🍀🌹 04, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 04, MAY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 212 / Agni Maha Purana - 212 🌹
🌻. లక్ష్మీ స్థాపనము. - 2 / Mode of installation of the image of Goddess Lakṣmī - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 077 / DAILY WISDOM - 077 🌹
🌻 17. విశ్వం అనే 'నేను' / 17. The Cosmic “I-am”🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 342 🌹
6) 🌹. శివ సూత్రములు - 79 / Siva Sutras - 79 🌹
🌻 2-02. ప్రయత్నః సాధకః - 1 / 2-02. Prayatnaḥ sādhakaḥ - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 04, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🍀. నరసింహ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Narasimha Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : నరసింహ జయంతి, Narasimha Jayanti 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 4 🍀*
*7. శ్రీరామమంత్రవిఖ్యాతో రామమంత్రాబ్ధిపారగః |
రామభక్తో రామసఖా రామవాన్ రామహర్షణః
8. అనసూయాత్మజో దేవదత్త శ్చాత్రేయనామకః |
సురూపః సుమతిః ప్రాజ్ఞః శ్రీదో వైకుంఠవల్లభః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జగన్మాత ప్రేమ ప్రసారం - దైవానికి నిన్ను నీవు నిశ్శేషంగా ఇచ్చుకోడం నేర్చితే దైవం కూడా నీకు తనను తాను నిరర్గళంగా ఇచ్చుకోడం జరుగుతుంది. ఇది నీ అంతరంగంలో అనుభవానికి రాగల విషయం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 23:45:00
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: చిత్ర 21:36:19
వరకు తదుపరి స్వాతి
యోగం: వజ్ర 10:36:18 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: గార 11:48:20 వరకు
వర్జ్యం: 05:10:40 - 06:49:12
మరియు 27:12:56 - 28:49:12
దుర్ముహూర్తం: 10:04:56 - 10:56:09
మరియు 15:12:15 - 16:03:28
రాహు కాలం: 13:49:01 - 15:25:03
గుళిక కాలం: 09:00:55 - 10:36:57
యమ గండం: 05:48:51 - 07:24:53
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 15:01:52 - 16:40:24
సూర్యోదయం: 05:48:51
సూర్యాస్తమయం: 18:37:06
చంద్రోదయం: 17:28:24
చంద్రాస్తమయం: 04:41:45
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు : చర యోగం - దుర్వార్త
శ్రవణం 21:36:19 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 27 🌴*
*27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |*
*యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||*
🌷. తాత్పర్యం :
*ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.*
🌷. భాష్యము :
*ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము.*
*ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 365 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴*
*27. yat karoṣi yad aśnāsi yaj juhoṣi dadāsi yat*
*yat tapasyasi kaunteya tat kuruṣva mad-arpaṇam*
🌷 Translation :
*Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.*
🌹 Purport :
*Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance. Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him. Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa.*
*Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana. Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 212 / Agni Maha Purana - 212 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 62*
*🌻. లక్ష్మీ స్థాపనము. - 2 🌻*
*పిమ్మట "అర్ద్రాం పుష్కరిణీమ్" ఇద్యాదిమంత్రముతో గంధ మర్పించి, "అర్ద్రాం యః కరిణీమ్ ఇత్యాదిమంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. పిమ్మట "తాం మ ఆవహా జాతవేదః" ఇత్యాదిమంత్రముతోను, "ఆనన్దః" ఇత్యాదిశ్లోకములతోను మిగిలన ఉపచారములన్నియు సమర్పింపవలెను. 'శ్రాయన్తీ' ఇత్యాదిమంత్రము చదువుచు శయ్యపై పరుండపెట్టవలెను. శ్రీసూక్తము పఠించుచు సంనిధీకరణము చేసి, లక్ష్మీబీజముతో (శ్రీం) చిచ్ఛక్తి విన్యాసము చేసి మరల పూజింపవలెను. పిదప శ్రీసూక్తముతో మండపముపైనున్న కుండములలో కమలముతో గాని, కరవీరపుష్పములతో గాని వెయ్యి లేదా వంద హోమములు చేయవలెను. గృహోపకరణాది సమస్తపూజాసామగ్రి మొదటి నుండియు శ్రీసూక్తమంత్రములతోడనే సమర్పింపవలెను. వెనుకటి వలె ప్రాసాదమునకు సంస్కారము చేసి, లక్ష్మికి పిండికానిర్మాణము చేయవలెను. పిమ్మట పిండికపై లక్ష్మిని ప్రతిష్ఠచేసి, శ్రీసూక్తముతో సంనిధీకరణము చేయుచు వెనుకటి వలె శ్రీసూక్తమునందలి ఒక్కొక్క ఋక్కును జపించవలెను. మూలమంత్రముచే చిచ్ఛక్తిని జాగృత మొనర్చి మరల సంనిధీకరణము చేయవలెను. పిమ్మట ఆచార్యునకు, బ్రహ్మకు, ఇతరఋత్విక్కులకు, బ్రహ్మణులకు భూ-సువర్ణ-వస్త్ర-గోదానాదులు చేయవలెను. ఈ విధముగ అందరి దేవులను స్థాపించినవాడు-రాజ్య-స్వర్గాదులను పొందును.*
*శ్రీ అగ్నిపురాణమునందు లక్ష్మీస్థాపన మను ఆరువదిరెండవ అధ్యాయము సమాప్తము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 212 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 62*
*🌻Mode of installation of the image of Goddess Lakṣmī - 2 🌻*
8. (The priest should worship the image) with perfumes accompanied by ārdrām puṣkariṇīm[13], with flowers accompanied by tāṃ ma āvaha[14] and ya ānanda.[15]
9. The goddess should be worshipped in the bed with (the mantra) śāyantī[16] yena and her presence is accomplished by śrīsūkta[17]. Her consciousness is invoked and worshipped again with. the principal mantra of the goddess.
10. Thousand or hundred lotus flowers or karavīra flowers. should be offered in the fire pit at the shed accompanied by śrīsūkta.[17]
11. Household furniture should be offered with the śrīsūkta[17] itself. Then the consecration of edifice should be performed as described earlier.
12. The pedestal should be made with (the recitation of) the mantra. The installation of the goddess is done subsequently. Her presence is accomplished with the śrīsūkta.[17] Everyone of the hymns (stated earlier)) should be recited as before.
13. Having invoked consciousness in the image, her presence is accomplished by the principal mantra. The priest and the brahmins should be presented with land, gold, clothes, cow and food. The images of all other forms of goddesses should be installed in the same way. One who invokes (and consecrates) in this way is held as going to heaven.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 77 / DAILY WISDOM - 77 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 17. విశ్వం అనే 'నేను' 🌻*
*మనం వేదాంతంలో పిలిచే, విశ్వమనస్సు లేదా హిరణ్యగర్భం అనేది విశ్వ స్వీయ అస్తిత్వం. ఇది విశ్వం యొక్క స్వీయచైతన్యం. విశ్వం యొక్క పరిపూర్ణ, స్వచ్ఛమైన అస్తిత్వం. అన్ని విధాలైన వైవిధ్యాలు ఇక్కడ నుంచే పుడతాయి. ఒక రకంగా చెప్పాలంటే, మనం ఈ విశ్వ మనస్సులో భాగాలు అని చెప్పవచ్చు, కానీ అది పూర్తిగా నిజం కాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనల్ని మనం పరమాత్మలో భాగాలుగా పరిగణించలేము. మనం మన కళ్లతో చూసే ఏదీ పరమాత్మకు నిజమైన ప్రాతినిధ్యంగా పరిగణించబడదు. కాబట్టి, మనం హిరణ్యగర్భంలో కూడా భాగాలు కాదని అర్థం చేసుకోవాలి. మనం దానికంటే చాలా తక్కువ.*
*మనం హిరణ్యగర్భం మరియు విరాట్ స్థితుల కంటే చాలా దిగువన ఉన్నాము. దాని కారణాలు వల్ల మనం త్వరలో చూద్దాం. ప్రస్తుతానికి ఈ శ్లోకం అసలు అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. సాంఖ్యం ప్రకృతి అని, వేదాంతులు మాయ లేదా మూల ప్రకృతి అని పిలిచే ఈ వాస్తవికత యొక్క ఒక పూర్తి విధ్వంసం మరియు మృత్యువు జరిగింది. అది మహత్ మరియు విశ్వ అహంకారం అని పిలువబడే విశ్వ మనస్సు యొక్క అభివ్యక్తికి బీజం అవుతుంది. వేదాంతము దానిని హిరణ్యగర్భం మరియు విరాట్ అని పిలుస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 77 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 17. The Cosmic “I-am” 🌻*
*The Cosmic Mind, Hiranyagarbha, as we call it in the Vedanta, is the Cosmic “I-Am”. It is Self-Consciousness, Pure Universality. And, here is the seed of all diversity. In a sense, we may say that we are parts of this Cosmic Mind, but not, indeed, correctly. As I pointed out, we cannot regard ourselves as parts of the Absolute. Nothing that we see with our eyes can be regarded as a real representation of the Absolute. Thus, we have to understand that we are not parts, even of the Hiranyagarbha. We are much less than that.*
*We are far down below the condition of Hiranyagarbha and Virat, for reasons we shall see shortly. For the time being, it is enough if we understand the actual meaning of this passage. There was a destruction, a Mrityu, a complete abolition of Reality, which is what the Samkhya calls Prakriti, and the Vedantins call Maya, Mula-Prakriti, etc., the Potential Being, the Matrix of the universe. That becomes the seed for the manifestation of the Cosmic Mind, known as Mahat and Cosmic Ahamkara. The Vedanta calls them Hiranyagarbha and Virat.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 342 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. శరీరానికి పరిమితి వుంది అందుకే మరణ భయం. అందుకనే భయం, ఆందోళన, ఆగ్రహం. మనల్ని చుట్టు ముట్టిన శరీరం నించీ మనసు నించీ మనం క్రమక్రమంగా వేరు కావాలి. ప్రతి ఒక్కడూ ఆ పని చేయడానికి సమర్థుడు. 🍀*
*శరీరానికి పరిమితులున్నాయి. అది జీవన్మరణాలకు మధ్యలో వుంది. మనసుకయినా అంతే. మనసు శరీరం నించీ వేరు కాదు. అది దాని లోపలి కోణం. శరీరానికి లోపల మనసు వుంది. మనసుకు బయట శరీరముంది. భాష ఈ రెండు వేరు వేరనే తప్పుడు అభిప్రాయాన్ని ఇస్తుంది. శరీరం, మనసు అంటుంది. నిజానికి శరీర మనసు అనాలి. అది ఒకే పదం, ఒకే వాస్తవం. నాణేనికి రెండు వైపు లేట్లాగో అట్లాగా మనసుకు పరిమితి వుంది. శరీరానికి పరిమితి వుంది అందుకే మరణ భయం. శరీరం భయపడదు, కారణం అది అచేతనం. కానీ మనను భయపడుతుంది. వణుకుతుంది.*
*భయమేమిటంటే ఈ రోజో రేపో ఫులుస్టాఫ్ వస్తుంది. సమస్య ఏమిటంటే మనమింకా ఏమీ సాధించలేదు. కానీ జీవితం ముగిసిపోతోంది. ప్రతిక్షణ క్షణం మరణం సమీపాన్ని కొస్తోంది. జీవితం చేజారిపోతోంది. అందుకనే భయం, ఆందోళన, ఆగ్రహం. మనల్ని చుట్టు ముట్టిన శరీరం నించీ మనసు నించీ మనం క్రమక్రమంగా వేరు కావాలి. అది వీలవుతుంది. ఆ పని చేయాలి. ప్రతి ఒక్కడూ ఆ పని చేయడానికి సమర్థుడు. అది అసాధ్యం కాదు. కష్టమయిందే కానీ అసాధ్యం కాదు. అది కష్టమయింది కావడం మంచిదే. అది మనకు సవాలు నిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 079 / Siva Sutras - 079 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-02. ప్రయత్నః సాధకః - 1 🌻*
*🌴. నిరంతర ధ్యాన పూర్వక ప్రయత్నంతో, యోగి తన చైతన్యంలో మరియు మంత్రాలలో దాగి ఉన్న శక్తులకు ప్రభువుగా మారి, భగవంతుని చైతన్యాన్ని పొందుతాడు. 🌴*
*ప్రయత్నః – నిరంతర ప్రయత్నం; సాధకః - సాక్షాత్కార ప్రయోజనం కోసం స్వీకరించ బడిన సాధన.*
*మంత్రం మరియు దాని దేవతతో అతని ఆలోచనా విధానాన్ని సమలేఖనం చేయడానికి నిరంతర ప్రయత్నం మరియు అంకితమైన అభ్యాసం అవసరం. ఒకరు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నప్పుడు, అతను తన ఆలోచన విధానాన్ని దేవత యొక్క మంత్రంతో సమలేఖనం చేయాలి. ఈ సంబంధం స్థాపించబడక పోతే, అభ్యాసకుడికి సమర్థవంతమైన ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. పరమ సత్యమైన శివుడిని గ్రహించడానికి ఒకరి చైతన్యం లేదా అవగాహన యొక్క ప్రాముఖ్యతను శివ సూత్రాలు పదేపదే నొక్కిచెప్పాయి. మునుపటి సూత్రం ఇక్కడ మరింత విస్తరించబడింది. మునుపటి సూత్రంలో ప్రవాస మంత్రం తర్వాత, ఈ సూత్రం ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 079 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-02. Prayatnaḥ sādhakaḥ - 1 🌻*
*🌴. By Persistent meditative effort, Yogi becomes the master of the forces latent in his consciousness and mantras and attains God consciousness. 🌴*
*Prayatna – continued effort; sādhaka – adapted for the purpose of realization.*
*Persistent effort and dedicated practice is necessary to align his thought process with mantra and its deity. When one desires to advance spiritually, he has to align his thought process with the mantra of the deity. If this union is not established, there cannot be an effective spiritual progression of the practitioner. Śiva Sūtra-s have repeatedly emphasized the importance of one’s consciousness or awareness to realize Śiva, the Ultimate Reality. The previous sūtra is further expanded here. After having expatiated mantra in the previous sūtra, this sūtra provides practical guidance.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments