🍀🌹 07, MAY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 07, MAY 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 174 / Kapila Gita - 174🌹
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 28 / 4. Features of Bhakti Yoga and Practices - 28 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 766 / Vishnu Sahasranama Contemplation - 766 🌹
🌻766. చతుర్బాహుః, चतुर्बाहुः, Caturbāhuḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 726 / Sri Siva Maha Purana - 726 🌹
🌻. శివుని యాత్ర - 4 / Śiva’s campaign - 4🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 346 / Osho Daily Meditations - 346 🌹
🍀 346. వినయం / 346. HUMBLENESS🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 453-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 453-2 🌹
🌻 453. 'కామరూపిణీ' - 2 / 453. 'Kamarupini' - 2🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 07, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రబీంద్రనాధ్ ఠాగూర్ జయంతి, Rabindranath Tagore Jayanti 🌻*
*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 6 🍀*
*11. వృషాకపిః కల్పకర్తా కల్పాంతకరణో రవిః |*
*ఏకచక్రరథో మౌనీ సురథో రథినాం వరః*
*12. సక్రోధనో రశ్మిమాలీ తేజోరాశిర్విభావసుః |*
*దివ్యకృద్దినకృద్దేవో దేవదేవో దివస్పతిః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఈశ్వరుని ప్రేమించటంలో ప్రాణకోశం పాత్ర - ఈశ్వరుని ప్రేమించడంలో ప్రాణమయ చేతన పాల్గొనడం జరిగినప్పుడు, ఉత్సాహం, శూరత్వం, గాఢత్వం, అనన్యత్వం, సర్వసమర్పణం మొదలైన గుణాలు ఆ ప్రేమకు సంతరించ బడుతాయి. ఈశ్వరుని కొరకు ప్రాణమయ చేతనలోని ప్రేమోద్వేగ ఫలితంగానే ఆధ్యాత్మిక వీరులు, విజేతలు, ప్రాణత్యాగ ఘనులు ఆవిర్భవిస్తారు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ విదియ 20:16:02
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: అనూరాధ 20:22:47
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: పరిఘ 26:52:51 వరకు
తదుపరి శివ
కరణం: తైతిల 09:05:39 వరకు
వర్జ్యం: 01:05:20 - 02:37:52
మరియు 25:41:26 - 27:12:42
దుర్ముహూర్తం: 16:55:17 - 17:46:40
రాహు కాలం: 17:01:43 - 18:38:02
గుళిక కాలం: 15:25:23 - 17:01:43
యమ గండం: 12:12:43 - 13:49:03
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 10:20:32 - 11:53:04
సూర్యోదయం: 05:47:25
సూర్యాస్తమయం: 18:38:02
చంద్రోదయం: 20:25:03
చంద్రాస్తమయం: 06:47:38
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: మృత్యు యోగం -
మృత్యుభయం 20:22:47 వరకు
తదుపరి కాల యోగం - అవమానం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 174 / Kapila Gita - 174 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 28 🌴*
*28. కౌమోదకీం భగవతో దయితాం స్మరేత దిగ్ధామరాతిభటశోణితకర్దమేన|*
*మాలాం మధువ్రతవరూథగిరోపఘుష్టామ్ చైత్యస్య తత్త్వమమలం మణిమస్య కంఠే॥*
*తాత్పర్యము : కౌముదీగద శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అది శత్రువీరులను నుగ్గునుగ్గు చేయగా వారి రక్తములతో తడిసి, అరుణ కాంతులను విరజిమ్ముచుండునట్టిది. ఆ స్వామి కంఠమునగల వనమాల పరిమళములకు ఆకర్షితములైన తుమ్మెదల ఝంకారములు అత్యంత మనోహరములు. ఆ పురుషోత్తముని గళసీమయందు విరాజిల్లుచుండెడి నిర్మలమైన కౌస్తుభమణి జీవులసత్త్వగుణమునకు ప్రతీక. అందువలన ఆ సర్వేశ్వరుని కౌమోదకీగదను, వనమాలను, కౌస్తుభమణిని హృదయపూర్వకముగా ధ్యానించవలెను.*
*వ్యాఖ్య : యోగి భగవంతుని అతీంద్రియ శరీరంలోని వివిధ భాగాల గురించి ఆలోచించాలి. ఇక్కడ జీవుల రాజ్యాంగ స్థితిని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ రెండు రకాల జీవుల గురించి ప్రస్తావించబడింది. ఒకటి ఆరతి అంటారు. పరమాత్మ యొక్క కాలక్షేపాలను అర్థం చేసుకోవడానికి వారు విముఖంగా ఉన్నారు. వారి కోసం, భగవంతుడు తన చేతితో భయంకరమైన గదను పట్టుకుని కనిపిస్తాడు, ఇది అతను రాక్షసులను చంపినప్పటి నుండి రక్తపు మరకలతో ఎల్లప్పుడూ అద్ది ఉంటుంది. రాక్షసులు కూడా పరమాత్ముని కుమారులు. భగవద్గీతలో చెప్పబడినట్లుగా, వివిధ రకాల జీవులందరూ భగవంతుని యొక్క కుమారులు. అయితే, రెండు రకాల జీవులు ఉన్నాయి, ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకరి శరీరం యొక్క వక్షస్థలం మరియు మెడపై ఉన్న ఆభరణాలను మరియు ముత్యాలను రక్షించినట్లుగా, పవిత్రమైన జీవులను పరమేశ్వరుడు తన మెడపై ఉంచుకుంటాడు. స్వచ్ఛమైన చైతన్యంలో ఉన్న ఆ జీవులు అతని మెడలోని ముత్యాలచే సూచించబడతాయి. రాక్షసులు మరియు భగవంతుని యొక్క లీలల పట్ల విద్వేషం కలిగి ఉన్నవారు అతని గదచే శిక్షించబడతారు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 174 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 4. Features of Bhakti Yoga and Practices - 28 🌴*
*28. kaumodakīṁ bhagavato dayitāṁ smareta digdhām arāti-bhaṭa-śoṇita-kardamena*
*mālāṁ madhuvrata-varūtha-giropaghuṣṭāṁ caityasya tattvam amalaṁ maṇim asya kaṇṭhe*
*MEANING : The yogī should meditate upon His club, which is named Kaumodakī and is very dear to Him. This club smashes the demons, who are always inimical soldiers, and is smeared with their blood. One should also concentrate on the nice garland on the neck of the Lord, which is always surrounded by bumblebees, with their nice buzzing sound, and one should meditate upon the pearl necklace on the Lord's neck, which is considered to represent the pure living entities who are always engaged in His service.*
*PURPORT : The yogī must contemplate the different parts of the transcendental body of the Lord. Here it is stated that the constitutional position of the living entities should be understood. There are two kinds of living entities mentioned here. One is called the arāti. They are averse to understanding the pastimes of the Supreme Personality of Godhead. For them, the Lord appears with His hand clutching the terrible mace, which is always smeared with bloodstains from His killing of demons. Demons are also sons of the Supreme Personality of Godhead. As stated in Bhagavad-gītā, all the different species of living entities are sons of the Supreme Personality of Godhead. There are, however, two classes of living entities, who act in two different ways. The Supreme Lord keeps on His neck those living entities who are pure, as one protects the jewels and pearls on the bosom and neck of one's body. Those living entities in pure Kṛṣṇa consciousness are symbolized by the pearls on His neck. Those who are demons and are inimical towards the pastimes of the Supreme Personality of Godhead are punished by His mace.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 766 / Vishnu Sahasranama Contemplation - 766🌹*
*🌻766. చతుర్బాహుః, चतुर्बाहुः, Caturbāhuḥ🌻*
*ఓం చతుర్బాహవే నమః | ॐ चतुर्बाहवे नमः | OM Caturbāhave namaḥ*
*చత్వారో బాహవోఽస్యేతి చతుర్బాహురితీర్యతే ।*
*వాసుదేవేరూఢమిదం నమేతి విదుషాం మతమ్ ॥*
*నాలుగు బాహువులు ఈతనికి కలవు. ఈ నామము వాసుదేవునియందు రూఢము అనగా వాడుక చేయబడుచున్న శబ్దము.*
:: పోతన భాగవతము దశమ స్కంధము, పూర్వ భాగము ::
సీ.జలధరదేహు నాజానుచతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షుఁజారుగదాశంఖచక్రపద్మవిలాసుఁ గంఠకౌస్తుభమణికాంతి భాసుఁగమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారునురుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటుతే.బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోల, పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁజూచి తిలకించి పులకించి చోద్య మంది, యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె (112)
*అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపారచూచినాడు. ఆ బాలుడు ఆయనకు దివ్య రూపముతో దర్శనమునిచ్చినాడు. ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరమును కలిగియున్నాడు. అతడి పొడవైన నాలుగు బాహువులలో గద, శంఖము, చక్రము, పద్మము వెలుగొందుచున్నాయి. తామరపువ్వు రేకులవంటి కన్నులు, విశాలమైన వక్షఃస్థలము కలవాని కంఠములో కౌస్తుభరత్నపు కాంతులు వెలుగొందుచున్నాయి. అందమైన మొలత్రాడు, కంకణములు, బాహుపురులు ధరించియున్నాడు. శ్రీవత్సము అనెడి మచ్చ వక్షఃస్థలముపైన మెరుస్తున్నది. చెవులకు ఉన్న కుండలముల కాంతితో నుదుటి ముంగురులు వెలుగొందుతున్నాయి. మణులు, వైఢూర్యాలు పొదిగిన కిరీటము ధరించియున్నాడు.*
*ఆ బిడ్డడు బాలుడుగనే ఉన్నా ఈ దివ్య లక్షణముల న్నిటితోను పూర్ణచంద్రుని కాంతులు చిమ్ముతూ ఉన్నాడు. అతడు భక్తులందరిని రక్షించెడివాడు. సృష్టిలోని సుగుణములు అన్నియును అతని వద్దానుండియే పుట్టినవి. అతివిశాలమైన కరుణ కలవాడు.*
*అటువంటి బాలుని చూచిన వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపారచూచి, పులకించి పోయాడు, ఆశ్చర్యపోయాడు, ఉప్పొంగిపోయాడు. ఆ పారవశ్యమునుండి తేరుకొని ఉత్సాహముతో నిలబడ్డాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 766🌹*
*🌻766. Caturbāhuḥ🌻*
*OM Caturbāhave namaḥ*
चत्वारो बाहवोऽस्येति चतुर्बाहुरितीर्यते ।
वासुदेवेरूढमिदं नमेति विदुषां मतम् ॥
*Catvāro bāhavo’syeti caturbāhuritīryate,*
*Vāsudeverūḍamidaṃ nameti viduṣāṃ matam.*
*He has four arms. So Caturbāhuḥ. This is well known for Vāsudeva.*
:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे कृष्णजन्मनि तृतीयोऽध्यायः ::
तमद्भुतं बालकमम्बुजेक्षणं चतुर्भुजं शङ्खगदाद्युदायुधम् ।
श्रīवत्सलक्ष्मं गलशॊभिकौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभगम् ॥ ९ ॥
महार्हवैदूर्यकिरीटकुण्डल त्विषा परिष्वक्तसहस्रकुन्तलम् ।
उद्दामकाञ्च्यङ्गदकङ्कणादिभिर्विरोचमानं वसुदेव ऐक्षत ॥ १० ॥
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tamadbhutaṃ bālakamambujekṣaṇaṃ caturbhujaṃ śaṅkhagadādyudāyudham,
Śrīvatsalakṣmaṃ galaśóbhikaustubhaṃ pītāmbaraṃ sāndrapayodasaubhagam. 9.
Mahārhavaidūryakirīṭakuṇḍala tviṣā pariṣvaktasahasrakuntalam,
Uddāmakāñcyaṅgadakaṅkaṇādibhirvirocamānaṃ vasudeva aikṣata. 10.
*Vasudeva then saw the newborn child, who had very wonderful lotus-like eyes and who bore in His four hands the four weapons śańkha, cakra, gadā and padma. On His chest was the mark of Śrīvatsa and on His neck the brilliant Kaustubha gem. Dressed in yellow, His body blackish like a dense cloud, His scattered hair fully grown, and His helmet and earrings sparkling uncommonly with the valuable gem Vaidūrya, the child, decorated with a brilliant belt, armlets, bangles and other ornaments, appeared very wonderful.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥
చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥
Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 727 / Sri Siva Maha Purana - 727 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 09 🌴*
*🌻. శివుని యాత్ర - 4 🌻*
*కేశుడు, విగతవాసుడు, మహాకేశుడు, మహాజ్వరుడు, సోమవల్లీ సవర్ణుడు, సోమదుడు, సనకుడు (34). సోమధృక్, సూర్యవర్చసుడు, సూర్యప్రేషణకుడు, సూర్యాక్షుడు, సూరినాముడు, సురుడు, సుందరుడు (35). ప్రస్కందుడు, కుందరుడు, చండుడు, కంపనుడు, అతికంపనుడు, ఇంద్రుడు, ఇంద్రజవుడు, యంత, హిమకరుడు (36). శతాక్షుడు, పంచాక్షుడు, సహస్రాక్షుడు, మహోదరుడు, సతీజహుడు, శతాస్యుడు, రంకుడు, కర్పూరపూతనుడు (37). ద్విశిఖుడు, త్రిశిఖుడు, అహంకార కారకుడు, అజవక్త్రుడు, అష్టవక్త్రుడు, హయవక్త్రుడు, అర్ధవక్త్రుడు (38). మొదలైన అపరిమిత బలశాలురైన, వారులగు గణాధ్యక్షులు అనేకులు అక్ష్యమును గురించి గాని, లక్షనముల గురించి గాని చింత చేయని వారై శివుని చుట్టుముట్టి ముందునకు సాగిరి (39).*
*వారు అపుడు పినాకధారియగు మహాదేవుని చుట్టు వారి యుండిరి. వారు సంకల్పమాత్రముచే చరాచర జగత్తును భస్మము చేయుటకు సమర్థులు (40). ఈ జగత్తు నంతనూ దహించుటకు వారే సమర్థులై యుండగా, త్రిపురనాశము కొరకు పినాకథారియగు శివుడు స్వయముగా వచ్చుటకు కారణమేమి? ఆ శివునకు రథముతో గాని, బాణముతో గాని, రుద్ర గణములతో గాని, దేవగణములతో గాని ప్రయోజనమేమి గలదు? (41). ఓ వ్యాసా! ఆ రాక్షసుల త్రిపురములను దహించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. అయినను ఆ పినాకపాణి స్వీయగణములతో, మరియు దేవగణములతో గూడి స్వయముగా బయలుదేరినాడు. ఇది అత్యాశ్చర్యము (42). ఓ మహర్షీ! ఆయన అట్లు చేయుటకు గల కారణమునుచెప్పెదను. ఆయన పరమపవిత్రమగు కీర్తిని లోకములో విస్తరింపజేయుట కొరకై అట్లు చూసెను (43). ఇట్లు చేయుటకు మరియొక కారణుము గలదు. దేవతలందరిలో సర్వోత్తముడు శివుడే గాని మరియొకడు గాడు అను నమ్మకము దుష్టులకు కలిగించుట కొరకై భగవానుడట్లు చేసెను (44).*
*శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధ ఖండలో శివయాత్రా వర్ణనమనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 727🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 09 🌴*
*🌻 Śiva’s campaign - 4 🌻*
34-39. These were the important ones who were there—Keśa, Vigatavāsa, Mahākeśa, Mahājvara, Somavallīsavarṇa, Somapa, Sanaka, Somadhṛk, Sūryavarcas, Sūryapreṣaṇaka, Sūryākṣa, Sūrināman, Sura, Sundara, Praskanda, Kundara, Caṇḍa, Kampana, Atikampana, Indra, Indrajava, Yantṛ, Himakara, Śatākṣa, Pañcākṣa, Sahasrākṣa, Mahodara, Satijahru, Śatāsya, Raṅka, Karpūrapūtana, Dviśikha, Triśikha, Ahaṃkārakāraka, Ajavaktra, Aṣṭavaktra, Hayakāraka and Ardhavaktraka. These and other innumerable lords of Gaṇas who cannot be characterised and classified surrounded Śiva and went ahead.
40. They were capable of burning the entire world including the mobile and immobile beings, within a trice by their very thought. Surrounding Śiva, the great lord, they went ahead.
41. Śiva is capable of burning the entire world. Of what avail are the Gaṇas, gods, chariot, and arrows to Śiva in order to burn the three cities?
42. O Vyāsa, that trident-bearing lord, of wonderful power of causing enjoyment and protection, himself went there with his own Gaṇas and the gods to burn the three cities of the enemies of gods.
43. What the reason was, I shall tell you, O excellent sage. It was to make his glory known to all the worlds, the glory that dispels all sins and dirt.
44. Another reason was to convince the wicked, since there is none to excel him among the gods.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 346 / Osho Daily Meditations - 346 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 346. వినయం 🍀*
*🕉. ప్రేమ అనేది నిరాడంబరత. మరో రకం నమ్రత లేదు. ప్రేమ లేకుండా వినయం పెంచుకుంటే, అది కేవలం అహం యొక్క మరొక ఉపాయం మాత్రమే. 🕉*
*ప్రేమ నుండి వినయం సహజంగా వచ్చినప్పుడు, అది చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఉనికితో ప్రేమలో పడండి - మరియు దానికి ప్రారంభం మీరు మీతో ప్రేమలో పడటం. ఒకసారి మీరు మీతో ప్రేమలో ఉంటే, మీరు చాలా మంది వ్యక్తులతో ప్రేమలో పడటం ప్రారంభిస్తారు మరియు ఆ స్థలం మరింత పెద్దదిగా మారుతుంది. ఒక రోజు మీరు అకస్మాత్తుగా మొత్తం అస్తిత్వం దానిలో చేర్చబడిందని, ప్రేమ ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరితోనూ సంబోధించ బడదని, అది ఎవరినైనా తీసుకోవడానికి మాత్రమే ఉందని మీరు కనుగొంటారు. ఇది సరళంగా ప్రవహిస్తుంది. తీసుకెళ్ళేందుకు ఎవరూ లేకపోయినా ధారపోస్తుంది.*
*అప్పుడు ప్రేమ అనేది సంబంధం కాదు, అది ఒక స్థితి. ఆ స్థితిలో వినయం, నిజమైన వినయం ఉంటుంది. మహాత్ములు అలాంటి వినయం కలిగి వుంటారు. మతాధికారులు అలా వినయపూర్వకంగా ఉండరు. ఎవరైనా పేదరికాన్ని పెంపొందించు కోవచ్చు మరియు దాని గురించి చాలా అహంభావంతో ఉండవచ్చు, ఎవరైనా వినయాన్ని పెంపొందించుకోవచ్చు మరియు దాని గురించి అహంభావంగా మారవచ్చు. నిజమైన వినయం ప్రేమ యొక్క సువాసనగా పుడుతుంది. ఇది పండించ బడదు, పండించ బడితే మీరు దానిని ఆచరించలేరు. దానిని నేర్చుకునే మార్గం లేదు. మీరు ప్రేమలోకి వెళ్లాలి మరియు ఒక రోజు అకస్మాత్తుగా ప్రేమ వికసించినట్లు మీరు కనుగొంటారు - వసంతం వస్తుంది మరియు ప్రేమ వికసిస్తుంది. మీరు వినయంగా మారితే మీలో 'ఇంతకు ముందెన్నడూ లేని ఒక నిర్దిష్ట సువాసన ఉంటుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 346 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 346. HUMBLENESS 🍀*
*🕉. Love is essentially humbleness--there is no other kind if humbleness. If humbleness is cultivated without love, it is just another trick if the ego. 🕉*
*When humbleness comes naturally out of love, then it is tremendously beautiful. So fall in love with existence--and the beginning is to fall in love with yourself. Once you are in love" with yourself you start feeling in love with many people, and by and by that space becomes bigger and bigger. One day you suddenly find that the whole of existence is included in it, that love is now no longer addressed to anybody in particular, that it is simply there for anybody to take-it is simply flowing. Even if nobody is there to take it, it is flowing.*
*Then love is not a relationship, it is a state of being. And in that state of being lies humbleness, true humbleness. Jesus is humble in that way; the pope is not humble. Somebody can cultivate poverty and become very egoistic about it, somebody can cultivate humbleness and become egoistic about it. To me, real humbleness arises as a fragrance of love. It cannot be cultivated, you cannot practice it, there is no way to learn it. You have to go into love and one day suddenly you find that love has flowered--spring has come and love has bloomed and "there is a certain fragrance that was never there before: You are humble.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 453 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 453 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।*
*మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀*
*🌻 453. 'కామరూపిణీ' - 1 🌻*
*ఇచ్ఛా లేమి నిర్భీజ నిర్వికల్ప సమాధి వంటిది. అది ప్రజ్ఞ స్థితి యందు ఇమిడిపోయిన స్థితి. రాయి రప్ప అట్లుండును. శివుడు కూడ అట్లే యుండును. ఈ నడుమ జరుగు నాటకమంతయు కామ స్వరూపమే. కామము దివ్య కామమై వుండవచ్చును. ఆసురమై యుండవచ్చును. సత్యకామమై యుండవచ్చును. కామమే సృష్టిని, జీవులను నడిపించు చున్నది. కోటానుకోట్ల జీవులు నిత్యము కదులుటకు కారణము కామమే. కామము లేనిదే చలనము లేదు. చలనము లేనిదే సృష్టి లేదు. ఇట్టి తత్త్వమునకు అధిదేవత శ్రీమాత అని తెలియవలెను. కామశక్తిని ఎట్లు వినియోగించిన ఫలితము లట్లుండును. సుఖ-దుఃఖములకు, లాభ - నష్టములకు, ఉన్నతి - పతనములకు కామమే కారణము. జీవుడు సృష్టియందు ఆరోహణము చెందుటకు, అవరోహణము చెందుటకు కామమే కారణము. శివుని చేరుటకు కూ డ కామమే సాధనము. శ్రీమాత శివకామినియై శివుని చేరినది. సృష్టికామినియై సృష్టిని నిర్మించినది. కామమును మించిన సాధనము లేదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 453 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 95. Tejovati trinayana lolakshi kamarupini*
*Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻*
*🌻 453. 'Kamarupini' - 2 🌻*
*Desirelessness is like Nirbhija Nirvikalpa (unwavering) Samadhi. It is a state that is embedded in the state of prajna. It is like that of stones. Shiva is also like that. The whole drama that takes place in this middle is of desire. Desire can be divine, or demonic. It can be a desire for truth. Desire is what drives creation and living beings. Desire is the reason for the constant flux of billions of living beings. Without desire, there is no movement. There is no creation without motion. It should be known that Srimata is the lord of this philosophy. The result the desire depends on how it is used. Desire is the cause of happiness and sorrow, profit and loss, ups and downs. Desire is the reason for a living being to ascend and descend in creation. Desire is also the means to reach Shiva. Srimata joined Lord Shiva by desiring Lord Shiva. She manifested this creation by desiring it. There is no tool beyond desire.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments