🍀🌹 04, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 04, JULY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 393 / Bhagavad-Gita - 393 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 21 / Chapter 10 - Vibhuti Yoga - 21 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 239 / Agni Maha Purana - 239 🌹
🌻. స్నానతర్పణాది విధి కధనము - 5 / Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 105 / DAILY WISDOM - 105 🌹
🌻 14. అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు. / 14. The Faith of the Ignorant is not to be Shaken🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 371 🌹*
6) 🌹. శివ సూత్రములు - 107 / Siva Sutras - 107 🌹
🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 10 / 2-07. Mātrkā chakra sambodhah - 10 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 04, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 10 🍀*
*20. శ్రీరామరూపః కృష్ణస్తు లంకాప్రాసాదభంజనః |*
*కృష్ణః కృష్ణస్తుతః శాంతః శాంతిదో విశ్వభావనః*
*21. విశ్వభోక్తాఽథ మారఘ్నో బ్రహ్మచారీ జితేంద్రియః |*
*ఊర్ధ్వగో లాంగులీ మాలీ లాంగూలాహతరాక్షసః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సామాన్య సాధనక్రమం
కోశ విశుద్ధికి పూర్వమే కొందరికి నిక్కమైన అనుభూతి' కలగ వచ్చు. కాని, అది స్థిరంగా వుండదు. మరల తిరోహితమై కోశవిశుద్ధి కొరకు నిరీక్షిస్తుంది. అయినా ఇది ఎల్లరికీ వర్తించే విషయం కాదు. సామాన్యంగా సాధన ఆత్మ యందలి ఆకాంక్షతోనే ప్రారంభం అవుతుంది. పిమ్మట ఆలయం సిద్ధం కావడానికి ప్రకృతిలో సంఘర్షణ, అనంతరం విగ్రహావిష్కరణ, అటు తర్వాత పవిత్ర గర్భాలయంలో నిత్యసన్నిధి.🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 13:39:55
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పూర్వాషాఢ 08:26:44
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ఇంద్ర 11:49:22 వరకు
తదుపరి వైధృతి
కరణం: కౌలవ 13:37:55 వరకు
వర్జ్యం: 15:30:40 - 16:55:36
దుర్ముహూర్తం: 08:23:49 - 09:16:23
రాహు కాలం: 15:37:31 - 17:16:05
గుళిక కాలం: 12:20:23 - 13:58:57
యమ గండం: 09:03:15 - 10:41:49
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 04:09:24 - 05:34:56
మరియు 24:00:16 - 25:25:12
సూర్యోదయం: 05:46:07
సూర్యాస్తమయం: 18:54:40
చంద్రోదయం: 20:07:17
చంద్రాస్తమయం: 06:19:21
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 08:26:44 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 393 / Bhagavad-Gita - 393 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 21 🌴*
*21. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |*
*మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ||*
🌷. తాత్పర్యం :
*నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.*
🌷. భాష్యము :
*ఆదిత్యులు పన్నెండురు కలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. అకాశమునందు ప్రకాశించువానిలో సూర్యుడు ముఖ్యమైనవాడు. అతడు దేవదేవుని సముజ్జ్వలనేత్రముగా బ్రహ్మసంహిత యందు అంగీకరింపబడినాడు. ఆకాశమున ఏబదిరకముల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టానదేవతయైన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి.*
*రాత్రి సమయమున నక్షత్రములందు ప్రదానుడైన చంద్రుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. చంద్రుడు ఒకానొక నక్షత్రమని ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. అనగా ఆకాశమునందు మెరయు నక్షత్రములు కూడా సూర్యునికాంతినే ప్రతిబింబించుచున్నవి. విశ్వమునందు అనేక సూర్యులు కలరనెడి సిద్ధాంతమును వేదవాజ్మయము అంగీకరింపదు. సూర్యుడొక్కడే. సూర్యునికాంతిని ప్రతిబింబించుట ద్వారా చంద్రుడు వెలుగునట్లు, నక్షత్రములు కూడా వెలుతురును ప్రసరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములలో ఒకడని భగవద్గీత ఇచ్చట తెలుపుచున్నందున ఆకాశమున మొరయు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కానేరవు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 393 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 21 🌴*
*21. ādityānām ahaṁ viṣṇur jyotiṣāṁ ravir aṁśumān*
*marīcir marutām asmi nakṣatrāṇām ahaṁ śaśī*
🌷 Translation :
*Of the Ādityas I am Viṣṇu, of lights I am the radiant sun, of the Maruts I am Marīci, and among the stars I am the moon.*
🌹 Purport :
*There are twelve Ādityas, of which Kṛṣṇa is the principal. Among all the luminaries shining in the sky, the sun is the chief, and in the Brahma-saṁhitā the sun is accepted as the glowing eye of the Supreme Lord. There are fifty varieties of wind blowing in space, and of these winds the controlling deity, Marīci, represents Kṛṣṇa. Among the stars, the moon is the most prominent at night, and thus the moon represents Kṛṣṇa.*
*It appears from this verse that the moon is one of the stars; therefore the stars that twinkle in the sky also reflect the light of the sun. The theory that there are many suns within the universe is not accepted by Vedic literature. The sun is one, and as by the reflection of the sun the moon illuminates, so also do the stars. Since Bhagavad-gītā indicates herein that the moon is one of the stars, the twinkling stars are not suns but are similar to the moon.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 240 / Agni Maha Purana - 240 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 72*
*🌻. స్నానతర్పణాది విధి కధనము - 5 🌻*
*పిమ్మట అఘమర్షణము చేయవలెను. కుడిచేతిలో బోధరూప శివమయ మగు ఉదకము పోసికొని, ముక్కు దగ్గరకు తీసికొనిపోయి, (వామ) ఇడానాడి ద్వారా శ్వాస పీల్చి లోపల నిలిపి, లోపలినుండి నల్లని పాప పురుషుని (దక్షిణ) పింగళానాడి ద్వారా బైటకు తీసికొని వచ్చి ఆ జలమునందు స్థాపించవలెను. ఆ పాపపురుషునితో కూడిన జలమును, ఒక వజ్రమయ శిలను భావన చేసి, దానిపై పడవేసి చంపవలెను. దీనితో అఘమర్షణము సంపన్న మగును. పిమ్మట కుశ - పుష్ప - అక్ష తలతో కూడిన జలముతో అర్ఘ్యాంజలి పట్టి దానిని ''ఓం నమః శివాయ స్వాహా'' అను మంత్రముతో శివునకు సమర్పించి యథాశక్తిగ గాయత్రీ మంత్రము జపింపవలెను.*
*ఇపుడు తర్పణవిధిని చెప్పెదను. దేవతలకు వారి నామ మంత్రముల నుచ్చరించుచు, దేవతీర్థము ద్వారా తర్పణము చేయవలెను. ''ఓం హూం శివాయ స్వాహా'' అని చెప్పి శివునకు తర్పణమీయవలెను. ఇతర దేవతలకు కూడ ఈ విధముగనే వారి వారి పేర్లకు ''స్వాహా'' చేర్చి తర్పణము లీయవలెను. ''ఓం హాం హృదయాయ నమః, ఓం హీం శిరసే స్వాహా; ఓం హూం శిఖాయై వషట్; ఓం హై కవచాయ హుం; ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్; ఓం హః అస్త్రాయ ఫట్'' అను వాక్యము లుచ్చరించుచు క్రమముగ హృదయ - శిరః - శిఖా - కవచ - నేత్ర - అస్త్రన్యాసములు చేయవలెను. ఎనిమిది దేవగణములకు వారి పేర్ల చివర నమః అను పదము చేర్చి తర్పణము చేయవలెను. ''ఓం హాం ఆదిత్యేభ్యో నమః; ఓం హాం వసుభ్యో నమః; ఓం హాం రుద్రేభ్యో నమః; ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యో నమః; ఓం హాం మరుద్భ్యో నమః; ఓం మాం భృగుభ్యో నమః, ఓం హాం అంగిరోభ్యో నమః'' - ఈ విధముగ చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కంఠమునందు మాల వలె ధరించి (ఉపవతి) ఋషితర్పణము చేయవలెను. ''ఓం హాం అత్రయే నమః; ఓం హాం విశ్వామిత్రాయ నమః; ఓం హాం ప్రచేతసే నమః; ఓం హాం మరీచయే నమః'' అను మంత్రములు పఠించుచు అత్ర్యాది ఋషులకు ఋషితీర్థము ద్వారా తర్పణములు చేయవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 240 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 72*
*🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 5🌻*
37. That water should then be ejected into the right palm after having conceived it as black in colour because of the redemption of one’s sins. It should be thrown on a stone slab. This is known to be the aghamarṣaṇa (redeeming from sin) rite.
38. Then one should repeat the gāyatrī mantra as many times as possible after having offered the respectful arghya consisting, of kuśa, flowers and unbroken rice to Śiva with the mantras of Śiva ending with (the syllable) svāhā (oblation).
39. I shall describe the offering of water oblations to the god. One should utter the mantra Śivāya svāhā (oblations to Śiva) and offer water. (The syllable) svāhā should be repeated in all cases.
40. (The nyāsa should be done as) hrāṃ, to the heart; hrīṃ, to the head; hrūṃ, to the tuft of hair; hraiṃ, to the armour and the weapons, (or in the alternative), the eight gods (can be located) in the heart and other limbs).
41-44. (The water oblations should be performed for the following gods)—hrāṃ, to the Vasus, Rudras, Viśve (devas), (to the sages)—hāṃ to Bhṛgus, Aṅgirās, Atri; salutation to Vasiṣṭha, Pulastya, Kratu, Bhāradvāja; salutations to Viśvāmitra, to Pracetas; vaṣaṭ to Sanaka; hāṃ vaṣaṭ to Sananda, vaṣaṭ to Sanātana, vaṣaṭ to Sanatkumāra; vaṣaṭ to Kapila, to Pañcaśikha, (the ceremony being done) with the fingers of the right hand placed at the elbow joint of the left.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 105 / DAILY WISDOM - 105 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 14. అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు. 🌻*
*విద్య వెనుక ఉన్న ప్రాథమిక తత్వం ఏమిటంటే 'అనుభవ స్థితిలో ఉన్న ఆ స్థాయి వాస్తవికతకి భంగం కలిగించకూడదు.' అని. భగవద్గీత ఇలా ఉద్బోధిస్తుంది: “అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు” అయితే జ్ఞాని అజ్ఞానులకు జ్ఞానాన్ని అందించే పనిని చేస్తాడు. విద్య యొక్క ఏ దశలోనూ విద్యార్థి యొక్క స్థాయిని విస్మరించలేము. అయితే ఇది ఉన్నత స్థాయి జ్ఞానంతో పోల్చితే సరిపోని స్థాయి అని పరిగణించవచ్చు.*
*విద్య అనేది ఒక పూల మొగ్గ వికసించే కళాత్మక ప్రక్రియను పోలి ఉంటుంది. ఇది క్రమంగా మరియు అందంగా ఉంటుంది. ఏదైనా అనవసరమైన శక్తిని ప్రయోగించడం ద్వారా మొగ్గ అకస్మాత్తుగా తెరవబడదు; అలా చేస్తే అది వికసించదు, విరిగిపోతుంది. అటువంటి విరిగిన నిర్మాణం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ విద్యార్థి వెనుక దాగి ఉంటాడు, అయినా అతను ఎల్లప్పుడూ విద్యార్థితోనే ఉన్నాడు. ఆ విద్యార్థి ఏర్పరచుకునే భావజాలలో అతను భాగస్వామి కాకూడదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 105 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 14. The Faith of the Ignorant is not to be Shaken 🌻*
*The basic psychology behind education should be “not to disturb the degree of reality involved in any state of experience.” The Bhagavadgita exhorts: “The faith of the ignorant is not to be shaken” while the wise one performs the function of imparting knowledge to the ignorant. The standpoint of the student in any stage of education cannot be ignored, though it may be regarded as an inadequate standpoint in comparison with a higher level of knowledge.*
*Education is similar to the artistic process of the blossoming of a flower bud, gradually and beautifully. The bud is not to be opened suddenly by exerting any undue force; else, it would not be a blossom, but a broken structure serving no purpose. The teacher is always to be hidden behind the student, though he is with the student at all times. He is not to come to the forefront, either as a superior or an unpleasant ingredient among the constituents that go to form the feelings, aspirations and needs of the student at any particular level.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 371 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' అన్నారు.అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. వాటిని అనుభూతి చెందు. 🍀*
*విశ్వం విశాలమైంది. హద్దులు లేనిది. దాంట్లో భాగాలం కనక మనమూ సరిహద్దులు లేని వాళ్ళమే. అనంత విశ్వంలోని అపూర్వ లక్షణాలు మనలోనూ వున్నాయి. చిన్ని ఫార్ములాని గమనించు. సమస్తం శాశ్వతమయితే భాగాలు ఎప్పటికీ అశాశ్వతం కావు. అట్లాగే విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' - అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. అవి మానవజాతి తరపున తీర్మానాలు. ఇవి అహంకార పూరితాలు కావు. అవి వాస్తవ ప్రకటనలు. వాటిని అనుభూతి చెందు. ఆద్యంతాలు లేని అనంతంలో నువ్వు భాగం. అపుడు నువ్వు తెలికపడతావు. నీ అల్పమయిన కష్టాలు, బాధలు వదిలిపెడతావు. నీ వైశాల్యంలో అవి అతి అల్పమైనవి. అవి లెక్కించాల్సినవి కావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 107 / Siva Sutras - 107 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 10 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*
*పైన చర్చించిన చివరి నాలుగు దశలు ప్రతి మనిషిలో కూడా జరుగుతాయి. ఇప్పటివరకు, శివ పది కదలికలు చేసాడు, దాని ఫలితంగా పది అచ్చులు వెల్లడయ్యాయి. అతని చైతన్యం యొక్క అంతర్గతీకరణ అంటే మొత్తం విశ్వం అతని అత్యున్నత స్థాయి చైతన్యం మరియు ఆనందంతో గుర్తించబడుతుందని అర్థం. ఈ దశల ముగింపులో, సృష్టి ఆవిర్భవించదు. ఈ సూత్రం చాలా సుదీర్ఘమైన వివరణను కలిగి ఉంది. పై వివరణ మొదటి భాగాన్ని పూర్తి చేస్తుంది. ఇక మిగిలిన భాగాలు అనుసరించబడతాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 107 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-07. Mātrkā chakra sambodhah - 10 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴*
*The last four stages that have been discussed above also happen within every human being. So far, Śiva has made ten movements, as a result of which ten vowels have been revealed. The internalisation of His consciousness means that the entire universe is being identified with His highest levels of consciousness and bliss. At the end of these stages, the creation as such does not unfold. This aphorism has a very lengthy explanation. The above interpretation completes the first part and rest of the parts will follow.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments