top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 04, FEBRUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

🌹🍀 04, FEBRUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 04, FEBRUARY 2023 SATURDAY, శనివారం, స్థిర వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 321 / Bhagavad-Gita -321 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 11 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 168 / Agni Maha Purana - 168 🌹 🌻. సూర్యుడు మరియు ఇతర గ్రహా ప్రతిమా లక్షణములు - 3 / Characteristics of the images of the Sun and other planets - 3 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 033 / DAILY WISDOM - 033 🌹 🌻 🌻 2. తత్వశాస్త్రంలో ఒక విషయం ఎలా సంభవిస్తుందో అధ్యయనం చేయబడింది / 2. The Why of a Thing is Studied in Philosophy🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 298 🌹

6) 🌹. శివ సూత్రములు - 35 / Siva Sutras - 35 🌹

🌻 11. త్రితయభోక్తా విరేషః - 3 / 11. Tritayabhoktā vīreśaḥ - 3 🌻

🌹. సంతోషాన్ని వెంబడించవద్దు. దాన్ని సృష్టించండి / Don't Chase Happiness. Create it 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 04, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 6 🍀*

11. నమః ఉగ్రాయ శాంతాయ భక్తేభ్యః శాంతిదాయినే |

గురవే సర్వలోకానాం నమః ప్రణవ రూపిణే

12. నమస్తే వాగ్భవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః |

నమస్తే కామరాజాయ యోషిత్కామాయ తే నమః


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ముక్తావస్థలో ప్రకృతి అంతఃప్రకృతి, బాహ్యప్రకృతి రెండు విభాగాలవుతుంది. తమ రజస్తమో గుణ ప్రవృత్తుల బంధం లేనిది అంతః ప్రకృతి. దానికి సాధన భూతమవుతూ మార్పులు చెందుతూ వుండేది బాహ్యప్రకృతి. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: శుక్ల చతుర్దశి 21:31:01

వరకు తదుపరి పూర్ణిమ

నక్షత్రం: పునర్వసు 09:17:12

వరకు తదుపరి పుష్యమి

యోగం: ప్రీతి 13:52:42 వరకు

తదుపరి ఆయుష్మాన్

కరణం: గార 08:14:27 వరకు

వర్జ్యం: 18:15:40 - 20:03:24

దుర్ముహూర్తం: 08:18:37 - 09:04:19

రాహు కాలం: 09:38:35 - 11:04:16

గుళిక కాలం: 06:47:13 - 08:12:54

యమ గండం: 13:55:38 - 15:21:19

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 06:35:12 - 08:23:04

మరియు 29:02:04 - 30:49:48

సూర్యోదయం: 06:47:13

సూర్యాస్తమయం: 18:12:41

చంద్రోదయం: 17:05:01

చంద్రాస్తమయం: 05:49:58

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం

09:17:12 వరకు తదుపరి మిత్ర

యోగం - మిత్ర లాభం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 321 / Bhagavad-Gita - 321 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 11 🌴*


*11. యదక్షరం వేదవిదో వదన్తి విశన్తి యద్యతయో వీతరాగా: |*

*యదిచ్చన్తో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే ||*


🌷. తాత్పర్యం :

*వేదవిదులైనవారును, ఓంకారమును ఉచ్చరించు వారును, సన్న్యాసాశ్రమము నందున్న మహర్షులు అగు మనుజులు బ్రహ్మము నందు ప్రవేశించు చున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్యవ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానము ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును.*


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు భ్రూమధ్యమున ప్రాణవాయువును నిలుపు షట్చక్రయోగాభ్యాసమును ఉపదేశించినాడు. అర్జునుడు ఆ యోగాభ్యాసము తెలియదని భావించి భగవానుడు దానిని రాబోవు శ్లోకములందు వివరింపనున్నాడు. పరబ్రహ్మము అద్వితీయుడైనను పలురూపములను మరియు లక్షణములను కలిగియుండునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.


నిరాకారవాదులకు ఓంకారము (అక్షరము) పరబ్రహ్మముతో సమానము. వీతరాగులైన యతులు ప్రవేశించు నిరాకారబ్రహ్మమును గూర్చి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు. వైదికమార్గమునందు ఓంకారము జపించుట మరియు పూర్ణ బ్రహ్మచర్యములో గురువుచెంత నిరాకారబ్రహ్మమును గూర్చి ఎరుంగుట శిష్యులకు ఆది నుండియే భోదింపబడును. ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క రెండు లక్షణములను తెలియగలరు.


ఈ అభ్యాసము బ్రహ్మచారుల ఆధ్యాత్మికజీవన పురోగతికి అత్యంత అవసరమైనను సంపూర్ణముగా నేటికాలమున అట్టి బ్రహ్మచర్యజీవనము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘికవ్యవస్థ సంపూర్ణముగా మార్పునొందినందున బ్రహ్మచర్యమును విద్యార్థిదశ నుండియే పాటించుట ఎవ్వరికినీ సాధ్యము కాకున్నది. ప్రపంచమంతటను వివిధజ్ఞానశాఖలకు పలు సంస్థలున్నను బ్రహ్మచర్య నియమములందు విద్యార్థులకు విద్యగరుపు ప్రామాణిక సంస్థ ఒక్కటియు లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించనిదే ఆధ్యాత్మికజీవన పురోగతి అత్యంత కష్టతరము కాగలదు. కనుకనే కలియుగమున శాస్త్రనియమము ప్రకారము శ్రీకృష్ణభగవానుని ప్రాప్తికి పవిత్ర శ్రీకృష్ణనామము తప్ప అన్యవిధానము లేదని శ్రీచైతన్యమాహాప్రభువు ప్రకటించి యుండిరి.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 321 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 11 🌴*


*11 . yad akṣaraṁ veda-vido vadanti viśanti yad yatayo vīta-rāgāḥ*

*yad icchanto brahma-caryaṁ caranti tat te padaṁ saṅgraheṇa pravakṣye*


🌷 Translation :

*Persons who are learned in the Vedas, who utter oṁ-kāra, and who are great sages in the renounced order enter into Brahman. Desiring such perfection, one practices celibacy. I shall now briefly explain to you this process by which one may attain salvation.*


🌹 Purport :

Lord Śrī Kṛṣṇa has recommended to Arjuna the practice of ṣaṭ-cakra-yoga, in which one places the air of life between the eyebrows. Taking it for granted that Arjuna might not know how to practice ṣaṭ-cakra-yoga, the Lord explains the process in the following verses. The Lord says that Brahman, although one without a second, has various manifestations and features. Especially for the impersonalists, the akṣara, or oṁ-kāra – the syllable oṁ – is identical with Brahman. Kṛṣṇa here explains the impersonal Brahman, into which the renounced order of sages enter.


In the Vedic system of knowledge, students, from the very beginning, are taught to vibrate oṁ and learn of the ultimate impersonal Brahman by living with the spiritual master in complete celibacy. In this way they realize two of Brahman’s features. This practice is very essential for the student’s advancement in spiritual life, but at the moment such brahmacārī (unmarried celibate) life is not at all possible. The social construction of the world has changed so much that there is no possibility of one’s practicing celibacy from the beginning of student life.


Throughout the world there are many institutions for different departments of knowledge, but there is no recognized institution where students can be educated in the brahmacārī principles. Unless one practices celibacy, advancement in spiritual life is very difficult. Therefore Lord Caitanya has announced, according to the scriptural injunctions for this Age of Kali, that in this age no process of realizing the Supreme is possible except the chanting of the holy names of Lord Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 168 / Agni Maha Purana - 168 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 51*


*🌻. సూర్యుడు మరియు ఇతర గ్రహా ప్రతిమా లక్షణములు - 3 🌻*


అనంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖుడు, కులికుడు మొదలగు ప్రముఖ నాగ గణములన్నియు సూత్రమును ధరించును. వీరందరును పడగల ఆకారముల గల ముఖములతో, గొప్ప తేజఃపుంజముతో ప్రకాశించు చుందురు, ఇంద్రుడు వజ్రము ధరించి గజముపై ఎక్కియుండును. అగ్ని శక్తి హస్తుడై మేక మీద కూర్చుంéడును. యుముడు దండము ధరించి మహిషాధిరూఢుడై ఉండును. ఖడ్గధారియైన నిరృతికి వాహనము మనిషి. వరుణుడు పాశహస్తుడా మకరముపై ఉండును. వజ్రధారియైన వాయుదేవునకు లేడి వాహనము. కుబేరుడు గద ధరించి గొఱ్ఱపై ఉండును. జటధారియైన ఈశానునకు వాహనము వృషభము.


లోకపాలులందరును ద్విభుజులు. విశ్వకర్మ చేతిలో అక్షసూత్రముండును. హనుమంతుని హస్తమునందు వజ్రయుధముండును. రెండు పాదములతో ఒక ఆసురుని అణగ ద్రొక్కి నిలబడును. కింనరులు వీణాధారులు, విద్యా ధరులు మాలాదారులై ఆకాశమున విహరించు చుందురు. పిశాచముల శరీరములు అస్థిపంజరమాత్ర శేషములుగ నుండును. వేతాళముల ముఖములు భయంకరముగ నుండును. క్షేత్రపాలులు శూలములు ధరించు యుందురు. ప్రేతముల ఉదరములు పెద్దవిగ నుండును. శరీరములు కృశించి యుండును.


అగ్ని మహాపురాణమునందు సూర్యాది ప్రతిమాలక్షణమను ఏబది ఒకటవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 168 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 51

*🌻Characteristics of the images of the Sun and other planets - 3 🌻*


13. (The serpents) Ananta, Takṣaka, Karka, Padma, Mahābja and Śaṅkha are all (represented as) having hooded heads with great radiance.


14. (The image of) Indra is endowed with thunder-bolt and as seated on an elephant, (that of) Agni as riding a goat and holding a spear, (that of) Yama as on a buffalo and carrying a club and (that of) Nirṛti as holding a sword.


15. (The image of) Varuṇa (ocean god) is made as seated) on a crocodile and as holding a noose, (that of) Vāyu (wind god) (as riding) an antelope and holding a banner, (that of) Kubera (god of wealth) as seated on a sheep and bearing a mace, and (that of) Īśāna (as seated) on a bull and having a matted hair.


16. (The images) of the guardian deities of the quarters of the world are endowed with two arms. (The celestial architect) Viśvakarman (should be represented) as holding a rosary. (The figure of) Hanūmat (monkey, devoted to Rāma) may be holding the thunderbolt in his hand and pounding the earth with his feet.


17. (The semi-divine beings) Kinnaras may be (represented) as holding lutes in their arms and the Vidyādharas (semi-divine beings) as having garlands (and moving) in the sky. The goblins may be (represented) as having emaciated bodies and the vampires as deformed faces, the Guardians of the sites as having the tridents and the spirits of the dead people as lean and big-bellied.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 33 / DAILY WISDOM - 33 🌹*

*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 2. తత్వశాస్త్రంలో ఒక విషయం ఎలా సంభవిస్తుందో అధ్యయనం చేయబడింది 🌻*


*ఒక విషయం ఎందుకు సంభవిస్తుంది అనేది తత్వశాస్త్రంలో అధ్యయనం చేయబడుతుంది. ఒక విషయం ఎలా సంభవిస్తుంది అనేది మనస్తత్వ శాస్త్రంలో అధ్యయనం చేయబడుతుంది. అసలు సంభవించేది 'ఏమిటి' అనేది అసలు రోజువారీ కార్యకలాపం. మన జీవితంలో సంభవించే ఏ విషయమైనా, అది ఎంత చిన్న వస్తువు అయినా, మన దృక్పథం మరియు విధానంలో మనం శాస్త్రీయంగా ఉండాలి.*


*శాస్త్రీయంగా ఉండటం అంటే ఏమిటి? ఇది మొదటి విషయాన్ని మొదటి విషయంగా, రెండవ విషయాన్ని రెండవ విషయంగా, ఒకదానితో మరొకటి కలపకుండా స్వీకరించడం. మొదటి విషయం విస్మరించి రెండవ విషయంతో ప్రారంభించకూడదు. విషయ ప్రాముఖ్యత అనుసారం ఉన్న వరుస శ్రేణిని మార్చకపోవడమే శాస్త్రీయత.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 33 🌹*

*🍀 📖 Philosophy of Yoga 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 2. The Why of a Thing is Studied in Philosophy 🌻*


*The ‘why’ of a thing is studied in philosophy. The ‘how’ of a thing is studied in psychology, and the ‘what’ is the actual daily routine of activity. In our approach to anything, even the smallest item, even the most insignificant so-called addendum to our life, we have to be scientific in our approach. And what is the meaning of being scientific?*


*It is taking the first thing as the first thing, the second thing as the second thing and not mixing up one with the other. You should not start with the second thing while the first thing has been ignored. To be able to conceive the consecutive series of any kind of movement is to be scientific.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 298 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. పరిస్థితిని ఎట్లా స్వీకరిస్తావు. ఎట్లా చూస్తావు అన్నదాని మీద ఆనందం ఆధారపడి వుంటుంది. ఆధ్యాత్మ దృష్టి వున్న మనిషి విషయాల్ని సరళంగా తీసుకుంటాడు. అందువల్ల సహజంగా జీవితం ఆనందమయ మవుతుంది. 🍀*


*నా చిన్నప్పుడు మా నాన్న మంచి యిల్లు కట్టాడు. మేస్త్రీ మోసం చేశాడు. మొదటి వర్షానికే ఆ యిల్లు కూలిపోయింది. మా నాన్న వూళ్ళో లేడు. టెలిగ్రాం యిచ్చాను. రాలేదు. రెండ్రోజులకు వచ్చి యిల్లెలా కూలింది. టెలిగ్రాంకు అనవసరంగా వది రూపాయలు ఎందుకు వేస్టు చేశావు? యింట్లోకి చేరక ముందే ఇల్లు కూలింది. లేకుంటే అందరం చచ్చేవాళ్ళం! అన్నాడు. వూరినంతా పిలిచి విందిచ్చాడు. అందరూ విస్తుపోయారు. 'మేమంతా బతికే వున్నాం కదా! ఆ సంతోష సంబరం' అన్నాడు. దీన్నే నేను ఎంపిక అంటాను.*


*పరిస్థితిని ఎట్లా స్వీకరిస్తావు. ఎట్లా చూస్తావు అన్నదాని మీద ఆనందం ఆధారపడి వుంటుంది. మా చెల్లెలు చనిపోయింది. నేను బాధపడుతూ వుంటే మా నాన్న నీ కింకా పదిమంది తమ్ముళ్ళు, చెల్లెల్ళు వున్నారు. అందర్నీ తీసుకు పోనందుకు ఆనందించు అన్నాడు. ఆధ్యాత్మ దృష్టి వున్న మనిషి విషయాల్ని అట్లా తీసుకుంటాడు. అందువల్ల సహజంగా జీవితం ఆనందమయ మవుతుంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 035 / Siva Sutras - 035 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 11. త్రితయభోక్తా విరేషః - 3 🌻*

*🌴. మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని అస్వాదించే వాడు శివుడు. 🌴*


*కానీ, తన ఇంద్రియాలను జయించిన ఒక యోగి, తన అనుభవ సమయంలో విషయానికి మరియు వస్తువుకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాడు, తద్వారా వస్తువు మరియు విషయం రెండింటినీ ఏకకాలంలో తెలుసుకుంటాడు. జ్ఞానోదయం పొందిన యోగి స్పృహ యొక్క మూడు దిగువ స్థాయిలలో అనుభూతి చెందుతున్న వాడిని గురించి ఎరుకలోనే ఉంటాడు.*


*అతనికి, మనస్సు ముద్రలను కలిగిస్తుంది కాబట్టి, వస్తువు మరియు విషయం మధ్య సంబంధం మనస్సును అధిగమించడం ద్వారా స్థాపించబడింది. లోపల ఉన్న బ్రహ్మం తరపున తన కార్యకలాపాలను కొనసాగించాలని మరియు అతను చేసేవాడు కానందున అతను ఏమి చేసినా కర్తృత్వం తీసుకోకూడదని ఈ సూత్రం చెబుతుంది. అతను లోపల స్వయం చెప్పినట్టు చేసాడు అంతే.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Siva Sutras - 035 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 11. Tritayabhoktā vīreśaḥ - 3 🌻*

*🌴. Shiva is the enjoyer of Bliss of all the three states 🌴*


*But a yogi, the one who has conquered his senses establishes a link between the subject and the object during his experience, thereby knowing both the object and the subject simultaneously. An enlightened yogi continues to know the experiencer in the three lower levels of consciousness.*


*For him, the link between the object and the subject is established by circumventing the mind, as the mind causes impressions. This aphorism says that one should continue his activities on behalf of the Brahman within, and should not take credit for whatever he does as he is not the doer. He is made to act by the Self within.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. సంతోషాన్ని వెంబడించవద్దు. దాన్ని సృష్టించండి. / DON'T CHASE HAPPINESS. CREATE IT. 🌹*

✍️. ప్రసాద్ భరద్వాజ


*మనలో చాలా మంది ఆనందాన్ని క్లిష్టతరం చేస్తారు, కనుక ఇది నశ్వరమైన భావోద్వేగంగా కనిపిస్తుంది. డబ్బు, ఆహారం, కారు, ఆస్తులు లేదా స్థానం సంపాదించడానికి మనం ఏదైనా చేయాలి. కానీ ఆనందాన్ని సంపాదించాలంటే ఏదో ఒకటి చేయాలి అనే సమీకరణాన్నే వర్తింపజేస్తాం. కాబట్టి మనం దాని కోసం వేచి ఉంటాము, దాని కోసం వెతుకుతాము, వెంబడిస్తాము, దానిని కొనాలని చూస్తాము, డిమాండ్ చేస్తాము, వాయిదా వేయండి లేదా దానిని ఒక సాఫల్యంతో ముడిపెట్టండి. కాబట్టి ఒక సమాజంగా మనం ఈ రోజు ధనవంతులుగా మరియు విజయవంతమయ్యాము కానీ సంతోషంగా లేము. నిజం ఏమిటంటే మనం ఉన్న చోటే ఆనందం ఏర్పడుతుంది. ఇది మనతో మరియు మనలో ఉంది. చేసేదేమీ లేదు, మనం సంతోషంగా ఉండాలి, ఈ క్షణం తర్వాత.*


*మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలమా? ఇది మా ఎంపిక. ఆనందం అంటే మనం ప్రతికూలతను లేదా బాధను తిరస్కరించడం కాదు. అదే సమయంలో మన జీవితంలోని పరిస్థితులు లేదా వ్యక్తులు మన ఆనందాన్ని దొంగిలించడానికి ఇక్కడ లేరని గుర్తుంచుకోండి. తమ పాత్రను వారు పోషిస్తున్నారు. వారు కొన్ని సమయాల్లో మనల్ని సవాలు చేస్తారు, కానీ మిగతా సమయాల్లో మనం సంతోషంగా ఉండకుండా మనల్ని మనం అడ్డుకుంటాము. ఆనందం అనేది మానసిక స్థితి లేదా అనుభూతికి సంబంధించినది కాదు, అది మన మార్గంలో వచ్చే ఏ సవాలునైనా అధిగమించే శక్తిని మనకు అందిస్తుంది. ఇది మన మనస్సు, బుద్ధి మరియు శరీరం ప్రశాంతత, జ్ఞానం మరియు ఆశావాదంతో పనిచేయడానికి కారణమవుతుంది. కాబట్టి సమస్యలు బాధలు కలిగించవు. బదులుగా మనం అనుభవాల నుండి నేర్చుకుని ఎదుగుతాం.*


* సంతోషకరమైన వ్యక్తులు ప్రజలను సంతోషపరుస్తారు. కానీ తరచుగా మనం మన లక్ష్యాలపై దృష్టి సారిస్తాము, అక్కడికి చేరుకునే ప్రక్రియను ఆస్వాదించడం మర్చిపోతాము. మనం తప్పు కర్మ చేయకపోయినా, సంతృప్తి లేదా తేలిక వంటి మన ప్రధాన లక్షణాలతో మనం సంబంధాన్ని కోల్పోతాము కాబట్టి మన ఆనందం తగ్గిపోతుంది. ఇది మన పనితీరు, ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రభావం చూపుతుంది. మన ప్రాధాన్యత జాబితాలో సంతోషాన్ని ఉంచుదాం, అంటే దానికి బాధ్యత వహిస్తామని హామీ ఇస్తున్నాము. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ దానిలో భాగస్వామ్యం లభిస్తుంది - ప్రపంచాన్ని అందంగా మార్చే బహుమతిని అందిస్తాము.*

🌹🌹🌹🌹🌹


*🌹DON'T CHASE HAPPINESS. CREATE IT. 🌹*


*Many of us complicate happiness, so it seems like a fleeting emotion. To earn money, food, car, possessions or position, we need to do something. But we apply the same equation that something is to be done to earn happiness. So we either wait for it, search for it, chase it, look to buy it, demand it, postpone it, or tie it to an accomplishment. So as a society we have become wealthy and successful today but not happy. Truth is that happiness can be created right where we are. It is with us and within us. There is nothing to do, we just need to be happy, moment after moment.*


*Can we be happy always? It is our choice. Happiness does not mean we deny negativity or pain. At the same time let us remember that situations or people in our lives are not here to steal our happiness. They are playing their role. They do challenge us at times but at all other times it is we who hold the self back from being Happy. Happiness is not just about a mood or feeling, it equips us with the power to cross any challenge that comes in our way. It causes our mind, intellect and body to function out of calmness, wisdom and optimism. So problems do not inflict suffering. Instead we will learn and grow from the experiences.*


*Happy people make people happy. But often we become so focused on our goals that we forget to enjoy the process of getting there. Even if we do not perform a wrong karma, our happiness starts reducing because we lose touch with our core qualities like contentment or lightness. This affects our performance, health and relationships. Let us put happiness on top of our priority list, which means we promise to take responsibility for it. When we are happy, everyone around us gets a share in it - we give a gift which makes the world beautiful.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Commentaires


bottom of page