🍀🌹 02, OCTOBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 02, OCTOBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 436 / Bhagavad-Gita - 436 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 22 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 22 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 797 / Sri Siva Maha Purana - 797 🌹
🌻. శివ జలంధరుల యుద్ధము - 1 / Description of Jalandhara’s Battle - 1 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 50 / Osho Daily Meditations - 50 🌹
🍀 50. ప్రేమ - ద్వేషం / 50. LOVE - HATE 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 -2 🌹
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 2 / Description of Nos. 485 to 494 Names - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 02, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహా భరణి, సంకష్టి చతుర్థి, గాంధీ జయంతి, Maha Bharani, Sankashti Chaturthi, Gandhi Jayanti 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 48 🍀*
97. బహుమాలో మహామాలః శశీ హరసులోచనః |
విస్తారో లవణః కూపస్త్రియుగః సఫలోదయః
98. త్రిలోచనో విషణ్ణాంగో మణివిద్ధో జటాధరః |
బిందుర్విసర్గః సుముఖః శరః సర్వాయుధః సహః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : గురుశిష్యుల ఆంతరంగిక సంబంధాలకే విశేష ప్రాధాన్యం - ఆధ్యాత్మిక శక్తి సంపదలో ఒక గురువునకు మరొక గురువునకు విశేష భేధం ఉండవచ్చుననే మాట నిజమే. కాని, గురుశిష్యుల అంతరంగిక సంబంధానికే విశేష ప్రాధాన్యం. గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నుని చేరినా ఆయన నుండి శిష్యుడు పొందేది అత్యల్పం కావచ్చు. అట్లే అంతకంటె తక్కువవాని వద్దకు చేరినా ఆయన నుండి శిష్యుడు ఆయన ఇవ్వగలిగినదేకాక ఇంకా ఎంతగానో కూడ పొందవచ్చు.🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ తదియ 07:37:15
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: భరణి 18:25:51 వరకు
తదుపరి కృత్తిక
యోగం: హర్షణ 10:28:37 వరకు
తదుపరి వజ్ర
కరణం: విష్టి 07:38:14 వరకు
వర్జ్యం: 04:38:48 - 06:10:36
మరియు 30:14:30 - 31:49:06
దుర్ముహూర్తం: 12:29:20 - 13:17:13
మరియు 14:52:58 - 15:40:50
రాహు కాలం: 07:36:06 - 09:05:52
గుళిక కాలం: 13:35:10 - 15:04:56
యమ గండం: 10:35:38 - 12:05:24
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28
అమృత కాలం: 13:49:36 - 15:21:24
సూర్యోదయం: 06:06:20
సూర్యాస్తమయం: 18:04:28
చంద్రోదయం: 20:20:55
చంద్రాస్తమయం: 08:45:46
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 18:25:51 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 436 / Bhagavad-Gita - 436 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 22 🌴*
*22. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |*
*గన్ధర్వయక్షాసురసిద్ధఙ్ఘా వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||*
*🌷. తాత్పర్యం : పరమశివుని పలుమారులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీకుమారులు, మరత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు.*
*🌷. భాష్యము : వీరందరూ గణములూ తమతమ స్థానములను భగవంతుడి అనుగ్రహ శక్తి ద్వారానే పొందారు మరియు తమ తమ కర్తవ్యములను సృష్టి యొక్క నియమముల ప్రకారంగానే నిర్వర్తిస్తుంటారు. అందుకే వారందరూ కూడా విశ్వ రూపమును ఆశ్చర్యముతో దర్శిస్తున్నారని పేర్కొనబడ్డారు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 436 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 22 🌴*
*22. rudrādityā vasavo ye ca sādhyā viśve ’śvinau marutaś coṣmapāś ca*
*gandharva-yakṣāsura-siddha-saṅghā vīkṣante tvāṁ vismitāś caiva sarve*
*🌷 Translation : All the various manifestations of Lord Śiva, the Ādityas, the Vasus, the Sādhyas, the Viśvedevas, the two Aśvīs, the Maruts, the forefathers, the Gandharvas, the Yakṣas, the Asuras and the perfected demigods are beholding You in wonder.*
*🌹 Purport : All these personalities receive their positions by the power of God and they discharge their respective duties in reverence to the Laws of Creation. Thus, they are all mentioned as beholding the cosmic form of God with wonder.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 797 / Sri Siva Maha Purana - 797 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 22 🌴*
*🌻. శివ జలంధరుల యుద్ధము - 1 🌻*
*సనత్కుమారుడిట్లు పలికెను - అపుడు మహాప్రభుడగు రుద్రుడు రౌద్రరూపమును దాల్చి వృషభము నధిష్ఠించి వీరులగు గణములతో గూడి చిరునవ్వుతో యుద్ధరంగమునకు వెళ్లెను (1). రుద్రుడు వచ్చుచుండటను గాంచి పూర్వము పరాజయమును పొంది యున్న గణములు సింహానాదములను చేయుచూ భయంకరాకారులై యుద్ధరంగమునకు మరలి వచ్చిరి(2). వారు మరియు ఇతరశంకరగణములు ఉత్సాహముతో వీరశబ్దములను చేయుచూ ఆయుధములన దాల్చి రాక్షసులను బాణవర్షములతో ముంచెత్తిరి (3). శివభక్తునకు భయపడి పాపములు పారిపోవు విధముగా, రాక్షసులందరు భయంకారాకారుడగు రుద్రుని చూచి పరుగులెత్తిరి (4). అపుడు యుద్ధరంగమునుండి వెనుదిరిగిన రాక్షసులను గాంచి జలంధరుడు చండీశుడగు శివునిప్తె వేలాది బాణములను ప్రయోగిస్తూ ముందునకు ఉరికెను (5).*
*నిశుంభశుంభాది ప్రముఖులగు రాక్షసవీరులు కూడ వేలసంఖ్యలో శివునిపై వేగముగా విరుచుకు పడిరి. వారు కోపముతో పెదవులను కొరుకుచుండిరి (6). అదే విధముగా వీరుడగు కాలనేమి, ఖడ్గరోముడు, బలాహకుడు, ఘస్మరుడు, ప్రచండుడు మరియు ఇతరులు కూడ శివునిపైకి వెళ్లిరి (7).*
*ఓ మునీ! శుంభుడు మొదలగు ఆ వీరులు అందరు రుద్రగణములను బాణములతో కప్పివేసి వారి అవయవములను ఛేదించిరి (8). గణసైన్యము బాణపరంపరల చీకటిచే కప్పివేయబడి యుండుటను గాంచి శివుడు ఆ బాణసమూహములను చీల్చి తన బాణములచే ఆకాశమును నింపివేసెను (9).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 797 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 22 🌴*
*🌻 Description of Jalandhara’s Battle - 1 🌻*
anatkumāra said:—
1. Then the great lord Śiva assuming a terrible form went laughingly to the battle-field and sat on his bull, accompanied by his heroic Gaṇas.
2. On seeing Śiva coming, the Gaṇas who were formerly defeated returned to fight roaring like lions.
3. Other Gaṇas too shouted heroically and jubilantly. Well-equipped with their weapons they killed the Daityas with showers of arrows.
4. On seeing Śiva the terrible, all the Daityas fled for fear from the battle field as the sins on seeing a devotee of Siva.
5. On seeing the Daityas returning from the battle field, Jalandhara rushed at Śiva discharging thousands of arrows.
6. Thousands of leading Daityas, Niśumbha, Śumbha and others rushed at Śiva, biting their lips.
7. Similarly Kālanemi the hero, Khaḍgaromā, Balāhaka, Ghasmara, Pracaṇḍa and others rushed at Śiva.
8. O sage, the heroes Śumbha and others, covered the Gaṇas of Rudra with arrows and cut their limbs.
9. On seeing his army of Gaṇas enveloped in darkness by the volleys of arrows, Śiva split the net of their arrows and encompassed the sky with his own.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 50 / Osho Daily Meditations - 50 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 50. ప్రేమ - ద్వేషం 🍀*
*🕉. మీరు దేనినైనా ప్రేమించినప్పుడల్లా, మీరు దానిని ద్వేషిస్తారు కూడా. మీరు ఎందుకు ద్వేషిస్తున్నారనే దానికి మీరు సాకులు కనుగొంటారు, కానీ అవి సంబంధితమైనవి కావు. 🕉*
*మీ ద్వేషం దేనినీ నిర్ణయించ నివ్వవద్దు. ద్వేషం ఉందని బాగా తెలుసు, ఎల్లప్పుడూ ప్రేమను నిర్ణయించనివ్వండి. నేను ద్వేషాన్ని అణచి వేయమని చెప్పడం లేదు, కానీ దానిని ఎప్పటికీ నిర్ణయించ నివ్వవద్దు. అది అక్కడ ఉండనివ్వండి, దానికి ద్వితీయ స్థానం ఉండనివ్వండి. దాన్ని అంగీకరించండి, కానీ అది నిర్ణయాత్మకంగా ఉండనివ్వకండి.*
*దానిని నిర్లక్ష్యం చేస్తే అది తన ఇష్టానుసారం చనిపోతుంది. ప్రేమపై ఎక్కువ శ్రద్ధ వహించండి; ప్రేమను నిర్ణయించ నివ్వండి. త్వరలోనే, ప్రేమ మీ మొత్తం జీవితాన్ని స్వాధీనం చేసుకుంటుంది మరియు ద్వేషానికి చోటు ఉండదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 50 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 50. LOVE - HATE 🍀*
*🕉 . Whenever you love something, you hate it too. You will find excuses for why you hate, but they are not relevant. 🕉*
*Never let your hate decide anything. Knowing well there is hate, always let love decide. I'm not saying to suppress hate, but never let it decide. Let it be there, let it have a secondary place. Accept it, but never let it be decisive.*
*Neglect it, and it dies of its own accord. Pay more attention to love; just let love decide. Sooner or later, love will take possession of your whole being, and there will be no place left for hate.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*
*🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*
*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 2 🌻*
*ఇచ్చట గల దేవి రెండు ముఖములు గలది. రెండు ముఖములనగా పంచభూతములలోని ఆకాశము, వాయు తత్త్వములు కలిగినది. అని తెలియవలెను. విశుద్ధి ఆకాశ తత్త్వమునకు, అనాహతము ఆకాశ వాయుతత్త్వములకు నిలయము. అట్లే అవరోహణ క్రమమున మూలాధారము వరకు చేరినపుడు పంచతత్త్వములు అవతరించి యుండును. ఆకాశమున మిగిలిన నాలుగు తత్త్వములు ఇమిడి యున్నవి. అట్లే అనాహత మందలి వాయు తత్త్వమున పదార్థము, నీరు, అగ్ని ఇమిడి యున్నవి. ఆకాశమొక ముఖముగాను, వాయువు ఒక ముఖముగాను, రెండు ముఖములతో శ్రీమాత అనాహతమున యున్నదని తెలియవలెను.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*
*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻*
*🌻 Description of Nos. 485 to 494 Names - 2 🌻*
*The goddess here has two faces. Akasha and Vayu Tattvams of Panchabhutas are the two faces. Vishuddhi is the home of Akasha Tattva and Anahata is the home of Akasha and Vayutattva. In the same way in descending order, when moolaadhara is reached, the Panchatattvas will appear. The sky contains the remaining four tattvas. Similarly the Vayu Tattva in Anaahata includes matter, water and fire. It should be known with sky as one face and air as another face, Srimata in Anahata has two faces.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments