top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 10, MAY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 10, MAY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 10, MAY 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 368 / Bhagavad-Gita - 368 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 30 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 215 / Agni Maha Purana - 215 🌹

🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 3 / Mode of installation of other Gods and Goddesses - 3 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 080 / DAILY WISDOM - 080 🌹

🌻 20. శరీరి-శరీరా భావము / 20. Shariri-Sharira Bhava🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 345 🌹

6) 🌹. శివ సూత్రములు - 82 / Siva Sutras - 82 🌹

🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 2 / 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 10, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌺*


*🍀. శ్రీ గణేశ హృదయం - 22 🍀*


*22. అసత్యసత్సామ్యతురీయనైజ-

-గనివృత్తిబ్రహ్మాణి విరచ్య ఖేలకః |*

*సదా స్వయం యోగమయేన భాతి

తమానతోఽహం త్వథ బ్రహ్మణస్పతిమ్*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి :జాగరూకత అవసరం - అంతరాత్మతో ప్రేమించే ప్రేమ స్వతః విశుద్దమైనదే. ప్రతిఫలాపేక్ష లేనిదే. కాని, మానవుల మధ్య పరస్పరాకర్షణ సందర్భములో అది సామాన్యంగా తన విశుద్దిని కోల్పోవడం జరుగుతూ వుంటుంది. కనుక, సాధకుడు దీని విషయంలో కడుజాగరూకుడై వుండడం అవసరం. ఏలనంటే, దీని మాటున ఇంద్రియలాలసలు చోటుచేసుకొనడం కద్దు.🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: కృష్ణ పంచమి 13:50:34 వరకు

తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: పూర్వాషాఢ 16:12:59

వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం: సద్య 18:17:20 వరకు

తదుపరి శుభ

కరణం: తైతిల 13:49:33 వరకు

వర్జ్యం: 02:44:48 - 04:14:36

మరియు 23:41:00 - 25:10:36

దుర్ముహూర్తం: 11:46:48 - 12:38:19

రాహు కాలం: 12:12:33 - 13:49:10

గుళిక కాలం: 10:35:57 - 12:12:33

యమ గండం: 07:22:43 - 08:59:20

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37

అమృత కాలం: 11:43:36 - 13:13:24

సూర్యోదయం: 05:46:07

సూర్యాస్తమయం: 18:39:00

చంద్రోదయం: 23:31:52

చంద్రాస్తమయం: 09:43:48

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,

సర్వ సౌఖ్యం 16:12:59 వరకు

తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 368 / Bhagavad-Gita - 368 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 30 🌴*


*30. ఆపి అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |*

*సాధురేవ స మన్తవ్య: సమ్యగ్వ్యవసితో హి స: ||*


🌷. తాత్పర్యం :

*మిక్కిలి హేయమైన కార్యము నినరించినప్పటికిని మనుజుడు భక్తియుతసేవలో నియుక్తుడైయున్నచో, తన సంకల్పమున స్థిరనిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగనే పరిగణింప వలెను.*


🌷. భాష్యము :

*ఈ శ్లోకమునందలి భావగర్భితమైన “సుదురాచార” అను పదమును మనము సరిగా అర్థము చేసికొనవలెను. జీవుడు బద్ధస్థితిలో నున్నప్పుడు బద్ధకర్మలు మరియు సహజస్థితికి అనుగుణమైన కర్మలనెడి రెండు విధములైన కర్మలను కలిగియుండును. దేహమును రక్షించుకొనుటకు లేదా సంఘము మరియు దేశమునకు సంబంధించిన నియమనిబంధనలను పాటించుటకు బద్ధజీవనస్థితి యందు నిక్కముగా వివిధ కర్మములు కలవు. అవియే బద్ధజీవన కర్మలనబడును. అవి భక్తులకు సైతము తప్పవు. కాని తన ఆధ్యాత్మికస్వభావమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన (భక్తియోగము) యందు నియుక్తుడైన జీవుడు ఆ బద్ధకర్మలతో పాటు ఆధ్యాత్మికములనబడు కర్మలను సైతము కలిగియుండును. అట్టి కర్మలు అతని సహజస్థితి యందు ఒనరింపబడుచు భక్తియోగకర్మలుగా పిలువబడును. కనుక బద్ధస్థితిలో నున్నప్పుడు భక్తికర్మలు మరియు దేహపరమైన బద్ధకర్మలు రెండును సమానాంతరములుగా సాగుచున్నను, కొన్నిమార్లు అవి ఒకదానికొకటి విరుద్ధములుగా తయారగును. ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంతవరకు అత్యంత జాగరూకుడై తన భక్తికి మరియు సహజస్థితికి ఆటంకము కలిగించు దేనిని చేయకుండును.*


*కృష్ణభక్తిభావనా అనుభవపు పురోగతి పైననే తన కర్మల పూర్ణత్వము ఆధారపడియుండునని అతడు ఎరిగియుండును. అయినను కొన్నిమార్లు అట్టివాడు సంఘదృష్ట్యా లేదా చట్టము దృష్ట్యా అత్యంత హేయముగా భావింపబడు కార్యమును ఒనరించినట్లుగా కనిపించవచ్చును. కాని అట్టి తాత్కాలికమగుపతనము అతనిని ఏ విధముగను అనర్హుని చేయజాలదు. అత్యంత శ్రద్ధతో భక్తియుక్తసేవ యందు నిలిచియున్నవాడు ఒకవేళ పతనము నొందినను హృదయస్థుడైన పరమాత్ముడు అతనిని పవిత్రుని చేసి ఆ పాపమును క్షమించునని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. అనగా భౌతికసంపర్కము అత్యంత బలమైనదగుటచే భగవత్సేవ యందు పూర్ణముగా నియుక్తుడైన యోగి సైతము కొన్నిమార్లు మాయకు గురియగును. కాని కృష్ణభక్తి యనునది మరింత బలమైనదగుటచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుక భక్తియోగము సదా జయమునే కలిగించును.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 368 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 30 🌴*


*30. api cet su-durācāro bhajate mām ananya-bhāk*

*sādhur eva sa mantavyaḥ samyag vyavasito hi saḥ*


🌷 Translation :

*Even if one commits the most abominable action, if he is engaged in devotional service he is to be considered saintly because he is properly situated in his determination.*


🌹 Purport :

*The word su-durācāraḥ used in this verse is very significant, and we should understand it properly. When a living entity is conditioned, he has two kinds of activities: one is conditional, and the other is constitutional. As for protecting the body or abiding by the rules of society and state, certainly there are different activities, even for the devotees, in connection with the conditional life, and such activities are called conditional. Besides these, the living entity who is fully conscious of his spiritual nature and is engaged in Kṛṣṇa consciousness, or the devotional service of the Lord, has activities which are called transcendental. Such activities are performed in his constitutional position, and they are technically called devotional service.*


*Now, in the conditioned state, sometimes devotional service and the conditional service in relation to the body will parallel one another. But then again, sometimes these activities become opposed to one another. As far as possible, a devotee is very cautious so that he does not do anything that could disrupt his wholesome condition. He knows that perfection in his activities depends on his progressive realization of Kṛṣṇa consciousness. Sometimes, however, it may be seen that a person in Kṛṣṇa consciousness commits some act which may be taken as most abominable socially or politically. But such a temporary falldown does not disqualify him.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 215 / Agni Maha Purana - 215 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 63*


*🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 3 🌻*


*ఇపుడు నేను గ్రంథప్రతిష్ఠను దానిలేఖన విధానమును గూర్చి చెప్పెదను. ఆచార్యుడు స్వస్తికమండలముపై శరయంత్రా సనము మీద నున్న లేఖ్యమును (వ్రాయదగిన దానిని) లిఖిత పుస్తకమును. విద్యను, శ్రీహరిని పూజించవలెను. పిదప యజమానుడు గురువును, విద్యను, శ్రీ మహావిష్ణువును, లేఖకుని పూజించవలెను. పిమ్మట పూర్వాభిముఖుడై పద్మినిని ధ్యానించి వెండి సిరాబుడ్డిలో నున్న సిరాలో ముంచి బంగారు కలముతో ఐదు శ్లోకములు దేవనాగరీ లిపిలో వ్రాయవలెను.*


*పిదప బ్రాహ్మణులకు యథాశక్తి భోజనము పెట్టి, దక్షిణ ఇవ్వవలెను. ఆచార్య-విద్యా-శ్రీ మహావిష్ణువులను వూజించి లేఖకుడు పురాణాదులను వ్రాయుట ప్రారంభింపవలెను. వెనుకటివలె మండలాదులపై ఈశాన్యము నందున్న అద్దముమీద పుస్తకము నుంచి, మొదట చెప్పినట్లుగనే కలశములచే తడపవలెను . పిదవ యజమానుడు నేత్రములను తెరచి, ఈ పుస్తకమును శయ్యపై ఉంచవలెను. పిమ్మట దానిపై పురుషసూక్తవేదాదిన్యాసము చేయవలెను. ప్రాణప్రతిష్ఠా పూజా-చరుహోమములు చేసి, పూజించి, ఆచార్యుని దక్షిణాదులతో సత్కరించి బ్రహ్మణ భోజనము ఏర్పరుపవలెను. అంతమున ఆ పుస్తకమును గృహమునందు గాని, దేవాలయమునంరు గాని స్థాపించి పూజించవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 215 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 63*

*🌻Mode of installation of other Gods and Goddesses - 3 🌻*


10. Having worshipped the manuscript and the written book on a seat made of kuśa grass placed on a svastika figure, the preceptor should worship the spell and Lord Hari (Viṣṇu).


11-12. The yajamāna (the person at whose instance a rite is performed) should face the east and contemplate the spiritual guide, the spell, lord Hari, the copyist and (the goddess) Padminī after having written five verses on a silver plate with golden pen and devanāgarī letters. The brahmins should be fed according to one’s capacity and fees should be paid as much as one could give.


13. After having worshipped the preceptor, the spell and Lord Hari, one should write the purāṇas etc. as before in a figure in an auspicious seat in the north-east.


14. Having seen the book [i.e., pustaka] in the mirror in the pitcher it should be consecrated as (described) earlier. After opening up the eyes one should place it in the bed.


15. The puruṣasūkta[1] and the Vedas etc. should be (mentally) located in the book. After having infused life to it, it should be worshipped and the porridge offered.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 80 / DAILY WISDOM - 80 🌹*

*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 20. శరీరి-శరీరా భావము 🌻*


*సాధారణ అవగాహన ప్రకారం,వస్తువు స్థలం మరియు సమయం ద్వారా విషయం నుండి వేరు చేయబడుతుంది. తద్వారా గ్రహించే వస్తువు మరియు గ్రహించిన విషయానికి మధ్య ఎటువంటి భౌతిక సంబంధం ఉండదు. కానీ విశ్వ వస్తువు మరియు విశ్వ విషయాల మధ్య జీవ అనుసంధానం ఉంది. ఈ సంబంధమే కొన్నిసార్లు శరీరం మరియు ఆత్మకి మధ్య ఉన్న సంబంధంగా వర్ణించబడింది. ఆత్మ మరియు శరీరానికి మధ్య సంబంధం ఉందని మనకు తెలుసు. ఆత్మ మరియు శరీరం మధ్య ఉన్న ఈ సంబంధం వ్యక్తికి, బాహ్య వస్తువుకి మధ్య ఉన్న సంబంధానికి భిన్నంగా ఉంటుంది. ఆత్మ మరియు శరీరం ఒకదానికొకటి వేరు చేయలేవు. అవి విషయంగా ఒకటి.*


*ఈ సంబంధాన్ని శరీరి-శరీర-భవ అని పిలుస్తారు, చైతన్యం మరియు దాని స్వరూపం మధ్య సంబంధం. ఈ విధంగా, విశ్వం యొక్క అవగాహన, భగవంతుడు అనే విశ్వ చైతన్యంతో, ఆత్మ మరియు శరీరం యొక్క సంబంధం వలె విడదీయరాని సంబంధం అని మనం చెప్పగలం. మనం మన శరీరాల గురించి తెలుసుకున్నప్పుడు, మనం స్థలం మరియు సమయంలో ఉన్న వస్తువు గురించి మాత్రమే తెలుసుకోవడం లేదు. ఈ శరీరం కూడా ఒక వస్తువే అని మనం చెప్పగలం. ఎందుకంటే ఇది గ్రహించగలదు, చూడగలదు మరియు ప్రపంచంలోని ఏ వస్తువు యొక్క అన్ని పాత్రలను కలిగి ఉంటుంది; కానీ, అదే సమయంలో, ఇది ప్రాణాధారంగా మరియు శారీరకంగా మనకు అంటుకునే ఉంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 80 🌹*

*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 20. Shariri-Sharira Bhava 🌻*


*The object, in an ordinary perception, is segregated from the subject by the differentiating medium of space and of time, so that there is no vital connection between the object that is perceived and the subject that perceives. But there is a living connectedness between the Cosmic Object and the Cosmic Subject. This connection is sometimes described as one of body and soul. We know that there is a connection between the soul and the body. This relation between the soul and the body is different from the relation between an individual subject encountering an outside object. The soul and the body cannot be separated from each other. They are organically one.*


*This relation is called shariri-sharira-bhava, the relation between consciousness and its embodiment. Thus, we can say that the Cosmic Awareness of the universe, in the case of God-Consciousness, is one of inseparable relation, like the relation of the soul and the body. When we are aware of our bodies, we are not only becoming aware of an object situated in space and time. We can say that this body is an object because it can be sensed, it can be seen, and it has all the characters of any object in the world; but, at the same time, it is an object which clings to us vitally and organically.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 345 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. మృదువుగా, నెమ్మదిగా వున్న వృద్ధుడు అరుదుగా కనిపిస్తాడు. అట్లా సౌమ్యంగా వున్నాడంటే అతను నిజంగా ఆహ్లాదకరంగా జీవించాడని అర్థం. మేలుకున్న వ్యక్తి, చైతన్యవంతుడయిన వ్యక్తి మాత్రమే వృద్ధాప్యంలో జీవితాన్ని దాటి అనంతాన్ని ఆనందగా అందుకోడానికి అతను సంసిద్ధుడయి వుంటాడు. 🍀*


*వృద్ధులు కఠినంగా వుండడమన్నది యాదృచ్ఛికం కాదు. వృద్ధులు మీ తల్లిదండ్రులయినా వాళ్ళతో జీవించడం చాలా కష్టం. కారణం వాళ్ళ జీవితమంతా నిష్పలంలో నీరు గారింది. వాళ్ళు అది అర్థం లేనిదిగా భావించారు. వాళ్ళు ప్రతిదాని మీదా వ్యతిరేకతని ప్రదర్శిస్తారు. పిల్లలు సంతోషంగా వుండడాన్ని భరించలేరు. ఆనందాన్ని, ఆటను, పాటను, ఉల్లాసాన్ని తట్టుకోలేరు. జీవితమని దేన్నీ అంటామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా వుంటారు. మృదువుగా, నెమ్మదిగా వున్న వృద్ధుడు అరుదుగా కనిపిస్తాడు. అట్లా సౌమ్యంగా వున్నాడంటే అతను నిజంగా ఆహ్లాదకరంగా జీవించాడని అర్థం.*


*అతను నిజంగా ఎదిగాడు అట్లా అందమమయిన అద్భుతమయిన జీవితం జీవించిన వృద్ధుల ముందు యవ్వనం బలాదూరు. అతనిలో పరిణితి వుంటుంది. పక్వత వుంటుంది. అతను చాలా చూశాడు. చాలా కాలం జీవించాడు. అతను అస్తిత్వం పట్ల కృతజ్ఞతతో వుంటాడు. అట్లాంటి వృద్ధుడు తటస్థపడడం కష్టం. అతను బుద్ధుడు, కృష్ణుడు. కేవలం మేలుకున్న వ్యక్తి, చైతన్యవంతుడయిన వ్యక్తి మాత్రమే వృద్ధాప్యంలో చిరునవ్వుతో వుంటాడు. మృదువుగా వుంటాడు. జీవితాన్ని దాటి అనంతాన్ని ఆనందగా అందుకోడానికి అతను సంసిద్ధుడయి వుంటాడు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 082 / Siva Sutras - 082 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 2 🌻*

*🌴. మంత్రం యొక్క రహస్యం, జ్ఞానాన్ని తన చలన శక్తిగా కలిగి ఉన్న దాని శరీరమే. స్వచ్ఛమైన జ్ఞానంతో తన చిత్తాన్ని, మానసిక శరీరాన్ని ప్రకాశింపజేసే యోగి అదే శక్తిని పెంపొందించుకుని మంత్రశక్తిపై ఆధిపత్యం సాధిస్తాడు. 🌴*


*గత కొన్ని సూత్రాలలో, మంత్రం అనే పదం తరచుగా ఉపయోగించబడింది. ఇంతకు ముందు చర్చించినట్లుగా, ఇక్కడ మంత్రం అంటే 'నేను దైవమే అయి ఉన్నాను' అనే సూత్రం. 'నేను దైవమే అయి ఉన్నాను' అని ధృవీకరించడం అన్ని మంత్రాల సారాంశం. ఒక సాధకుడు ఈ ధృవీకరణ చేయడంలో విఫలమైతే, అతడు ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేడు. సంబంధిత దేవతతో దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మాత్రమే వర్ణమాలలతో కూడిన మంత్రాలు తయారు చేయబడతాయని చెప్పబడింది. ఇక్కడ మంత్రం కేవలం స్థూల రూపంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. సంబంధిత దేవతతో ఏకత్వం అనేది ఆలోచన ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది. సాక్షాత్కారం సూక్ష్మ స్థాయిలో మాత్రమే జరుగుతుంది కానీ స్థూల స్థాయిలో కాదు. సూక్ష్మ స్థాయి మనస్సు యొక్క కేంద్రం. స్థూల స్థాయి ఇంద్రియాల కేంద్రం.


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 082 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 2 🌻*

*🌴. The secret of the mantra is its body which has knowledge as its moving force. A yogi who illuminates his chitta and mental body with pure knowledge develops a similar power and gains lordship over the mantra shaktis. 🌴*


*In the last few sūtra-s, word mantra has been frequently used. As discussed earlier, mantra here means principle of “I am That”. Affirming “I am That” is the essence of all the mantra-s. If an aspirant fails to make this affirmation, he cannot make significant spiritual progress. It is said that mantra-s consisting of alphabets are made only to establish a firm link with the concerned deity. Here mantra merely helps to concentrate on a gross form. Oneness with the concerned deity can happen only through thought process. Realization can happen only at the subtle level and not at the gross level. Subtle level is the domain of mind and gross level is the domain of senses.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page