెనుకటి అధ్యాయములలో చెప్పినట్లే చేయవలెను. పిమ్మట భద్రపీఠమును లక్ష్మిని స్థాపించి ఎనిమిది దిక్కలందును ఎనిమిది కలశలు స్థాపించవెలను. దేవీప్రతిమకు అజ్యము పూసి మూలమంత్రము చదువుచు, పంచగవ్యములతో స్నానము చేయించవలెను. "హిరణ్యవర్ణాం హరిణీమ్‌" ఇత్యాదిమంత్రము చదువుచు నేత్రములను తెరువవలెను, "తాం మ ఆవహ" అను మంత్రము చదివి దేవికి తేనె, నెయ్యి, పంచదార సమర్పింపవలెను. 'అశ్వపూర్వామ్‌' ఇత్యాది మంత్రముతో తూర్పున నున్న కలశతో స్నానము చేయించవలెను.*


*"కాంసోస్మితామ్‌" ఇత్యాదిమంత్రముతో దక్షిణకలశజలముతోను, "చన్ద్రాంప్రభాసామ్‌" ఇత్యాదిమంత్రముతో పశ్చిమకలశజలముతోను, "అదిత్యవర్ణే" ఇత్యాదిమంత్రముతో ఉత్తరకలశ జలముతోను 'ఉపైతు మాం" ఇత్యాదిమంత్రముతో అగ్నేయకలశజలముతోను, "క్షుత్పిపాసామలామ్‌" ఇత్యాదిమంత్రముతో నైరృతికలశ జలముతోను, "గన్ధిద్వారాం" ఇత్యాదిమంత్రముతో వాయవ్యకోణ కలశజలముతోను "మనసః కామాకూతిమ్‌" ఇత్యాది మంత్రముతో ఈశాన్యకలశజముతోను, లక్ష్మీదేవికి అభిషేకము చేయవలెను. "కర్దమేన ప్రజాభూతా" అను మంత్రము చదువుచు సువర్ణకలశజలముతో దేవి శిరస్సుపై అభిషేకము చేయవెలను. "అపః సృజస్తు" ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క కలశలతో శ్రీదేవి ప్రతిమకు స్నానము చేయించవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 211 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 62*

*🌻Mode of installation of the image of Goddess Lakṣmī - 1 🌻*


The Lord said:


1. I shall describe to you the mode of installation of all divine images. At first I shall describe the (mode of) installation (of the image) of Lakṣmī and her attendant goddesses.


2. As before, one should do all rites such as bathing (the image) in the shed. (The image of) goddess Lakṣmī should be placed on the pedestal. One should place eight pitchers.


3. The image should be anointed with ghee with the principal mantra and washed with the five things got from a cow. The eyes of (the goddess) Lakṣmī should be opened with (the recitation of the mantra) hiraṇyavarṇām hariṇīm[1].


4. The three sweet things[2] should be offered with (the recitation of the mantra) tāṃ ma āvaha[3]. She (the image) should be bathed with (the waters of) the pitcher on the east with (the recitation of) the (hymn) aśvapūrva[4].


5. The image should then be bathed with (the waters of.pitchers on) the south, west and north with the recitation of hymns kāmo'smi te[5], candram prabhāsām[6], āditya varṇa[7] (respectively)


6-7. (Waters) from (the pitchers placed in) the southeast, south-west, north-west and north-east should be poured on the image accompanied by (the recitation of the mantras) upaitu mā[8], kṣut pipāsā[9], gandhadvāra[10], manasaḥ kāmamākṛti[11]. The image should subsequently be bathed with (the waters of) eighty-one pitchers (accompanied) by āpaḥ sṛjan kṣitim.[12]


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 76 / DAILY WISDOM - 76 🌹*

*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 16. సంపూర్ణమైనది పరిమాణం లేదా గుణం కాదు 🌻*


*విశ్వ చైతన్యం, పరమాత్మ చైతన్యం ఒకటి కాదు. ఆ రెండూ ఒకటి కాదు అనే విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావించ‌బ‌డింది. విశ్వం యొక్క అస్తిత్వాన్ని చైతన్యంలో అంగీకరించిన తర్వాత, దాని కారణంగా వచ్చే మిగతావన్నీ కూడా అంగీకరించబడతాయి. రెండూ రెండు నాలుగైతే, నాలుగు నాలుగు ఎనిమిది అవుతాయి. అలా గణితం ప్రకారం తర్వాత ఏమి వస్తుందో మనం అంచనా వేయగలము. కానీ, ప్రాథమికంగా, రెండు రెండు నాలుగు అవ్వాలి. దానిని మనం అంగీకరించాలి. అది నిజం కాకపోతే, దాని నుండి వచ్చే ఏ గుణకారం కూడా నిజం కాదు.*


*పరమాత్మ చైతన్యం మరియు విశ్వం-చైతన్యం మధ్య వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసమే పరమాత్మకు, సృష్టి పూర్వ స్థితికి మధ్య ఉన్న ఈ రేఖకు కారణం. పరమాత్మను అర్థం చేసుకోవడం మానవ మనస్సుకు కష్టం. మన ఊహలు ఏమైనప్పటికీ, మనం దానిని ఊహించలేము, ఎందుకంటే ప్రతి భావన పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది. పరమాత్మ పరిమాణం కాదు, గుణం కాదు. అందువల్ల పరమాత్మ గురించి ఆలోచించడం సాధ్యం కాదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 76 🌹*

*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 16. The Absolute is Neither a Quantity nor a Quality 🌻*


*The consciousness of the existence of the universe is different from the consciousness of the Absolute. That the two are not identical is a point that is made out here. Once the existence of the universe is accepted in consciousness, everything else that follows from it can also be accepted. If two and two make four, four and four make eight, and so on, arithmetically, we can draw conclusions. But two and two must, first of all, make four. We must accept that. If that is not true, then any multiplication therefrom also is not true.*


*There is a distinction between Absolute-Consciousness and universe-consciousness. That distinction is the cause behind this line drawn here between Pure Being that is the Absolute, and the condition precedent to creation. It is difficult for the human mind to understand what the Absolute is. Whatever be our stretch of imagination, we cannot conceive it, because every conception is quantitative and qualitative. The Absolute is neither a quantity nor a quality, and therefore no thought of it is possible.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 341 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. మనం శరీరాన్ని ఒక్కదాన్నే అంటి పెట్టుకుంటే స్వర్గ న్యాయమైన దయ పని చేయదు. మనం లోపలికి ప్రయాణించడం అంటే ధ్యానంలోకి వెళ్ళడం. మనం శరీరం కాని దాని పట్ల స్పృహతో వుండాలి. అది శరీరంలో వుంది. కానీ అది శరీరం కాదు. శరీరం ఆలయం. కానీ దేవుడు కాడు. 🍀*


*రెండు పదాల్ని గుర్తుంచుకో. ఒకటి గురుత్వాకర్షణ. రెండోది దయ. మొదటిది భూమి లక్షణం అది. వస్తువుల్ని కిందకు లాగుతుంది. దయ స్వర్గ సంబంధి. అది వస్తువుల్ని పైకి లాగుతుంది. సైన్సు భూమ్యాకర్షణని కనిపెట్టింది. మతం దయను కనిపెట్టింది. మనం జన్మించి గురుత్వాకరణలో బతుకుతాం. మన జీవితమంతా కిందికి లాగబడుతూ వుంటుంది. సజీవంగా మొదలై మన బతుకు మరణంతో ముగుస్తుంది. వ్యక్తి తన లోపలికి ప్రయాణించకుంటే దయ తన పని ప్రారంభించదు.*


*మనం శరీరాన్ని ఒక్కదాన్నే అంటి పెట్టుకుంటే స్వర్గ న్యాయమైన దయ పని చేయదు. మనం లోపలికి ప్రయాణించడం అంటే ధ్యానంలోకి వెళ్ళడం. మనం శరీరం కాని దాని పట్ల స్పృహతో వుండాలి. అది శరీరంలో వుంది. కానీ అది శరీరం కాదు. శరీరం ఆలయం. కానీ దేవుడు కాడు. ఒకసారి నువ్వు లోపలి దేవుడి పట్ల స్పృహతో వుంటే రెండో న్యాయం అంటే స్వర్గసంబంధ న్యాయం పని చేయ్యడం ప్రారంబిస్తుంది. నిన్ను పైకి లాగుతుంది. జీవితం మరింత విశాలమవుతుంది. దానికి ఆకాశం కూడా హద్దు కాదు. ఆ రహస్యం ధ్యానంలో ఉంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 078 / Siva Sutras - 078 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 01. చిత్తం మంత్రః - 5 🌻*

*🌴. స్వీయ-సాక్షాత్కారమైన యోగి యొక్క చైతన్యమే (చిత్తం) మంత్రం. శక్తిని ఆవాహన చేసే మరియు వ్యక్తీకరించే సిద్ధి.🌴*


*పారాయణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక వ్యక్తిని పరమ సత్యంపై ఏకాగ్రత మరియు శ్రద్ధ వహించేలా చేయడం. ఏకాగ్రతా సామర్థ్యాన్ని పెంపొందించుకోకుండా ఎంత మంత్రోచ్ఛారణ చేసినా ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఉదహరించిన మంత్రాలు ఉదాహరణలు మాత్రమే. ఈ సూత్రం చెప్తుంది, మనస్సు అనేది మంత్రం, ఎందుకంటే ఇది స్పష్టమైన మనస్సు యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది, ఇక్కడ మనస్సు తన స్వంత చైతన్యం యొక్క అత్యున్నత మరియు స్వచ్ఛమైన స్థాయి అయిన పరమ సత్యాన్ని శక్తి సహాయంతో గ్రహించగలదు. చైతన్యం యొక్క అత్యున్నత స్థాయి శివుడు అయినప్పటికీ, ఆయనను పొందడానికి పాటించవలసిన అవసరమైన సూత్రాలను రూపొందించే శక్తి సహాయంతో మాత్రమే ఆయనను సాధించగలడు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 078 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 01. Cittaṁ mantraḥ - 5 🌻*

*🌴. The consciousness (chitta) of a self-realized yogi is mantra, with the power to invoke and manifest the shaktis.🌴*


*The main purpose of recitation is to make a person to concentrate and be attentive on the Supreme Reality. No amount of mantra chanting is of any help without developing ability of concentrate. Mantra-s cited here are only examples. This sūtra says, that mind is mantra because it signifies the importance of lucid mind where the mind becomes capable of realizing the Supreme Reality, the highest and purest level of one’s own consciousness, with the help of Śaktī. Though the highest level of consciousness is Śiva, He can be attained only with the help of Śaktī, who formulates the necessary principles that are to be followed to attain Him.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page