top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 04, OCTOBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 04, OCTOBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 04, OCTOBER 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 437 / Bhagavad-Gita - 437 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 23 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 23 🌴

3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 798 / Sri Siva Maha Purana - 798 🌹

🌻. శివ జలంధరుల యుద్ధము - 2 / Description of Jalandhara’s Battle - 2 🌻

4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 51 / Osho Daily Meditations  - 51 🌹

🍀 51. పొగలేని జ్వాల / 51. SMOKELESS FLAME 🍀

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 -3 🌹

🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 3 / Description of Nos. 485 to 494 Names - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 04, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*


*🍀. శ్రీ గజానన స్తోత్రం - 14 🍀*


*14. మహాఖుమారూఢ మకాలకాలం విదేహ యోగేన చ లభ్యమానమ్ |*

*అమాయినం మాయికమోహదం తం గజాననం భక్తియుతా భజామః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : గురువాద ప్రశస్తి - సాధనలో గురువు ఆవశ్యకతను ఉద్ఘాటించే గురువాదాన్ని ముక్త పురుషులెవ్వరూ ఇంతవరకు నిరాకరించి వుండలేదు. ప్రాణ, మనఃకోశాలలో నివసిస్తూ వాటికి సంబంధించిన స్వాతిశయ ప్రవృత్తి కలవారు మాత్రమే గురువు నంగీకరించడం తమ ఘనతకు లోపంగా భావిస్తారు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: కృష్ణ షష్టి 29:42:07 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: రోహిణి 18:30:23 వరకు

తదుపరి మృగశిర

యోగం: సిధ్ధి 06:42:04 వరకు

తదుపరి వ్యతీపాత

కరణం: గార 17:37:30 వరకు

వర్జ్యం: 10:21:20 - 11:59:04

మరియు 24:22:20 - 26:03:00

దుర్ముహూర్తం: 11:40:54 - 12:28:39

రాహు కాలం: 12:04:47 - 13:34:18

గుళిక కాలం: 10:35:15 - 12:04:47

యమ గండం: 07:36:12 - 09:05:44

అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27

అమృత కాలం: 15:14:32 - 16:52:16

సూర్యోదయం: 06:06:40

సూర్యాస్తమయం: 18:02:53

చంద్రోదయం: 21:59:17

చంద్రాస్తమయం: 10:46:12

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: శుభ యోగం - కార్య

జయం 18:30:23 వరకు తదుపరి

అమృత యోగం - కార్య సిధ్ది

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 437 / Bhagavad-Gita - 437 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 23 🌴*


*23. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదమ్ |*

*బహూదరం బహు దంష్ట్రాకరాలం దృష్ట్వా లోకా: ప్రవ్యథితాస్తథాహమ్ ||*


*🌷. తాత్పర్యం : ఓ మహాబాహో! బహు ముఖములును, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నియు వ్యథ చెందుచున్నవి. వానివలెనే నేనును కలత చెందుచున్నాను.*


*🌷. భాష్యము : భగవంతుని అసంఖ్యాకములైన చేతులు, కాళ్ళు, ముఖములు, మరియు ఉదరములు అంతటా ఉన్నాయి. శ్వేతాశ్వాతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:*


*సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్*

*స భూమిం విశ్వతో వృత్వాత్యతిష్ఠద్దశాఙ్గులమ్ (3.14)*


*‘సర్వోత్కృష్ట భగవానుడికి వేలకొలదీ తలలు, వేల కళ్ళు, మరియు వేల పాదములు ఉన్నాయి. ఆయన విశ్వమును ఆవరించి ఉన్నాడు, కానీ దాని కన్నా అతీతుడు. అందరు మనుష్యులలో నాభి (బొడ్డు) నుండి పది వేళ్ళ పైన, హృదయాంతరాళంలో ఆయన ఉన్నాడు.’ ఆయనను దర్శించేవారు, ఆయనచే దర్శించబడేవారు, భీతిల్లి పోయేవారు మరియు భయం పుట్టించేవారు అందరూ కూడా ఆ భగవంతుని విశ్వ రూపము యందు భాగమే. మరల, కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:*


*భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్యః*

*భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః (2.3.3)*


*‘భగవంతుడు అంటే భయం చేతనే, అగ్ని మండుతున్నది మరియు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన అంటే భయము వలననే గాలి వీస్తున్నది, మరియు ఇంద్రుడు వర్షాలను కురిపిస్తున్నాడు. మృత్యు దేవత యమధర్మరాజు కూడా ఆయన ముందు వణికిపోతాడు.’*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 437 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 23 🌴*


*23. rūpaṁ mahat te bahu-vaktra-netraṁ mahā-bāho bahu-bāhūru-pādam*

*bahūdaraṁ bahu-daṁṣṭrā-karālaṁ dṛṣṭvā lokāḥ pravyathitās tathāham*


*🌷 Translation : O mighty-armed one, all the planets with their demigods are disturbed at seeing Your great form, with its many faces, eyes, arms, thighs, legs and bellies and Your many terrible teeth; and as they are disturbed, so am I.*


*🌹 Purport : The numerous hands, legs, faces, and stomach of God are everywhere. The Śhwetāśhvatar Upaniṣhad states:*


*sahasraśhīrṣhā puruṣhaḥ sahasrākṣhaḥ sahasrapāt*

*sa bhūmiṁ viśhwato vṛitvātyatiṣhṭhaddaśhāṅgulam (3.14)[v5]*


*“The Supreme Entity has thousands of heads, thousands of eyes, and thousands of feet. He envelopes the universe, but is transcendental to it. He resides in all humans, about ten fingers above the navel, in the lotus of the heart.” Those who are beholding and those who are being beheld, the terrified and the terrifying, are all within the universal form of the Lord. Again, the Kaṭhopaniṣhad states:*


*bhayādasyāgnistapati bhayāt tapati sūryaḥ*

*bhayādindraśhcha vāyuśhcha mṛityurdhāvati pañchamaḥ (2.3.3)[v6]*


*“It is from the fear of God that the fire burns and the sun shines. It is out of fear of him that the wind blows and Indra causes the rain to fall. Even Yamraj, the god of death, trembles before him.”*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 798 / Sri Siva Maha Purana - 798 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 22 🌴*


*🌻. శివ జలంధరుల యుద్ధము - 2 🌻*


*ఆయన బాణముల తుఫానులచే రాక్షసులను దుఃఖింపచేసెను. మరియు భయంకరమగు బాణములను గుప్పించి వారిని నేల గూల్చెను (10). మరియు ఖడ్గరోముని శిరస్సును పరశువుతో నరికి దేహమునుండి వేరు చేసెను. మరియు ఖట్వాంగముతో బలాహకుని శిరస్సును రెండు ముక్కలుగా చేసెను (11). ఆయన ఘస్మరాసురుని పాశముతో బంధించి నేలగూల్చెను. మహావీరుడగు ప్రచుండుని త్రిశూలముతో నరికివేసెను (12). వృషభము కొందరిని సంహరించగా, మరి కొందరు బాణములచే సంహరింపబడిరి. సింహముచే పీడింపబడిన ఏనుగులు వలె ఆ రాక్షసులు అచట నిలబడలేక పోయిరి (13). అపుడు ధైర్యశాలి, మహారాక్షసుడు అగు జలంధరుడు క్రోధముతో నిండిన మనస్సు గలవాడై శుంభాది రాక్షసులను ఆ యుద్ధములో నిందించి ఇట్లు పలికెను (14).*


*జలంధరుడిట్లు పలికెను - శత్రువులచే పృష్ఠ భాగమునందు కొట్టబడుతూ పారిపోయే మీరు మాతృవంశమును గూర్చి గొప్పలను చెప్ప ఫలమేమున్నది.? మేము శూరులమని భావించు వారలు భయపడి పారిపోతూ వధింపబడుట కొని యాడదగినది కాదు; స్వర్గమును ఈయబోదు (15). ఓ అల్పులారా! మీకు యుద్ధమునందు శ్రద్ద ఉన్నచో, హృదయములో దార్ఢ్యము ఉన్నచో, తుచ్ఛసుఖముల యందు తృష్ణలేని వారైనచో కేవలము నా ఎదుట నిలబడుడు (16). యుద్ధములో మరణించుట శ్రేష్ఠము. ఆ మరణము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. సర్వఫలములను, కీర్తిని, మరియు విశేషించి మోక్షమును కూడా ఇచ్చునని మహర్షులచే కీర్తింపబడినది (17).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 798 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 22 🌴*


*🌻 Description of Jalandhara’s Battle - 2 🌻*


10. He afflicted the Daityas with the gusts of wind raised by the arrows. He felled them to the ground with fierce volleys of arrows.


11. He severed the head of Khaḍgaromā from his body with his axe. He shattered the head of Balāhaka with his club into two pieces.


12. He tied the Daitya Ghasmara with his noose and dashed him on the ground. With his trident, he chopped off the great hero Pracaṇḍa.


13. Some of the Asuras were killed by the bull. Some were struck by the arrows. Like elephants harassed by lions, the Asuras were unable to stay there.


14. Then the great Asura Jalandhara became infuriated and rebuked the Daityas in the battle. The courageous Daitya mocked at Śumbha and others and spoke thus.

Jalandhara said:—


15. Of what avail is your boasting about the pedigree of your mother if you flee back on being attacked? To die cowardly while you profess to be heroes is not commendable, nor does it yield heaven.


16. O trivial fellows, if you have faith in war or the essential strength in the heart or if you have no lurking pleasures for sexual indulgence then you come forward and stand before me.


17. Death in battle is preferrable. It yields all cherished desires. It is especially conducive to fame. It has been proclaimed as the bestower of salvation too.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 51 / Osho Daily Meditations  - 51 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 51. పొగలేని జ్వాల 🍀*


*🕉. ఎక్కడ వెలుగు చూసినా ఆరాధనగా భావించండి. గుడి అక్కడే ఉంది. 🕉*


*కాంతి రహస్యాలను చూడండి. కేవలం ఒక చిన్న జ్వాల ప్రపంచంలో అత్యంత రహస్యమైన విషయం, మరియు జీవితం మొత్తం దానిపై ఆధారపడి ఉంటుంది. అదే జ్వాల మీలో మండుతోంది. అందుకే నిరంతర ఆక్సిజన్ అవసరం, ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా మంట మండదు.*


*అందుకే యోగాలో చెప్పబడినట్టుగా లోతుగా ఊపిరి పీల్చుకోవడం, ఆక్సిజన్‌ను ఎక్కువగా పీల్చడం ద్వారా మీ జీవితం మరింత లోతుగా మండుతుంది మరియు జ్వాల స్పష్టంగా మారుతుంది మరియు మీలో ఎటువంటి పొగ రాకుండా ఉంటుంది--మీరు పొగలేని మంటను పొందవచ్చు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 51 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 51. SMOKELESS FLAME  🍀*


*🕉.  Wherever you see light, feel worshipful. The temple is there.  🕉*


*Look at the mysteries of light. Just a small flame is the most mysterious thing in the world, and the whole of life depends on it. The same flame is burning in you. That's why continuous oxygen is needed, because the flame cannot burn without oxygen.*


*This is why yoga emphasizes breathing deeply, breathing more and more oxygen so that your life burns deeper and the flame becomes clearer and no smoke arises in you--so that you can attain a smokeless flame.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 485 - 494 -3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 490 - 494 - 3🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।*

*దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*

*🍀  101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।*

*మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*


*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 3 🌻*


*పండ్రెండు దళముల పద్మము నిజమునకు ఆరు జంటల పద్మమే. ఆరు జంటలు కూడ నిజమునకు మూడు చతుర్భుజములే. లేక నాలుగు త్రిభుజములే. పండ్రెండు దళములకు పండ్రెండు రాశులకు సంబంధ మున్నది. పండ్రెండు రాశులు నిజమునకు ఆరు జంట రాశులే. రాశులు కూడ నాలుగు త్రిభుజములు. అనాహతము మహత్తరమగు కేంద్రము. సృష్టి యందలి పరిపూర్ణ కేంద్రము. సృష్టి కావల దైవము సృష్టియందు పరిపూర్ణముగ యుండుటకు హృదయమే నివాసముగ నుండును. ఇచ్చటి పండ్రెండు దళముల యందు 'క' నుండి 'ఈ' వరకు పండ్రెండు అక్షరము లున్నవని యోగశాస్త్రము తెలుపును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 485 to 494 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya*

*danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*

*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya*

*mahavirendra varada rakinyanba svarupini  ॥ 101 ॥ 🌻*


*🌻 Description of Nos. 485 to 494 Names - 3 🌻*


*The lotus of twelve petals is actually a lotus of six pairs. Six pairs are also three quadrilaterals really. Or four triangles. The twelve petals are related to the twelve constellations. Twelve constellations are actually six pairs of constellations. The signs are also four triangles. Anahata is a great center. The perfect center in the whole creation. For the God beyond creation to be perfectly in the creation, the heart is the abode. Yoga Shastra says that there are twelve letters from 'Ka' to 'E' in these twelve petals.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Комментарии


bottom of page