🍀🌹 06, APRIL 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 06, APRIL 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 351 / Bhagavad-Gita - 351 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 13 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 198 / Agni Maha Purana - 198 🌹
🌻. అధివాసనము - 5 / Preliminary consecration of an image (adhivāsana) - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 063 / DAILY WISDOM - 063 🌹
🌻 3. ఆత్మ-విద్య లేదా అధ్యాత్మ-విద్య / 3. Atma-Vidya or Adhyatma-Vidya 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 328 🌹
6) 🌹. శివ సూత్రములు - 65 / Siva Sutras - 65 🌹
🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 4 / 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 06, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🍀. హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Hanuman Jayanti and Chaitra Purnima to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : హనుమాన్ జయంతి, చైత్ర పౌర్ణమి, Hanuman Jayanti, Chaitra Purnima 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - ధ్యానమ్ 🍀*
*బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్జ్వలం*
*శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరమ్ |*
*బ్రహ్మాద్యైః సనకాదిభిః పరివృతం సిద్ధైర్మహా యోగిభిః*
*దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగినామ్ ||*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : లోనికి నెట్టే ఒత్తిడి ధ్యానసాధనకు కూర్చున్నప్పుడు, నిన్ను లోనికి నెట్టే ఒత్తిడి ఒకటి కలుగుతుంది. జాగ్రచ్చేతనను వీడి అంతశ్చేతనలో నీవు మేల్కొనడానికై కలిగే ఒత్తిడి అది. కాని, నిద్రారూపమైన అంతశ్చేతనకు మాత్రమే అలవాటుపడిన మనస్సు మొదట్లో ఆ ఒత్తిడిని నిద్రకు కలిగే ఒత్తిడిగానే భావిస్తుంది. పట్టుదలతో నెమ్మదిగా అభ్యాసం కొనసాగించిన మీదట గాని, నిద్ర క్రమేణా అంతశ్చేతనానుభవంగా మార్పు చెందదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: పూర్ణిమ 10:05:35 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: హస్త 12:42:01 వరకు
తదుపరి చిత్ర
యోగం: వ్యాఘత 26:31:13 వరకు
తదుపరి హర్షణ
కరణం: బవ 10:02:35 వరకు
వర్జ్యం: 20:59:20 - 22:38:48
దుర్ముహూర్తం: 10:14:52 - 11:04:24
మరియు 15:12:04 - 16:01:36
రాహు కాలం: 13:51:34 - 15:24:27
గుళిక కాలం: 09:12:57 - 10:45:50
యమ గండం: 06:07:12 - 07:40:05
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 06:22:30 - 08:03:42
మరియు 30:56:08 - 32:35:36
సూర్యోదయం: 06:07:12
సూర్యాస్తమయం: 18:30:12
చంద్రోదయం: 18:45:28
చంద్రాస్తమయం: 06:09:02
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 12:42:01 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 351 / Bhagavad-Gita - 351 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 13 🌴*
*13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా: |*
*భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ||*
🌷. తాత్పర్యం :
*ఓ పృథాకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.*
🌷. భాష్యము :
*మహాత్ములైనవారి వర్ణనము ఈ శ్లోకమున స్పష్టముగా ఒసగబడినది. దైవీప్రకృతిలో స్థితిని పొందియుండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడెన్నడును భౌతికప్రకృతికి లోబడియుండడు. అది ఎట్లు సాధ్యమనెడి విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము నొందినవాడు శీఘ్రమే భౌతికప్రకృతి యొక్క అధీనము నుండి ముక్తి నొందగలడు. అదియే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మనుజుడు తన ఆత్మను ఆ భగవానుని అధీనము చేసినంతనే భౌతికప్రకృతి అదుపు నుండి ముక్తుడు కాగాలడన్నది ప్రాథమికసూత్రము. తటస్థశక్తియైన జీవుడు భౌతికశక్తి నుండి విడివడినంతనే ఆధ్యాత్మికశక్తి నేతృత్వమునకు మరియు నిర్దేశమునకు వచ్చును. అట్టి ఆధ్యాత్మికప్రకృతి నిర్దేశమే “దైవీప్రకృతి” యని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణభగవానునికి శరణమునొంది ఆ విధముగా పురోగతి నొందినపుడు మనుజుడు “మహాత్ముడు” అనెడి స్థాయిని పొందగలడు.*
*శ్రీకృష్ణుడే ఆదిపురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణముగా తెలిసియున్నందున మహాత్ముడైనవాడు తన మనస్సును కృష్ణునిపై నుండి ఇతరము వైపునకు మళ్ళింపడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. మహాత్ములైన శుద్ధభక్తుల సాంగత్యము వలననే అట్టి మహాత్ముడు రూపొందగలడు. శుద్ధభక్తులైనవారు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపములందును ఆకర్షితులుగాక కేవలము అతని ద్విభుజరూపమునందే అనురాగమును, ఆకర్షణను కలిగియుందురు. కృష్ణుని ఇతర రూపముల యెడ గాని, ఇతర దేవతల యెడగాని, మనుజుల యెడగాని వారెన్నడును ఆకర్షుతులు కారు. సంపూర్ణ భక్తిభావనలో కృష్ణుని పైననే ధ్యానము నిలిపి, ఆ కృష్ణభక్తిరసభావనలో వారు నిశ్చితమైన కృష్ణసేవ యందు సదా నియుక్తులై యుందురు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 351 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 13 🌴*
*13 . mahātmānas tu māṁ pārtha daivīṁ prakṛtim āśritāḥ*
*bhajanty ananya-manaso jñātvā bhūtādim avyayam*
🌷 Translation :
*O son of Pṛthā, those who are not deluded, the great souls, are under the protection of the divine nature. They are fully engaged in devotional service because they know Me as the Supreme Personality of Godhead, original and inexhaustible.*
🌹 Purport :
*In this verse the description of the mahātmā is clearly given. The first sign of the mahātmā is that he is already situated in the divine nature. He is not under the control of material nature. And how is this effected? That is explained in the Seventh Chapter: one who surrenders unto the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, at once becomes freed from the control of material nature. That is the qualification. One can become free from the control of material nature as soon as he surrenders his soul to the Supreme Personality of Godhead. That is the preliminary formula. Being marginal potency, as soon as the living entity is freed from the control of material nature, he is put under the guidance of the spiritual nature.*
*The guidance of the spiritual nature is called daivī prakṛti, divine nature. So when one is promoted in that way – by surrendering to the Supreme Personality of Godhead – one attains to the stage of great soul, mahātmā. The mahātmā does not divert his attention to anything outside Kṛṣṇa, because he knows perfectly well that Kṛṣṇa is the original Supreme Person, the cause of all causes. There is no doubt about it. Such a mahātmā, or great soul, develops through association with other mahātmās, pure devotees. Pure devotees are not even attracted by Kṛṣṇa’s other features, such as the four-armed Mahā-viṣṇu. They are simply attracted by the two-armed form of Kṛṣṇa. They are not attracted to other features of Kṛṣṇa, nor are they concerned with any form of a demigod or of a human being. They meditate only upon Kṛṣṇa in Kṛṣṇa consciousness. They are always engaged in the unswerving service of the Lord in Kṛṣṇa consciousness.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 198 / Agni Maha Purana - 198 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 59*
*🌻. అధివాసనము - 5 🌻*
*లేదా ఏదేవత ప్రతిష్ఠింపిబడుచున్నదో దాని మూలమంత్రముచేతనే మూర్తి సజీవకరణ ప్రకియ జరుపవలెను. ఆ మూర్తి యొక్క పేరులోని మొదటి అక్షరము గ్రహించి, దానికి పండ్రెండు స్వరములను చేర్చి అంగకల్పన చేయవలెను. దేవేశ్వరా! విగ్రహముపై హృదయాద్యంగన్యాసము, ద్వాదశాక్షర మూలమంత్రన్యాసము, తత్త్వన్యాసము ఏ విధముగ చేయబడునో ఆ విధముగనే తన శరీరముమీద కూడ చేయవలెను. పిమ్మట చక్రాకార మగు పద్మమండలముపై మహావిష్ణువును గంధాదులచే పూజించవలెను. వెనుకటి వలెనే మహావిష్ణు శరీరమును, వస్త్రాలంకారాదులను, ఆసనమును ధ్యానించవలెను. పై భాగమున పండ్రెండు ఆకుల సుదర్శన చక్రమును ధ్యానించవలెను. ఆ చక్రమునకు మూడు నాభులు, రెండు నేములు (చక్రాంతములు) పండ్రెండు స్వరములు ఉండును. పిమ్మట విద్వాంసుడు పృష్ఠదేశమున ప్రకృత్యాదులను స్థాపింపవలెను. ఆకులు చివర పండ్రెండు గురు సూర్యులను పూజింపవలెను. పిమ్మట అచట పదునారు కళలతో కూడిన చంద్రుని ధ్యానించవలెను. చక్రనాభియందు మూడు వస్త్రములను ధ్యానించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు పద్మములోపల ద్వాదశదల పద్మమును ద్యానించవలెను.*
*ఆ పద్మముపైన పురుషశక్తిని ధ్యానించి, దానిన పూజించవలెను. పిమ్మట, దేశికుడు, ప్రతిమపై శ్రీహరి న్యాసము చేసి, ఆ శ్రీహరిని, ఇతర దేవతలను పూజింపవలెను. గంధపుష్పాద్యుపచారములు సమర్పించి అంగావరణ సహితముగా ఇష్ట దేవతను బాగుగా పూజింపవలెను. ద్వాదశాక్షర మంత్రములోని ఒక్కొక్క అక్షరమును బీజాక్షరముగ చేసి దానితో కేశవాది భగవద్విగ్రహములను క్రమముగ పూజించవలెను. పండ్రెండు ఆకులుగల మండలము మీద ఆ క్రమముగ లోక పాలాదులను పూజింపవెలను. పిమ్మట, ద్విజుడు, గంధపుష్పాద్యుపచారములతో పురుషసూక్తమును పఠించుచు పురుషప్రతిమలను. శ్రీ సూక్తము పఠించుచు పిండికలను పూజింపవలెను పిమ్మట జననాదిక్రమమున వైష్ణవాగ్నిని ఆవిర్భవింపిచేయవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 198 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 59*
*🌻Preliminary consecration of an image (adhivāsana) - 5 🌻*
37-39. O most virtuous one! This is general mode of assignment of Viṣṇu. In the alternative, the installation of which form of the deity has been begun, one should infuse life into the image with the principal mystic syllable of that form. The first letter of the name of any form of a deity should be used along with the twelve vowels and assigned to the different parts of image such as the heart. O Lord of celestials! the principal mystic syllable should consist of ten syllables.
40. The principles should be placed in the body in the same order as they are found in the god. Lord Viṣṇu should be worshipped with perfumes etc., in the diagram of a lotus inscribed in a circle.
41. One should contemplate on the seat as before together with the limbs and cover. Then one should imagine an auspicious disc over that as having twelve radii.
42. The circle (should be imagined) as having three concentric naves and two outer circles and filled with the vowels. The wise man should then place the prakṛti (the nature, the source of the material world) and other principles.
43-44. The sun god should again be worshipped at the tips of the spokes in the twelve-fold way[5] and the moon possessing three-fold armies and sixteen phases should be contemplated therein. The excellent worshipper should contemplate on a lotus flower of twelve petals.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 63 / DAILY WISDOM - 63 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 3. ఆత్మ-విద్య లేదా అధ్యాత్మ-విద్య 🌻*
*ఉపనిషత్తులో ప్రకటించబడిన జ్ఞానం దుఃఖాన్ని తొలగించే శాస్త్రం. అందువల్ల, ఇది సాధారణంగా మనం సంపాదించే అభ్యాసానికి లేదా ప్రపంచంలోని విషయాలకు సంబంధించి మనం పొందే జ్ఞానానికి భిన్నమైన జ్ఞానం. ఈ పదం యొక్క సాధారణ అర్థంలో ఇది శాస్త్రం కాదు. వివిధ రకాలైన శాస్త్రాలు మరియు కళలు ఉన్నాయి. అవన్నీ తగినంత ముఖ్యమైనవి మరియు వాటి స్వంత మార్గంలో అద్భుతమైనవి. కానీ అవి మానవ హృదయమూలం నుండి దుఃఖాన్ని తొలగించలేవు.*
*అవి ఒక నిర్దిష్టమైన పరిస్థితులలో ఉన్న, ఒక నిర్దుష్టమైన జన్మలో ఉన్న, ఒక నిర్దుష్టమైన తత్వం ఉన్న వ్యక్తి యొక్క సంతృప్తికి దోహదం మాత్రమే చేస్తాయి. కానీ అవి సంబంధిత వ్యక్తి యొక్క ఆత్మకు వరకు వెళ్లవు. ఆత్మ శాస్త్రం యొక్క అర్థంలో, ఉపనిషత్తును ఆత్మ విద్య లేదా అధ్యాత్మ విద్య అని కూడా అంటారు. గ్రహీత తెలిసినప్పుడు, గ్రహీతతో అనుసంధానించబడిన ప్రతిదీ కూడా తెలుస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 63 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 3. Atma-Vidya or Adhyatma-Vidya 🌻*
*The knowledge proclaimed in the Upanishad is a science which deals with the removal of sorrow. Thus, it is a knowledge which is different in kind from the learning that we usually acquire or the knowledge that we gain in respect of the things of the world. It is not a science in the ordinary sense of the term. While there are sciences and arts of various kinds, all of which are important enough, and wonderful in their own way, they cannot remove sorrow from the human heart, root and branch.*
*They contribute to the satisfaction of a particular individual, placed in a particular constitution, in a particular type of incarnation, but they do not go to the soul of the person concerned. In the sense of the science of the soul, the Upanishad is also called Atma Vidya or Adhyatma Vidya. When the perceiver is known, everything connected with the perceiver also is known.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 328 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. వ్యక్తి రెండు విషయాల గుండా సాగాలి. మొదటిది మరణం. పాతదానికి మరణం, గతానికి మరణం. యిప్పటి దాకా జీవించిన దానికి మరణం. రెండోది పునర్జన్మ. తాజాగా మొదలు పెట్టు. ఈ రోజే పుట్టినట్లు ఆరంభించు. 🍀*
*భౌతికమయిన జన్మ వుంది. ప్రతి ఒక్కరూ దాని గుండా సాగుతారు. ఐతే అది నీకు సంక్లిష్టమయిన శారీరక మానసిక స్థితినిస్తుంది. అది నీకు ఆధ్యాత్మికంగా జన్మించడానికి అవకాశమిస్తుంది. పునర్జన్మ కలిగితే తప్ప నిజంగా జీవించినట్లు కాదు. ఒకటి కేవలం అవకాశం. బీజప్రాయం. వసంతం రానిదే బీజం మొక్కయి, పుష్పించదు. నా పూర్తి ప్రయత్నం మీకు సాధారణ మతాన్ని బోధించడం కాదు. కొత్త అస్తిత్వాన్ని, కొత్త మానవత్వాన్ని, కొత్త చైతన్యాన్ని యివ్వడం.*
*వ్యక్తి రెండు విషయాల గుండా సాగాలి. మొదటిది మరణం. పాతదానికి మరణం, గతానికి మరణం. యిప్పటి దాకా జీవించిన దానికి మరణం. రెండోది పునర్జన్మ. తాజాగా మొదలు పెట్టు. ఈ రోజే పుట్టినట్లు ఆరంభించు. అది కేవలం రూపకం కాదు. నిజంగా ఆరంభించు. ఆ భావన నీ అంతరాంతరాలలో పాదుకోనీ. అప్పుడు రాత్రి అంతమై దిగంతాలలో సూర్యుడు ఉదయిస్తాడు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 065 / Siva Sutras - 065 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 4 🌻*
*🌴.సంకల్ప శక్తి ద్వారా యోగి తన అవగాహనను కేంద్రీకరించి మూలకాలను తన శరీరం నుండి మరియు ఇతరుల నుండి వేరు చేయగలడు. అతను స్థలం మరియు సమయం యొక్క పరిమితుల నుండి విముక్తి పొందగలడు. 🌴*
*యోగి కాలము, స్థలము మరియు దూరము మూడింటిని అధిగమించగలడు కాబట్టి అవి యోగికి ఆటంకములు కావు. అతని సంకల్ప శక్తిని అతని స్వచ్ఛమైన చైతన్యం తో ఐక్యం చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. యోగి యొక్క అటువంటి శక్తిని యోగ శక్తి అంటారు. సాధన ద్వారా ఎవరైనా ఈ దశకు చేరుకోవచ్చు. సాధారణంగా, ఒక యోగి అటువంటి మానవాతీత చర్యలలో పాల్గొనడు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన కర్మల కారణంగా బాధపడవలసి ఉంటుందని అతనికి బాగా తెలుసు. శివుడు కూడా కర్మ నియమాన్ని అతిక్రమించడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 065 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 4 🌻*
*🌴. By will power the yogi can concentrate his awareness and separate the elements from his own body and that of others. He can become free from the limitations of space and time. 🌴*
*Time, space and distance are not hindrances to that yogi, as he can transcend all the three. This becomes possible because of union of his will power with his purest form of consciousness. Such power of a yogi is known as yogic power. By practice, anyone can reach this stage. Generally, a yogi does not involve himself in such superhuman acts, as he knows well that everyone has to suffer on account of his karma-s. Even Śiva does not transcend the law of karma.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments