top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 10, AUGUST 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 10, AUGUST 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀

1) 🌹10, AUGUST 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 411 / Bhagavad-Gita - 411 🌹

🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 39 / Chapter 10 - Vibhuti Yoga - 39 🌴

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 257 / Agni Maha Purana - 257 🌹

🌻. శివ పూజాంగ హోమ విధి - 2 / Mode of installation of the fire (agni-sthāpana) - 2 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 123 / DAILY WISDOM - 123 🌹

🌻 2. విశ్వవ్యాప్త దృష్టి / 2. Universality of Vision 🌻

5) 🌹. శివ సూత్రములు - 125 / Siva Sutras - 125 🌹

🌻 2-09. జ్ఞానం అన్నం - 2 / 2-09.  Jñānam annam  - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 10, అగష్టు, AUGUST, 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌺. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌺*


*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 17 🍀*


*33. శ్రీమేరునిలయో యోగీ బాలార్కసమకాంతిమాన్ |*

*రక్తాంగః శ్యామలాంగశ్చ బహువేషో బహుప్రియః*

*34. మహాలక్ష్మ్యన్నపూర్ణేశః స్వధాకారో యతీశ్వరః |*

*స్వర్ణరూపః స్వర్ణదాయీ మూలికాయంత్రకోవిదః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఇతర సాధకులతో ఘర్షణలు - స్త్రీ పురుషుల కామ ప్రవృత్తుల కెట్లో, అట్లే ఇతర సాధకులతో ఘర్షణలకు సైతం యోగసాధన యందు స్థానం లేదు. సామరస్యం, సద్భావం. సహనం, సమత, ఇవే సాధకులకు ఆ ఇతర సాధకుల తోడి సంబంధాలు దానికుండ వలసిన లక్షణాలు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ దశమి 29:07:21 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: రోహిణి 28:02:01 వరకు

తదుపరి మృగశిర

యోగం: ధృవ 15:09:52 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: వణిజ 16:38:54 వరకు

వర్జ్యం: 19:31:00 - 21:13:12

దుర్ముహూర్తం: 10:13:29 - 11:04:38

మరియు 15:20:26 - 16:11:36

రాహు కాలం: 13:57:18 - 15:33:14

గుళిక కాలం: 09:09:31 - 10:45:27

యమ గండం: 05:57:41 - 07:33:36

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 24:37:36 - 26:19:48

సూర్యోదయం: 05:57:41

సూర్యాస్తమయం: 18:45:05

చంద్రోదయం: 00:35:03

చంద్రాస్తమయం: 14:07:59

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 28:02:01 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 411 / Bhagavad-Gita - 411 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 39 🌴*


*39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |*

*న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ||*


*🌷. తాత్పర్యం : ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావరజంగములలో నేను లేకుండ ఏదియును స్థితిని కలిగి యుండలేదు.*


*🌷. భాష్యము : ప్రతిదానికి ఒక కారణముండును. అట్టి కారణము లేదా బీజము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదు కనుక అతడు సర్వశక్తిమంతుడని పిలువబడినాడు. అతని శక్తి లేకుండా స్థావరము గాని, జంగమము గాని ఏదియును మనుగడను కలిగియుండలేదు. కనుకనే కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించునది మాయగా (లేనటువంటిది) పిలువబడును.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 411 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 10 - Vibhuti Yoga - 39 🌴*


*39. yac cāpi sarva-bhūtānāṁ bījaṁ tad aham arjuna*

*na tad asti vinā yat syān mayā bhūtaṁ carācaram*


*🌷 Translation : Furthermore, O Arjuna, I am the generating seed of all existences. There is no being – moving or nonmoving – that can exist without Me.*


*🌹 Purport : Everything has a cause, and that cause or seed of manifestation is Kṛṣṇa. Without Kṛṣṇa’s energy, nothing can exist; therefore He is called omnipotent. Without His potency, neither the movable nor the immovable can exist. Whatever existence is not founded on the energy of Kṛṣṇa is called māyā, “that which is not.”*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 257 / Agni Maha Purana - 257 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*


*🌻. శివ పూజాంగ హోమ విధి - 2 / Mode of installation of the fire (agni-sthāpana) - 2 🌻*


*సంహితామంత్రముచే అభిమంత్రతమై, ధేనుముద్రాప్రదర్శన పూర్వకముగ అమృతీకరణ క్రియచే సంస్కృతమై అస్త్రమంత్రముచే సురక్షితమై, కవచ మంత్రముచే అవగుంఠితమై, పూజింపబడిన అగ్నిని, అగ్నికుండముపై మూడు పర్యాయములు ప్రదక్షిణముగా త్రిప్పి, ''ఇది శివుని బీజము'' అని భావన చేసి, ''వాగీశ్వరదేవునిచే ఈ బీజమును వాగీశ్వరీ గర్భమునందు స్థాపింపడెను'' అని ధ్యానము చేసి, మంత్రసాధకుడు మోకాళ్లు భూమిపై ఆన్చి నమస్కారపూర్వకముగ ఆ అగ్నిని తన ఎదుట కుండమునందు స్థాపించవలెను.*


*పిమ్మట ఏ కుండమునందు బీజరూపాగ్ని ధ్యానము చేయబడినదో దాని వాభిదేశమునందు కుశలచే పరిసంవహానము చేయవలెను. పరిధాన- సంభారము, శుద్ధి, అచమనము. నమస్కారము చేసి గర్భాగ్నిని పూజించి, ఆగర్భజాగ్నిరక్షణముకొరకై అస్త్రమంత్రముచే, వాగీశ్వరీదేవి పాణిపల్లవమునందు కంకణము (రక్షౌసూత్రము) కట్టి నట్లు భావన చేయవలెను. సద్యోజాతమంత్రముతో, గర్భాదానముకొరకై, అగ్నిపూజనము చేసి, హృదయ మంత్రముతో మూడు ఆహుతులివ్వవలెను. మూడవమాసమున జరుగు పుంసవనసంస్కారమును భావన చేసి, అది సిద్ధించుటకై వామదేవమంత్రముతో అగ్నిని పూజించి "శిరసే స్వాహా" అని పలుకుచు, మూడు హోమములుచేయవలెను. పిమ్మట ఆ అగ్నిపై జలబిందువును చల్లవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 257 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 75*

*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 2 🌻*


9-10. Oṃ hūṃ (salutations) to god of fire. (The deity) should be established with the principal mantra of the fire. The fire which has been invoked with the vedic hymns and made immortal by showing the dhenumudrā (formation with the fingers representing a cow), and protected by mantras of weapons should be covered by the armour. It should be worshipped by waving over the pit thrice and circumambulation.


11. Having meditated upon (the fire) as an element of Lord Śiva, (the worshipper) should contemplate it as lying dormant in the womb of Goddess of speech and cast by the Lord of speech.


12. The worshipper should have his knees resting on the ground and put the fire in his front with the hṛd mantra. Then the seeds of fire in the vicinity should be gathered at the centre.


13. The collection of clothes, purification and offering of water for rinsing the mouth (should be done) with the hṛd (mantra). Having worshipped the dormant fire [i.e., garbha-agni], it should be protected by (the recitation of) the mantra of the shaft.


14. The embryo fire should be contemplated as tied around the wrist of the goddess as a bracelet. The fire should be worshipped with the sadyojāta (mantra) for the impregnation.


15. Three oblations to the fire should then be offered with (hṛdayamantra. For the puṃsavana (rite) (for the determination of the sex of the foetus) (generally performed) in the third month it should be worshipped on the left side.


16. Three oblations containing drops of water should be offered with the head. The sīmantonnayana (rite) (parting of the hair on the head) (performed) in the sixth month should be done after having worshipped the fire.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 123 / DAILY WISDOM - 123 🌹*

*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 2. విశ్వవ్యాప్త దృష్టి / 2. Universality of Vision 🌻*


*జీవిత తత్వం సహజంగానే అపరిమిత విశ్వవ్యాప్త దృష్టితో పాటు విడదీయరానిదిగా ఉండాలి. అందువల్ల ఇది మానవ అవగాహన యొక్క అత్యంత ప్రాథమిక వాస్తవమైన బాహ్య ప్రకృతిని అధ్యయనం చేయడం నుండి ప్రారంభించాలి. అనేకానేక గణిత పద్ధతుల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించబడిన మన స్థూల విశ్వం చైతన్యం యొక్క భౌతిక వ్యక్త రూపం. ఈ భౌతిక విశ్వంలో విషయాలు అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. బహుశా అన్ని భౌతిక వస్తువులను ప్రభావితం చేసే గురుత్వాకర్షణ తప్ప.*


*ఈ వైవిధ్యభరితమైన విశ్వం యొక్క నిర్మాణంలోకి లోతుగా వెళ్లే భౌతిక శాస్త్రం మాత్రమే ఈ విషయాలను కేవలం భౌతిక దృష్టితో కాక వాటి స్వభావం మరియు పనితీరును నిర్ణయించే విద్యుదయస్కాంత క్షేత్రాలను కనుగొంటుంది. విశ్వం వెనుక పనిచేసే భౌతిక న్యాయాలు విశ్వం అంతా చెల్లాచెదురైన విషయాలుగా కాక అనేక విధాలుగా వ్యక్తమయ్యే ఒకటే విద్యుదయస్కాంత క్షేత్రశక్తి సూచిస్తాయి. శరీరాల ప్రత్యేక ఉనికి మసకబారుతుంది. అవి అంతర్లీన విశ్వ సామరస్యతలో ఒకదానితో ఒకటి కలిసిపోతాయి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 123 🌹*

*🍀 📖 The Philosophy of Life 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 2. Universality of Vision 🌻*


*A philosophy of life has naturally to be inseparable from universality of vision. It has therefore to start from a study of the most basic fact of human perception, viz. nature in all its externality. The astronomical universe, with its mathematical laws, may be regarded as the extreme content of the extroverted consciousness. Things hang loosely in this scheme with apparently no connection with one another, except perhaps the pull of gravitation and a distant influence characteristic of physical bodies.*


*It is physics which goes deeper into the structure and content of this diversified universe and discovers electromagnetic fields determining the nature and function of bodies and a closer relation among them than crass perception would permit. The physical laws working behind the universe seem to be uniform and the substance of things is seen ultimately to consist not of scattered particulars but a single force or energy permeating and constituting everything. The ‘locality’ of bodies fades and they coalesce and fuse into one another in an underlying universal continum.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 125 / Siva Sutras - 125 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-09. జ్ఞానం అన్నం - 2 / 2-09.  Jñānam annam  - 2🌻*


*🌴. ఆత్మశుద్ధి కొరకు చేసే యఙ్యములో, మెలకువ, స్వప్న మరియు గాఢనిద్ర స్థితులలో మనస్సు మరియు ఇంద్రియాల కార్యకలాపాల నుండి ఉద్భవించి అజ్ఞానం, భ్రాంతి మరియు బంధనాలను కలిగించే అపవిత్ర జ్ఞానాన్ని హవిస్సుగా సమర్పించాలి  🌴 *


*అందువల్ల ఇంద్రియ గ్రహణాల ద్వారా పొందిన జ్ఞానం మాయ లేదా భ్రాంతి ప్రభావం కారణంగా పరిమితం చేయబడి ఉంటుంది.  ఉన్నత జ్ఞానమే యోగికి ఆహారంగా మారుతుందని ఈ సూత్రం చెబుతోంది. ఈ సూత్రాన్ని ఈ విధంగా వివరించవచ్చు. ఆహారం స్వీకరించి లోపల ఎప్పుడూ కొనసాగుతున్న జీర్ణాశయంలోకి నైవేద్యంగా అందించబడుతుంది. అవసరమైనది సమీకరించ బడుతుంది (దీనిని జీర్ణం చేసినట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది మనస్సు యొక్క ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి సమీకరణ ఉపయోగించ బడుతుంది) మరియు అవసరం లేనిది విసర్జించ బడుతుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 125 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-09.  Jñānam annam  - 2 🌻*


*🌴. In the sacrifice of self-purification, impure knowledge which arises from the activities of the mind and senses in the wakeful, dream and deep sleep states and which causes ignorance, delusion and bondage should be offered as food in the sacrifice of self-purification  🌴*


*Hence knowledge acquired through sensory perceptions are said to be limited because of the influence of māyā or illusion. This sūtra says that such a type of knowledge becomes the food of a yogi. This sūtra can be explained this way. The food is consumed and offered as oblation into the ever persisting digestive fire within. What is needed is assimilated (it can also be interpreted as digested. But assimilation is used because this happens in the area of mind) and what is not needed is excreted.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comentários


bottom of page