top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 12, JULY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 12, JULY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 12, JULY 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 397 / Bhagavad-Gita - 397 🌹

🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 25 / Chapter 10 - Vibhuti Yoga - 25 🌴

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 243 / Agni Maha Purana - 243 🌹

🌻. సూర్య పూజా విధి వర్ణనము - 3 / Mode of worshipping the Sun - 3 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 109 / DAILY WISDOM - 109 🌹

🌻 18. ఏకాంతంగా ఉండటం వల్ల కలిగే ఆనందం / 18. The Happiness of Being Alone 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 375 🌹*

6) 🌹. శివ సూత్రములు - 111 / Siva Sutras - 111 🌹

🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 14 / 2-07. Mātrkā chakra sambodhah   - 14 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 12, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*


*🍀. శ్రీ గజానన స్తోత్రం - 02 🍀*


*మునీంద్రవంద్యం విధిబోధహీనం సుబుద్ధిదం బుద్ధిధరం ప్రశాంతమ్ |*

*వికాలహీనం సకలాంతగం వై గజాననం భక్తియుతా భజామః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : కలుష క్షాళనకు ఉపాయం - నీ లోపల ఉండే కలుషాలను, దోషాలను క్షాళన చెయ్యాలంటే, మొట్టమొదట వాటి ఉనికిని స్పష్టంగా గుర్తించు. పిమ్మట దృఢమైన సంకల్పంతో వాటిని త్రోసిపుచ్చు. అనంతరం వాటి నుండి వేరుపడడం నేర్చుకో. అప్పుడు ఒక వేళ అవి నీలోనికి తిరిగి ప్రవేశింప జూచినా నీకు పరాయివిగానే ప్రవేశించ గలుగుతాయి.🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

ఆషాడ మాసం

తిథి: కృష్ణ దశమి 18:01:47 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: భరణి 19:45:56 వరకు

తదుపరి కృత్తిక

యోగం: ధృతి 09:39:23 వరకు

తదుపరి శూల

కరణం: వణిజ 05:58:40 వరకు

వర్జ్యం: 04:56:36 - 06:35:12

దుర్ముహూర్తం: 11:55:24 - 12:47:48

రాహు కాలం: 12:21:36 - 13:59:50

గుళిక కాలం: 10:43:22 - 12:21:36

యమ గండం: 07:26:55 - 09:05:09

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47

అమృత కాలం: 14:48:12 - 16:26:48

సూర్యోదయం: 05:48:41

సూర్యాస్తమయం: 18:54:30

చంద్రోదయం: 01:10:47

చంద్రాస్తమయం: 14:20:00

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: కాల యోగం - అవమానం

19:45:56 వరకు తదుపరి సిద్ది యోగం

- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 397 / Bhagavad-Gita - 397 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 25 🌴*


*25. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం |*

*యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ: ||*


🌷. తాత్పర్యం :

*నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైనవానిలో హిమాలయమును అయి యున్నాను.*


🌷. భాష్యము :

*విశ్వమునందలి తొలిజీవియైన బ్రహ్మదేవుడు వివిధజీవజాతుల సృష్టికై పెక్కురు పుత్రులను సృజించెను. అట్టి పుత్రులలో భృగుమహర్షి శక్తిమంతుడైన ఋషి. దివ్య ధ్వనులలో ఓంకారము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. అదేvవిధముగా సమస్తయజ్ఞములలో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను జపయజ్ఞము శ్రీకృష్ణుని విశుద్ధ ప్రాతినిధ్యమే. కొన్నిమార్లు పశుహింసను కూడిన యజ్ఞములు ఉపదేశింపబడినను ఈ హరినామ జపయజ్ఞమునందు హింస యనెడి ప్రశ్నయే ఉదయింపదు. కనుకనే ఇది అత్యంత సులభము మరియు పరమపవిత్రమై యున్నది.*


*సృష్టియందు ఉదాత్తమైనది శ్రీకృష్ణునికి ప్రాతినిద్యము వహించును గావున ప్రపంచమునందలి ఘనపర్వతములైన హిమాలయములు సైతము శ్రీకృష్ణునికి ప్రాతినిద్యములు. శ్లోకములలో మేరుపర్వతమును గూర్చి చెప్పబడినను, అది హిమాలయమువలె స్థావరముగాక, కొన్నిమార్లు చలనశీలమై యుండును. కనుకనే హిమాలయములు మేరువుకన్నను ఘనమైనవి.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 397 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 10 - Vibhuti Yoga - 25 🌴*


*25. maharṣīṇāṁ bhṛgur ahaṁ girām asmy ekam akṣaram*

*yajñānāṁ japa-yajño ’smi sthāvarāṇāṁ himālayaḥ*


🌷 Translation :

*Of the great sages I am Bhṛgu; of vibrations I am the transcendental oṁ. Of sacrifices I am the chanting of the holy names [japa], and of immovable things I am the Himālayas.*


🌹 Purport :

*Brahmā, the first living creature within the universe, created several sons for the propagation of various kinds of species. Among these sons, Bhṛgu is the most powerful sage. Of all the transcendental vibrations, oṁ (oṁ-kāra) represents Kṛṣṇa. Of all sacrifices, the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare is the purest representation of Kṛṣṇa.*


*Sometimes animal sacrifices are recommended, but in the sacrifice of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, there is no question of violence. It is the simplest and the purest. Whatever is sublime in the worlds is a representation of Kṛṣṇa. Therefore the Himālayas, the greatest mountains in the world, also represent Him. The mountain named Meru was mentioned in a previous verse, but Meru is sometimes movable, whereas the Himālayas are never movable. Thus the Himālayas are greater than Meru.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 244 / Agni Maha Purana - 244 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 73*


*🌻. సూర్య పూజా విధి వర్ణనము - 3 🌻*


*హృదయ-శిరః-శిఖా-కవచములకు పూర్వాది దిక్కులందు ధేనుముద్రను ప్రదర్శించవలెను. నేత్రములకు గోశృంగముద్ర చూపవలెను. అస్త్రమునకు త్రాసనీముద్ర చూపవలెను. పిమ్మట గ్రహములకు నమస్కారము, పూజ చేయవలెను. ''ఓం సోం సోమాయ నమః'' అను మంత్రముతో తూర్పునందు చంద్రుని, ''ఓం బుం బుధాయ నమః'' అను మంత్రముతో దక్షిణమున బుధుని, ''ఓం బృం బృహస్పతయే నమః'' అను మంత్రముతో పశ్చిమమున బృహస్పతిని, ''ఓం భం భార్గవాయ నమః'' అను మంత్రముతో శుక్రుని పూజింపవలెను. ఈ విధముగ పూర్వాదిదిశలందు చంద్రాదిగ్రహములను పూజించి ఆగ్నేయాది విదిక్కులందు మిగిలిన గ్రహములను పూజింపవలెను ఎట్లనగా - ''భౌం భౌమాయ నమః'' అను మంత్రముతో ఆగ్నేయమున కుజుని, ''ఓం శం శనైశ్చరాయ నమః'' అను మంత్రముతో నైరృతి దిక్కునందు శ##నైశ్చరుని, ''ఓం రాం రాహవే నమః'' అను మంత్రముతో వాయవ్యమునందు రామువును, ''ఓం కేం కేతవే నమః'' అను మంత్రముతో ఈశాన్యమునందు కేతువును గంధాద్యుపచారములతో పూజింపవలెను.*


*ఖఖోల్కీ (సూర్యభగవానుని) తో పాటు ఈ అన్ని గ్రహములపూజ కూడ చేయవలెను. మూలమంత్రము జపించి, అర్ఘ్యపాత్రమునందు జలము గ్రహించి సూర్యునకు సమర్పించి, పిదప స్తుతించవలెను. ఈ విధముగ స్తుతి చేసిన పిదప అభిముఖముగ నిలబడి సూర్యునకు నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. ''ప్రభో! నా అపరాధములను లోపములను క్షమింపుము''. పిమ్మట ''అస్త్రాయ ఫట్‌'' అను మంత్రముతో అను సంహార సమామరణము చేసి, ''శివసూర్య'' అని పలుకుచు సంహారిణీముద్ర ద్వారా సూర్యుని ఉపసంహృత మగు తేజస్సును తన హృదయకమలములో నుంచి సూర్యనిర్మాల్యమును ఆతని పార్షదుడైన చండునకు సమర్పింపవలెను. ఈ విధముగ జగదీశ్వరు డగు సూర్యుని పూజ చేసి, ధ్యానహోమములు చేయుటచే సాధకుని మనోరథములన్నియు సిద్ధించును.*


*అగ్ని మహాపురాణమునందు సూర్యపూజావిధివర్ణన మను డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 244 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 73*

*🌻 Mode of worshipping the Sun - 3 🌻*


13-14. The trasanī (the dreadful) should be added to the mantra of the weapon and obeisance should be made to the planets (as follows)—soṃ salutations to the Moon, buṃ salutations to Mercury, bṛṃ to Jupiter, bhaṃ to Venus, aṃ to Mars, saṃ to Saturn, raṃ to Rāhu and keṃ to Ketu (to be done) in the petals (of the lotus) commencing with the east. The perfumes etc. (should be offered) with the khakholka mantra.


15. Having recited the principal mantra, water of oblation from the water-vessel should be offered to the sun-god. Then the worshipper should sing the glory of the lord, pay obeisance to him with his face turned away and say “Pardon me, (taking leave of thee)”.


16-17. One should mentally merge the five component principles in the fundamental one with the syllable phaṭ. The sun-god should be conceived as identical with lord Śiva in the lotus of the heart. One should offer light to the lord as a garland made of the solar rays. One gets everything by thus worshipping and contemplating the sun-god or by oblation unto fire in his honour.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 109 / DAILY WISDOM - 109 🌹*

*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 18. ఏకాంతంగా ఉండటం వల్ల కలిగే ఆనందం 🌻*


*మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు, మిమ్మల్ని కదపడానికి వస్తువులు లేనప్పుడు, మిమ్మల్ని చూసే వ్యక్తులు లేనప్పుడు, మీరు మీ స్వంత గదిలో ఏకాంతంలో ఉన్నప్పుడు, మీ ఆనందం అత్యంత తీవ్రంగా ఉంటే, అది మీ ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుంది. కానీ మరోవైపు, మీ ఆనందం పరిచయాల ద్వారా మాత్రమే పెరుగుతుందని అనిపిస్తే, వ్యక్తులను చూడటం ద్వారా మాత్రమే, మీ ఆనందం విస్తరిస్తే, మీరు ఇటూ అటూ పరుగులు తీస్తూ ఉంటే, అది మీ ఆధ్యాత్మిక పురోగతిని సూచించదు.*


*మీరు ఎంత ఎక్కువగా ఒంటరిగా ఉన్నారో, అంత ఎక్కువగా మీ ఆత్మకు దగ్గరగా ఉంటారు. మీ జీవితంలోని ఈ ఒంటరితనం మీ సామాజిక జీవితంలో మీరు చేసుకునే అన్ని పరిచయాల కంటే మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఆత్మ దేనితోనూ సంబంధంలోకి రాదు మరియు దాని ఆనందాన్ని పరిచయాల ద్వారా మెరుగుపరచలేము; మరోవైపు, అన్ని పరిచయాలు దాని వ్యక్తీకరణపై ఒక పరిమితిని ఉంచుతాయి. ఇంద్రియ పరిచయాల ద్వారా ఆత్మ యొక్క ఆనందాలు తగ్గుతాయి; అందుకే మనం ఈ ప్రపంచంలో సంతోషంగా లేము.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 109 🌹*

*🍀 📖 The Ascent of the Spirit 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 18. The Happiness of Being Alone 🌻*


*When you are absolutely alone, when there are no things to contact you, no persons to see you, when you are in the solitude of your own room, if your happiness is the most intense, that would perhaps indicate your progress along the spiritual path, your inner growth. But on the other hand, if your joy seems to enhance only by contacts, by seeing people and persons, if your joy expands the more you run about, the more you see things, the more you go about here and there, that will not be the indication of your growth in the spiritual field.*


*The more you are alone, the more are you near to your Spirit. This loneness of your life promises you greater satisfaction than all the contacts that you can make in your social life. The Spirit does not come in contact with anything, and its joy cannot be enhanced by contacts; on the other hand, all contacts are a restriction on its expression. Joys of the Spirit get diminished by sensory contacts; that is why we are unhappy in this world.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 375 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. చెప్పేది నమ్మకండి. అనుభవానికి తెచ్చుకోడానికి ప్రయత్నించండి. పరిశోధించు. దాని వల్లే సత్యాన్ని గ్రహిస్తావు. అప్పుడు అనంతంలో నువ్వు భాగమని తెలుసుకుంటావు. 🍀*


*నిజమైన విషయం అనుభవం. కాబట్టి నేను అనుభవం గురించి నొక్కి చెబుతాను. నమ్మకం గురించి కాదు. నేను చెప్పేది నమ్మకండి. అనుభవానికి తెచ్చుకోడానికి ప్రయత్నించండి. నమ్మకం ఉద్రేక పరుస్తుంది. మనసు అక్కడ పరిశోధన ఎందుకు? బుద్ధుడు లాంటి వాళ్ళంతా చెప్పారు. నమ్ము' అంటుంది.. వాళ్ళు తాగారు. దాహం తీర్చుకున్నారు. దాహం వాళ్ళకు తీరింది. నీకు కాదు. నమ్మకం మరణం అని పవిత్ర గ్రంథాల్లో చెప్పారు, నమ్మండి అంటారు. అక్కడ ప్రశ్నకు అవకాశం లేదు. సందేహాలకు వీలు లేదు. నేనేమంటానంటే పరిశోధించు. దాని వల్లే సత్యాన్ని గ్రహిస్తావు. అప్పుడు అనంతంలో నువ్వు భాగమని తెలుసుకుంటావు. యింటికి తిరిగి వస్తావు. ఆశీర్వాదాన్ని అందుకుంటావు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 111 / Siva Sutras - 111 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 14 🌻*

*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*


*సమస్త సృష్టి ఈ బిందువు నుండి ఉద్భవించి ఈ బిందువులో కలిసి పోతుంది. బిందు అనేది నేనే విస్తరించిన స్వభావం తప్ప మరొకటి కాదు. ఈ విస్తరణ ఏదో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏది ఉనికిలో ఉన్నా అది అంతర్గత మరియు బాహ్య శక్తుల యొక్క పరస్పర శక్తిగా వ్యక్తీకరించ బడిన శివుని యొక్క విస్తారమైన తేజస్సు తప్ప మరొకటి కాదు. అంతర్గత సృజనాత్మక శక్తి మనస్సు ద్వారా గ్రహించ బడుతుంది మరియు బాహ్య సృజనాత్మక శక్తి ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది. శివ యొక్క ఈ అంశం విసర్గచే సూచించ బడుతుంది, ఇది సృజనాత్మక మరియు పరిమిత చైతన్యం రెండింటినీ సంగ్రహించడం తప్ప మరొకటి కాదు. ఇక్కడే మొత్తం అభివ్యక్తీకరణ అవుతుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 111 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-07.  Mātrkā chakra sambodhah   - 14 🌻*

*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*


*The entire creation originates from this bindu and dissolves into this bindu. Bindu is nothing but the expanded nature of Self. This expansion appears as if something exists. Whatever that exist is nothing but the expanded splendour of Śiva, expressed as interactive force of both internal and external energies. Internal creative force is realised by mind and external creative force is revealed through senses. This aspect of Śiva is represented by visarga, which is nothing but the summing up of both creative and limitative dynamism. This is where the entire manifestation is let loose.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page