🌹🍀 06, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 06, FEBRUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 322 / Bhagavad-Gita -322 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 12 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 169 / Agni Maha Purana - 169 🌹 🌻 చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 1 / Characteristics of images of different forms of goddesses - 1🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 034 / DAILY WISDOM - 034 🌹 🌻*🌻 3. మీకు ఆలోచించడానికి సమయం ఉందా? / 3. Have You Time to Think? 🌻*
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 299 🌹
6) 🌹. శివ సూత్రములు - 36 / Siva Sutras - 36 🌹
🌻 12. విస్మయో యోగ భూమికాః - 1 / 12. Vismayo yogabhūmikāḥ- 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹06, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 19 🍀*
35. లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః
36. ముఖ్యోఽముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః |
సర్వకాలప్రసాదశ్చ సుబలో బలరూపధృక్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : తమ స్వరూపం లోలోతులకు చొరని మానవులకు మనస్సన్నా చైతన్యమన్నా ఒకటిగానే తోస్తుంది. చైతన్య వికాసం ద్వారా మన నిజస్వరూపం మనకు ఎరుకపడుతున్న కొలదీ పెక్కు తరగతులు, భూమికలు, శక్తులు చైతన్యానికి ఉన్నవని మనం గ్రహిస్తాము. అన్నమయ, ప్రాణమయ, మనోమయాది కోశములతో విలసిల్లేది చైతన్యమే. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 26:20:25
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఆశ్లేష 15:04:31 వరకు
తదుపరి మఘ
యోగం: సౌభాగ్య 15:25:08 వరకు
తదుపరి శోభన
కరణం: బాలవ 13:09:10 వరకు
వర్జ్యం: 02:32:40 - 04:20:00
మరియు 28:25:00 - 30:11:48
దుర్ముహూర్తం: 12:53:01 - 13:38:49
మరియు 15:10:26 - 15:56:15
రాహు కాలం: 08:12:28 - 09:38:21
గుళిక కాలం: 13:56:00 - 15:21:53
యమ గండం: 11:04:14 - 12:30:07
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 13:16:40 - 15:04:00
సూర్యోదయం: 06:46:34
సూర్యాస్తమయం: 18:13:40
చంద్రోదయం: 18:48:13
చంద్రాస్తమయం: 07:14:26
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
15:04:31 వరకు తదుపరి ధ్వాoక్ష యోగం
- ధన నాశనం, కార్య హాని
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 322 / Bhagavad-Gita - 322 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 12 🌴*
*12. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుద్య చ |*
*మూర్ద్న్యాధాయాత్మన: ప్రాణమాస్థితో యోగధారణమ్ ||*
🌷. తాత్పర్యం :
*ఇంద్రియ కర్మల నుండు విడివడి యుండుటయే యోగస్థితి యనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి, మనస్సును హృదయము నందు స్థిరము చేసి, ప్రాణవాయువును శీర్షాగ్రము నందు నిలిపి మనుజుడు యోగము నందు స్థితుడు కాగలడు.*
🌷. భాష్యము :
ఇచ్చట తెలుపబడిన యోగవిధానమును అభ్యసించుట మనుజుడు మొట్టమొదట సర్వభోగద్వారములను మూసివేయవలెను. ఇట్టి అభ్యాసమునకే “ప్రత్యాహారము”
(ఇంద్రియార్థముల నుండు ఇంద్రియములను మరలించుట) అని పేరు.
జ్ఞానేంద్రియములైన కన్నులు, చెవులు, నాసికము, జిహ్య, స్పర్శను సంపూర్ణముగా నిగ్రహించవలెను. స్వీయతృప్తి యందు వాటిని నియుక్తము చేయరాదు. ఈ విధముగా ఒనరించినపుడు మనస్సు హృదయస్థ పరమాత్మపై నెలకొని, ప్రాణవాయువు శీర్షాగ్రము నందు ప్రతిష్టితమగును. షష్టాధ్యాయమున ఈ పద్ధతి విపులముగా వివరింపబడినది.
కాని ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగపద్ధతి ప్రస్తుతకాలమునాకు ఆచరణీయము కానిది. కలియుగమునకు ఏకైక ఉత్తమమార్గము కృష్ణభక్తిరసభావనమే. భక్తియోగమునందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సు లగ్నము చేయగలిగినచో అచంచలమైన సమాధిస్థితి యందు నిలుచుట మనుజునకు సులభతరము కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 322 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 12 🌴*
*12 . sarva-dvārāṇi saṁyamya mano hṛdi nirudhya ca*
*mūrdhny ādhāyātmanaḥ prāṇam āsthito yoga-dhāraṇām*
🌷 Translation :
*The yogic situation is that of detachment from all sensual engagements. Closing all the doors of the senses and fixing the mind on the heart and the life air at the top of the head, one establishes himself in yoga.*
🌹 Purport :
To practice yoga as suggested here, one first has to close the doors of all sense enjoyment. This practice is called pratyāhāra, or withdrawing the senses from the sense objects. The sense organs for acquiring knowledge – the eyes, ears, nose, tongue and touch – should be fully controlled and should not be allowed to engage in self-gratification. In this way the mind focuses on the Supersoul in the heart, and the life force is raised to the top of the head. In the Sixth Chapter this process is described in detail. But as mentioned before, this practice is not practical in this age. The best process is Kṛṣṇa consciousness. If one is always able to fix his mind on Kṛṣṇa in devotional service, it is very easy for him to remain in an undisturbed transcendental trance, or in samādhi.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 169 / Agni Maha Purana - 169 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 52*
*🌻. చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 1 🌻*
హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు అరువది నాలుగు యోగినులను గూర్చి చెప్పెదను. వీరి స్థానము క్రమముగ తూర్పు నుండి ఈశాన్య పర్యంతము ఉండును. యోగినుల పేర్లు : అక్షోభ్య, రూక్షకర్ణి, రాక్షసి, కృపణ, క్షయ, పింగాక్షి, అక్షయ, క్షేమ, ఇల, నీలాలయ, లోల, అలక్త, బలాకేశి, లాలస, విమల, హుతాశ, విశాలాక్షీ, హుంకార, బడబాముఖి, మహాక్రూర, క్రోధన, భయంకరి, మహానన, సర్వజ్ఞ, తరల, తార, ఋగ్వేద, హయానన, సార, హుద్రసంగ్రాహి, శబర, తాలజింఘిక, రక్తాక్షి, సుప్రసిద్ద, విద్యుజ్జిహ్వ, కరఁకిణి, మేఘనాద, ప్రచండ, ఉగ్ర, కాలకర్ణి, వరప్రడ, చంద్ర చంద్రావలి, ప్రపంచ, ప్రలయాంతిక, శిశువక్త్ర, పిశాచి పిశితాశ, లోలుప, ధమని, తపని, రాగిణి, వికృతానన, వాయువేగ, బృహృత్కుక్షి, వికృత, విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, జయంతిక, బిడాలి, రేవతి, పూతన, విజయాంతిక. ఈ యోగినులకు ఎనిమిది లేదా నాలుగు చేతులుండును.
ఇచ్ఛానుసారముగ ఆయుధములను ధరించు చుందురు, ఉపాసకులకు సంపూర్ణ సిద్ధులను ప్రసాదింతురు. భైరవునకు పండ్రెండు చేతులుండును. దంతములు ఎత్తుగా ఉండును. శిరస్సుపై జటా-చంద్రులుండును. ఒక వైపున నున్న ఐదు చేతులతో ఖడ్గ-అంకుశ-కుఠార-బాణ-జగదభయప్రదాన ముద్రలును రెండవ ప్రక్కనున్న ఐదుచేతులలో ధనుష్ - త్రిశూల-ఖట్వాంగ (మంచము కోడు) పాశకార్ధ - వరముద్రలను ధరించి యుండును. మిగిలిన రెండు చేతులలో గజ చర్మ యుండును. గజ చర్మమే వస్త్రము. సర్పాలంకారములచే అలంకృతుడై యుండును. మాతృకల మధ్య ప్రేతముపై కూర్చుండును. భైరవుని ప్రతిమ ఈ రూపమున నిర్మించి పూజించవలెను. భైరవునకు ఒక ముఖముండ వచ్చును. లేదా ఐదు ముఖములుండవచ్చును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 169 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 52
*🌻Characteristics of images of different forms of goddesses - 1 🌻*
The Lord said:
1. I shall describe (the characteristics) of the eight Yoginis (female attendants on Durgā) respectively residents of (the eight quarters) east to north-east. (The Yoginīs) Akṣobhyā, Rūkṣakarṇī, Rākṣasi, Kṛpaṇā and Akṣayā (reside in the east).
2. (The Yoginīs) Piṅgākṣī, Kṣayā, Kṣemā, Ilā, Līlā, Layā, Laktā, Balākeśī, Lālasā and Vimalā (dwell in the south-east).
3. (The Yoginīs) Hutāśā, Viśālākṣī, Huṅkārā, Vaḍavāmukhī, Mahākrūrā, Krodhanā, Bhayaṅkarī and Mahānanā (are the residents of the south).
4. (The Yoginīs) Sarvajñā, Taralā, Tārā, Ṛgvedā, Hayānanā, Sārā (Sārākhyā), Rudrasaṅgrāhī, Śambarā and Tālajaṅghikā (occupy the south (-west).
5. Raktākṣī, Suprasiddhā, Vidyujjihvā, Karaṅkiṇī, Meghanādā, Pracaṇḍogrā, Kālakarṇī and Varapradā (are the inmates of the west).
6. Candrā, Candrāvalī, Prapañcā, Pralayāntikā, Śiśuvaktrā, Piśācī, Piśitāśā and Lolupā (dwell in the north-west).
7. Dhamanī, Tāpanī, Rāgiṇī, Vikṛtānanā, Vāyuvegā, Bṛhatkukṣi, Vikṛtā and Viśvarūpikā (govern the north).
8. Yamajihvā, Jayanti, Durjayā, Jayantikā, Viḍālā, Revatī, Pūtanā and Vijayāntikā (hold sway over the north-east).
9. (These Yoginīs should be represented) as having eight arms (or) four arms, wielding weapons of their choice and yielding all benefits (on their votaries). (Lord) Bhairava may hold the arka plant (Calotropis gigantee) in the hand and have the face like the knee or elbow bearing the matted hair and the Moon.
10. Kṛttivāsas (should be represented) as holding on one side the sword, goad, axe and arrow and offering protection to the universe and a bow, trident, club with a skull at the top and noose on the other.
11. Or he shall be having five faces and be wearing the elephant’s hide and adorned by the serpents. He shall be seated on the dead body. He must be worshipped in the midst of the mother goddesses.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 34 / DAILY WISDOM - 34 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 3. మీకు ఆలోచించడానికి సమయం ఉందా? 🌻*
*మనలో ఏదో వెలితి మనకు నిరంతరంగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. మీరు భౌతిక లేదా సామాజిక కోణంలో ప్రతిదీ కలిగి ఉన్నప్పటికీ, ఏదో సరిగ్గా లేదు అని మీరు అనుకుంటారు. మీరు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు. మీకు మీ స్వంత ఆర్థిక స్థితి ఉంది; అంతా బాగానే ఉంది కానీ మీరు నిజంగా సంతోషంగా లేరు. దీనికి కారణం కనుక్కోవడానికి మీకు ఇంకా సమయం దొరకలేదు. బయటి పరిస్థితుల వరదతో మనం చాలా ఖాళీ లేకుండా ఉన్నాము. ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కలిగి లేకపోవడమే కాకుండా ఆలోచించడానికి సమయం కూడా దొరకకుండా ఉన్నాము.*
*మనకు సరిగ్గా ఆలోచించే సామర్థ్యం ఉందా లేదా అనేది వేరే విషయం, కానీ ఆలోచించడానికి మీకు కనీసం సమయం ఉందా? అందరూ అసలు ఖాళీ లేకుండా ఉన్నారు. అందువల్ల, సరైన ఆలోచనలు చేయడానికి కావలసిన సమయాన్ని కనుగొనే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ జీవితం మానసికమైన జీవితం తప్ప మరొకటి కాదు. మానసిక జీవితాన్ని విస్మరించినట్లయితే, మీ శారీరక మరియు సామాజిక జీవితం మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనీయవు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 34 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 3. Have You Time to Think? 🌻*
*There is something which speaks within us in a language of anxiety. Something is not all right, though you have everything in the physical or social sense. You are respectable people in society. You have a financial status of your own; everything is going well but you are not really happy, for a reason which you have not yet found time to go deep into. We are so busy with the enormous flood of the atmospheric conditions outside that we have been prevented from even finding time to think, let alone having the capacity to think.*
*Whether we have a capacity to think correctly or not is a different subject, but have you time to think? Everyone is very busy indeed. Therefore, there is the need to learn the art of finding time to think in the proper way, because your life is nothing but a mental life. If the mental life is ignored, your physical and social life is not going to make you free.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 299 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ప్రతి బిడ్డకూ ఆనందంగా ఎట్లా వుండాలో తెలుసు. దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి. నిన్ను నువ్వు అస్తిత్వ ప్రేమికుడిగా మలచుకో. అప్పుడు అత్యున్నత శిఖరం దర్శనమిస్తుంది. 🍀*
*ప్రతి పసిబిడ్డకు ఎట్లా ప్రతిస్పందించాలో తెలుసు. అందుకనే పిల్లలందరూ అందంగా వుంటారు. ఆనందంగా వుంటారు. వాళ్ళ కళ్ళలోకి చూడు. ఎంత నిశ్శబ్దం! వాళ్ళ ఆనందాన్ని చూడు. ఎంతగా పొంగిపొర్లుతూ వుంటుంది ! ప్రతి బిడ్డకూ ఆనందంగా ఎట్లా వుండాలో తెలుసు. కానీ త్వరలోనే పసిబిడ్డ ఆనందాన్ని మరచిపోతుంది. లేదా మరచిపోయేలా మనం చేస్తాం. దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి. ఆ కళని తిరిగి గ్రహించాలి.*
*ప్రతిస్పందించే తనాన్ని తెలుసుకోవాలి. అప్పుడు అంతా ఎప్పట్లాగే వుంటుంది. నిన్ను నువ్వు అస్తిత్వ ప్రేమికుడిగా మలచుకో. అప్పుడు అత్యున్నత శిఖరం దర్శనమిస్తుంది. దానికి పవిత్ర గ్రంథాల పరామర్శ అక్కర్లేదు. ఎందుకంటే ఈ అనంత విశ్వమే అపూర్వ పవిత్ర గ్రంథం. ప్రతిచోటా అస్తిత్వ సంతకముంది. మతాలన్నీ మానవ నిర్మితాలే.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 036 / Siva Sutras - 036 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 12. విస్మయో యోగ భూమికాః - 1🌻*
*🌴. యోగా యొక్క దశలు ఒక అద్భుతం 🌴*
*విస్మయః అంటే ఆశ్చర్యంతో నిండి ఉండటం మరియు యోగభూమిక అంటే యోగము యొక్క వివిధ దశలు. ఈ సూత్రం యోగ అభివృద్ధి యొక్క వివిధ దశలను సూచిస్తుంది, యోగి యొక్క చైతన్యాభివృద్ధి. ఇక్కడ ఒక యోగి గురించి ప్రస్తావించబడింది, ఎందుకంటే ఒక యోగి తన వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యం లేదా శివ చైతన్యంతో ఏకం చేయడానికి ప్రయత్నిస్తాడు.*
*ఒక యోగి చైతన్యం యొక్క సాధారణ దశలను అధిగమించి తుర్య వైపు వెళ్ళినప్పుడు, అతను ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. దాని ప్రభావంతో కొంత కలవరపడతాడు. వేడి భూభాగం నుండి ఎత్తైన కొండ ప్రాంతానికి తన ప్రయాణాన్ని చేస్తున్న వ్యక్తితో దీనిని పోల్చవచ్చు. అతను కొండ వైపు కదులుతున్నప్పుడు, అతను వేడి నుండి చలి వాతావరణ పరిస్థితులలో మార్పును అనుభవిస్తాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 036 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 12. Vismayo yogabhūmikāḥ- 1 🌻*
*🌴. The stages of yoga are a wonder🌴*
*Vismayaḥ means filled with astonishment and yogabhūmikā means the various stages of yoga. This aphorism refers to different stages of yogic development, the development of consciousness of a yogi. The reference is made to a yogi, because a yogi attempts to unite his individual consciousness with that of cosmic consciousness or Shiva consciousness.*
*When a yogi transcends normal stages of consciousness and moves towards turya, he begins to feel the bliss and becomes bewildered by its effect. This can be compared to a person from a hot terrain making his journey to a hill resort. When he moves towards the hill, he could feel the change in weather conditions from hot to cold.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comments