🍀🌹 06, MAY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 06, MAY 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 366 / Bhagavad-Gita - 366 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 28 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 213 / Agni Maha Purana - 213 🌹
🌻. లక్ష్మీ స్థాపనము. - 3 / Mode of installation of the image of Goddess Lakṣmī - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 078 / DAILY WISDOM - 078 🌹
🌻 18. మీరు అనుభూతి చెందే ప్రేమ పరిపూర్ణత కోసం / 18. The Love that You Feel is for Completeness 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 343 🌹
6) 🌹. శివ సూత్రములు - 80 / Siva Sutras - 80 🌹
🌻 2-02. ప్రయత్నః సాధకః - 2 / 2-02. Prayatnaḥ sādhakaḥ - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 06, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*🍀. దేవర్షి నారద జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on DevRushi Narada Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవర్షి నారద జయంతి, DevRushi Narada Jayanti🌻*
*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 18 🍀*
*33. చింతామణిమవాప్నోతి ధేను కల్పతరుం ధృవమ్ |*
*స్వర్ణరాశిమవాప్నోతి సిద్ధిమేవ స మానవః*
*34. సంధ్యాయాం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమైః |*
*స్వప్నే శ్రీభైరవస్తస్య సాక్షాద్భూత్వా జగద్గురుః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సర్వాత్మనా ఈశ్వరుని ప్రేమించ నేర్చుకో - ఈశ్వరుని ప్రేమించ మన్నప్పుడు, నీ అంతరాత్మతోనే గాక, నీ 'యందలి అన్నమయ ప్రాణమయాది చేతనావి భాగాలన్నిటితో కూడ ప్రేమించ వలసి వుంటుందనేది ముఖ్యంగా గుర్తుంచుకో. పరిపూర్ణమైన ఆత్యార్పణం ఈ విభాగాలు అన్నిటికీ సాధ్యమే. ప్రియతముడైన ఈశ్వరుని కొరకై ఆత్మసమర్పణ మొనర్చుకొనే ప్రాణమయ చేతనా ప్రవృత్తి వాస్తవంగా పరమోదారం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 21:53:26
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: విశాఖ 21:14:03 వరకు
తదుపరి అనూరాధ
యోగం: వ్యతీపాత 07:30:02
వరకు తదుపరి వరియాన
కరణం: బాలవ 10:29:28 వరకు
వర్జ్యం: 03:10:42 - 04:44:54
మరియు 25:05:20 - 26:37:52
దుర్ముహూర్తం: 07:30:31 - 08:21:51
రాహు కాలం: 09:00:20 - 10:36:34
గుళిక కాలం: 05:47:52 - 07:24:06
యమ గండం: 13:49:02 - 15:25:16
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 12:35:54 - 14:10:06
సూర్యోదయం: 05:47:52
సూర్యాస్తమయం: 18:37:43
చంద్రోదయం: 19:22:39
చంద్రాస్తమయం: 06:00:46
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: శుభ యోగం - కార్య జయం
21:14:00 వరకు తదుపరి అమృత యోగం
- కార్య సిధ్ది
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 366 / Bhagavad-Gita - 366 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 28 🌴*
*28. శుభాశుభఫలరేవం మోక్ష్యసే కర్మబన్ధనై: |*
*సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి*
🌷. తాత్పర్యం :
*ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్న్యాసయోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు.*
🌷. భాష్యము :
*ఉన్నతమైన మార్గదర్శకత్వమున కృష్ణభక్తిభావనలో వర్తించువాడు యుక్తుడని పిలువబడును. దీనికి సరియైన పదము “యుక్తవైరాగ్యము”. ఈ విషయమును గూర్చి శ్రీరూపగోస్వామి మరింతగా ఇట్లు వర్ణించిరి.*
*అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజత: |
నిర్భంధ: కృష్ణసంబంధే యుక్తం వైరాగ్య ముచ్యతే (భక్తిరసామృతసింధువు 1.2.255)*
*భౌతికజగమున ఉన్నంతవరకు మనము కర్మ చేయవలసిన ఉండును. కర్మను విరమించుట సాధ్యము కాదు.*
*కనుకనే కర్మలను ఒనరించి ఆ ఫలమును శ్రీకృష్ణునకు సమర్పించినచో అది “యుక్తవైరాగ్యము” అనబడునని శ్రీరూపగోస్వామి పలికిరి. వైరాగ్యమునందు వాస్తవముగా నెలకొనినపుడు అట్టి కర్మలు చిత్తదర్పణమును పరిశుభ్రము చేయగలవు. ఇక కర్త ఆధ్యాత్మికానుభవమునందు క్రమపురోగతి సాధించిన కొలది శ్రీకృష్ణభగవానుని సంపూర్ణ శరణాగతుడై అంత్యమున మోక్షమును బడయును. అతడు పొందు ముక్తియు స్పష్టముగా వివరింపబడినది.*
*ఈ ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతిలో లీనముగాక భగవద్దామమున ప్రవేశించునని “మాముపైష్యసి” (నన్ను పొందును) యను పదము ద్వారా స్పష్టముగా తెలుపబడినది. వాస్తవమునకు ముక్తి ఐదురకములైనను జీవితమంతయు శ్రీకృష్ణభగవానుని నేతృత్వమున భక్తియోగమును సాగించిన భక్తుడు మాత్రము ఆధాత్మికముగా అత్యున్నతస్థితికి చేరి, దేహత్యాగానంతరము ఆ దేవదేవుని ధామము కేగి అతని ప్రత్యక్ష సాహచర్యమున నియుక్తుడగును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 366 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 28 🌴*
*28. śubhāśubha-phalair evaṁ mokṣyase karma-bandhanaiḥ*
*sannyāsa-yoga-yuktātmā vimukto mām upaiṣyasi*
🌷 Translation :
*In this way you will be freed from bondage to work and its auspicious and inauspicious results. With your mind fixed on Me in this principle of renunciation, you will be liberated and come to Me.*
🌹 Purport :
*One who acts in Kṛṣṇa consciousness under superior direction is called yukta. The technical term is yukta-vairāgya. This is further explained by*
*Rūpa Gosvāmī as follows:*
*anāsaktasya viṣayān yathārham upayuñjataḥ
nirbandhaḥ kṛṣṇa-sambandhe yuktaṁ vairāgyam ucyate
(Bhakti-rasāmṛta-sindhu, 1.2.255)*
*Rūpa Gosvāmī says that as long as we are in this material world we have to act; we cannot cease acting.*
*Therefore if actions are performed and the fruits are given to Kṛṣṇa, then that is called yukta-vairāgya. Actually situated in renunciation, such activities clear the mirror of the mind, and as the actor gradually makes progress in spiritual realization he becomes completely surrendered to the Supreme Personality of Godhead. Therefore at the end he becomes liberated, and this liberation is also specified.*
*By this liberation he does not become one with the brahma-jyotir, but rather enters into the planet of the Supreme Lord. It is clearly mentioned here: mām upaiṣyasi, “he comes to Me,” back home, back to Godhead. There are five different stages of liberation, and here it is specified that the devotee who has always lived his lifetime here under the direction of the Supreme Lord, as stated, has evolved to the point where he can, after quitting this body, go back to Godhead and engage directly in the association of the Supreme Lord.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 213 / Agni Maha Purana - 213 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 63*
*🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 1 🌻*
*హయగ్రీవుడు చెప్పెను: గరుడ - సుదర్శన - బ్రహ్మ-నృసింహమూర్తుల ప్రతిష్ఠకూడ, వారి వారి మంత్రములతో, విష్ణుమూర్తిని స్థాపించిన విధముననే స్థాపింపవలెను. ఆ విధానమును వినుము " ఓం సుదర్శన....సుదర్శనాయ నమః" అను (మూలములో వ్రాసిన) మంత్రముతో చక్రపూజ చేసిన వీరుడు యుద్ధమునందు శత్రువులను చీల్చివేయగలడు "ఓం క్షౌ నరసింహ ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహా" అనునది నరసింహా మంత్రము. ఇపుడు నీకు పాతాలనృసింహ మంత్రము పదేశించుచున్నాను.*
*ఇది పాతాలనృసింహమంత్రము దీనిని ఈ విధముగ జపించగనే సత్ఫలము లభించును. శత్రువులను, నాకు అపకారము చేయు అసురులు మొదలగువారిని, పరులు ప్రయోగించిన మంత్రములను నశింపచేయుము. అని దీని తాత్పర్యము. మధ్యనున్న 'హుం' 'ఫట్' అనువాటికి ప్రత్యేకముగ అర్థమేమియు ఉండదు. కాని ఉచ్చారణమాత్రముచేతనే అవి నశింపచేయుట అను అర్థమును సూచించును 'ఫట్' అనుదానికి మారకాస్త్రమని పేరు.]*
*"ప్రకాశించుచున్న కోటిసహన్రసూర్యలతో సమాన మైన తేజస్సు కలవాడును, వజ్రము వంటి నఖములు కోరలు ఆయుధముగా కలవాడును, పైకి విడివడి లేచిన జూలుచేత క్షోభింపచేయబడిన మహాసముద్ర జలముచే ఏర్పడిన దుందుభిధ్వని కలవాడును, సర్వమంత్రప్రయోగములనుండి తరింపచేయువాడును అగు భగవంతుడైన నరసింహునకు నమస్కారము భగవంతుడవైన నరసింహా! రమ్ము; రమ్ము. పురుషా! పరాపరబ్రహ్మరూపా! సత్యముచే ప్రకాశించుము ప్రకాశించుము. విజృంభించుము, విజృంభించుము. ఆక్రమించుము, అక్రమించుము గర్జించుము, గర్జించుము. సింహనాదము చేయుము, చేయుము. చీల్చుము, చీల్చుము, పారద్రోలుము, పారద్రోలుము, ఆవేశించుము, ఆవేశించుము. సర్వ సంత్రరూపములను, మంత్రజాతులను చంపుము, చంపుము. భేదించుము, భేదించుము. సంక్షేపించుము, సంక్షేపించుము. నడుపుము, నడుపుము. చీల్చుము, చీల్చుము. బ్రద్దలుకొట్టుము, బ్రద్దలుకొట్టుము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 213 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 63*
*🌻Mode of installation of other Gods and Goddesses - 1 🌻*
The god said:
I. The installation [i.e., pratiṣṭhā] of the (images of) Garuḍa (vehicle of Viṣṇu) Brahman, Nṛhari (man-lion form of Viṣṇu) and of the (sudarśana) disc should be done in the same way as that of Viṣṇu with their respective mantras. Listen to me.
2. O Sudarśana! The great disc that is tranquil! Dreadful to the wicked! Kill kill, pierce pierce, cut through and cut through.
3. Devour devour the incantations of others. Eat up, eat up the evil spirits. Frighten frighten, huṃ phaṭ, salutation to sudarśana. Having worshipped the disc with this mantra one destroys the enemies in the battle.
Oṃ kṣauṃ Narasiṃha (man-lion)! of fierce form! burn, burn, blaze up, blaze up, svāhā. Oṃ kṣauṃ salutations to lord Narasiṃha! Effulgent like crores of radiant suns! One armed with mace, claws and teeth! One who manifests with a sound similar to the trumpet while the dreadful and dishevelled manes wildly dance in the storm and one who has agitated the ocean! One who rescues from all incantations! O Lord Narasiṃha (you) come! Manifest with the divine truth as the universal subjective and objective! Open thy mouth! Attack! Roar and release your lion-like voice! Cut through! Drive away! Pierce into all sorts of incantations! Kill, cut, heap together, dislodge, cut open, break up, cause to be burst!
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 78 / DAILY WISDOM - 78 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 18. మీరు అనుభూతి చెందే ప్రేమ పరిపూర్ణత కోసం 🌻*
*ఒక వస్తువు పట్ల మీకు కలిగే ప్రేమ వాస్తవానికి పరిపూర్ణత పట్ల మీకు కలిగే ప్రేమ. ఇది నిజంగా వస్తువు పట్ల ప్రేమ కాదు. మీరు ఒక నిర్దిష్ట వస్తువును మీకు తృప్తిని ఇచ్చే విషయంగా అంటిపెట్టుకుని కూడా, మీరు విషయాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. మనస్సు ఒక వస్తువును కోరుకోదు; అది సంపూర్ణతను కోరుకుంటుంది.*
*దాని కోసమే వెతుకుతోంది. ఆ విధంగా, అది కోరుకునే తృప్తి యొక్క హామీ ఉన్నప్పుడు, దాని ప్రతిరూపంగా కనిపించే వస్తువును గ్రహించడం ద్వారా ఆ సంపూర్ణత్వం రాబోతోందని విశ్వసించడం వల్ల ఆ వస్తువుని ఊహించినా ఒక సంతృప్తి కలుగుతుంది. కానీ అది నిజమైన సంతృప్తి కాదు. కేవలం వస్తువు తన సొంతం అయిందని ఊహించడం వల్ల వచ్చిన సంతృప్తి మాత్రమే.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 78 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 18. The Love that You Feel is for Completeness 🌻*
*The love that you feel in respect of an object is in fact the love that you feel towards that which is called perfection and completeness. It is not really a love for the object. You have thoroughly misunderstood the whole point, even when you are clinging to a particular object as if it is the source of satisfaction. The mind does not want an object; it wants completeness of being.*
*That is what it is searching for. Thus, when there is a promise of the fulfilment that it seeks, through the perception of an object that appears to be its counterpart, there is a sudden feeling that fullness is going to come, and there is a satisfaction even on the perception of that object; and there is an apparent satisfaction, just by the imagined possession of it together with the yearning for actual possession.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 343 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మామూలు మనిషి మానసిక వయసు పన్నెండేళ్ళు. మనం ఎదుగుదల లేని ప్రపంచంలో నివసిస్తున్నాం. మానసికంగా ఎదగని ప్రపంచంలో వున్నాం. సాహసంగా వుండు. సాహసంతో యిష్టం, గాఢత ప్రదర్శించు. సవాళ్ళని ఎదుర్కో, అప్పుడే లోపల దాగిన కాంతిని దర్శిస్తావు. 🍀*
*చలనం లేని వాటికి, తెలివి తక్కువ వాటికి, వ్యతిరేకంగా తిరగబడ్డమన్నది గొప్ప సాహసం, గొప్ప విప్లవం. అది నీ ఆత్మకు, తెలివికి చురుకుదనాన్ని ఇస్తుంది. నీలోని వ్యక్తికి అది సంపూర్ణత నిస్తుంది. ఆనంద సుమం వికసిస్తుంది. నువ్వు ఎదగడం ఆరంభిస్తావు. మామూలు మనిషి మానసిక వయసు పన్నెండేళ్ళు. మనం ఎదుగుదల లేని ప్రపంచంలో నివసిస్తున్నాం. మానసికంగా ఎదగని ప్రపంచంలో వున్నాం. ఎనభయి, తొంభయి ఏళ్ళ వృద్ధులు కూడా వయసులో పెద్దవాళ్ళు. కానీ మానసికంగా పన్నెండేళ్ళ వయసు దగ్గరే ఆగిపోయారు.*
*అందువల్ల వాళ్ళు ఒకోసారి తమ వయసు మరచిపోయి పసితనంతో ప్రవర్తిస్తారు. వాళ్ళకు కొంత విస్కీ యిచ్చి చూడు. తెలివిలేని పసివాడులా ప్రవర్తించడం ఆరంభిస్తారు. విస్కీ పసితనాన్ని సృష్టించలేదు. లోపల వున్న దాన్ని బయటికి తెస్తుంది. ఎవర్నయినా తక్కువ చేసి మాట్లాడు, అతను తన పెద్ద వయసు మరచిపోయి ఆగ్రహిస్తాడు, వివేకం, అనుభవం మాయమవుతాయి. సాహసంగా వుండు. సాహసంతో యిష్టం, గాఢత ప్రదర్శించు. సవాళ్ళని ఎదుర్కో, అప్పుడే లోపల దాగిన కాంతిని దర్శిస్తావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 080 / Siva Sutras - 080 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-02. ప్రయత్నః సాధకః - 2 🌻*
*🌴. నిరంతర ధ్యాన పూర్వక ప్రయత్నంతో, యోగి తన చైతన్యంలో మరియు మంత్రాలలో దాగి ఉన్న శక్తులకు అధిపతిగా మారి, భగవంతుని చైతన్యాన్ని పొందుతాడు. 🌴*
*సంపూర్ణతను అర్థం చేసుకోవడానికి అభ్యాసంతో పాటు అంకితభావం మరియు తపన కూడి ఉండాలి. తన మనస్సును అంతరం వైపుకి ఏకాగ్రత పెట్టేలా బలవంతంగానైనా నడిపించడం ద్వారా దీనిని సాధించవచ్చు. పరమాత్మను పొందాలనే కోరిక కంటే పట్టుదల ముఖ్యం. తీవ్రమైన పట్టుదలతో, మంత్రాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా బలమైన పునాది వేయబడినట్లయితే, అంతర్గత సూచనల రూపంలో స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు తలెత్తుతాయి. ఇది ఇప్పటికే సూత్రం 1-13 లో సూచించ బడింది. ఇక్కడ యోగి యొక్క సంకల్ప శక్తి గురించి చర్చించబడింది. దైవం యొక్క మూల జ్ఞానాన్ని అనుభవం ద్వారా మాత్రమే పొందవచ్చు.*
*ఈ సూత్రం భగవంతుని సాక్షాత్కారం యొక్క అత్యున్నత లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన అనుభవంగా సాధించడానికి వుండవలసిన పట్టుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 080 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-02. Prayatnaḥ sādhakaḥ - 2 🌻*
*🌴. By Persistent meditative effort, Yogi becomes the master of the forces latent in his consciousness and mantras and attains God consciousness. 🌴*
*The practice is to be accompanied with dedication and desire to understand the Absolute. This can be achieved by forcefully directing his mind to concentrate within. Perseverance is more important than the desire to attain Him. With intense perseverance, inspirational thoughts arise in the form of internal flashes, provided a strong foundation is laid by effectively using the mantra. This has been already highlighted in sūtra I.13, where the will power of a yogi has been discussed. The foundational knowledge can be attained only by experience.*
*This sūtra stresses the importance of perseverance coupled with knowledge gained though experience to attain the highest goal of God realization.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments