🍀🌹 05, SEPTEMBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹05, SEPTEMBER 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 424 / Bhagavad-Gita - 424 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 10 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 10 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 785 / Sri Siva Maha Purana - 785 🌹
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 3 / The fight between the Gaṇas and the Asuras - 3 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 38 / Osho Daily Meditations - 38 🌹
🍀 38. షరతులు లేని ప్రేమ / 38. UNCONDITIONAL LOVE 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 480 - 483 / Sri Lalitha Chaitanya Vijnanam - 480 - 483 🌹
🌻 480 నుండి 483 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 05, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. ఓనమ్ శుభాకాంక్షలు అందరికి, Onam Good Wishes to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : బలరామ జయంతి, Balarama Jayanti 🌻*
*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 19 🍀*
*38. భాగీరథీపదాంభోజః సేతుబంధవిశారదః |*
*స్వాహా స్వధా హవిః కవ్యం హవ్యవాహః ప్రకాశకః*
*39. స్వప్రకాశో మహావీరో మధురోఽమితవిక్రమః |*
*ఉడ్డీనోడ్డీనగతిమాన్ సద్గతిః పురుషోత్తమః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : యోగసాధనకు మూలవిశ్వాసం - భగవంతుడు ఉన్నాడు, అతడే అనుసరణీయుడు, అతనితో పోల్చి చూస్తే జీవితంలో ఇంకేదీ పొందదగినది కాదు, అనే విశ్వాసం యోగసాధనకు మూలభూతమై వుంటుంది. అట్టి విశ్వాసం కలిగి వుండే మానవుని ఆధ్యాత్మిక ప్రగతి సునిశ్చయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా, ఎంత కాలం పట్టినా కడ కతనికి విజయం తప్పదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ షష్టి 15:47:29 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: భరణి 09:01:23 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వ్యాఘత 23:23:30
వరకు తదుపరి హర్షణ
కరణం: వణిజ 15:52:30 వరకు
వర్జ్యం: 21:10:00 - 22:47:20
దుర్ముహూర్తం: 08:31:30 - 09:21:07
రాహు కాలం: 15:20:50 - 16:53:52
గుళిక కాలం: 12:14:46 - 13:47:48
యమ గండం: 09:08:42 - 10:41:44
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 04:17:24 - 05:51:36
మరియు 30:54:00 - 32:31:20
సూర్యోదయం: 06:02:38
సూర్యాస్తమయం: 18:26:54
చంద్రోదయం: 22:30:09
చంద్రాస్తమయం: 11:01:48
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ముసల యోగం -
దుఃఖం 09:01:23 వరకు తదుపరి
గద యోగం - కార్య హాని , చెడు
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 424 / Bhagavad-Gita - 424 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 10 🌴*
*10. అనేకవక్త్రనయనమనేకాధ్బుతదర్శనమ్ |*
*అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ||*
*🌷. తాత్పర్యం : అర్జునుడు ఆ విశ్వరూపమున అనతసంఖ్యలో ముఖములను, నేత్రములను,అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై, ఎత్తబడియున్న పలు దివ్యాయుధములను కలిగియుండెను.*
*🌷. భాష్యము : అర్జునుడు గాంచుచున్న హస్తములు, ముఖములు, పాదములు, ఇతర రూపముల సంఖ్యకు పరిమితి లేదనెడి విషయమును ఈ రెండు శ్లోకములలో పలుమార్లు వాడబడిన “అనేక” యను పదము సూచించుచున్నది. విశ్వమంతటిని వ్యాపించియున్న ఆ రూపములను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని కరుణచే ఒకే స్థలమున నిలిచి గాంచగలిగెను. శ్రీకృష్ణభగవానుని అచింత్య శక్తియే దానికి కారణము.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 424 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 10 🌴*
*10. aneka-vaktra-nayanam anekādbhuta-darśanam*
*aneka-divyābharaṇaṁ divyānekodyatāyudham**
*🌷 Translation : Arjuna saw in that universal form unlimited mouths, unlimited eyes, unlimited wonderful visions. The form was decorated with many celestial ornaments and bore many divine upraised weapons.*
*🌹 Purport : In these two verses the repeated use of the word many indicates that there was no limit to the number of hands, mouths, legs and other manifestations Arjuna was seeing. These manifestations were distributed throughout the universe, but by the grace of the Lord, Arjuna could see them while sitting in one place. That was due to the inconceivable potency of Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 785 / Sri Siva Maha Purana - 785 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴*
*🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 3 🌻*
*ఓ స్వామీ! ప్రభూ! దేవతలకు వచ్చి పడిన ఈ ఆపదను నీవు ఎరుంగక పోవుట ఎట్లు సంభవము? కావున మమ్ములను రక్షించుటకొరకై సముద్రతనయుడగు జలంధరుని సంహరించుము (18). ఓ నాథా! నీవు పూర్వము మా రక్షణకొరకై గరుడవాహనుడగు విష్ణువును ఆదేశించి యుంటివి. కాని ఆతడీ నాడు మమ్ములను రక్షింప సమర్థుడు గాడు (19). అతడు లక్ష్మీదేవితో సహా జలంధరునకు వశుడై వాని గృహములో నివసించుచున్నాడు. వాని ఆజ్ఞకు వశవర్తులమగు మేము దేవతలము కూడా అచటనే ఉన్నాము (20). ఓ శంభూ! బలవంతుడగు ఆ సముద్రతనయుడు నీతో యుద్ధమును చేయుటకు వచ్చుచున్నాడు. మేము ఆతని కంట బడకుండగా ఇచటకు నీ సన్నిధికి వచ్చి యుంటిమి (21). ఓ స్వామీ! కావున నీవు శీఘ్రముగా ఆ జలంధరుని యుద్ధములో సంహరించ తగుదువు. ఓ సర్వజ్ఞా! శరణు జొచ్చిన మమ్ములను రక్షింపుము (22).*
*సనత్కుమారుడిట్లు పలికెను- ఆ ఇంద్రాది దేవతలందరు ఇట్లు పలికి ఆ ప్రభువునకు ప్రణమిల్లి మహేశ్వరుని పాదములను దర్శిస్తూ వినయముతో నిలబడిరి (23). వృషభధ్వజుడగు శివుడు దేవతల ఈ మాటలను విని నవ్వి వెంటనే విష్ణువును పిలిపించి ఈ మాటను పలికెను (24).*
*ఈశ్వరుడిట్లు పలికెను - ఓ ఇంద్రియాధిపతీ! మహావిష్ణూ! జలంధరునిచే పీడింపబడి మిక్కిలి దుఃఖమును పొందిన దేవతలు ఇచటకు వచ్చి నన్ను శరణు పొందినారు (25). ఓ విష్ణూ! నీవు యుద్ధములో జలంధరుని సంహరించ పోవుటకు కారణమేమి? పైగా, నీవు వైకుంఠమును విడిచిపెట్టి వాని గృహమునకు చేరు కొంటివి (26). స్వతంత్రుడను, లీలావిహారిని అగు నేను నిన్ను సాధుపురుషుల రక్షణకొరకు, దుష్టుల శిక్షణ కొరకు నియోగించి యున్నాను గదా! (27)*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 785🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴*
*🌻 The fight between the Gaṇas and the Asuras - 3 🌻*
18. O lord, how is it possible that you do not know this adversity of the gods? Hence in order to protect us please kill him.
19. O lord, Viṣṇu who was assigned by you the task of protection is now unable to protect us.
20. He is also subservient to him and stays in his mansion along with Lakṣmī. All of us gods stay there obeying his behests.
21. O Śiva, we have approached you unobserved by him. That powerful son of the ocean is coming hither to fight with you.
22. O omniscient lord, you shall kill Jalandhara in the battle without delay. Save us who have sought refuge in you.
Sanatkumāra said:—
23. After saying this, the gods including Indra bowed to him and stood humbly glancing at the feet of lord Śiva.
24. On hearing the words of the gods the bull-bannered deity laughed. He called Viṣṇu immediately and spoke these words.
The lord Śiva said:—
25. O great Viṣṇu, the distressed gods harassed by Jalandhara have sought refuge in me.
26. O Viṣṇu, how is it that Jalandhara was not killed in battle by you? Leaving off your own Vaikuṇṭha you have gone to his mansion?
27. As I wanted to be free and sportful, I had appointed you for the protection of the good and the curbing of the wicked.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 38 / Osho Daily Meditations - 38 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 38. షరతులు లేని ప్రేమ 🍀*
*🕉. ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు; మీరు ఎంత ఎక్కువ ఇస్తారో, అంత ఎక్కువ మీరు దానిని కలిగి ఉంటారు. మీరు ఇతరులపై ఎంత ఎక్కువ కురిపిస్తారో, మీ జీవoలో అంత ప్రేమ పుడుతుంది. 🕉*
*ఇతరులు స్వీకరించడానికి అర్హులా కాదా అనే దాని గురించి ప్రేమ ఎప్పుడూ బాధపడదు. ఇది లోపభూయిష్ట వైఖరి, మరియు ప్రేమ ఎప్పుడూ లోభి కాదు. భూమి యోగ్యమైనదా కాదా అని మేఘం ఎప్పుడూ ఆలోచించదు. పర్వతాల మీద వర్షం కురుస్తుంది, రాళ్ళ మీద వర్షం పడుతుంది; ప్రతిచోటా మరియు ఎక్కడైనా వర్షం పడుతుంది. ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి బంధాలూ లేకుండా ఇస్తుంది. ప్రేమ ఇలా ఉంటుంది: ఇది కేవలం ఇస్తుంది, ఇవ్వడాన్ని ఆనందిస్తుంది. స్వీకరించడానికి ఇష్టపడే వాడు దానిని స్వీకరిస్తాడు. అతను యోగ్యుడు కానవసరం లేదు, అతను ఏ ప్రత్యేక వర్గానికి సరిపోనవసరం లేదు, అతను ఏ అర్హతలను పూర్తి చేయనవసరం లేదు. ఇవన్నీ కావాలంటే, మీరు ఇస్తున్నది ప్రేమ కాదు; అది వేరే ఏదైనా అయి ఉండాలి.*
*ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు; మీరు ఎంత ఎక్కువ ఇస్తారో, అంత ఎక్కువ మీరు కలిగి ఉంటారు. మీరు ఇతరులపై ఎంత ఎక్కువ ప్రేమ కురిపిస్తారో, మీ జీవoలో అంత ప్రేమ పుడుతుంది. సాధారణ ఆర్థికశాస్త్రం పూర్తిగా భిన్నమైనది: మీరు ఏదైనా ఇస్తే, మీరు దానిని కోల్పోతారు. మీరు ఏదైనా ఉంచుకోవాలనుకుంటే, దానిని ఇవ్వకుండా ఉండండి. దానిని సేకరించండి, లొభత్వంతో ఉండండి. ప్రేమ విషయంలో దీనికి విరుద్ధం: మీరు దానిని కలిగి ఉండాలనుకుంటే, లొభత్వంతో ఉండకండి; లేకుంటే అది చచ్చిపోతుంది, పాతబడిపోతుంది. ఇవ్వడం కొనసాగిస్తే తాజా వనరులు అందుబాటులోకి వస్తాయి. తాజా ప్రవాహాలు మీ ఉనికిలోకి ప్రవహిస్తాయి. అస్తిత్వం మొత్తం మీలోకి ప్రవహిస్తుంది 'మీ ఇవ్వడం షరతులు లేనిది అయినప్పుడు, అది సంపూర్ణంగా ఉన్నప్పుడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 38 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 38. UNCONDITIONAL LOVE 🍀*
*🕉 Once you know what love is, you are ready to give; the more you give, the more you have it. The more you go on showering on others, the more love springs up in your being. 🕉*
*Love never bothers much about whether the other is worthy of receiving or not. This is a miserly attitude, and love is never a miser. The cloud never bothers about whether the earth is worthy. It rains on the mountains, it rains on the rocks; it rains everywhere and anywhere. It gives without any conditions, without any strings attached. And that's how love is: It simply gives, it enjoys giving. Whoever is willing to receive, receives it. He need not be worthy, he needs not fit any special category, he needs not fulfill any qualifications. If all these things are required, then what you are giving is not love; it must be something else.*
*Once you know what love is, you are ready to give; the more you give, the more you have. The more you go on showering on others, the more love springs up in your being. Ordinary economics is totally different: If you give something, you lose it. If you want to keep something, avoid giving it away. Collect it, be miserly. Just the opposite is the case with love: If you want to have it, don't be miserly; otherwise it will go dead, it will become stale. Go on giving, and fresh sources will become available. Fresh streams will flow into your being. The whole of existence starts pouring into you 'when your giving is unconditional, when it is total.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 480 to 483 / Sri Lalitha Chaitanya Vijnanam - 480 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।*
*అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀*
*480. 'పాయసాన్న ప్రియా' - పరమాన్నము ప్రియముగా గలది శ్రీమాత అని అర్థము.*
*481. 'త్వక్స్ట్రా’ - చర్మధాతువు నందున్న శ్రీమాత అని అర్థము.*
*482. 'పశులోక భయంకరీ' - పశులోకములకు భయము కలిగించునది శ్రీమాత అని అర్థము.*
*483. 'అమృతాది మహాశక్తి సంవృత' - అమృత మాదిగా గల మహా శక్తులతో కూడి యున్నది శ్రీమాత అని అర్థము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 480 to 483 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari*
*amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻*
*480. 'Payasanna Priya' - means Mother who loves payasam.*
*481. 'Tvakstra' - Sri Mata who is in the skin.*
*482. 'Pashuloka Bhayakari' - means that Srimata is the one who causes fear in the animal worlds.*
*483. 'Amritadi Mahashakti Samvrita' - It means that Mother is endowed with the great powers including amruta.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments