🌹🍀 03, FEBRUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 03, FEBRUARY 2023 FRIDAY, శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 128 / Kapila Gita - 128 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 12 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 12 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 720 / Vishnu Sahasranama Contemplation - 720 🌹
🌻720. అమూర్తిమాన్, अमूर्तिमान्, Amūrtimān🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 681 / Sri Siva Maha Purana - 681 🌹 🌻. త్రిపుర వర్ణనము - 1 / Description of Tripura (the three cities) - 1🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 302 / Osho Daily Meditations - 302 🌹 🍀 302. పునర్జన్మ / REINCARNATION 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 429-1 🌹 🌻 429. 'మదశాలినీ' - 1 / 429. 'Madashalini' - 1🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹03, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -30 🍀*
30. పరిసేవిత భక్త కులోద్ధరిణి
పరిభావితదాస జనోద్ధరిణి ।
మధుసూదనమోహిని శ్రీరమణి
శరణం శరణం తవ లక్ష్మి నమః ॥
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జీవన్ముక స్థితిలో సామాన్యంగా సత్వగుణం ప్రధానంగా వుండి దాని స్వాధీనంలో రజోగుణం తమోగుణ ప్రేరిత విరతిసర్యంతం క్రియాత్మకంగా పనిచేస్తూ వుంటుంది. ఒకవేళ తమోగుణమే ప్రధానంగా ఉండి కర్మప్రవృత్తి తీవ్రతరమైనా పురుష ప్రకృతులు మాత్రం కలతకు లోను గాక అంతటా ఒకే విధమైన ప్రశాంతి నెలకొని వుంటుంది. కర్మ ప్రవృత్తి అనేది ఆట్టిస్థితిలో ఉపరితలంమీది ఒక చిన్న అల లేక సుడి వంటిది మాత్రమే అవుతుంది.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 18:59:13
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: పునర్వసు 33:17:19 వరకు
తదుపరి పుష్యమి
యోగం: వషకుంభ 13:02:08 వరకు
తదుపరి ప్రీతి
కరణం: తైతిల 18:58:13 వరకు
వర్జ్యం: 19:48:00 - 21:35:52
దుర్ముహూర్తం: 09:04:27 - 09:50:05
మరియు 12:52:40 - 13:38:19
రాహు కాలం: 11:04:16 - 12:29:51
గుళిక కాలం: 08:13:06 - 09:38:41
యమ గండం: 15:21:01 - 16:46:36
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 30:35:12 - 32:23:04
మరియు 29:02:04 - 30:49:48
సూర్యోదయం: 06:47:30
సూర్యాస్తమయం: 18:12:11
చంద్రోదయం: 16:12:13
చంద్రాస్తమయం: 05:02:09
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 33:17:19 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 128 / Kapila Gita - 128🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 12 🌴*
*12. యథా జలస్థ ఆభాసః స్థలస్థేనావదృశ్యతే|*
*స్వాభాసేన యథా సూర్యో జలస్థేన దివి స్థితః॥*
*తాత్పర్యము : జలముల యందు ప్రతిబింబించుచున్న సూర్యబింబము గోడపై పడినప్పుడు అది జలముల యందు సూర్య ప్రతిబింబమునకు అభాస మాత్రమే. జలములలో కనబడు ప్రతిబింబము ద్వారా ఆకాశము నందలి సూర్యుడు తెలియ బడుచున్నాడు. అలాగే శరీరములో ఉన్న ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే, "ఇది ఆత్మా", అని చెబుతాడు, అది ఉన్న శరీరం ఆభాసమూ అని చెబుతాడు, ఆ శరీరములో ఉన్న తననీ చూపుతాడు.*
*వ్యాఖ్య : నీటిలో సూర్య ప్రతిబింబాన్ని చూస్తున్నాము. అన్నిటినీ చూపే వెలుగుతోటే నీటిలో ఉన్న సూర్యుని చూస్తున్నాము. ఆకాశములో ఉన్న సూర్యుని చేతనే నీటిలో ఉన్న సూర్యున్నీ చూస్తున్నాము. సూర్యభగవానుడే నీటి ప్రతిబింబాన్నీ చూపుతాడూ, ఆ సూర్యభగవానుడే, తన నిజమైన స్వరూపాన్నీ చూపుతాడు. అలాగే, దేహములో ఆత్మ స్వరూపాన్ని, ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే చూపుతాడు. ఆత్మలోని పరమాత్మ జ్ఞ్యానమూ, ఆత్మలోని పరమాత్మ వలన కలిగే ఆత్మ జ్ఞ్యానమూ, ఈ రెండూ పరమాత్మ వలననే కలుగుతాయి. శరీరములో ఉన్న ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే, "ఇది ఆత్మా", అని చెబుతాడు, అది ఉన్న శరీరం ఆభాసమూ అని చెబుతాడు, ఆ శరీరములో ఉన్న తననీ చూపుతాడు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 128 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 12 🌴*
*12. yathā jala-stha ābhāsaḥ sthala-sthenāvadṛśyate*
*svābhāsena tathā sūryo jala-sthena divi sthitaḥ*
*MEANING : The presence of the Supreme Lord can be realized just as the sun is realized first as a reflection on water, and again as a second reflection on the wall of a room, although the sun itself is situated in the sky.*
*PURPORT : The example given herewith is perfect. The sun is situated in the sky, far, far away from the surface of the earth, but its reflection can be seen in a pot of water in the corner of a room. The room is dark, and the sun is far away in the sky, but the sun's reflection on the water illuminates the darkness of the room. A pure devotee can realize the presence of the Supreme Personality of Godhead in everything by the reflection of His energy. In the Viṣṇu Purāṇa it is stated that as the presence of fire is understood by heat and light, so the Supreme Personality of Godhead, although one without a second, is perceived everywhere by the diffusion of His different energies. It is confirmed in the Īśopaniṣad that the presence of the Lord is perceived everywhere by the liberated soul, just as the sunshine and the reflection can be perceived everywhere although the sun is situated far away from the surface of the globe.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 720 / Vishnu Sahasranama Contemplation - 720🌹*
*🌻720. అమూర్తిమాన్, अमूर्तिमान्, Amūrtimān🌻*
*ఓం అమూర్తిమతే నమః | ॐ अमूर्तिमते नमः | OM Amūrtimate namaḥ*
*కర్మనిబన్ధనామూర్తిర్విష్ణోస్య న విద్యతే ।*
*ఇతి విద్వద్భిరనన్తః ప్రోచ్యతేఽమూర్తిమానితి ॥*
*కర్మచే నిబంధించబడిన మూర్తి ఈతనిది కాదు. అందుకే అమూర్తిమాన్.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 720🌹*
*🌻720. Amūrtimān🌻*
*OM Amūrtimate namaḥ*
कर्मनिबन्धनामूर्तिर्विष्णोस्य न विद्यते ।
इति विद्वद्भिरनन्तः प्रोच्यतेऽमूर्तिमानिति ॥
*Karmanibandhanāmūrtirviṣṇosya na vidyate,*
*Iti vidvadbhiranantaḥ procyate’mūrtimāniti.*
*Since His form is not determined by the bonds of karma, He is called Amūrtimān.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 681 / Sri Siva Maha Purana - 681 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 01 🌴*
*🌻. త్రిపుర వర్ణనము - 1 🌻*
నారదుడిట్లు పలికెను -
గృహస్థుడగు శంభుని ఆనందదాయకమగు ఉత్తమ చరితమును, గణశ కుమారస్వాముల పవిత్రగాథను మేము వింటిమి (1). శంకరుడు రుద్రరూపుడై శత్రువులను సంహరిస్తూ విహరించిన ఉత్తమ చరిత్రను ఇపుడు పరమప్రీతితో వర్ణించి చెప్పుము (2). పరాక్రమ వంతుడగు శివభగవానుడు దేవద్రోహులగు అసురుల మూడు నగరములను ఒకే బాణముతో ఏకకాలమునందు ఎట్లు దహించెను? (3) చంద్రుని శిరముపై ధరించు వాడు, సర్వదా మాయారూపిణి యగు పార్వతితో కలిసి విహరించు వాడు అగు శివప్రభుని చరితమునంతను చెప్పుము. ఈ చరితము దేవతలకు, ఋషులకు సుఖమును కలిగించును (4).
బ్రహ్మ ఇట్లు పలికెను -
పూర్వము వ్యాసుడు ఋషిశ్రేష్ఠుడగు సనత్కుమారుని ఇదే విధముగా ప్రశ్నించగా, ఆయన చెప్పిన వృత్తాంతమునే నేను చెప్పెదను(5).
సనత్కుమారుడిట్లు పలికెను -
వ్యాసా! మహాప్రాజ్ఞా! చంద్రశేఖరుని చరిత్రను వినుము. జగత్తును లయము చేయు ఆ ప్రభువు ఒకే బాణముతో త్రిపురములను దహించిన తెరంగును వినుము (6). ఓ మహర్షీ! శివపుత్రుడగు స్కందుడు తారకాసురుని సంహరించగా, ఆతని పుత్రులగు ముగ్గురు రాక్షసులు మిక్కిలి దుఃఖించిరి (7). పెద్దవాని పేరు తారకాక్షుడు. రెండవవాడు విద్యున్మాలి. మూడవవాడు కమాలాక్షుడు, ముగ్గురు సమానమగు బలము గలవారే (8). దేవద్రోహులగు ఆ రాక్షసులు జితేంద్రియులు, మనస్సును నియంత్రించినవారు, సత్య వాక్య పరాయణులు, దృఢసంకల్పము గలవారు మరియు మహావీరులు(9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 681🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴*
*🌻 Description of Tripura (the three cities) - 1 🌻*
Nārada said:—
1. The excellent story of the householder Śiva, including that of Gaṇeśa, Skanda and others which confers bliss has been heard by us.
2. Now please narrate lovingly the story of how Śiva killed wicked persons playfully.
3. How did the lord burn off three cities (tripura) of the Asuras with a single arrow simultaneously? What sort of an arrow was it?
4. Please narrate the story of the moon-crested lord conducive to the happiness of the gods and sages and a play of the magic of Śiva.
Brahmā said:—
5. When he was asked by Vyāsa formerly, the excellent sage Sanatkumāra narrated the story. I will repeat the same.
Sanatkumāra said:—
6. O Vyāsa of great intellect, listen to the story of the moon-crested lord, how the annihilator of the universe burnt the three cities (tripura) with a single arrow.
7. O great sage, when the Asura Tāraka was killed by Skanda, the son of Śiva, his three sons performed austerities.
8. The eldest of them was Tārakākṣa, the middle one Vidyunmālī and the youngest Kamalākṣa. All of them were of equal strength.
9. They were self-controlled, well prepared, disciplined, truthful, of steady mind, heroic and inimical to the gods.
10. Eschewing all enjoyments captivating the mind, they went to the cavern of the mountain Meru[1] and performed a wonderful penance.
11. The three sons of Tāraka eschewed all desires in the season of spring. They disdained music, the sound of instruments as well as jubilation and performed penances.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 302 / Osho Daily Meditations - 302 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 302. పునర్జన్మ 🍀*
*🕉. పునర్జన్మ అనే తూర్పు భావన అందంగా ఉంటుది. అది నిజమా కాదా అనేది విషయం కాదు. ఇది మీకు జీవితం పట్ల చాలా శాంత వైఖరిని ఇస్తుంది. అదే అసలు విషయం. 🕉*
*పాశ్చాత్య దేశాలలో, ఒకే జీవితం మాత్రమే ఉందనే మత భావన కారణంగా చాలా తొందరపాటు ఉంటుంది. మరణంతో మీరు వెళ్లిపోయారు మరియు తిరిగి రాలేరు. అది ప్రజల మదిలో చాలా విచిత్ర ఆలోచనను సృష్టించింది. కాబట్టి అందరూ హడావిడిగా ఉన్నారు, వేగంగా పరుగెత్తుతున్నారు. వారు ఎక్కడికి వెళుతున్నారో ఎవరూ ఆందోళన చెందరు; వారు వేగంగా వెళ్లడం గురించి మాత్రమే ఆలోచిస్తారు, అంతే. కాబట్టి ఎవరూ దేనినీ ఆస్వాదించడం లేదు, ఎందుకంటే మీరు అంత వేగంతో ఉంటే ఎలా ఆనందించగలరు? జీవితమంతా కొట్టు- పరిగెత్తు వ్యవహారంగా మారింది. ఏదైనా ఆనందించాలంటే చాలా శాంతి, అభయం అవసరం. జీవితాన్ని ఆస్వాదించాలంటే శాశ్వతత్వం కావాలి.*
*మృత్యువు ఇంత త్వరగా రాబోతుంటే ఎలా ఆనందించ గలవు? ఒక వ్యక్తి తనకు వీలైనంత వరకు ఆనందించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ ప్రయత్నంలోనే శాంతి అంతా పోతుంది. శాంతి లేకుండా ఆనందం ఉండదు. మీరు చాలా నెమ్మదిగా విషయాలను ఆస్వాదించినప్పుడే ఆనందం సాధ్యమవుతుంది. మీకు వృధా చేయడానికి తగినంత సమయం ఉన్నప్పుడు మాత్రమే ఆనందం సాధ్యమవుతుంది. పునర్జన్మ యొక్క తూర్పు భావన అందంగా ఉంటుంది. అది నిజమా కాదా అనేది విషయం కాదు. ఇది జీవితం పట్ల మీకు చాలా శాంత వైఖరిని ఇస్తుంది. అదే అసలు విషయం. నేను అభౌతికం గురించి చింతించను. ఇది నిజం కావచ్చు, ఇది నిజం కాకపోవచ్చు; అది అస్సలు విషయం కాదు. నాకు అది అప్రస్తుతం. కానీ ఇది మీకు అందమైన నేపథ్యాన్ని ఇస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 302 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 302. REINCARNATION 🍀*
*🕉. The Eastern concept of reincarnation is beautiful. Whether or not it is true is not the point. It gives you a very relaxed attitude toward life· That is the real thing. 🕉*
*In the West there is too much hurry because of the Religion concept that there is only one life, and with death you are gone and will not be able to come back. That has created a very crazy idea in people's minds. So everybody is in a hurry, running fast. Nobody worries about where they are going; they just think about going faster, that's all. So nobody is enjoying anything, because how can you enjoy things at such a speed? All of life has become a hit-andrun affair. To enjoy anything one needs a very relaxed attitude. To enjoy life one needs eternity.*
*How can you enjoy when death is going to come so soon? One tries to enjoy as much as one can, but in that very effort all peace is lost, and without peace there is no enjoyment. Delight is possible only when you are savoring things very slowly. When you have enough time to waste, only then only is delight possible. The Eastern concept of reincarnation is beautiful. Whether or not it is true is not the point. It gives you a very relaxed attitude toward life. That is the real thing. I am not worried about metaphysics. It may be true, it may not be true; that's not the point at all. To me it is irrelevant. But it gives you a beautiful background.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*
*🌻 429. 'మదశాలినీ' - 1 🌻*
*ఆనందముచే ప్రకాశించునది శ్రీమాత అని అర్థము. 'శాలిని' అనగా ప్రకాశించునది అని అర్థము. 'మద'మనగా ఆనందమని అర్థము. అతిశయించిన ఆనందమే మదము. తెనుగున మదమను పదము గర్వమునకు పర్యాయ పదముగ వాడుదురు. నిజమునకు మద మనగా ముదమే, ఆనందమే.*
*భక్తి పారవశ్యమున ఆనందము కలిగినపుడు భక్తుడు అట్లతిశయించిన ఆనందమున యిక దేనిని లెక్కచేయడు. "తక్కుమేమి మనకు, రాముండొక్కడుండు వరకూ” అనుచు భక్తుడు కీర్తించునపుడు అతడు విషమును కూడ లెక్కచేయడు. రామదాసు రామభక్తిలో ఆనంద పరవశుడై తానీషా శిక్షను లెక్కచేయలేదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*
*🌻 429. 'Madashalini' - 1 🌻*
*It means that Srimata is radiant with joy. 'Shalini' means shining. 'Mada' means happiness. Mada is an exaggerated pleasure. In Telugu, mada is used as a synonym for pride. But in fact, mada means exaggerated joy.*
*When the devotee enjoys the ecstasy of devotion, the devotee does not count anything more than the bliss. When a devotee glorifies saying, 'Takkumemi to us, Ramundokkdundu' as sung by Ramadas meaning that he does not care anything as long as Lord Rama is there by his side, he does not even count the poison. Ramadasu was very happy in his devotion of Rama and did not count Tanisha's punishment.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comentaris