🍀🌹 07, MARCH 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 07, MARCH 2023 TUESDAY, మంగళవారం, భౌమవాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🌹. హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి శుభాకాంక్షలు / Happy Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti to All. 🌹*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita -336 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 26 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 183 / Agni Maha Purana - 183 🌹 🌻. దశదిక్పతియాగ ము - 3 / Five divisions of installation - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 048 / DAILY WISDOM - 048 🌹 🌻 17. అనుభవించే దాని పట్ల చైతన్యం ఉండకపోతే ఆ జీవిత అనుభవం కలగదు / 17. There is no Experience without a Consciousness of It 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 313 🌹
6) 🌹. శివ సూత్రములు - 50 / Siva Sutras - 50 🌹
🌻 16. శుద్ధ తత్త్వ సంధానద్ వాపశుశక్తిః - 2 / 16. Śuddha-tattva- sandhānād-vāpaśuśaktiḥ - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹07, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి శుభాకాంక్షలు / Happy Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి, Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti 🌻*
*🍀. అపరాజితా స్తోత్రం - 9 🍀*
17. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
18. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : చతుర్విధధ్యానాలు : ఏకవిషయానికి చెందిన ఎడతెగని ఆలోచనా ప్రవాహంపై మనస్సును ఏకాగ్రం చెయ్యడం, ఆ విషయానికి సంబందించిన విజ్ఞానం స్ఫురించేటట్లు దానిని మనసులో ధారణ చెయ్యడం, మనసులోని ఆలోచనలకు వెనుకగా నిలువబడి వాటిని పరిశీలించడం, ఆలోచనల నన్నింటిని మనసులోంచి ఖాళీ చెయ్యడం, అనే యీ నాలుగు రకాల ధ్యాన పద్ధతులూ వరుసగా ఒకదాని కంటే ఒకటి ఎక్కువ కష్ట సాధ్యములై క్రమాధికంగా విస్తృత ఫలితాలను సాధకునకు అందిస్తాయి. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: పూర్ణిమ 18:11:10 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 26:23:55
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: ధృతి 21:14:51 వరకు
తదుపరి శూల
కరణం: బవ 18:08:10 వరకు
వర్జ్యం: 08:51:40 - 10:36:48
దుర్ముహూర్తం: 08:53:12 - 09:40:46
రాహు కాలం: 15:25:38 - 16:54:49
గుళిక కాలం: 12:27:15 - 13:56:26
యమ గండం: 09:28:52 - 10:58:04
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: 19:22:28 - 21:07:36
సూర్యోదయం: 06:30:30
సూర్యాస్తమయం: 18:24:00
చంద్రోదయం: 18:22:47
చంద్రాస్తమయం: 06:27:25
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 26:23:55 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి శుభాకాంక్షలు / Happy Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti to All. 🌹*
*🕉. ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita - 336 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 26 🌴*
*26. శుక్లకృష్ణే గతీ హ్యేతే జగత: శాశ్వతే మతే |*
* ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పున: ||*
🌷. తాత్పర్యం :
*ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు కలవు. శుక్లమార్గమునందు మరణించువాడు తిరిగిరాకుండును. కాని చీకటిమార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగివచ్చును.*
🌷. భాష్యము :
మరణము మరియు పునరాగమనములను ఇదే వివరణను శ్రీబలదేవవిద్యాభూషణులు ఛాందోగ్యోపనిషత్తు (5.10.3-5) నుండి ఉదాహరించిరి.
కామ్యకర్మరతులు, తాత్వికకల్పనాపరులు అనంతకాలముగా ఇట్టి మరణము మరియు పునరాగమనములందు తగుల్కొనియున్నారు. శ్రీకృష్ణుని శరణుజొచ్చని కారణముగా వారెన్నడును దివ్యమైన చరమమోక్షమును పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 336 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 26 🌴*
*26 . śukla-kṛṣṇe gatī hy ete jagataḥ śāśvate mate*
*ekayā yāty anāvṛttim anyayāvartate punaḥ*
🌷 Translation :
*According to Vedic opinion, there are two ways of passing from this world – one in light and one in darkness. When one passes in light, he does not come back; but when one passes in darkness, he returns.*
🌹 Purport :
The same description of departure and return is quoted by Ācārya Baladeva Vidyābhūṣaṇa from the Chāndogya Upaniṣad (5.10.3–5).
Those who are fruitive laborers and philosophical speculators from time immemorial are constantly going and coming. Actually they do not attain ultimate salvation, for they do not surrender to Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 183 / Agni Maha Purana - 183 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 56*
*🌻. దశదిక్పతియాగ ము - 3 🌻*
*పూర్వాది దిక్కులలోనున్న ధ్వజములపై కుముద-కుముదాక్ష-పుండరీక-వామన-శంకుకర్ణ-సర్వనేత్ర-సుముఖ-సుప్రతిష్ఠితులను దేవతలను పూజింపవలెను. వీరందరును కోట్లకొలది సద్గుణములు కలవారు. ఎఱ్ఱని దొండపండువలె ఎఱ్ఱగాకాలిన నూడ ఇరువది ఎనిమిది కలశలను నాలుగు శేర్ల నీళ్లతోనింపి 'కాలదండ' మను యోగములేని సమయమున స్థాపింపవలెను. వీటి అన్నింటికి కంఠభాగమునందు వస్త్రములుకట్టి, వాటిలో సువర్ణము ఉంచి, తోరణముల వెలుపల ఉంచవలెను. వేదికి తూర్పుమొదలైన నాలుగు దిక్కులందును, కోణములందును గూడ కలశములు స్థాపింపవెలను. మొదట నాలుగు కలశములను పూర్వాది దిక్కులు నాల్గింటియందు "అజిఘ్ర కలశమ్" ఇత్యాది మంత్రము చదువుచు స్థాపింపవలెను.*
*ఆ కలశలపై, పూర్వాది దిక్కులందు దిక్పాలకులను అవాహనచేసి పూజింపవెలను. "ఐరావతముపై ఎక్కి, హస్తమున వజ్రము ధరించిన దేవరాజువైన ఇంద్రా! ఇతరదేవతలతో కూడ ఇచటికి రమ్ము; ఈ తూర్పు ద్వారమును రక్షింపిము; దేవతాసమేతుడవైన నీకు నమస్కారము'' అని ప్రార్థించుచు ఇంద్రుని ఆవహనచేసి, "త్రాతారమిన్ద్రమ్" ఇత్యాదిమంత్రము పఠించుచు పూజింపవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 183 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 56*
*🌻Five divisions of installation - 3 🌻*
13-15. The presiding deities of the banners (hoisted) in the (quarters) east etc., such as Kumuda, Kumudākṣa, Puṇḍarīka, Vāmana, Saṅkarṣaṇa, Sarvanetra, Sumukha and Supratiṣṭhita, who are endowed with countless (divine) qualities should. be worshipped. One hundred and eight pitchers resembling the ripe bimba fruit (in colour), not having black spots and having been filled with water and gold and having pieces of cloth around their necks should be placed outside the arches.
16. Pitchers should be placed at the east and other directions. Four pitchers should be placed at the corners of the sacrificial altar with the sacred syllable ājighra.
17. After having invoked Indra and others in the pitchers. in the east etc. one should worship (Indra). O Indra, the lord of celestials, the wielder of thunderbolt, seated on the elephant you come.
18. (You) protect the eastern door in the company of celestials. May salutations be to you. After having worshipped (Indra) with the sacred syllable trātāram indra[1], the wise man should invoke him.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 48 / DAILY WISDOM - 48 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 17. అనుభవించే దాని పట్ల చైతన్యం ఉండకపోతే ఆ జీవిత అనుభవం కలగదు 🌻*
*మన జీవితాన్ని మన అనుభవం నుండి విడదీయలేము. మనం జీవితం అని పిలుస్తున్నది అనుభవం తప్ప మరొకటి కాదు. ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం. అనుభవం, దాని స్వభావం ఏదైనప్పటికీ, ఆ అనుభవం యొక్క చైతన్యం నుండి విడదీయరానిది. చైతన్యం లేకుండా అనుభవం లేదు. మనము ఒక ప్రక్రియలో ఉన్నామని లేదా అనుభవ స్థితిలో ఉన్నామనే ఎరుక మనకి ఉంది.*
*అవగాహన లేకుంటే, మనం ఎలాంటి అనుభవం లేని స్థితిలో ఉన్నామని చెప్పవచ్చు. అనుభవం లేకపోవడమంటే ఏమి జరుగుతుందో తెలియకపోవడమే. ఇప్పుడు, మన జీవితం అంటే అనుభవంతో సమానంగా ఉండటం మరియు వాస్తవికత కోసం మన అన్వేషణ శాస్త్రీయ పద్ధతిలో పరిశీలనాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా ఉండటంతో, బాహ్య ప్రకృతి శాస్త్రీయ కోణంలో మన జీవితం లో ఎలా ప్రతిబింబిస్తుందో, మన వ్యక్తిగత జీవితానికి ఎలా ముడిపడి ఉందో మనం కనుగొనాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 48 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj
*🌻 17. There is no Experience without a Consciousness of It 🌻*
*Our life is inseparable from our experience. What we call life is nothing but experience, and this is important to remember. And experience, whatever be the nature of it, is inseparable from a consciousness of that experience. There is no experience without a consciousness of it. We are aware that we are undergoing a process or are in a state of experience. If the awareness is absent, we cannot be said to be in a state of any experience at all.*
*To have no experience is to have no awareness of what is happening. Now, our life being identical with a conscious experience, and our search for reality being observational and experimental in the scientific fashion, we have to find out how the panorama of external nature, as it stands before us from the point of view of science, is connected with our personal life.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 313 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ప్రార్ధన అంటే, నేను చిన్నవాణ్ణి, సమస్తం లేదా సంపూర్ణత నాకు సహకరించకుంటే నేను ఏమీ చేయలేను' అని. ప్రార్థన అంటే అహం అనంతానికి లొంగిపోవడం. నిరాశతో కాదు. గాఢమయిన అవగాహనతో లొంగిపోవడం. 🍀*
*ప్రయాణం ప్రేమతో ఆరంభమై కాంతిలోనో జ్ఞానోదయంలోనో ముగుస్తుంది. దానికి ప్రార్థన వంతెన. సమస్త తీర్థయాత్ర, అజ్ఞానం నించి వివేకానికి సాగేవి. అది ప్రార్థనకు సంబంధించిన తీర్థయాత్ర. ప్రార్ధన అంటే, నేను చిన్నవాణ్ణి, సమస్తం లేదా సంపూర్ణత నాకు సహకరించకుంటే నేను ఏమీ చేయలేను' అని.*
*ప్రార్థన అంటే అహం అనంతానికి లొంగిపోవడం. నిరాశతో కాదు. గాఢమయిన అవగాహనతో లొంగిపోవడం. చిన్ని అల సముద్రానికి వ్యతిరేకంగా ఎలా వెళుతుంది? అసలు ప్రయత్నమన్నదే అసంగతం. కానీ మానవజాతి చేస్తున్నది అదే. అనంత చైతన్య సముద్రంలో మనం అల్పమైన అలలం. అనంత చైతన్య సముద్రాన్ని దేవుడు, సత్యం, జ్ఞానోదయం, నిర్వాణం తావో, ధర్మం ఏమైనా అనండి. వాటన్నిటి అర్థం ఒకటే.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 050 / Siva Sutras - 050 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 16. శుద్ధ-తత్త్వ-సంధానద్-వాపశుశక్తిః - 2 🌻*
*🌴. స్వచ్ఛమైన పూర్ణత్వాన్ని ధ్యానించడం ద్వారా సాధకుడు బంధించే శక్తి నుండి విముక్తుడవుతాడు 🌴*
*విశ్వం స్వతహాగా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుందని సూచించడానికి శివుడు శుద్ధ-తత్త్వాన్ని ఉపయోగించాడు. కానీ కర్మ బాధల కారణంగా దానితో సంబంధం ఉన్న సహజ మలినాల (మల) కారణంగా వ్యక్తి స్వయం చైతన్యం అపరిశుభ్రంగా మారుతుంది. సాధన లేదా అభ్యాసం ద్వారా ఆశించే వ్యక్తి పదే పదే ఏకత్వాన్ని ధృవీకరించినప్పుడు, అతని వ్యక్తిగత చైతన్యం భిన్నత్వాన్ని పక్కకు నెట్టడం ద్వారా స్వచ్ఛంగా మారుతుంది. యోగి చేసేది ఇదే.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 050 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 16. Śuddha-tattva-sandhānād-vāpaśuśaktiḥ - 2 🌻*
*🌴. By contemplating the pure principle one is free of the power that binds 🌴*
*Śiva has used Śuddha-tattva to point out that universe by itself always remains pure. But the individual self becomes impure because of natural impurities (mala) associated with it due to karmic afflictions. When an aspirant repeatedly affirms through sādhana or practice, his individual consciousness also becomes pure by pushing aside, the differentiated perception that binds an individual. This is what a yogi does.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Komentar