top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 13, JUNE 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 13, JUNE 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 13, JUNE 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 384 / Bhagavad-Gita - 384 🌹

🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 12 / Chapter 10 - Vibhuti Yoga - 12 🌴

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 231 / Agni Maha Purana - 231 🌹

🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 1 / Mode of conducting the bathing festival (snāna) - 1 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 096 / DAILY WISDOM - 096 🌹

🌻5. ఆదర్శం యొక్క దృక్కోణం నుండి ప్రతిదీ వివరించడం / 2-07. Mātrkā chakra sambodhah   - 1 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 362 🌹

6) 🌹. శివ సూత్రములు - 98 / Siva Sutras - 98 🌹

🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 1 / 2-07. Mātrkā chakra sambodhah   - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 13, జూన్‌, June 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 7 🍀*


*13. బుభూకార హతారాతిర్గర్వ పర్వత మర్దనః | హేతుస్త్వ హేతుః ప్రాంశుశ్చ విశ్వకర్తా జగద్గురుః*

*14. జగన్నాథో జగన్నేతా జగదీశో జనేశ్వరః | జగత్శ్రితో హరిః శ్రీశో గరుడస్మయభంజకః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : హృదయమే ప్రధాన కేంద్రం - పూర్ణయోగంలో ఏకాగ్రతా సాధనకు ప్రధాన కేంద్రం హృదయమే. చైతన్యం ఊర్ధ్వగతి నందుకునే పర్యంతం ఏకాగ్రతా సాధన హృదయ స్థానంలోనే జరుగవలసి వుంటుంది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: కృష్ణ దశమి 09:30:10 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: రేవతి 13:34:10 వరకు

తదుపరి అశ్విని

యోగం: సౌభాగ్య 05:55:50 వరకు

తదుపరి శోభన

కరణం: విష్టి 09:31:10 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 08:19:12 - 09:11:50

రాహు కాలం: 15:33:26 - 17:12:07

గుళిక కాలం: 12:16:03 - 13:54:44

యమ గండం: 08:58:40 - 10:37:22

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42

అమృత కాలం: 12:35:30 - 26:11:50

సూర్యోదయం: 05:41:18

సూర్యాస్తమయం: 18:50:48

చంద్రోదయం: 01:53:04

చంద్రాస్తమయం: 14:33:54

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: శుభ యోగం - కార్య

జయం 13:34:10 వరకు తదుపరి

అమృత యోగం - కార్య సిధ్ది

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 384 / Bhagavad-Gita - 384 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 12 🌴*


*12. అర్జున ఉవాచ*

*పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |*

*పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ||*


🌷. తాత్పర్యం :

*అర్జునుడు ఇట్లు పలికెను: నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్త్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేని వాడవు, ఘనమైన వాడవు అయి యున్నావు.*


🌷. భాష్యము :

*ఈ అధ్యాయపు ముఖ్యమైన నాలుగుశ్లోకములను శ్రవణము చేసినంతనే అర్జునుడు సర్వసందేహముల నుండి ముక్తుడై శ్రీకృష్ణుని పూర్ణపురుషోత్తముడైన ఆదిదేవునిగా అంగీకరించెను. కనుకనే అతడు “నీవే పరబ్రహ్మమువు మరియు ఆదిదేవుడవు” అని ప్రకటించెను. సమస్తము తన నుండియే ఉద్భవించినదనియు మరియు దేవ, మనుష్యాది జీవులందరును తన పైననే ఆధారపడినవారనియు శ్రీకృష్ణుడు పూర్వమే ప్రకటించియున్నాడు. కాని వారు అజ్ఞానకారణముగా తమనే పరతత్త్వముగా భావించుచు తాము దేవదేవునికి ఆధీనులము కామని భావింతురు. అట్టి అజ్ఞానము భక్తియుతసేవ ద్వారా సంపూర్ణముగా తొలగునని శ్రీకృష్ణభగవానుడు గడచిన శ్లోకములలో వివరించియున్నాడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 384 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 10 - Vibhuti Yoga - 12 🌴*


*12. arjuna uvāca*

*paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān*

*puruṣaṁ śāśvataṁ divyam ādi-devam ajaṁ vibhum*


🌷 Translation :

*Arjuna said: You are the Supreme Personality of Godhead, the ultimate abode, the purest, the Absolute Truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest.*


🌹 Purport :

*In these two verses the Supreme Lord gives a chance to the Māyāvādī philosopher, for here it is clear that the Supreme is different from the individual soul. Arjuna, after hearing the essential four verses of Bhagavad-gītā in this chapter, became completely free from all doubts and accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead. He at once boldly declares, “You are paraṁ brahma, the Supreme Personality of Godhead.”*


*And previously Kṛṣṇa stated that He is the originator of everything and everyone. Every demigod and every human being is dependent on Him. Men and demigods, out of ignorance, think that they are absolute and independent of the Supreme Personality of Godhead. That ignorance is removed perfectly by the discharge of devotional service. This has already been explained in the previous verse by the Lord. Now, by His grace, Arjuna is accepting Him as the Supreme Truth, in concordance with the Vedic injunction.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 231 / Agni Maha Purana - 231 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 69*


*🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 1 🌻*


*అగ్నిదేవుడు పలికెను.: 'బ్రహ్మదేవా! ఇపుడు నేను స్నానోత్సవమునుగూర్చి సవిస్తరముగా చెప్పెదను. ప్రాసాదము ఎదుట మండపము క్రింద మండలముపై కలశములు ఉంచవలెను. ప్రారంభమునందు అన్ని కర్మలు చేయు నపుడును శ్రీహరి ధ్యానము పూజహోమములు చేయవలెను. పూర్ణాహుతితో పాటు వెయ్యి లేక నూటఎనిమిది హోమములు చేయవలెను. స్నానద్రవ్యములు తీసికొని వచ్చి కలశవిన్యాసము చేయవలెను. కంఠసూత్రయుక్త కుంభములను అధివాసనము చేసి మండలముపై ఉంచవలెను.*


*చతురస్రమండలము నిర్మించి దానిని పండ్రెండు రేఖలచే విభజించవలెను. ప్రక్క నున్న రేఖను తుడిచివేయువలెను. ఈ విధముగ ఆ మండలమపై నాలుగు దిక్కులందును తొమ్మిదేసి కష్ఠకములు స్థాపించి వాటిని పూర్వాదిక్రమమున వరిపిండి మొదలైన వాటితో నింపవలెను. పిమ్మట విద్వాంసుడు కుంభముద్రతో పూర్వాది దిక్కులందున్న నవకమునందు కలశ లుంచవలెను. పుండరీకాక్ష మంత్రముతో వాటిలో దర్భ లుంచవలెను. సర్వరత్నములును ఉంచి ఉదకపూర్ణకుంభమును మధ్యభాగమునందుంచి. మిగిలిన ఎనిమిది కుంభములో క్రమముగ యవ-వ్రీహి-తిల-నీవార-శ్యామాక-కులత్థ-ముద్గ-శ్వేత సర్షపములు వేసి ఎనిమిది దిక్కులందును. స్థాపింపవలెను. పూర్వదిక్కునందున్న నవకమునందు మధ్య ఘృతపూర్ణకుంభ ముంచవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 231 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 69*

*🌻 Mode of conducting the bathing festival (snāna) - 1 🌻*


The Fire (Lord) said:


1. O Brahman! Listen! I shall describe in detail (the mode of conducting) the bathing festival. The pitchers should be placed in a drawn figure in the shed in front of the temple.


2. First of all, God Hari (Viṣṇu) should be contemplated, propitiated and offered oblations before doing anything. One should offer oblations hundred or thousand times along with the final one.


3. The materials for bathing [i.e., snāna-dravya] should then be brought and the pitchers also should be placed. The pitchers to the necks of which threads have been tied should be made fragrant and they should be held in a circle.


4. A square should be drawn and divided into eleven compartments. The gruel should be placed at the centre, the adjacent parts having been cleaned.


5. The nine angular points commencing with east should be filled with powdered rice etc., and the pitcher should be brought by the wise man after having formulated the kumbha mudrā[1].


6. Darbha grass should be put on them with the puṇḍarīkākṣa (an epithet of Viṣṇu) (lotus-eyed) mantra. A pitcher filled with water and containing all gems should be placed in the middle.


7. The barley, paddy, sesamum, uncultivated rice, śyāmāka (grains), horse gram, green gram and white mustard seeds. (should be put) in the eight directions in order.


8-9. A pitcher filled with ghee should be placed in the middle of the eastern side in the midst of nine pitchers. The remaining pitchers should be filled with the decoctions of the (barks of) palāśa, aśvattha, nyagrodha, bilva, udumbara, śirīṣa, jambū, śamī and kapittha. The central pitcher in the nine pitchers in the south-east should be filled with honey.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 96 / DAILY WISDOM - 96 🌹*

*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻5. ఆదర్శం యొక్క దృక్కోణం నుండి ప్రతిదీ వివరించడం 🌻*


*ఆధ్యాత్మిక జీవితం అంటే మీ నడవడిక లేదా జీవన విధానం మరియు ఆలోచనా విధానం మరియు అర్థం చేసుకునే విధానాలైన ప్రతి కోణం ఉన్నత ఆదర్శాల దృక్కోణం నుంచి అర్థం చేసుకోవడం. ఇది భౌతిక, సామాజిక, నైతిక, రాజకీయ లేదా మానసిక - జీవితంలోని ఏ పరిస్థితైనా కావచ్చు. ఇది ప్రస్తుతం మీకు అర్థం కాని, భవిష్యత్తులో మాత్రమే అనుభూతి లోకి వచ్చే ఆదర్శమే కావచ్చు. కానీ అది ఇప్పుడు మిమ్మల్ని ఆ ఆదర్శాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నానికి అడ్డు కాకూడదు. ఒకవేళ మీరు ఆ కారణంగా ఆ ఆదర్శాన్ని కనుక చేరుకునే ప్రయత్నం చేయకపోతే, మీరు అసంపూర్ణ మానవుల లాగా మిగిలిపోతారు. అది మిమ్మల్ని అసంతృప్తిగా ఉంచుతుంది.*


*ఈ విషయంలో జంతు స్వభావం మాత్రమే అసమర్థమైనది కానీ మానవ స్వభావం కాదు. జంతువులు మరియు జంతు స్వభావం ఉన్న మానవులు కూడా ప్రస్తుత స్థితికి అతీతమైన ఆదర్శ కోణం నుండి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోలేరు. ఉన్నతమైన వాటి వెలుగులో దిగువను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని మనం ఒకసారి మేల్కొలుపుతే, అప్పుడు మాత్రమే మనం నిజమైన మానవులుగా పిలవబడవచ్చు. ఎందుకంటే జంతువులపై మానవులకు ఉన్న ఆధిక్యత ఈ ప్రత్యేకత లోనే ఉంది. కేవలం రెండు కాళ్లతో నడిచినందున, ఒక వ్యక్తిని నిజమైన మనిషిగా పరిగణించాల్సిన అవసరం లేదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 96 🌹*

*🍀 📖 The Ascent of the Spirit 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻5. Interpreting Everything from the Point of View of the Ideal 🌻*


*A spiritual life is that conduct or way of living and mode of thinking and understanding which enables one to interpret every situation in life—physical, social, ethical, political or psychological—from the point of view of the ideal that is above and is yet to be reached, notwithstanding the fact that it is a remote ideal in the future. The inability to interpret the practical affairs of life, and the present state of existence in terms of the higher ideal immediately succeeding, would make us incomplete human beings and keep us unhappy.*


*It is only the animal nature that is incapacitated in this respect. The animals and even human beings who have the animal nature preponderating in them cannot interpret present situations from the point of view of the ideal that is transcendent to the present state. And once we are awakened to the capacity of being able to understand and interpret the lower in the light of the higher, then it is that we can be called real humans, for the superiority of humans over animals lies just in this special endowment. Merely because one walks with two legs, one need not necessarily be regarded as truly human.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 361 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. ధ్యానమంటే మనసులోని విషయాలనన్నిట్నీ ఖాళీ చెయ్యడం. ఖాళీ మనసు చైతన్యంతో నిండి వుంటుంది. కాబట్టి 'ఖాళీ' అన్న మాటకు భయపడకు. ఒకసారి అన్ని సరిహద్దుల్ని అధిగమించి నువ్వు స్వేచ్ఛ పొందితే ఆకాశంలా విస్తరిస్తావు. అనంతమవుతావు. 🍀*


*ధ్యానమంటే మనసులోని విషయాలనన్నిట్నీ ఖాళీ చెయ్యడం. జ్ఞాపకం, వూహా, దురభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు, ఆశలు, అనుభూతులు అన్నిట్నీ, నీకు బయటికి దేనినీ పంపాల్సిన పని లేని రోజు నీ జీవితంలో గొప్ప రోజు. అక్కడ స్వచ్ఛమైన ఖాళీ వుంటుంది. అక్కడ స్వచ్ఛమైన చైతన్యాన్ని చూస్తావు. మనసుకు సంబంధించి అక్కడ ఏమీ లేదు. కానీ అది పొంగి పొర్లేది. అస్తిత్వం తొణికిసలాడేది.*


*ఖాళీ మనసు చైతన్యంతో నిండి వుంటుంది. కాబట్టి 'ఖాళీ' అన్న మాటకు భయపడకు. అది వ్యతిరేకమయింది కాదు. అట్లా అనుకోవడం పాత అలవాటు. దాని వల్ల నష్టమెక్కువ. ఒకసారి అన్ని సరిహద్దుల్ని అధిగమించి నువ్వు స్వేచ్ఛ పొందితే ఆకాశంలా విస్తరిస్తావు. అనంతమవుతావు. అదే దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవడం, లేదా బుద్ధునితత్వం, దాన్ని మరింకే పేరుతోనైనా పిలువు. ధర్మం, తావో, సత్యం, నిర్వాణం - అవన్నీ దాన్నే చెబుతాయి.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 098 / Siva Sutras - 098 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 1 🌻*

*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*


*మాతృక - అక్షరాలు; చక్ర - సమూహం; సంబోధ - సంపూర్ణ అవగాహన. - మాతృక అని పిలువబడే అక్షరాల సమూహం పరిపూర్ణ అవగాహనను ఇస్తుంది. ఈ సూత్రం అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ, శివుడు కొన్ని సందేశాలను సూక్ష్మంగా తెలియ జేయదలచుకున్నాడు. అక్షరాల సమూహం పరిపూర్ణ అవగాహనను అందిస్తుందని ఈ సూత్రం చెబుతుంది. సాధారణంగా, అక్షరాల సమూహం అంటే మంత్రం. కానీ అంతిమ మంత్రం 'నేను అదే అయి ఉన్నాను' లేదా 'నేనే బ్రాహ్మమును' అని మనం చూసాము. కాబట్టి 'నేను అదే అయి ఉన్నాను ' అనే అక్షరాల సమూహమును, అత్యున్నత మంత్రం అని పిలుస్తారు *


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 098 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-07. Mātrkā chakra sambodhah   - 1 🌻*

*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*


*Mātṛkā – letters; chakra – group; sambodha – perfect understanding. - The group of letters known as mātṛkā gives perfect understanding. On the face of it, one may feel that the aphorism appears to be incomplete. But, Śiva chooses to convey certain messages in a subtle way. The aphorism says that a group of letters provide perfect understanding. Generally, group of letters mean a mantra. But it is already seen that the ultimate mantra is “I am That” or the affirmation “I am the Brahman”. Therefore the group of letters, known as Supreme mantra is the affirmation “I am That”. *


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page