top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 12, MAY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 12, MAY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 12, MAY 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 369 / Bhagavad-Gita - 369 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 31 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 216 / Agni Maha Purana - 216 🌹

🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 4 / Mode of installation of other Gods and Goddesses - 4 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 081 / DAILY WISDOM - 081 🌹

🌻 21. అది 'ఇతరమైనది' అయినప్పటికీ, అది కూడా నేనే / 21. Though it is the 'Other', it is Also the Self 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 346 🌹

6) 🌹. శివ సూత్రములు - 83 / Siva Sutras - 83 🌹

🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 3 / 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 12, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 44 🍀*


*44. బీజాక్షరత్రయవిరాజితమన్త్రయుక్తే*

*ఆద్యన్తవర్ణమయశోభితశబ్దరూపే ।*

*బ్రహ్మాణ్డభాణ్డజనని కమలాయతాక్షి*

*లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : దివ్య ప్రేమ రెండురకాలు. ఒకటి ప్రేమ స్వరూపుడైన భగవానునికి తనలో భాగమైన సృష్టియెడ, జీవులయెడ నుండే దివ్యప్రేమ. రెండవది_ప్రియతముడైన భగవానునియెడ భ క్తునికుండే దివ్యప్రేమ. అది వ్యక్తి గతంగానూ, తదతీతంగానూ కూడ విలసిల్లగలదు. అయితే. ఆ వ్యక్తిగత ప్రేమ అవరప్రకృతిచే దూషితము కానిది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: కృష్ణ సప్తమి 09:08:27 వరకు

తదుపరి కృష్ణ అష్టమి

నక్షత్రం: శ్రవణ 13:04:54 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: శుక్ల 12:16:26 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: బవ 09:07:27 వరకు

వర్జ్యం: 16:49:20 - 18:19:28

దుర్ముహూర్తం: 08:20:11 - 09:11:49

మరియు 12:38:19 - 13:29:56

రాహు కాలం: 10:35:42 - 12:12:30

గుళిక కాలం: 07:22:06 - 08:58:54

యమ గండం: 15:26:06 - 17:02:54

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37

అమృత కాలం: 03:20:18 - 04:50:06

మరియు 25:50:08 - 27:20:16

సూర్యోదయం: 05:45:18

సూర్యాస్తమయం: 18:39:41

చంద్రోదయం: 00:25:37

చంద్రాస్తమయం: 11:52:52

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: ధూమ్ర యోగం - కార్య

భంగం, సొమ్ము నష్టం 13:04:54 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 369 / Bhagavad-Gita - 369 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 31 🌴*


*31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి |*

*కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి ||*


🌷. తాత్పర్యం :

*అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయా! నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము.*


🌷. భాష్యము :

*ఈ శ్లోకమును తప్పుగా అర్థము చేసికొనరాదు. దురాచారుడైనవాడు తన భక్తుడు కాలేడని భగవానుడు సప్తమాధ్యాయమున తెలిపియున్నాడు. అలాగుననే భగవద్భకుడు కానివానికి ఎట్టి శుభలక్షణములు ఉండవనియు మమమెరిగియున్నాము. అట్టి యెడ యాదృచ్చికముగా లేక ప్రయత్నపూర్వకముగా పాపమును ఒనరించినవాడు ఎట్లు భక్తుడగును? ఇటువంటి ప్రశ్న ఇచ్చట ఉదయించుట సహజమే. గీత యందలి సప్తమాధ్యాయమున పేర్కొనబడిన దుష్కృతులు (వారెన్నడును శ్రీకృష్ణుని భక్తియోగమునకు రారు) ఎటువంటి శుభలక్షణములను కలిగియుండరని శ్రీమద్భాగవతము నందు తెలుపబడినది. కాని భక్తుడైనవాడు అట్లుగాక నవవిధములైన భక్తిమార్గముల ద్వారా తన హృదయమాలిన్యమును తొలగించుకొన యత్నమున ఉన్నట్టివాడు.*


*అతడు శ్రీకృష్ణభగవానుని సదా తన హృదయమునందే నిలిపియుండుటచే, అతని పాపములన్నియును సహజముగనే నశించిపోయియుండును. భగవానుని నిరంతర చింతన అతనిని పరమపవిత్రునిగ చేయును. ఉన్నతస్థితి నుండి పతనము చెందినవాడు పవిత్రతకై కొన్ని ప్రాయశ్చిత్తకర్మలను చేయవలెనని వేదానుసారము కొన్ని నియమములు కలవు. పవిత్రీకరణ విధానము భక్తుని హృదయమునందు ఇదివరకే నెలకొనియున్నందున అటువంటి పరిస్థితి భక్తియోగమునకు అన్యయింపదు. హృదయమునందు అతడు శ్రీకృష్ణభగవానుని సదా స్మరించుటయే అందులకు కారణము. కనుకనే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను దివ్యమాహామంత్ర జపకీర్తనలు నిలుపుదల లేకుండా సదా జరుగవలెను. అట్టి కార్యము భక్తుని సర్వవిధములైన యాదృచ్చిక పతనముల నుండి రక్షించును. ఆ విధముగా అతడు భౌతికసంపర్కము నుండి సదా ముక్తుడై యుండగలడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 369 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 31 🌴*


*31. kṣipraṁ bhavati dharmātmā śaśvac-chāntiṁ nigacchati*

*kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati*


🌷 Translation :

*He quickly becomes righteous and attains lasting peace. O son of Kuntī, declare it boldly that My devotee never perishes.*


🌹 Purport :

*This should not be misunderstood. In the Seventh Chapter the Lord says that one who is engaged in mischievous activities cannot become a devotee of the Lord. One who is not a devotee of the Lord has no good qualifications whatsoever. The question remains, then, How can a person engaged in abominable activities – either by accident or by intention – be a pure devotee? This question may justly be raised. The miscreants, as stated in the Seventh Chapter, who never come to the devotional service of the Lord, have no good qualifications, as is stated in the Śrīmad-Bhāgavatam. Generally, a devotee who is engaged in the nine kinds of devotional activities is engaged in the process of cleansing all material contamination from the heart. He puts the Supreme Personality of Godhead within his heart, and all sinful contaminations are naturally washed away.*


*Continuous thinking of the Supreme Lord makes him pure by nature. According to the Vedas, there is a certain regulation that if one falls down from his exalted position he has to undergo certain ritualistic processes to purify himself. But here there is no such condition, because the purifying process is already there in the heart of the devotee, due to his remembering the Supreme Personality of Godhead constantly. Therefore, the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare should be continued without stoppage. This will protect a devotee from all accidental falldowns. He will thus remain perpetually free from all material contaminations.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 216 / Agni Maha Purana - 216 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 63*


*🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 4 🌻*


*గ్రంథమును వస్త్రముతో అచ్ఛాదించి పాఠ ప్రారంభమునందును, అంతరమునందును దానిని పూజించవలెను. పుస్తకమును చదువువాడు విశ్వశాంతి కలుగవలెను. నని సంకల్పించి ఒక అధ్యాయమును చదువవలెను. గురువు కుంభములోని జలముతో యజమానుడు మొదలగు వారికి అభిషేకము చేయించవలెను.*


*బ్రహ్మణునకు పుస్తకదానము చేసినచో అనంతఫలము లభించును. గోదాన-భూదాన-విద్యాదానము లను మూడు దానములకును అతిదానము లని పేరు పాలుపిదుకు, విత్తనములు, చల్లుట అను పనులు చేయగనే ఆ దానములు చేసిన వాడు నరకము నుండి ఉద్ధరింపబడును. సిరాతో రాసిన పత్రములను దానము చేసినచో విద్యాదానఫలము లభించును. ఆ పత్రము లెన్ని యున్నవో, అక్షరము లెన్ని యున్నవో అన్ని వేల సంవత్సరములు దాత వుష్ణులోకములో పూజింప బడును. పంచరాత్రము, పూరాణములు, మహాభారతము దానము చేసిన వాడు తన వంశములో ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించి తాను పరమ తత్త్వమునందు విలీను డగును.*


*అగ్ని మహాపురాణమునందు దేవతాప్రతిష్ఠాకథన మను అరువదిమూడవ అధ్యాయము సమాప్తము.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 216 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 63*

*🌻Mode of installation of other Gods and Goddesses - 4 🌻*


16. Having fed the preceptor and given the fees, the twice-borns should be fed. The book [i.e., pustaka] should be carried by men in a car, or on the elephant.


17. The book [i.e., pustaka] should be established and worshipped (on its return) in a house or temple. That which is wrapped up in a cloth should be worshipped at the commencement and end of reading.


18. Having resolved to have universal peace a chapter of the book should be read out. The yajamāna and others should be sprinkled with water from the pitcher.


19. The merit of presenting a book to the twice-born is. unlimited. Three things (are said to be) gifts par excellence. (They are) cows, land and knowledge.


20-21. O sinless one! the merits of imparting knowledge (is great). One who presents a bundle of written leaves, remains. and enjoys in the region of Viṣṇu for so many years as the number of leaves and letters (in the manuscript). One who gives away pañcarātra[2], purāṇas, bhārata (as gift) elevates twenty-one generations of his family and gets merged in the supreme being.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 81 / DAILY WISDOM - 81 🌹*

*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 21. అది 'ఇతరమైనది' అయినప్పటికీ, అది కూడా నేనే 🌻*


*విశ్వం లేదా భగవంతుడు తనకు రెండవ స్వయం ఉండాలని సంకల్పించాడు. ఇదే సంకల్పమే ఈ సృష్టికి మూలం. ప్రపంచం, ఈ సృష్టి, ఈ విశ్వం, పరమాత్మ యొక్క రెండవ స్వయమే. ఈ విశాలమైన సృష్టి అయిన ఈ రెండవ నేను స్వయంగా పరమాత్మ చేత ప్రాణం పోసుకుంది. ఇది సంపూర్ణత యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉండదు అనే అర్థంలో ఇది రెండవది అయింది. అయినప్పటికీ, ఇది భగవంతుని స్వయమే. అది రెండవది అయినప్పటికీ, అది కూడా స్వయమే. పరమాత్మ యొక్క స్వీయ చైతన్యం సృష్టిలో పూర్తిగా ప్రతిబింబించడం వలన ఈ సృష్టిని రెండవ స్వయం అని కూడా పిలుస్తారు. విశ్వాత్మ మొత్తం విశ్వంలో, సృష్టిలోని అన్ని అంశాలలో అంతర్లీనంగా ఉంది. కానీ ఈ విశ్వాన్ని దైవానిదిగా, అంటే భగవంతునికి చెందిన ఒక వస్తువుగా పరిగణిస్తారు. *


*ఇది విశ్వాత్మ స్థలం, సమయం మరియు కారణం కలిగి ఉన్న ఒక విశ్వవ్యాప్త వస్తువును ఊహించినట్లుగా ఉంటుంది. ఇక్కడ సర్వత్రా వ్యాపించి ఉన్న విషయం తానే అయి ఉన్న వస్తువును తెలుసుకోవడాన్ని వర్ణించారు. అంటే విశ్వ చైతన్యం విశ్వ సృష్టిని తెలుసుకోవడం. ఇది మామూలు మనిషి తనకి బయట ఉన్న వస్తువును గురించి తెలుసుకోవడం కంటే భిన్నంగా ఉంటుంది. భగవంతుడు విశ్వం గురించి స్పృహలో ఉన్న విధానం, ఒక సాధారణ జీవుడు లేదా వ్యక్తి ఒక వస్తువు పట్ల స్పృహ కలిగి ఉండే విధానానికి భిన్నంగా ఉంటుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 81 🌹*

*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 21. Though it is the 'Other', it is Also the Self 🌻*


*It willed, or He willed: “May I have a second Self.” This is the origin of creation. The world, this creation, this universe is the second Self, as it were, of the Supreme Being. This ‘other’ Self, which is this vast creation, is animated by the Supreme Being Himself. It is ‘other’ in the sense that it had not all the characteristics of the Absolute. Yet, it is the Self. Though it is the ‘other’, it is also the Self. It is called the ‘Other Self’, inasmuch as the Selfhood of the Absolute is transparently present in this creation. The Universal Atman is immanent in the whole universe, in all aspects of creation; and yet the universe is an ‘otherness’, as it were, of God, an object of God.*


*It is as if the Universal ‘I’ is envisaging a universal object, including all that is visible or sensible—space, time and causal relation. A single Subject encountering a single Object is the state which is described in this passage, a Cosmic Consciousness becoming aware of a Cosmic Object in a peculiar manner, not in the way in which the ordinary individual is aware of an object outside. The way in which God is conscious of the universe, is different from the way in which an ordinary jiva, or individual, is conscious of an object.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 346 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. మనిషి మనిషిగా మారింది మొదలు పరిణామం ఆగిపోయింది. పరిణిత దశ వచ్చేసింది. మనిషి వేల సంవత్సరాలుగా మనిషిగానే వున్నాడు. ఎట్లాంటి ఎదుగుదలా లేదు. మనం పరిణామం నించి విప్లవానికి సాగాలి. పరిణామం అంటే అచేతన, విప్లవమంటే చేతన. 🍀*


*పరిణామవాదమన్నది అచేతన విషయం. అది సహజమయిన విషయం. సైంటిస్టులు మనిషి చేపగా సముద్రంలో జన్మించాడంటారు. చేపకు మనిషికి మధ్య కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. మనిషి అన్ని రకాల జంతు స్థాయిల్ని దాటి వచ్చాడు. మనిషి చివరి దశ, మనిషికి ముందు దశ కోతి. ఇదంతా అచేతనంగా జరిగింది. అక్కడ ఎట్లాంటి ప్రయత్నమూ లేదు. మనిషి మనిషిగా మారింది మొదలు పరిణామం ఆగిపోయింది. పరిణిత దశ వచ్చేసింది.*


*మనిషి వేల సంవత్సరాలుగా మనిషిగానే వున్నాడు. ఎట్లాంటి ఎదుగుదలా లేదు. దీన్ని బట్టి ప్రకృతి ఏం చెయ్యాలో అదంతా చేసేసింది అని తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితిని మన చేతుల్లోకి తీసుకోవాలి. మనం పరిణామం నించి విప్లవానికి సాగాలి. పరిణామం అంటే అచేతన, విప్లవమంటే చేతన.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 083 / Siva Sutras - 083 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 3 🌻*

*🌴. మంత్రం యొక్క రహస్యం, జ్ఞానాన్ని తన చలన శక్తిగా కలిగి ఉన్న దాని శరీరమే. స్వచ్ఛమైన జ్ఞానంతో తన చిత్తాన్ని, మానసిక శరీరాన్ని ప్రకాశింపజేసే యోగి అదే శక్తిని పెంపొందించుకుని మంత్రశక్తిపై ఆధిపత్యం సాధిస్తాడు. 🌴*


*ఆత్మ-సాక్షాత్కారం యొక్క సారాంశమైన 'నేను దైవమే అయి ఉన్నాను' అనే అంతర్లీన సూత్రాన్ని అర్థం చేసుకోకుండా కేవలం మంత్రాలను జపించడం వలన, పరమానందాన్ని, అత్యున్నత చైతన్నాన్ని తెలుసుకోలేరు. ఈ అంశాన్ని తెలుసుకోవటమే రహస్యం. పైన వివరించిన ఈ స్వీయ ధృవీకరణే రహస్యం. ద్వంద్వవాదమే ఆధ్యాత్మిక సాధనలో నిరోధక కారకం అని పదేపదే చెప్పబడింది. ద్వంద్వాతీతము ఆధ్యాత్మికత యొక్క పునాది సూత్రం. ద్వంద్వాతీతము ఒక్కటే భగవంతుని సర్వవ్యాపిత్వాని ధృవీకరిస్తుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 083 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 3 🌻*

*🌴. The secret of the mantra is its body which has knowledge as its moving force. A yogi who illuminates his chitta and mental body with pure knowledge develops a similar power and gains lordship over the mantra shaktis. 🌴*


*Mere chanting of mantra-s without understanding the underlying factor of “I am That”, the essence of Self-realization, does not carry the aspirant anywhere near the logical goal of bliss ultimate realization. This aspect of knowing is called secret. The self affirmation described above is the secret. It has been repeatedly stated that the thought of dualism is a deterrent factor in spiritual attainment. Non-dualism is the foundational principle of spirituality. Non-dualism alone corroborates the omnipresent nature of the Lord.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comentários


bottom of page