top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 13, AUGUST 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 13, AUGUST 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 13, AUGUST 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 220 / Kapila Gita - 220🌹

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 30 / 5. Form of Bhakti - Glory of Time - 30 🌴

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 812 / Vishnu Sahasranama Contemplation - 812 🌹

🌻812. అనిలః, अनिलः, Anilaḥ🌻

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 773 / Sri Siva Maha Purana - 773 🌹

🌻. నారద జలంధర సంవాదము - 3 / The conversation between Nārada and Jalandhara - 3 🌻

5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 027 / Osho Daily Meditations - 027 🌹

🍀 27. తీర్పుల చీటీలు / 27. LABELS 🍀

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 469 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 3 🌹

🌻 469. 'వయోవస్థా వివర్జితా' - 3 / 469. 'vayovasdha vivarjita'- 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 13, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻*


*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 19 🍀*


*37. ధర్మకేతుర్ధర్మరతిః సంహర్తా సంయమో యమః |*

*ప్రణతార్తిహరో వాయుః సిద్ధకార్యో జనేశ్వరః*

*38. నభో విగాహనః సత్యః సవితాత్మా మనోహరః |*

*హారీ హరిర్హరో వాయురృతుః కాలానలద్యుతిః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : అంతర్ బహిశ్చేతనల అనుసంధాన శిక్షణ - వార్తాపత్రికలు చదవడం, ఉత్తరాలు వ్రాయడం వంటి బహిర్వ్యాపారాలు చేతనకు విక్షేపం కలిగించక పోయినా దాని నైశిత్యం తగ్గించవచ్చు నన్నంతమాత్రాన ఏ బహిర్వ్యాపారాలూ సాధకుడు చెయ్యరాదని అర్థం కాదు. ఏ బహిర్వ్యాపారాలనూ చెయ్యని యెడల అంతర్‌ బహిశ్చేతనలను అనుసంధానించే శిక్షణావకాశమే అతనికి లేకుండా పోతుంది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ ద్వాదశి 08:21:54 వరకు

తదుపరి కృష్ణ త్రయోదశి

నక్షత్రం: ఆర్ద్ర 08:27:02 వరకు

తదుపరి పునర్వసు

యోగం: వజ్ర 15:55:18 వరకు

తదుపరి సిధ్ధి

కరణం: తైతిల 08:20:55 వరకు

వర్జ్యం: 21:47:00 - 23:33:40

దుర్ముహూర్తం: 17:01:22 - 17:52:22

రాహు కాలం: 17:07:44 - 18:43:21

గుళిక కాలం: 15:32:07 - 17:07:44

యమ గండం: 12:20:53 - 13:56:30

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45

అమృత కాలం: -

సూర్యోదయం: 05:58:26

సూర్యాస్తమయం: 18:43:21

చంద్రోదయం: 03:06:05

చంద్రాస్తమయం: 16:48:38

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన

నాశనం, కార్య హాని 08:27:02 వరకు

తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 220 / Kapila Gita - 220 🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 30 🌴*


*30. రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతోదతః|*

*తేషాం బహుపదాః శ్రేష్ఠాశ్చతుష్పాదస్తతో ద్విపాత్॥*


*తాత్పర్యము : వాటి కంటెను రూప భేదములను గుర్తింప గల కాకులు గొప్పవి. వాటి కంటెను పై భాగము నందును, క్రింది భాగము నందును దంతములు గల జీవులు గొప్పవి. వాటిలో గూడ పెక్కు పాదములు గలవి శ్రేష్ఠములు. వాటి కంటెను నాలుగు పాదములు గల పశువులు గొప్పవి. నాలుగు పాదములు గల జంతువుల కంటెను రెండు పాదములు గల మానవులు శ్రేష్ఠులు.*


*వ్యాఖ్య : వాటి కన్నా రూపాన్ని చూసేవి గొప్పవి. వాటిలో కూడా రెండువైపులా పళ్ళు ఉన్నవి గొప్పవి. (గేదెలకు ఒకవైపే ఉంటాయి, గుఱ్ఱాలకు రెండు వైపులా ఉంటాయి) వాటికంటే చాలా కాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటికన్నా నాలుగు కాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటి కంటే రెండుకాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటిలో కూడా మానవులు శ్రేష్టులు*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 220 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 5. Form of Bhakti - Glory of Time - 30 🌴*


*30. rūpa-bheda-vidas tatra tataś cobhayato-dataḥ*

*teṣāṁ bahu-padāḥ śreṣṭhāś catuṣ-pādas tato dvi-pāt*


*MEANING : Better than those living entities who can perceive sound are those who can distinguish between one form and another. Better than them are those who have developed upper and lower sets of teeth, and better still are those who have many legs. Better than them are the quadrupeds, and better still are the human beings.*


*PURPORT : It is said that certain birds, such as crows, can distinguish one form from another. Living entities that have many legs, like the wasp, are better than plants and grasses, which have no legs. Four-legged animals are better than many-legged living entities, and better than the animals is the human being, who has only two legs.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 812 / Vishnu Sahasranama Contemplation - 812🌹*


*🌻812. అనిలః, अनिलः, Anilaḥ🌻*


*ఓం అనిలాయ నమః | ॐ अनिलाय नमः | OM Anilāya namaḥ*


ఇలతి ప్రేరణఙ్కరోతీతీలస్త భావవాన్ ।

ఇలతి స్వపితి వేత్యజ్ఞ ఇలస్తద్విపరీతతః ॥

నిత్య ప్రబుద్ధ రూపత్వా దథవాఽనిల ఉచ్యతే ।

గహనార్థాన్నిలతేః కప్రత్యయాన్తాన్నిలః స్మృతః ॥

గహనో యో న భవతి ముక్తేభ్యః సులభోఽథవా ।

శ్రీ విష్ణురనిల ఇతి ప్రోచ్యతే విద్వదుత్తమైః ॥


*ప్రేరణ చేయువాడు 'ఇలః' అనబడును. ఎవనికి అతనిని తన వ్యాపారములయందు ప్రేరేపించువాడు ఎవడును లేడో అట్టివాడు అనిలుడు. పరమాత్ముడు తాను చేయు సృష్ట్యాదికృత్యముల యందు తాను స్వతంత్రుడై ప్రవర్తించునేకాని, ఆతనిచే అవి చేయించువారు మరి ఎవరును ఎండరు.*


*లేదా ఆత్మ జ్ఞానము లేకయుండు అజ్ఞుడు ఇలుడు. అందులకు విపరీతుడైన సర్వజ్ఞుడు పరమాత్ముడు ఏలయన ఆతడు స్వాభావికముగానే నిత్య ప్రభోదశాలియగు స్వరూపము కలవాడు. నిత్య ప్రభోదము అనగా స్వతః సిద్ధమును, శాశ్వతమును, ఉత్కృష్టమును అగు జ్ఞానము.*


*లేదా దుర్లభుడు కానివాడు అని కూడ అర్థము వచ్చును. భక్తసులభుడు.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 812🌹*


*🌻812. Anilaḥ🌻*


*OM Anilāya namaḥ*


इलति प्रेरणङ्करोतीतीलस्त भाववान् ।

इलति स्वपिति वेत्यज्ञ इलस्तद्विपरीततः ॥

नित्य प्रबुद्ध रूपत्वा दथवाऽनिल उच्यते ।

गहनार्थान्निलतेः कप्रत्ययान्तान्निलः स्मृतः ॥

गहनो यो न भवति मुक्तेभ्यः सुलभोऽथवा ।

श्री विष्णुरनिल इति प्रोच्यते विद्वदुत्तमैः ॥


Ilati preraṇaṅkarotītīlasta bhāvavān,

Ilati svapiti vetyajña ilastadviparītataḥ.

Nitya prabuddha rūpatvā dathavā’nila ucyate,

Gahanārthānnilateḥ kapratyayāntānnilaḥ smr‌taḥ.

Gahano yo na bhavati muktebhyaḥ sulabho’thavā,

Śrī viṣṇuranila iti procyate vidvaduttamaiḥ.


*ilati means inducement or orders. As He is without it, as He is not subject to the inducement or command of another, He is Anilaḥ.*


*ilati may mean svapiti - sleeps. So one who is ignorant or sleeps to knowledge is ilaḥ. Since Paramātma is the opposite of it as He is eternally awake in wisdom, He is Anilaḥ.*


*The root nila is used in the sense of dense or inaccessibility. He is not inaccessible to devotees; so He is Anilaḥ.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 773 / Sri Siva Maha Purana - 773🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 18 🌴*


*🌻. నారద జలంధర సంవాదము - 3 🌻*


*సనత్కుమారుడిట్లు పలికెను - ఆ మహర్షి ఇట్లు పలికి దేవతలందరినీ ఓదార్చి రాక్షసరాజగు జలంధరుని చూచుటకై అతని సభకు వెళ్ళెను (19). అపుడు జలంధర మహారాజు అచటకు విచ్చేసిన మహర్షిని గాంచి పరమభక్తితో లేచి నిలబడి శ్రేష్ఠమగు ఆసనమును ఇచ్చెను (20). ఆ రాక్షసరాజు మిక్కిలి ఆశ్చర్యమును పొంది, ఆ మహర్షిని యథావిధిగా పూజించి చిరునవ్వుతో నిట్లనెను (21).*


*జలంధరుడిట్లు పలికెను - ఓ మహర్షీ! ఎచటనుండి వచ్చుచున్నారు? మీరు ఎచట ఏమి చూసినారు? ఇచటకు వచ్చిన పని యేమి? ఓ మునీ! ఆ పనిని నాకు ఆజ్ఞాపించుడు (22).*


*సనత్కుమారుడు పలికెను- రాక్షసరాజగు జలంధరుని ఈ మాటను విని నారదమహర్షి ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆతనికిట్లు బదులు చెప్పెను (23).*


*నారదుడిట్లు పలికెను- రాక్షసులందరికీ ప్రభువైన జలంధరా! నీవు గొప్ప బుద్ధిమంతుడవు. నీవు ధన్యుడవు. ఓ సర్వలోక ప్రభూ! శ్రేష్ఠవస్తువు (రత్నము) లను అనుభవించు వాడవు నీవే (24). ఓ రాక్షస శ్రేష్ఠా! నేను వచ్చిన కారణమును వివరముగా చెప్పెదను. వినుము (25). ఓ రాక్షసరాజా! నేను అనుకోకుండగా కైలాసమునకు వెళ్లితిని. ఆ కైలాసశిఖరము పదివేల యోజనముల విస్తీర్ణము గలది. అచట కల్పవృక్షములనేకము గలవు (26).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 773🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 18 🌴*


*🌻 The conversation between Nārada and Jalandhara - 3 🌻*


Sanatkumāra said:—

19. After saying so and consoling the gods, the excellent sage went to the assembly chamber of Jalandhara to see the favourite Asura.


20. On seeing the excellent sage, the king Jalandhara stood up and offered him a splendid seat with great devotion.


21. After worshipping him duly the surprised king of the Asuras laughed loudly and spoke to the excellent sage.


Jalandhara said:—

22. O brahmin, whence do you come from? What did you see here? O sage, what is the aim of your present visit here?


Sanatkumāra said:—

23. On hearing these words of king Jalandhara the delighted great sage Nārada replied to him.


Nārada said:—

24. O Jalandhara of great intellect, O lord of Dānavas and Daityas, O lord of all the worlds, you are blessed. You alone are the enjoyer of all jewels.


25. O excellent king of Daityas, listen to the purpose for which I have come here. I shall explain it to you.


26. O lord of Daityas, I had been to the summit of Kailāsa casually. It is ten thousand Yojanas wide. It has a grove of Kalpa trees.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 27 / Osho Daily Meditations  - 27 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 27. తీర్పుల చీటీలు 🍀*


*🕉. ఆనందం మరియు దు:ఖం అనే పదాలను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఈ పదాలు తీర్పులను కలిగి ఉంటాయి. తీర్పు చెప్పకుండా కేవలం చూడండి- 'ఇది మూడ్ 'ఎ' మరియు ఇది మూడ్ 'బి'' అని చెప్పండి. 🕉*


*'ఎ' మూడ్ పోయింది, ఇప్పుడు 'బి' మూడ్ వచ్చింది మరియు మీరు కేవలం వీక్షకులు. అకస్మాత్తుగా మీరు ఆనందాన్ని 'ఎ' అని పిలిచినప్పుడు, అది అంత ఆనందంగా లేదని మీరు గ్రహిస్తారు; మరియు మీరు దు:ఖాన్ని 'బి' అని పిలిచినప్పుడు, అది అంత డు:ఖమయం అనిపించదు. మూడ్‌లను 'ఎ' మరియు 'బి' అని పిలవడం ద్వారా దూరం ఏర్పడుతుంది. మీరు ఆనందం అని చెప్పినప్పుడు, పదంలో చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు దానిని అంటిపెట్టుకుని ఉండాలని, అది పోకూడదని మీరు అంటున్నారు. మీరు సంతోషంగా లేరని చెప్పినప్పుడు, మీరు కేవలం ఒక పదాన్ని ఉపయోగించడం లేదు; అందులో చాలా సూచించబడింది.*


*మీకు అది వద్దు, ఉండకూడదని అంటున్నారు. ఈ విషయాలన్నీ తెలియకుండానే చెబుతున్నాయి. కాబట్టి ఏడు రోజుల పాటు మీ మానసిక స్థితి కోసం ఈ కొత్త నిబంధనలను ఉపయోగించండి. మీరు కొండపై కూర్చున్నట్లుగా, మరియు లోయలో మేఘాలు మరియు సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు వస్తున్నట్టుగా, మరియు కొన్నిసార్లు పగలు మరియు కొన్నిసార్లు రాత్రి అయినట్లుగా, చూసేవారిగా ఉండండి. దూరంగా ఉన్న కొండపై పరిశీలకుడిగా ఉండండి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 27 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 27. LABELS 🍀*


*🕉.  Don't use the words happiness and unhappiness, because these words carry judgments. Simply watch without judging-just say, "This is mood ‘A’ and this is mood ‘B’". 🕉*


*"A" mood has gone, now "B" mood is here, and you are simply a watcher. Suddenly you will realize that when you call happiness "A," it is not so happy; and when you call unhappiness "B," it is not so unhappy. Just by calling the moods "A" and "B" a distance is created. When you say happiness, much is implied in the word.  You are saying you want to cling to it, that you don't want it to go. When you say unhappy, you are not just using a word; much is implied in it.*


*You are saying that you don't want it, that it should not be there. All these things are said unconsciously. So use these new terms for your moods for seven days. Just be a watcher--as if you are sitting on top of the hill, and in the valley clouds and sunrises and sunsets come, and sometimes it is day and sometimes night. Just be a watcher on the hill, far away.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 469 - 3  / Sri Lalitha Chaitanya Vijnanam  - 469  - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।*

*సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀*


*🌻 469. 'వయోవస్థా వివర్జితా' - 3  / 469. 'vayovasdha vivarjita'- 3 🌻*


*బ్రహ్మదేవుడికే వయోపరిమితి యున్నట్లు దీని వలన తెలియును. అనగా ఇతరులందరికి కూడ వయోపరిమితి యున్నట్లే. శ్రీమాతకు మాత్రము యిట్టి వయోపరిమితి లేదు. ముందు తెలిపినట్లు ఋషులు, యోగులు, దివ్యపురుషులు వయోపరిమితి యున్ననూ, అందలి అవస్థలకు గురికారు. వారు ఆత్మ జ్ఞానముతో యుండుటవలన వయో అవస్థలు వుండవు. వయో పరిమితి యుండును. సామాన్యులకు వయోపరిమితి మరియు అవస్థలు కూడ యుండును. శ్రీమాతకు ఈ రెండునూ లేవు. ఈ విశిష్టతను తెలియ వలెనని ఈ నామము యొక్క ఉద్దేశ్యము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 469 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita*

*sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻*


*🌻 469. 'vayovasdha vivarjita'- 3 🌻*


*Because of this it is known that even Brahma has an age limit. That means everyone else has an age limit too. But there is no age limit for Shrimata. As mentioned earlier, even though sages, yogis and divine men have age limit they do not succumb to such conditions. As they are self-aware, they do not have age related conditions. There is an age limit. Common people have age limit and conditions too. Srimata has neither of these. The meaning of this name is to know this peculiarity.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page