top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 13, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 13, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹13, FEBRUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 133 / Kapila Gita - 133 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 17 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 17 🌴

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 725 / Vishnu Sahasranama Contemplation - 725 🌹

🌻725. ఏకః, एकः, Ekaḥ🌻

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 686 / Sri Siva Maha Purana - 686 🌹 🌻. త్రిపుర వర్ణనము - 6 / Description of Tripura (the three cities) - 6 🌻

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 305 / Osho Daily Meditations - 305 🌹 🍀 307. సరిహద్దులు / 307. BOUNDARIES 🍀

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 432-2 🌹 🌻 432. 'చందనద్రవ దిగ్ధాంగీ'- 2 / 432. 'Chandandrava Digdhangi'- 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 13, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శబరి జయంతి, కాలాష్టమి, కుంభ సంక్రాంతి, Shabari Jayanti, Kalashtami, Kumbha Sankranti🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 20 🍀*


37. సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |

ఆకాశనిర్విరూపశ్చ నిపాతీ హ్యవశః ఖగః

38. రౌద్రరూపోఽంశురాదిత్యో బహురశ్మిః సువర్చసీ |

వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఒకప్పుడు నీవు కార్యోత్సాహివే కర్మచేస్తావు. వేరొకప్పుడు కార్య విముఖుడవై ప్రశాంతస్థితి నభిలషిస్తావు. ఈ రెండు ప్రవృత్తులనూ కలపడం కష్టం. కానీ రెంటికీ సమన్వయం కుదిరే సమయం ఒకనాటికి వస్తుంది. అంతరంగమున నొకవంక ప్రశాంతి నెలకొని యుండగా, దాని ఆసరాతో వేరొక వంక నీవు కార్యోత్సాహివి కూడ కాగలవు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: కృష్ణ సప్తమి 09:47:41 వరకు

తదుపరి కృష్ణ అష్టమి

నక్షత్రం: విశాఖ 26:36:22 వరకు

తదుపరి అనూరాధ

యోగం: వృధ్ధి 14:16:42 వరకు

తదుపరి ధృవ

కరణం: బవ 09:43:42 వరకు

వర్జ్యం: 08:05:52 - 09:42:24

మరియు 30:30:20 - 32:04:04

దుర్ముహూర్తం: 12:53:23 - 13:39:35

మరియు 15:11:59 - 15:58:11

రాహు కాలం: 08:10:25 - 09:37:02

గుళిక కాలం: 13:56:55 - 15:23:32

యమ గండం: 11:03:40 - 12:30:17

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53

అమృత కాలం: 17:45:04 - 19:21:36

సూర్యోదయం: 06:43:48

సూర్యాస్తమయం: 18:16:47

చంద్రోదయం: 00:45:00

చంద్రాస్తమయం: 11:24:39

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: మిత్ర యోగం - మిత్ర లాభం

26:36:22 వరకు తదుపరి మానస

యోగం - కార్య లాభం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 133 / Kapila Gita - 133 🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 17 🌴*


*17. దేవహూతిరువాచ*

*పురుషం ప్రకృతిర్బ్రహ్మన్ న విముంచతి కర్హిచిత్|*

*అన్యోన్యాపాశ్రయాత్వాచ్చ నిత్యత్వాచ్చానయోః ప్రభో॥*


*తాత్పర్యము : దేవహూతి వచించెను - ప్రభూ! ప్రకృతి-పురుషుడు రెండును నిత్యములు. అవి ఒకదానిని మరియొకటి ఆశ్రయించుకొని యుండును. కనుక, ప్రకృతి పురుషుని ఎన్నడు త్యజింపదు.*


*వ్యాఖ్య : ఆత్మ జ్ఞ్యానం కలిగాక ప్రకృతి పురుషున్ని విడిచి పెడుతుందా? జీవాత్మ పరమాత్మ ప్రకృతీ మూడూ అనాధులు. ఎంత తపస్సు చేసినా పురుషున్ని ప్రకృతి వదిలి పెడుతుందా? ఒక దాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ప్రకృతీ పురుషుడూ రెండూ నిత్యములూ, ఒక దాన్ని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 133 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 17 🌴*


*17. devahūtir uvāca*

*puruṣaṁ prakṛtir brahman na vimuñcati karhicit*

*anyonyāpāśrayatvāc ca nityatvād anayoḥ prabho*


*MEANING : Śrī Devahūti inquired: My dear brāhmaṇa, does material nature ever give release to the spirit soul? Since one is attracted to the other eternally, how is their separation possible?*


*PURPORT : Devahūti, the mother of Kapiladeva, here makes her first inquiry. Although one may understand that spirit soul and matter are different, their actual separation is not possible, either by philosophical speculation or by proper understanding. The spirit soul is the marginal potency of the Supreme Lord, and matter is the external potency of the Lord. The two eternal potencies have somehow or other been combined, and since it is so difficult to separate one from the other, how is it possible for the individual soul to become liberated? By practical experience one can see that when the soul is separated from the body, the body has no real existence, and when the body is separated from the soul one cannot perceive the existence of the soul. As long as the soul and the body are combined, we can understand that there is life. But when they are separated, there is no manifested existence of the body or the soul. This question asked by Devahūti of Kapiladeva is more or less impelled by the philosophy of voidism. The voidists say that consciousness is a product of a combination of matter and that as soon as the consciousness is gone, the material combination dissolves, and therefore there is ultimately nothing but voidness. This absence of consciousness is called nirvāṇa in Māyāvāda philosophy.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 725 / Vishnu Sahasranama Contemplation - 725 🌹*


*🌻725. ఏకః, एकः, Ekaḥ🌻*


*ఓం ఏకైస్మై నమః | ॐ एकैस्मै नमः | OM Ekaismai namaḥ*


*సజాతీయవిజాతీయ స్వగతత్వావిభేదతః ।*

*పరమార్థత్వేనవినిర్ముక్తాదేక ఉచ్యతే ।&

*ఏకమేవాఽద్వితీయం బ్రహ్మేతి శ్రుతిసమీరణాత్ ॥*


*వాస్తవ పరమార్థ స్థితిలో పరమాత్ముడు సజాతీయ విజాతీయ స్వగత భేదములనుండి సంపూర్ణముగాను, మిక్కిలిగాను వినిర్ముక్తుడు కావున ఏకః.*


*ఒకే యొకడు. ఏకమేవాఽద్వితీయమ్ (ఛాందోగ్యోపనిషత్ 6.2.1) 'పరమాత్మ తత్త్వము ఒక్కటియే; తనకు భిన్నముగా రెండవది మరి ఏదియు లేనిది' అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 725🌹*


*🌻725. Ekaḥ🌻*


*OM Ekaismai namaḥ*


सजातीयविजातीय स्वगतत्वाविभेदतः ।

परमार्थत्वेनविनिर्मुक्तादेक उच्यते ।

एकमेवाऽद्वितीयं ब्रह्मेति श्रुतिसमीरणात् ॥


Sajātīyavijātīya svagatatvāvibhedataḥ,

Paramārthatvenavinirmuktādeka ucyate,

Ekamevā'dvitīyaṃ brahmeti śrutisamīraṇāt.


*He is one (only) as in truth. He is bereft of any difference of like kind, of different kind or internal differences vide the śruti एकमेवाऽद्वितीयं / Ekamevā’dvitīyaṃ (Chāndogyopaniṣat 6.2.1) 'one only without a second'.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 686 / Sri Siva Maha Purana - 686 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*

*🌻. త్రిపుర వర్ణనము - 6 🌻*


అపుడు ధీరుడగు మయుడు తపః ప్రభావముచే తారకాక్షునకు బంగారముతో, కమాలాక్షునకు వెండితో (57), విద్యున్మాలికి ఇనుముతో మూడు రకముల ఉత్తమ దుర్గములను నిర్మించెను . అవి క్రమముగా స్వర్గమునందు,ఆకాశమునందు, మరియు భూమిపై ఉండెడివి (58). మయుడు వారి హితమునందు లగ్నమైన మనస్సు గలవాడై ఆ రాక్షసులకు మూడు నగరములను ఇచ్చి వాటియందు తాను స్వయముగా ప్రవేశించెను (59). మహా బలపరాక్రమవంతులగు తారకుని పుత్రులు ఈ మూడు నగరములను పొంది వాటి యందు ప్రవేశించి సమస్త భోగముల ననుభవించిరి (60).


ఆ నగరములయందు కల్పవృక్షములు దట్టముగా నుండెను. ఏనుగులతో, గుర్రములతో అవి హడావుడిగా నుండెను. అనేక ప్రసాదములతోనిండి యుండెను. మణితోరణములతో అలంకరింపబడెను (61). సూర్యకాంతులను విరజిల్లే ప్రాసాదములు అన్నివైపులా సింహద్వారములను కలిగి యుండెను. పద్మరాగమణులు పొదిగి చంద్రుని వలె తెల్లనైన కాంతులు గల ప్రాసాదములతో (62), కైలాసశిఖరమును బోలిన దివ్యమగు గోపురములతో ఆ నగరములు ప్రకాశించెను. వాటియందు దేవతా స్త్రీలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు కోలాహలముగా నుండిరి (63). ప్రతి గృహమునందు రుద్రలయము, అగ్ని హోత్రము ప్రతిష్ఠింపబడి యుండెను. శివభక్తి నిష్ఠులు, శాస్త్రపండితులు అగు బ్రహ్మణశ్రేష్ఠులు ఆ నగరములలో నుండిరి (64).


ఆ మూడు నగరములు బావులతో, దిగుడు బావులతో, చెరువులతో ప్రకాశించినవి. వాటిలోని ఉద్యానవనములు ఉత్తమగుణములు కలిగి స్వర్గమునుండి జారినవా యన్నట్లు ఉన్న వృక్షములతో కూడియుండెను (65). ఆ నగరములు నదులతో, నదములతో మరియు విశాలమగు సరస్సులతో ప్రకాశించెను. అన్ని రకములు ఫలములతో నిండిన అనేక వృక్షములతో అవి సుందరముగా నుండెను (66). మదించిన ఏనుగుల గుంపులతో, అందమగు గుర్రములతో, వివిధ ఆకారములు గల రథములతో మరియు పల్లకీలతో ఆ నగరము భాసిల్లెను (67). ఆ మూడు నగరములు వేర్వేరు స్థలములలో నిర్మింపబడిన సమయమును నిర్దేశించే యంత్రములతో, క్రీడాంగణములతో, మరియు వేదాధ్యయన పాఠశాలలతో ప్రకాశించినవి (68).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 686🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴*


*🌻 Description of Tripura (the three cities) - 6 🌻*


57-58. Then the intelligent Maya built the cities by means of his penance: the golden one for Tārakākṣa, the silver one for Kamalākṣa and the steel one for Vidyunmālī. The three fortlike excellent cities were in order in heaven, sky and on the earth.


59. After building the three cities (tripura) for the Asuras, Maya established them there desiring their welfare.


60. Entering the three cities (tripura) thus, the sons of Tāraka, of great strength and valour experienced all enjoyments.


61. They had many Kalpa trees[5] there. Elephants and horses were in plenty. There were many palaces set with gems.


62. Aerial chariots shining like the solar sphere, set with Padmarāga stones, moving in all directions looking like moonshine illuminated the cities.


63-64. There were many palaces, divine minarets resembling the summits of the mount Kailāsa. Celestial damsels, Gandharvas, Siddhas, and Cāraṇas were also there. There were temples of Rudra. In every house, people performed the rites of Agnihotra. There were excellent brahmins well-versed in sacred texts and devoted to Śiva always.


65-66. The cities were embellished with many trees in the well-laid out gardens and parks as if they had dropped from heaven. There were beautiful tanks, lakes, wells, rivers and huge ponds. They were very beautiful with plenty of fruit-bearing trees.


67. The cities were decorated with camps and tents of various sizes and chariots with beautiful horses. There were herds of elephants in rut too.


68. There were time-indicators, playgrounds and different halls for Vedic studies.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 307 / Osho Daily Meditations - 307 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 307. సరిహద్దులు 🍀*


*🕉. ప్రేమ అంటే ప్రాదేశిక సరిహద్దులను వదలడం. ఆ అదృశ్య రేఖ మాయమవ్వాలి, అందుకే భయం పుడుతుంది, ఎందుకంటే ఇది మన జంతు వారసత్వం. అందుకే, మీరు మనస్సు ఉంటే ప్రేమ స్థితిలో ఉన్నట్లయితే, మీరు జంతు వారసత్వాన్ని మించి పోతారు. మొదటి సారి మీరు మనిషిగా, నిజంగా మనిషిగా మారారు. 🕉*


*మీరు నిజంగా సంపన్నమైన, సంపూర్ణమైన, అద్భుతమైన ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపాలనుకుంటే, హద్దులు వదలడం తప్ప వేరే మార్గం లేదు. ప్రజలతో మరింతగా పరిచయం పెంచుకోవడమే ఏకైక మార్గం. మీ ఉనికిని అతిక్రమించడానికి ఎక్కువ మంది వ్యక్తులను అనుమతించండి, ఎక్కువ మంది వ్యక్తులు మీలో ప్రవేశించడానికి అనుమతించండి. ఒకరు గాయపడవచ్చు-అదే భయం-కాని ఆ రిస్క్ తీసుకోవాలి. ఇది విలువైనది. మీ జీవితమంతా మిమ్మల్ని మీరు రక్షించుకుంటే మరియు మీ దగ్గరకు ఎవరినీ అనుమతించకపోతే, మీరు జీవించి ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి?*


*మీరు చనిపోక ముందే చనిపోతారు. మీరు అస్సలు జీవించి ఉండరు. మీరు ఎన్నడూ లేనట్లుగా ఉంటుంది, ఎందుకంటే సంబంధం కంటే మరొక జీవితం లేదు. కాబట్టి రిస్క్ తీసుకోవాల్సిందే. మనుషులందరూ నీలాంటి వారే. ముఖ్యంగా మానవ హృదయం ఒకటే. కాబట్టి ప్రజలు దగ్గరికి రావడానికి అనుమతించండి. మీరు వారిని మీ దగ్గరికి రావడానికి అనుమతిస్తే, వారు మిమ్మల్ని వారి దగ్గరికి రావడానికి అనుమతిస్తారు. సరిహద్దులు అతివ్యాప్తి చెందినప్పుడు, ప్రేమ జరుగుతుంది.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 307 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 307. BOUNDARIES 🍀*


*🕉. Love means dropping territorial boundaries. That invisible line has to disappear, hence fear arises, because it is our animal heritage. That's why, once you are in a loving state if mind, you go beyond animal heritage. For the first time you become human, really human. 🕉*


*If you really want to live a rich, fulfilled, tremendously vibrant life, then there is no other way but to drop boundaries. The only way is to make more and more contact with people. Allow more and more people to trespass your being, allow more and more people to enter you. One can be hurt-that's the fear-but that risk has to be taken. It is worth it. If you protect yourself your whole life and nobody is allowed near you, what is the point of your being alive?*


*You will be dead before you are dead. You will not have lived at all. It would be as if you had never existed, because there is no other life than relationship. So the risk has to be taken. All human beings are just like you. Essentially the human heart is the same. So allow people to come close. If you allow them to come close to you, they will allow you to come close to them. When boundaries overlap, love happens.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।*

*చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀*


*🌻 432. 'చందనద్రవ దిగ్ధాంగీ'- 2 🌻*


*శివుని ఆరాధనమున కన్నులు, చెక్కిళ్ళు, పెదవులు ఎరుపెక్కుటయే గాక దేహమంతయూ శివతేజస్సు వ్యాపింపగ, ఆ తేజస్సు యొక్క వేడిమిని ఉపశమింప జేయుటకు చల్లని గంధపు పూత శ్రీమాతకు ఆవశ్యకమైనదని ఋషుల అభిప్రాయము. నరసింహుని శాంతింపజేయుటకు కూడ గుట్టలు గుట్టలుగ గంధపు లేపనమే వాడిరని ప్రతీతి. పుణ్యక్షేత్రమగు సింహాచలమున వరాహ నృసింహుని సంవత్సర మంతయూ గంధపు పూతతోనే నింపియుంతురు.*


*కారణము ఏమనగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించుటకు శ్రీ మహా విష్ణువు శివతేజస్సు నావాహనముచేసి ప్రళయకాల రుద్రునివలె చెలరేగి వరాహ నృసింహుల రూపమున సంహరించెను. శివుని తేజము గల నృశింహుని శాంతింప జేయుటకు గంధమే శరణ్యమైనది. అట్లే సతతము శివుని ఆరాధించు శ్రీమాత అంగములకు గంధ మావశ్యకమై నిలచినది అని భావము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh*

*Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻*


*🌻 432. 'Chandandrava Digdhangi'- 2 🌻*


*Sages are of the opinion that the eyes, cheekbones and lips become red in the worship of Shiva, so that the effulgence of Shiva spreads throughout the body, and to relieve the heat of that effulgence, the application of cold sandalwood is necessary for Sri Mata. It is believed that sandalwood ointment was also used to appease Lord Narasimha. Varaha Nrisimha is filled with sandal paste on the body in the shrine all year round. The reason is that in order to kill Hiranyaksha and Hiranyakaship,*


*Lord Vishnu used the essence of Shiva and burst out like Rudra and killed them in the form of Nrisimha. Sandalwood is the only refuge to pacify Nrisimha, who has the energy of Lord Shiva. Similarly, it is believed that sandalwood is essential for the limbs of Srimata who constantly worships Lord Shiva.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Comments


bottom of page