🍀🌹 12, APRIL 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 12, APRIL 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 354 / Bhagavad-Gita - 354 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 16 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 200 / Agni Maha Purana - 201 🌹
🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 1 / Mode of installation of the image of Vāsudeva - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 066 / DAILY WISDOM - 066 🌹
🌻 6. మనము జన్మతో పాటు దుఃఖాన్ని కూడా తెచ్చుకుంటాము / 6. We Bring Sorrow with Us Even When our Birth Takes Place 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 331 🌹
6) 🌹. శివ సూత్రములు - 68 / Siva Sutras - 65 🌹
🌻. 21. శుద్ధవిద్యోద్యా చ్చక్రే ఈశత్వ-సిద్ధిః - 3 / 21. śuddhavidyodyāccareśatva-siddhiḥ - 3 🌻
*🌹. ఎవరూ ఏమీ చేయరు మరియు ఎవరూ ఏమీ చేయలేరు. అంతా జరుగుతోంది. / Nobody does anything and Nobody can do Anything. Everything is Happening. 🌹*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 12, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 18 🍀*
*18. వరైః సమస్థాపితమేవ సర్వం విశ్వం తథా బ్రహ్మవిహారిణా చ |*
*అతః పరం విప్రముఖా వదంతి వరప్రదం తం వరదం నతోఽస్మి*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : చిత్తస్థాయి - సత్వర సాధనకు ముఖ్యంగా చిత్తస్థాయి కావాలి. ఫలితాల కొరకు వేగిపడడం, మితిమీరి శ్రమ చేయడం తగదు. అనుభూతులు పొందగల యోగ్యతను పెంపొందించు కోడానికి చిత్తానికి వ్యవధి యివ్వాలి. లోపలి నుండి కవిత్వం, సంగీతం పుట్టుకు వచ్చినంత సహజంగా ఆ అనుభూతుల నతడు పొందవలసి వుంటుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: కృష్ణ సప్తమి 27:45:48
వరకు తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: మూల 11:59:09 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: పరిఘ 15:20:04 వరకు
తదుపరి శివ
కరణం: విష్టి 16:41:58 వరకు
వర్జ్యం: 21:05:00 - 22:36:00
దుర్ముహూర్తం: 11:52:06 - 12:42:01
రాహు కాలం: 12:17:03 - 13:50:39
గుళిక కాలం: 10:43:28 - 12:17:03
యమ గండం: 07:36:17 - 09:09:52
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41
అమృత కాలం: 05:51:00 - 07:23:00
మరియు 30:11:00 - 31:42:00
సూర్యోదయం: 06:02:41
సూర్యాస్తమయం: 18:31:25
చంద్రోదయం: 00:38:40
చంద్రాస్తమయం: 10:47:18
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధ్వజ యోగం - కార్య
సిధ్ధి 11:59:09 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 354 / Bhagavad-Gita - 354 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 16 🌴*
*16. అహం క్రతురహం యజ్ఞ: స్వధాహమహమౌష ధమ్ |*
*మన్త్రోహమహవేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ||*
🌷. తాత్పర్యం :
*నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే.*
🌷. భాష్యము :
*“జ్యోతిష్టోమము” అను వైదికయజ్ఞము శ్రీకృష్ణుడే. అదే విధముగా స్మృతి యందు తెలుపబడిన “మహాయజ్ఞము” కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు ఆహుతి లేక పితృలోకప్రీత్యర్థమై ఒనరించబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులు నెయ్యిరూపున గల ఒకానొక ఔషధముగా పరిగణింపబడును. ఇట్టి కార్యమునకు సంబంధించిన మంత్రములు సైతము శ్రీకృష్ణుడే. యజ్ఞములందు అర్పింపబడు పాలకు సంబంధించిన పదార్థములన్నియును శ్రీకృష్ణుడే.*
*ప్రకృతి మూలకములలో ఒకటియైనందున అగ్నియు శ్రీకృష్ణుడే. కాని అది ప్రకృతికి సంబంధించినది కావున భగవానుని నుండి విడివడియున్నదిగా తెలియబడును. వేరు మాటలలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగము నందు ఉపదేశింపబడిన యజ్ఞములన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు నియుక్తులైనవారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టివారే యగుచున్నారు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 354 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 16 🌴*
*16. ahaṁ kratur ahaṁ yajñaḥ svadhāham aham auṣadham*
*mantro ’ham aham evājyam aham agnir ahaṁ hutam*
🌷 Translation :
*But it is I who am the ritual, I the sacrifice, the offering to the ancestors, the healing herb, the transcendental chant. I am the butter and the fire and the offering.*
🌹 Purport :
*The Vedic sacrifice known as Jyotiṣṭoma is also Kṛṣṇa, and He is also the Mahā-yajña mentioned in the smṛti. The oblations offered to the Pitṛloka or the sacrifice performed to please the Pitṛloka, considered as a kind of drug in the form of clarified butter, is also Kṛṣṇa. The mantras chanted in this connection are also Kṛṣṇa. And many other commodities made with milk products for offering in the sacrifices are also Kṛṣṇa.*
*The fire is also Kṛṣṇa because fire is one of the five material elements and is therefore claimed as the separated energy of Kṛṣṇa. In other words, the Vedic sacrifices recommended in the karma-kāṇḍa division of the Vedas are in total also Kṛṣṇa. Or, in other words, those who are engaged in rendering devotional service unto Kṛṣṇa are to be understood to have performed all the sacrifices recommended in the Vedas.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 201 / Agni Maha Purana - 201 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 60*
*🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 1 🌻*
*హయగ్రీవుడు చెప్పెను - బ్రహ్మదేవా! పిండికాస్థాపనము కొరకై, విద్వాంసుడు దేవాలయములోని గర్భగృహమును ఏడు భాగములుగా విభజింపవలెను. ప్రతిమను బ్రహ్మభాగము నందు స్థాపింపవలెను. దేవ-మనుష్య-పిశాచ భాగములయందెన్నుడు స్థాపింపగూడదు. బ్రహ్మభాగములో కొంతభాగము విడచి, దేవభాగమనుష్య భాగములలో కొన్ని భాగములు గ్రహించి, ఆ భూమిపై ప్రయత్న పూర్వకముగ పిండికను స్థాపింపవలెను. నపుంసక శిలపై రత్నన్యాసము చేయవలెను. నృసింహమంత్రముతో హోమము చేసి ఆ మంత్రముతోనే రత్నన్యాసము కూడ చేయవలెను. వ్రీహులు, రత్నములు లోహము మొదలగు ధాతువులు, చందనము మొదలగు పదార్థములను పూర్వాది దిశలందును. మద్యభాగమునందును ఉంచిన కుండములలో, తన అభిరుచి ననుసరించి ఉంచవలెను.*
*పిమ్మట ఇంద్రాది మంత్రములతో పూర్వాది దిశలలో నున్న గుంటలను గుగ్గులముచే కప్పి, రత్నన్యాస విధి పూర్తియైన పిదప గురుశలాకలతో కూడిన కుశసమూహముల చేతను, సహదేవమను ఓషధి చేతను ప్రతిమను బాగుగా రాయవలెను. బైటను, లోపలను తగు సంస్కారములు చేసి పంచగవ్యములతో శుద్ధి చేయవలెను. పిమ్మట కుశోదకము, నదీజలము, తీర్థజలము ఆ ప్రతిమపై ప్రోక్షించవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 201 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 60*
*🌻Mode of installation of the image of Vāsudeva - 1 🌻*
The Lord said:
1. One should divide the length of adytum into seven parts for the installation of the pedestal. The wise man should fix the image on the part of Brahman.
2-3. (One should) never (fix it) in the parts (presided over) by the celestials, mortals and goblins, leaving out the part (presided over by) Brahman. The pedestal should be carefully fixed off the regions of celestials and mortals. Gems should be imbedded in the case of a hermaphrodite stone.
4-5. Having performed oblation with (the mantra sacred to) Narasiṃha (the man-lion form of Viṣṇu), the gems. should be placed with (the repetition of) the same (mantra). Rice grains, gems, three (kinds of) minerals, iron and other metallic substances, sandal wood etc., should be placed in the nine holes commencing with the east at the centre as one likes. Then the holes should be filled with the guggulu (a kind of fragrant gum resin) with (the recitation of) the mantras—indra etc.
6. After having performed the insertion of gems, the preceptor should rub the image with sticks of sahadeva (tree) and bunches of darbha (grass).
7. The outer and inner surface (of the image) should be cleansed and then purified with the pañcagavya (the five things got from a cow). Water should be sprinkled with the darbha. grass as well as with the waters of the river.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 66 / DAILY WISDOM - 66 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 6. మనము జన్మతో పాటు దుఃఖాన్ని కూడా తెచ్చుకుంటాము 🌻*
*స్వయం యొక్క బంధనం అనేది వ్యక్తి యొక్క నిర్మాణంలో అంతర్గతంగా ఉన్న విషయం. మన జన్మ జరిగినప్పుడు కూడా మనతో పాటు దుఃఖాన్ని తెచ్చుకుంటాము; మరియు మన మరణాన్ని కూడా మన పుట్టుకతో కలిపి తీసుకువస్తామని తరచుగా చెబుతారు. మన జీవితపు చివరి క్షణంతో సహా అన్ని అనుభవాలు-సంతోషాలు, దుఃఖాలు-ఇవన్నీ మనం తల్లి గర్భం నుండి జన్మించిన పరిస్థితుల యొక్క ఫలితం అని అర్థం.*
*మనం కొన్ని పరిస్థితులలో జన్మించాము. అవి తరువాత అనుసరించే విషయాలకి బీజాలు, తద్వారా మన జీవితమంతా మన జన్మ సమయంలో ఒక బీజ రూపంలో ఉన్న దాని యొక్క వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. మనము ఊహించని విధంగా కొత్త అనుభవాలను పొందలేము. కానీ అవన్నీ మనం ఊహించిన, ఆశించిన విషయాలే. గణిత శాస్త్రంలో ఒక సిద్ధాంతం నుండి ఒక పరిణామం ఆశించబడినట్లుగా జీవితంలోని ప్రతి అనుభవం ఆశించబడుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 66 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 6. We Bring Sorrow with Us Even When our Birth Takes Place 🌻*
*The bondage of the self is intrinsically involved in the structure of the individual. We bring sorrow with us even when our birth takes place; and it is often said that we bring our death also together with our birth. The meaning is that all experiences—joys, sorrows, including our last moment of life—all these are a fructification of circumstances with which we are born from the mother’s womb.*
*We are born under certain conditions, and they are the seeds of what will follow later, so that the entire life of ours may be said to be an unfolding of that which is present in a seed-form at the time of our birth. We do not pass through newer and newer experiences unexpectedly, as it were, but they are all expected things only. Every experience in life is expected, as a corollary is expected from a theorem in mathematics.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 331 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మన బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు. 🍀*
*వాళ్ళు నువ్వు ఎట్లా పెంచితే అట్లా పెరుగుతావు ' అంటారు' కానీ మనం బాధల్లో పెరిగాం, దుఃఖంలో పెరిగాం. కానీ ఎవరూ మనకు బాధల్ని దు:ఖాల్ని యివ్వలేదు. కారణం మనం యితరుల మీద బాధ్యతని తోసేస్తాం. అదే మనకు మరింత దుఃఖకారణం. నీ జీవితానికి సంబంధించిన పూర్తి బాధ్యతని నువ్వే తీసుకో. దానికి బాధ్యత యితర్ల మీద వేయడం దారుణం. మొదట్లో 'నా నరకానికి కారణం నేనే' అని అంగీకరించడం కష్టమే. కానీ అట్లా ఆమోదిస్తే తలుపులు తెరుచుకుంటాయి. కారణం నా నరకానికి నేనే కారణమయితే నా స్వర్గానికి కూడా నేనే కారణమన్న సంగతి తెలిసి వస్తుంది.*
*ఆగ్రహాన్ని సృష్టించుకున్న వాణ్ణి. ఆనందాన్ని సృష్టించుకోలేనా అని గ్రహిస్తావు. బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు. అప్పుడు నువ్వు పాట పాడవచ్చు. ఆట ఆడవచ్చు. జీవితాన్ని ఉత్సవం చేసుకోవచ్చు. నీ జీవితం అనుక్షణం పండగవుతుంది. నిన్నెవడూ ఆటంకపరచలేడు. అది మనిషి ఆత్మ గౌరవం. దేవుడు వ్యక్తిత్వమున్న వాళ్ళని గౌరవిస్తాడు. కారణం వ్యక్తిత్వమున్న వాళ్ళు బాధ్యతని తీసుకుంటారు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 068 / Siva Sutras - 068 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻. 21. శుద్ధవిద్యోద్యాచ్చక్రేఈశత్వ-సిద్ధిః - 3 🌻*
*🌴. యోగి పరిమిత శక్తులను కోరకుండా, సార్వత్రిక జ్ఞానాన్ని పొందాలనే తపనతో ఉన్నప్పుడు స్వచ్ఛమైన జ్ఞానం పెరిగి , అతను విశ్వ చైతన్య నిపుణుడు అవుతాడు.🌴*
*జ్ఞాన స్వచ్ఛత అనేది పరమాత్మ యొక్క సర్వవ్యాప్త స్వభావాన్ని అర్థం చేసుకోవడం అని వివరించవచ్చు. పరమాత్మ శక్తి యొక్క సర్వవ్యాప్త స్వభావం కారణంగా, ఒక వ్యక్తికి కనిపించే ప్రతి వస్తువు దైవికంగా మారుతుంది. ఇది స్వచ్ఛమైన జ్ఞానం యొక్క ప్రాథమిక వివరణ. చైతన్యం యొక్క స్వచ్ఛత రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ‘నేను అది కూడా’ అని అనిపిస్తుంది. ఇది రెండవ దశ అయిన 'నేను అది' నుండి గణనీయంగా భిన్నంగా ఉంటుంది. మొదటి దశలో, వ్యక్తిగత గుర్తింపు పూర్తిగా కరిగిపోదు, రెండవ దశలో వ్యక్తిగత ఉనికి ఉండదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 068 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 21. śuddhavidyodyāccakreśatva-siddhiḥ - 3 🌻*
*🌴. When yogī does not desire limited powers and is eager to attain the knowledge of universal being then pure knowledge rises and he becomes the master of the universal consciousness. 🌴*
*Purity of knowledge can be explained as understanding the omnipresence nature of the Divine. Due to ubiquitous nature of Divine energy, every object that one comes across becomes divine. This is the basic explanation of pure knowledge. The purity of consciousness takes place in two stages. In the first stage, one feels ‘I am also That’. This is significantly different from ‘I am That’, which is the second stage. In the first stage, the individual identity is not totally dissolved, whereas in the second stage there is no individual existence.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఎవరూ ఏమీ చేయరు మరియు ఎవరూ ఏమీ చేయలేరు. అంతా జరుగుతోంది. / Nobody does anything and Nobody can do Anything. Everything is Happening. 🌹*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*ఇచ్చిన అవగాహనల పరిమితుల్లో మనిషి ఎక్కువ తప్పు చేయవచ్చు లేదా తక్కువ తప్పు చేయవచ్చు. మనిషి యొక్క ప్రధాన భ్రాంతి అతను చేయగలడని అతని నమ్మకం. ప్రజలందరూ తాము చేయగలరని అనుకుంటారు, ప్రజలందరూ చేయాలనుకుంటున్నారు మరియు ప్రజలందరూ అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే వారు ఏమి చేయాలి. కానీ నిజానికి ఎవరూ ఏమీ చేయరు మరియు ఎవరూ ఏమీ చేయలేరు. ఇది అర్థం చేసుకోవలసిన మొదటి విషయం. అంతా జరుగుతుంది. ఒక మనిషికి జరిగేదంతా, అతను చేసేదంతా, అతని నుండి వచ్చేవన్నీ-ఇవన్నీ జరుగుతాయి. వాతావరణం యొక్క ఎత్తైన ప్రాంతాలలో లేదా చుట్టుపక్కల ఉన్న మేఘాలలో ఉష్ణోగ్రతలో మార్పు ఫలితంగా వర్షం పడటం వలన, సూర్యుని కిరణాల క్రింద మంచు కరుగుతుంది, గాలితో దుమ్ము పెరుగుతుంది.*
*'మనిషి ఒక యంత్రం. అతని పనులు, చర్యలు, మాటలు, ఆలోచనలు, భావాలు, నమ్మకాలు, అభిప్రాయాలు మరియు అలవాట్లు అన్నీ బాహ్య ప్రభావాలు, బాహ్య ముద్రల ఫలితాలు. మనిషి తనలోంచి ఒక్క ఆలోచనను, ఒక్క చర్యను ఉత్పత్తి చేయలేడు. అతను చెప్పేది, చేసేది, ఆలోచించడం, అనుభూతి చెందడం-ఇవన్నీ జరుగుతాయి. మనిషి దేన్నీ కనిపెట్టలేడు. ఇదంతా జరుగుతుంది. 'ఈ వాస్తవాన్ని స్వయంగా స్థాపించడం, అర్థం చేసుకోవడం, దాని సత్యాన్ని ఒప్పించడం అంటే మనిషికి సంబంధించిన వెయ్యి భ్రమలను వదిలించుకోవడం, అతను సృజనాత్మకంగా ఉండటం మరియు తన జీవితాన్ని స్పృహతో నిర్వహించడం మొదలైనవి. ఈ రకంగా ఏమీ లేదు. అన్నీ జరుగుతాయి-ప్రజా ఉద్యమాలు, యుద్ధాలు, విప్లవాలు, ప్రభుత్వ మార్పులు, ఇవన్నీ జరుగుతాయి. మరియు వ్యక్తిగత మనిషి జీవితంలో ప్రతిదీ జరిగే విధంగానే ఇది జరుగుతుంది. మనిషి పుడతాడు, బతుకుతాడు, చనిపోతాడు, ఇళ్లు కట్టుకుంటాడు, పుస్తకాలు రాస్తాడు, తను కోరుకున్నట్టు కాదు, అలాగే జరుగుతుంది. అంతా జరుగుతుంది.*
*మనిషికి ప్రేమ, ద్వేషం, కోరిక-ఇవన్నీ జరుగుతాయి. కానీ తను ఏమీ చేయలేనని చెబితే ఎవరూ నమ్మరు. ఇది మీరు ప్రజలకు చెప్పగలిగే అత్యంత అభ్యంతరకరమైన మరియు అత్యంత అసహ్యకరమైన విషయం. ఇది ముఖ్యంగా అసహ్యకరమైనది మరియు అప్రియమైనది ఎందుకంటే ఇది నిజం, మరియు ఎవరూ నిజం తెలుసుకోవాలనుకోవడం లేదు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹Nobody does anything and Nobody can do Anything. Everything is Happening. 🌹*
*Prasad Bharadwaj*
*Within the Limits of given perceptions man can err more or err less. As I have said before, man's chief delusion is his conviction that he can do. All people think that they can do, all people want to do, and the first question all people ask is what they are to do. But actually nobody does anything and nobody can do anything. This is the first thing that must be understood. Everything happens. All that befalls a man, all that is done by him, all that comes from him—all this happens. And it happens in exactly the same way as rain falls as a result of a change in the temperature in the higher regions of the atmosphere or the surrounding clouds, as snow melts under the rays of the sun, as dust rises with the wind.*
*"Man is a machine. All his deeds, actions, words, thoughts, feelings, convictions, opinions, and habits are the results of external influences, external impressions. Out of himself a man cannot produce a single thought, a single action. Everything he says, does, thinks, feels—all this happens. Man cannot discover anything, invent anything. It all happens. 'To establish this fact for oneself, to understand it, to be convinced of its truth, means getting rid of a thousand illusions about man, about his being creative and consciously organizing his own life, and so on. There is nothing of this kind. Everything happens—popular movements, wars, revolutions, changes of government, all this happens. And it happens in exactly the same way as everything happens in the life of individual man. Man is born, lives, dies, builds houses, writes books, not as he wants to, but as it happens. Everything happens.*
*Man does not love, hate, desire—all this happens. "But no one will ever believe you if you tell him he can do nothing. This is the most offensive and the most unpleasant thing you can tell people. It is particularly unpleasant and offensive because it is the truth, and nobody wants to know the truth.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments