top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 11, MARCH 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 11, MARCH 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 11, MARCH 2023 SATURDAY, శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 338 / Bhagavad-Gita -338 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 28 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 185 / Agni Maha Purana - 185 🌹 🌻. దశదిక్పతియాగ ము - 5 / Five divisions of installation - 5 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 050 / DAILY WISDOM - 050 🌹 🌻 19. నా ఇష్టానుసారం నేను చేయి ఎత్తగలను / 19. I can Lift my Hand at My Will 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 315 🌹

6) 🌹. శివ సూత్రములు - 52 / Siva Sutras - 52 🌹

🌻 17. వితర్క ఆత్మజ్ఞానం - 1 / 17. Vitarka ātmajñānam - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 11, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌻*


*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 10 🍀*

17. నమో మహాభైరవాయ శ్రీరూపాయ నమో నమః |

ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః

18. నమః ప్రసన్నరూపాయ హ్యాదిదేవాయ తే నమః |

నమస్తే మంత్రరూపాయ నమస్తే రత్నరూపిణే


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : బాహ్యపరిస్థితులు : ధ్యానసాధన

విజనస్థలం, ఏకాంతవాసం, నిశ్చలాసనం, ఇవి ధ్యానం చేసేటప్పుడు సాధకునికి ప్రారంభ దశలో సహాయకములే. కానీ, వీటికి అతడు బద్ధుడై పోరాదు. ధ్యానం అలవాటైన పిమ్మట, అన్ని పరిస్థితులలోను, అనగా పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఒంటరిగా వున్నా, పది మందిలో ఉన్నా, సద్దు మణిగి ఉన్నా, రేగినా అతడు ధ్యానం చేయగలిగి వుండాలి. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం

తిథి: కృష్ణ చవితి 22:07:01 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: చిత్ర 07:11:30 వరకు

తదుపరి స్వాతి

యోగం: ధృవ 19:51:41 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: బవ 09:56:06 వరకు

వర్జ్యం: 12:58:26 - 14:37:42

దుర్ముహూర్తం: 08:03:12 - 08:51:02

రాహు కాలం: 09:26:54 - 10:56:35

గుళిక కాలం: 06:27:32 - 07:57:13

యమ గండం: 13:55:56 - 15:25:37

అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49

అమృత కాలం: 00:27:32 - 02:08:24

మరియు 22:54:02 - 24:33:18

సూర్యోదయం: 06:27:32

సూర్యాస్తమయం: 18:24:59

చంద్రోదయం: 21:43:40

చంద్రాస్తమయం: 08:44:54

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: కాల యోగం - అవమానం

07:11:30 వరకు తదుపరి సిద్ది యోగం

- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 338 / Bhagavad-Gita - 338 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 28 🌴*


*28. వేదేషు యజ్ఞేషు తప:సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |*

*అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరంస్థానముపైతి చాద్యమ్ ||*


🌷. తాత్పర్యం :

*వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్వికకర్మలను మరియు కామ్యకర్మలను ఒనరించుట వలన కలుగు ఫలితములు భక్తిమార్గము చేపట్టి మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుతసేవ నొనరించుట ద్వారా అతడు వీటినన్నింటిని పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు.*


🌷. భాష్యము :

ఈ శ్లోకము కృష్ణభక్తిరసభావనపు మరియు భక్తియుతసేవను గూర్చి ప్రత్యేకముగా చర్చించిన సప్తమ, అష్టమాధ్యాయముల సారాంశమై యున్నది.


ప్రతియొక్కరు ఆధ్యాత్మికగురువు నిర్దేశమునందు వేదాధ్యనము కావించును ఆయన సన్నిధిలో పలువిధములైన తపస్సులను నిర్వహింపవలసియున్నది. బ్రహ్మచారియైనవాడు గుర్వాశ్రయమున సేవకునిగా జీవించును, ఇంటింట భిక్షను స్వీకరించి గురువునకు అర్పింపవలెను.


గురువుగారి ఆజ్ఞపైననే ఆహారమును స్వీకరించుచు, ఒకవేళ ఆయన భోజమునకు పిలువకున్నచో ఉపవసింపవలెను. ఇవియే బ్రహ్మచర్యమును ననుసరించువానికి విధింపబడిన కొన్ని వేదనియమములు.


విద్యార్థి ఆ విధముగా గురువు చెంత ఐదు నుండు ఇరువది సంవత్సరముల కాలము వేదాధ్యయనము చేసిన పిమ్మట సమగ్రలక్షణములు కలిగిన మనుజునిగా రూపొందును.


మొదటి ఆరు అధ్యాయములు మరియు చివరి ఆరు అధ్యాయములు ఆచ్చాదానలుగా కలిగిన ఈ నడుమ ఆరు అధ్యాయములు శ్రీకృష్ణభగవానునిచే ప్రత్యేకముగా రక్షింపబడుచున్నవి.


భక్తుల సంగమములో భగవద్గీతను ( ముఖ్యముగా ఈ నడుమ ఆరు అధ్యాయములను) అవగాహన చేసికొనగలిగిన భాగ్యము కలిగినచో మనుజుని జీవితము తపస్సులను, యజ్ఞములను, దానములను, ఊహాకల్పనలను అతిశయించి సఫలమగును. ఏలయన వాని ద్వారా కలుగు ఫలముల నన్నింటిని మనుజుడు కేవలము కృష్ణభక్తిరసభావన యందు నిలిచి సులభముగా పొందగలడు.


శ్రీమద్భగవద్గీత యందలి “భాగవత్ప్రాప్తి” అను అష్టమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 338 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 28 🌴*


*28 . vedeṣu yajñeṣu tapaḥsu caiva dāneṣu yat puṇya-phalaṁ pradiṣṭam*

*atyeti tat sarvam idaṁ viditvā yogī paraṁ sthānam upaiti cādyam*


🌷 Translation :

*A person who accepts the path of devotional service is not bereft of the results derived from studying the Vedas, performing sacrifices, undergoing austerities, giving charity or pursuing philosophical and fruitive activities. Simply by performing devotional service, he attains all these, and at the end he reaches the supreme eternal abode.*


🌹 Purport :

This verse is the summation of the Seventh and Eighth chapters, which particularly deal with Kṛṣṇa consciousness and devotional service. One has to study the Vedas under the guidance of the spiritual master and undergo many austerities and penances while living under his care.


A brahmacārī has to live in the home of the spiritual master just like a servant, and he must beg alms from door to door and bring them to the spiritual master. He takes food only under the master’s order, and if the master neglects to call the student for food that day, the student fasts. These are some of the Vedic principles for observing brahmacarya.


Then after retiring from household life, upon accepting the order of vānaprastha, he undergoes severe penances – living in forests, dressing with tree bark, not shaving, etc. By carrying out the orders of brahmacarya, householder life, vānaprastha and finally sannyāsa, one becomes elevated to the perfectional stage of life.


Some are then elevated to the heavenly kingdoms, and when they become even more advanced they are liberated in the spiritual sky, either in the impersonal brahma-jyotir or in the Vaikuṇṭha planets or Kṛṣṇaloka. This is the path outlined by Vedic literatures.


Thus end the Bhaktivedanta Purports to the Eighth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Attaining the Supreme.


Continues.....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 185 / Agni Maha Purana - 185 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 56*


*🌻. దశదిక్పతియాగ ము - 5 🌻*


*"వృషభారూఢుడవును, మహాబలశాలివి, శూలధారివి అగు ఈశానా! నీవు వచ్చి యజ్ఞమండపముయొక్క ఈశాన్యదిక్కును రక్షింపుము; నీకు నమస్కారము" అని ప్రార్థించి ఈశానుని ఆవాహనముచేసి "ఈశానమస్య" ఇత్యాది మంత్రము చేతగాని, "ఈశానాయ నమః" అను మంత్రముచేతగాని, పూజింపవలెను. "హస్తాగ్రములందు స్రుక్‌స్రువములను ధరించినవాడువును, హంసారూపుఢుడవును, జన్మరహితుడవును అగు ఓ బ్రహ్మదేవా! ఊర్ధ్వదిక్కను రక్షించుము: నీకు నమస్కారము" అని ప్రార్థించి, బ్రహ్మదేవుని ఆవాహనముచేసి,*


*"హిరణ్యగర్భః" ఇత్యాది మంత్రము చేతగాని "నమస్తే బ్రహ్మణ" ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను." "తాబేలు వీపుపై కూర్చున్నవాడా! నాగ గణముల అధిపతీ! చక్రధారీ! అనంతా! రమ్ము; అధర దిశను రక్షింపుము; అనంతేశ్వరా! నీకు నమస్కారము" అని ప్రార్థించుచు అనంతుని ఆవాహనముచేసి "నమో7స్తు సర్పేభ్యః" అను మంత్రముచేగాని, "అనన్తాయనమః" అను మంత్రముచేతగాని పూజింపవలెను.*


*అగ్నిమాహాపురాణమునందు దశదిక్పతియాగ మను ఏబదియారవ అధ్యాయము సమాప్తము.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 185 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 56*

*🌻Five divisions of installation - 5 🌻*


28-30. O Īsāna! (you) come along! possesser of strength, riding the bull. You guard the north-eastern direction of the ritual pavilion. Salutations to you. He should be worshipped with (the sacred syllable). īśānamasya[6] or ‘Salutations to Īsāna’. O Brahman! (you) come. Seated on a swan! Carrying the sacrificial vessel and ladle! You defend the direction above the sacrificial place, O unborn! Salutations to you. (One) should worship with (the sacred syllable) hiraṇyagarbha or ‘salutations to Brahman’.


31. O Ananta! you come. Endowed with the disc! Seated on the tortoise! Lord of the gaṇas. You protect the bottom (of the sacrificial place). O Lord Ananta! Salutations to you. One should worship with (the sacred syllable) ‘Salutations to serpent’ or ‘Salutations to Ananta’.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 50 / DAILY WISDOM - 50 🌹*

*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 19. నా ఇష్టానుసారం నేను చేయి ఎత్తగలను 🌻*


*మనం ఎంత ఎక్కువ వాస్తవికతను కలిగి ఉంటామో, మన శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. అసలు స్వాధీనం అంటే ఏమిటి? ఒక వస్తువును కలిగి ఉండటం, దాని కోసం ఏదైనా కలిగి ఉండటం అంటే, దానితో విడదీయరాని పద్ధతిలో నిరంతరం అనుసంధానించబడి ఉండటం. మన శరీరంలోని అవయవాలపై మనకు అధీనం ఉంది. అధీనం అంటే ఏమిటో మరియు అధీనం అంటే ఏది కాదో నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను. నేను నా ఇష్టానుసారం నా చేతిని ఎత్తగలను; దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు.*


*ఏనుగు కాలు చాలా బరువైనప్పటికీ, ఏనుగు తన కాలును ఎత్తగలదు. వంద మంది కూడా ఏనుగును ఎత్తలేనప్పటికీ ఏనుగు తన శరీరమంతా ఎత్తగలదు. బహుశా, నేను మీ శరీరాన్ని ఎత్తలేకపోవచ్చు, కానీ మీరు మీ శరీరాన్ని ఎత్తగలరు. మీరు నా శరీరాన్ని ఎత్తలేకపోవచ్చు, కానీ నేను నా శరీరాన్ని ఎత్తగలను. ఈ మిస్టరీ ఏమిటి? నా శరీరాన్ని పైకి లేపి నడవగలిగే ఈ శక్తి ఎక్కడ నుండి వస్తుంది? కారణం ఏమిటంటే, నా చైతన్యం నా వాస్తవికత అయిన ఈ శరీరంతో ఒకటి అయి ఉంది; అది బయట లేదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 50 🌹*

*🍀 📖 Philosophy of Yoga 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 19. I can Lift my Hand at My Will 🌻*


*The more do we possess reality, the more is the power that we wield. And what is possession? To possess an object, to possess anything for the matter of that, is to be invariably connected with it, in an inseparable manner. We have a power over the limbs of our body. I am giving one example of what power means and what power does not mean. I can lift my hand at my will; there is no difficulty about it. Even if the leg of the elephant is very heavy, the elephant can lift its leg.*


*The elephant can lift its whole body, though even a hundred people cannot lift an elephant. Perhaps, I may not be able to lift your body, but you can lift your body. You may not be able to lift my body, but I can lift my body. What is this mystery? Wherefrom comes this strength by which I can lift my body and walk? The reason is that my consciousness is one with my reality, which is this body; it is not outside.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 315 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. తర్కం మనసు చేసే వ్యాయామం. సిద్ధాంతకారులు పరిణిత మనస్కులు కారు. మహాత్ములు సిద్ధాంతకారులు కారు. నిజమైన గురువులు. గొప్ప ప్రేమికులు. ప్రేమ అన్నది ప్రార్థన. అస్తిత్వంతో చేసే సంభాషణ. 🍀*


*మతం సిద్ధాంతం కాదు. సిద్ధాంతం కేవలం తార్కికం. తార్కికంతో మతానికి సంబంధం లేదు. తర్కం మనసు చేసే వ్యాయామం. వెంట్రుకను చీల్చటం. మాటల్తో కోటలు కడుతుంది. ఇసుక మేడలు కడుతుంది. వాటి వల్ల ఉపయోగం లేదు. అది పసితనం. మత సిద్ధాంతకారులు పరిణిత మనస్కులు కారు. మహాత్ములు మత సిద్ధాంతకారులు కారు. నిజమైన గురువులు. సిద్ధాంతకారులు కారు. గొప్ప ప్రేమికులు. వారు సమస్త అస్తిత్వాన్ని ప్రేమిస్తారు.*


*ప్రేమ అన్నది ప్రార్థన. అస్తిత్వంతో చేసే సంభాషణ. విసుగు చెందే జనాలు తార్కిక ప్రపంచంలో జీవించే వాళ్ళు. తర్కం విసుగు పుట్టిస్తుంది. ప్రేమ విసుగు పుట్టించదు. ప్రేమ నిరంతరం నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నీ కవిత్వాన్ని, నాట్యాన్ని, నీ ఉత్సవాన్ని సజీవంగా నిలుపుతుంది. లేని పక్షంలో అందమయి నదంతా అంధకార బంధురమవుతుంది తర్కాన్ని వదిలించుకో. ప్రేమను దగ్గరికి తీసుకో.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 052 / Siva Sutras - 052 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 17. వితర్క ఆత్మజ్ఞానం - 1 🌻*

*🌴. అత్యున్నత స్థాయి స్పృహ లేదా సరైన విచక్షణ అనేది స్వీయ జ్ఞానం. 🌴*


*వితర్క అంటే స్థిరమైన చైతన్యం (వితర్క అంటే తర్కించడం, చర్చించడం, పరిశీలించడం). స్థిరమైన చైతన్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. స్థిరమైన, స్వచ్ఛమైన లేదా అత్యున్నత స్థాయి చైతన్యంగా పిలువబడే స్వచ్ఛమైన అవగాహనే సత్-చిత్-ఆనందం (ఉనికి, చైతన్యం మరియు ఆనందం) లేదా శాశ్వతమైన స్వయం. ఇది శివుడిని సూచిస్తుంది. ఈ అవగాహన మానవజాతికి యొక్క స్వాభావికంగా ఉన్నది. చైతన్యాన్ని శుద్ధి చేయడం ద్వారా అహంకారం నాశనం అవుతుంది మరియు అంతరంలో ఉన్న పరమాత్మను గ్రహించగలరు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 052 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 17. Vitarka ātmajñānam - 1 🌻*

*🌴. Highest level of consciousness or Right discernment is the knowledge of the self. 🌴*


*Vitarka means unfaltering consciousness (vitarka literally means reasoning, deliberation, consideration). Unfaltering consciousness is to be properly understood. The pure awareness also known as unfaltering or pure consciousness or the highest level of consciousness is sat-cit- ānanda(existence, consciousness and bliss) or the eternal Self and in the present context this refers to Śiva. This awareness is inherent quality of mankind. Destroying egoistic self and realising Supreme Self within, is the result of purifying one’s consciousness.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page