top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 10, APRIL 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 10, APRIL 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 10, APRIL 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 353 / Bhagavad-Gita - 353 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 15 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 200 / Agni Maha Purana - 200 🌹

🌻. అధివాసనము - 7 / Preliminary consecration of an image (adhivāsana) - 7 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 065 / DAILY WISDOM - 065 🌹

🌻 5. దుఃఖం బయట నుండి రాలేదు / 5. The Sorrow has Not Come from Outside 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 330 🌹

6) 🌹. శివ సూత్రములు - 67 / Siva Sutras - 67 🌹

🌻. 21. శుద్ధవిద్యోద్యా చ్చక్రే ఈశత్వ-సిద్ధిః - 2 / 21. śuddhavidyodyāccareśatva-siddhiḥ - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 10, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 27 🍀*


*53. వృషణః శంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః |*

*నీలస్తథాఽంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః*

*54. స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |*

*ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : జపమార్గాలు - జవం సాధారణంగా విజయవంతమయ్యే మార్గాలు రెండున్నాయి. ఒకటి, బుద్ధిని మంత్రదేవత శక్తి సౌందర్యాదుల యందు లగ్నంచేస్తూ జపించే మార్గం. రెండవది భక్తిభావ పురస్సరంగా హృదయమందు మంత్రాన్ని స్పందింప జేస్తూ జపించే మార్గం. సాధకుడు రెండింటిలో ఏదో ఒకదాన్ని అనుసరించవచ్చు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: కృష్ణ చవితి 08:38:39 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: అనూరాధ 13:40:04 వరకు

తదుపరి జ్యేష్ఠ

యోగం: వ్యతీపాత 20:11:20 వరకు

తదుపరి వరియాన

కరణం: బాలవ 08:36:39 వరకు

వర్జ్యం: 19:06:26 - 20:39:42

దుర్ముహూర్తం: 12:42:28 - 13:32:16

మరియు 15:11:50 - 16:01:37

రాహు కాలం: 07:37:31 - 09:10:52

గుళిక కాలం: 13:50:56 - 15:24:17

యమ గండం: 10:44:13 - 12:17:34

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41

అమృత కాలం: 03:25:06 - 04:59:42

మరియు 28:26:02 - 29:59:18

సూర్యోదయం: 06:04:10

సూర్యాస్తమయం: 18:30:59

చంద్రోదయం: 22:34:39

చంద్రాస్తమయం: 08:53:33

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు: మానస యోగం - కార్య

లాభం 13:40:04 వరకు తదుపరి పద్మ

యోగం - ఐశ్వర్య ప్రాప్తి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 353 / Bhagavad-Gita - 353 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 15 🌴*


*15. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే |*

*ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||*


🌷. తాత్పర్యం :

*జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.*


🌷. భాష్యము :

*పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. సంపూర్ణ భక్తిభావనలో నిలిచి తనను తప్ప అన్యమును తెలియనివారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపియున్నాడు. అట్టి మహాత్ముల స్థాయికి చెందకున్నను శ్రీకృష్ణునే పలువిధములుగా పూజించువారు కొందరు గలరు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానసముపార్జన యందు నియుక్తులైనవారుగా ఇదివరకే వర్ణింపబడినారు. వీరికన్నను తక్కువస్థాయిలో గల ఇతరులు తిరిగి మూడు రకములుగా విభజింపబడిరి. అందులో మొదటిరకమువారు ఆత్మనే భగవానుని తలచి తమను తాము అర్చించుకొందురు. రెండవరకమువారు భగవానునికి ఏదో తోచినరూపము ఆపాదించి దానిని అర్చింతురు. మూడవ రకము వారు చెందినవారు విశ్వమును భగవానునిగా భావించి పూజింతురు.*


*ఈ మూడురకములలో తమను అద్వైతులుగా భావించుచు తమను తామే భగవానుని రూపమున అర్చించువారు అధికముగా నుందురు. వారు అధములు. అట్టివారు తమనే భగవానుని భావించుచు అదే భావనలో తమను తాము పూజించుకొందురు. ఇదియును ఒక విధమైన భగవదర్చనమే. ఏలయన అట్లు చేయువారు తాము దేహాదులము కామనియు, కేవలము ఆత్మస్వరూపలమేననియు సంపూర్ణముగా తెలిసియుందురు. కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగా నుండును. సాధారణగా నిరాకారవాదులు దేవదేవుని ఈ రీతిగనే అర్చింతురు. ఈ రూపమైనను భగవానుని రూపమే అనెడి భావనలో ఇతర దేవతార్చనము చేయువారు రెండవ తరగతికి చెందినవారు. ఇక మూడవతరగతికి చెందినవారు విశ్వమును తప్ప అన్యమును ఊహింపలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని అర్చింతురు. అట్టి విశ్వము కూడా శ్రీకృష్ణ భగవానుని రూపమే అయియున్నది.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 353 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 15 🌴*


*15. jñāna-yajñena cāpy anye yajanto mām upāsate*

*ekatvena pṛthaktvena bahudhā viśvato-mukham*


🌷 Translation :

*Others, who engage in sacrifice by the cultivation of knowledge, worship the Supreme Lord as the one without a second, as diverse in many, and in the universal form.*


🌹 Purport :

*This verse is the summary of the previous verses. The Lord tells Arjuna that those who are purely in Kṛṣṇa consciousness and do not know anything other than Kṛṣṇa are called mahātmā; yet there are other persons who are not exactly in the position of mahātmā but who worship Kṛṣṇa also, in different ways. Some of them have already been described as the distressed, the financially destitute, the inquisitive, and those who are engaged in the cultivation of knowledge. But there are others who are still lower, and these are divided into three: (1) he who worships himself as one with the Supreme Lord, (2) he who concocts some form of the Supreme Lord and worships that, and (3) he who accepts the universal form, the viśva-rūpa of the Supreme Personality of Godhead, and worships that.*


*Out of the above three, the lowest, those who worship themselves as the Supreme Lord, thinking themselves to be monists, are most predominant. Such people think themselves to be the Supreme Lord, and in this mentality they worship themselves. This is also a type of God worship, for they can understand that they are not the material body but are actually spiritual soul; at least, such a sense is prominent. Generally the impersonalists worship the Supreme Lord in this way. The second class includes the worshipers of the demigods, those who by imagination consider any form to be the form of the Supreme Lord. And the third class includes those who cannot conceive of anything beyond the manifestation of this material universe. They consider the universe to be the supreme organism or entity and worship that. The universe is also a form of the Lord.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 200 / Agni Maha Purana - 200 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 59*


*🌻. అధివాసనము - 7 🌻*


*ఒక్కొక కుండములో ఓంకారోచ్చారణ పూర్వకముగ ఒక వెయ్యి ఎనిమిది చొప్పున పలాశసమిధలను యవలు మొదలగు వాటిని హోమము చేయవలెను. వ్యాహృతి మంత్రముతో ఘృతమిశ్రతిలలను, మూలమంత్రముతో ఘృతమును హోమము చేయవలెను. పిమ్మట మధురత్రయము (నెయ్యి, తెనె, పంచదార)తో శాంతిహోమము చేయవలెను. ద్వాద శాక్షర మంత్రముతో పాదనాభి-హృదయ-శిరస్సులను స్పృశింపవలెను. నెయ్యి, పెరుగు, పాలు హోమము చేసి శిరస్సు స్పృశింపవలెను. పిమ్మట శిరో-నాభి-పాదములు స్పృశించి గంగా-యమునా-గోదావరి-సరస్వతీ నదులను ఆవాహనము చేయవలెను. విష్ణుగాయత్రితో అగ్నిని రగిల్చి, గాయత్రితో ఆ అగ్నిపై చరువును వండవలెను.*


*గాయత్రీ మంత్రముతో హోమము చేసి, బలు లిచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. మాసాధీపతులైన ద్వదశాది దిత్యుల తుష్టికై ఆచార్యునకు బంగారము, గోవు దక్షిణగా ఈయవలెను. దిక్పాలకులను బలి ఇచ్చి. వేదపాఠ - గీత కీర్త నాదులతో రాత్రి జాగరణము చేయవలెను. ఈ విధముగ ఆధివాసనము పూర్తి చేసినవానికి అన్ని ఫలములును లభించును.*


అగ్ని మహాపురాణమునందు అధివాసన మను ఏబది తొమ్మిదవ అద్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 200 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 59*

*🌻Preliminary consecration of an image (adhivāsana) - 7 🌻*


52. One should place one thousand and eight twigs of the palāśa tree in each one of the fire pits and offer grains with vedic hymns.


53. Clarified butter and sesamum (should be offered to fire) with the vyāhṛtis (Oṃ bhūḥ, bhuvaḥ, suvaḥ) and ghee with the principal mantra. One should perform the appeasing oblation with the three sweet things.[13]


54. One should then touch the feet, navel, heart and forehead with (the utterance of) twelve mystic syllables (of the god). After having offered ghee, curd and milk, the head of the image should again be touched.


55. After having touched the head, navel, and feet, (the priest) should make four rivers Gaṅgā, Yamunā, Godāvarī and Sarasvatī present there by pronouncing their names.


56. (The rivers) should be dried up by (the recitation of the viṣṇugāyatrī[14] and the sacrificial gruel should be boiled with (the recitation of) the gāyatrī. One should offer oblation, offer the victim and feed the twice-borns afterwards.


57. For the satisfaction of the singer of sāmans one should give gold and cows to the spiritual preceptor. Having made offerings to the guardian deities of the quarters, one should spend night in vigil. By singing the praise of the brahman one gets fruits of the consecration rite.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 65 / DAILY WISDOM - 65 🌹*

*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 5. దుఃఖం బయట నుండి రాలేదు 🌻*


*బృహదారణ్యక ఉపనిషత్తు, ముఖ్యంగా, బంధం మరియు విముక్తి యొక్క వివిధ ప్రక్రియలను వివరించడానికి ప్రయత్నిస్తుంది. మనం ఎలా బంధించబడ్డామో మరియు మనం ఎలా స్వేచ్ఛ పొందాలో అది చెబుతుంది. అది ఆత్మ యొక్క బంధం యొక్క అంతిమ కారణానికి సైతం వెళుతుంది. మన బంధం కేవలం భౌతికమైనది లేదా సామాజికమైనది కాదు. ఇది శతాబ్దాలుగా మన పునరావృత జననాలు మరియు మరణాల ద్వారా మనల్ని బాధించే లోతుగా పాతుకుపోయిన ఒక పరిస్థితి.*


*బాహ్య ప్రపంచంలో మనం చేసే ఏ పని అయినా మన ఈ దుఃఖానికి తగిన పరిహారంగా అనిపించదు, ఎందుకంటే దుఃఖం బయటి నుండి రాలేదు. వర్షం, ఎండ మరియు గాలి నుండి మనలను బాధించకుండా నిరోధించడానికి మనం బంగళాను కలిగి ఉండవచ్చు; మనం తినడానికి రోజువారీ ఆహారాన్ని కలిగి ఉండవచ్చు; మనం చాలా సంతోషకరమైన మరియు స్నేహపూర్వక సామాజిక సంబంధాలను కలిగి ఉండవచ్చు; కానీ మనం ఈ సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక రోజు చనిపోవచ్చు. ఈ భయం నుండి మనల్ని ఎవరూ విడిపించలేరు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 65 🌹*

*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 5. The Sorrow has Not Come from Outside 🌻*


*The Brihadaranyaka Upanishad, particularly, attempts to explain the various processes of bondage and liberation. It tells us how we are bound and how we are to get free; and it goes to the very cause ultimate of the bondage of the soul. Our bondage is not merely physical or social. It is a more deep-rooted condition which has been annoying us through centuries and through our repeated births and deaths.*


*Anything that we do in the outer world does not seem to be an adequate remedy for this sorrow of ours, because the sorrow has not come from outside. We can have a bungalow to prevent us from suffering from rain and sun and wind; we can have daily food to eat; we can have very happy and friendly social relationships; but we can also die one day, even with all these facilities. Nobody can free us from this fear.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 330 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది. 🍀*


*నువ్వు నీ లోపల జరుగుతున్న దాన్ని గమనిస్తే ఆశ్చర్యపోతావు. శరీరం 'చాలు చాలా తినకు, నాకు ఎక్కువయి పోయింది' అంటుంది. మనసు 'ఐస్క్రీం అద్భుతంగా వుంది. యింకొంచెం తిను' అంటుంది. హృదయం 'అదెంత అందంగా వుంది' అంటుంది. మనసు ' నీకు బుర్ర లేదు, నీకు పిచ్చి పట్టింది అంటుంది. ఎప్పుడు హృదయం ప్రేమలో పడితే మనసు 'ఇది గుడ్డితనం' అంటుంది. హృదయం ఎటు వెళ్ళినా మనసు తప్పుపడుతుంది. వాటి ప్రపంచాలు వేరు.*


*ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది. కారణం ఘర్షణ వుండదు. ఆ శక్తి నీకు రెక్కల్ని యిచ్చి అనంతం వేపు సాగిపోయేలా చేస్తుంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 067 / Siva Sutras - 067 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻. 21. శుద్ధవిద్యోద్యాచ్చక్రేఈశత్వ-సిద్ధిః - 2 🌻*

*🌴. యోగి పరిమిత శక్తులను కోరకుండా, సార్వత్రిక జ్ఞానాన్ని పొందాలనే తపనతో ఉన్నప్పుడు స్వచ్ఛమైన జ్ఞానం పెరిగి , అతను విశ్వ చైతన్య నిపుణుడు అవుతాడు. 🌴*


*ఒకరి స్వీయ చైతన్యం సంపూర్ణ స్వచ్ఛతతో ఉంటే తప్ప, విశ్వ చైతన్యం లేదా శివ చైతన్యం యొక్క అంతిమ దశకు చేరుకోవడానికి అనేక ఇతర ఉన్నత స్థాయి చైతన్యాలను అధిగమించడం సాధ్యం కాదు. అటువంటి వ్యక్తి తన వ్యక్తిగత చైతన్యాన్ని సర్వోన్నత చైతన్యంతో విలీనం చేసుకోగలిగినప్పుడు, అతను అది అవుతాడు. మరో మాటలో చెప్పాలంటే, అతను శివుడిగా రూపాంతరం చెందుతాడు. ఆ స్థితిలో మాత్రమే, అతను విశ్వాన్ని కొనసాగించే అన్ని శక్తి స్థాయిలను స్వాధీనం చేసుకోగలడు. తన జ్ఞానం యొక్క స్వచ్ఛత కారణంగా మాత్రమే ఉత్పన్నమయ్యే అతని చైతన్య స్థాయి యొక్క స్వచ్ఛత వల్ల మాత్రమే అతను ఆధిపత్యాన్ని పొందుతాడు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 067 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 21. śuddhavidyodyāccakreśatva-siddhiḥ - 2 🌻*

*🌴. When yogī does not desire limited powers and is eager to attain the knowledge of universal being then pure knowledge rises and he becomes the master of the universal consciousness. 🌴*


*Unless one’s own consciousness is in absolute purity, it is not possible to transcend several other higher levels of consciousness to reach the ultimate stage of universal consciousness or Śiva consciousness. When such a person is able to merge his individual consciousness with Supreme consciousness, he becomes That. In other words, he becomes transformed as Śiva. Only in that state, he is able to master all energy levels that keep the universe going. He attains supremacy only because of the purity of his consciousness level that arises only because of purity of his knowledge.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page