top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 13, SEPTEMBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 13, SEPTEMBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀

1) 13, SEPTEMBER 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 427 / Bhagavad-Gita - 427 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 13 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 13 🌴

3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 788 / Sri Siva Maha Purana - 788 🌹

🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 6 / The fight between the Gaṇas and the Asuras - 6 🌻

4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 41 / Osho Daily Meditations  - 41 🌹

🍀 41. సామాన్యత / 41. MEDIOCRITY 🍀

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -3 🌹

🌻 484. 'డాకినీశ్వరీ' - 3 / 484. 'Dakinishwari' - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 13, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌻*


*🍀. శ్రీ గజానన స్తోత్రం - 11 🍀*


*11. సురేంద్రసేవ్యం హ్యసురైః సుసేవ్యం సమానభావేన విరాజయంతమ్ |*

*అనంతవాహం ముషక ధ్వజం తం గజాననం భక్తియుతా భజామః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : మూడు త్రోవలు - మూడే ప్రధానమైన త్రోవలు, సాధకునికి ఉన్నాయి. (1) భగవంతునిపై భారం వేసి, ఆయన అనుగ్రహం కొరకు వేచి వుండడం, (2) అద్వైతి వలె, బౌద్ధుని వలె, స్వశక్తి మీదనే ఆధారపడడం (3) మధ్యేమార్గ మవలంబించి, పరమ సంసిద్ధి కొరకై ఆకాంక్ష, అపర ప్రవృత్తుల నిరాకరణ మున్నగు వాని ద్వారా ఈశ్వరశక్తి తోడ్పాటుతో ముందుకు సాగడం.🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ చతుర్దశి 28:50:21

వరకు తదుపరి అమావాశ్య

నక్షత్రం: మఘ 26:01:38 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: సిధ్ధ 26:08:06 వరకు

తదుపరి సద్య

కరణం: విష్టి 15:35:46 వరకు

వర్జ్యం: 12:31:30 - 14:19:26

దుర్ముహూర్తం: 11:47:27 - 12:36:33

రాహు కాలం: 12:12:00 - 13:44:04

గుళిక కాలం: 10:39:56 - 12:12:00

యమ గండం: 07:35:47 - 09:07:51

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36

అమృత కాలం: 23:19:06 - 25:07:02

సూర్యోదయం: 06:03:42

సూర్యాస్తమయం: 18:20:17

చంద్రోదయం: 04:30:49

చంద్రాస్తమయం: 17:31:55

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: చర యోగం - దుర్వార్త

శ్రవణం 26:01:38 వరకు తదుపరి

స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 427 / Bhagavad-Gita - 427 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 13 🌴*


*13. తత్త్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా |*

*అపశ్యద్దేవస్య శరీరే పాండవస్తదా ||*


*🌷. తాత్పర్యం : ఆ సమయమున అర్జునుడు బహువేలసంఖ్యలో విభజింపబడియున్నను ఒకేచోట నిలిచియున్న విశ్వము యొక్క అనంతరూపములను శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమున గాంచెను.*


*🌷. భాష్యము : ఆ విశ్వరూపములోని మహాద్భుతమైన ఆశ్చర్యములను వివరించిన పిదప, సంజయుడు ఈ జగత్తు అంతటిని అది తన యందే కలిగి ఉన్నదని పేర్కొంటున్నాడు. ఇంకా ఆశ్చర్యముగా అర్జునుడు జగత్తు యొక్క సమస్త అస్తిత్వమునూ శ్రీ కృష్ణుడి శరీర భాగములోనే చూసాడు. అనంతమైన బ్రహ్మాండములను, వాటి యొక్క నక్షత్ర మండలములు మరియు గ్రహ-సమూహాలను ఆ పరమేశ్వరుని చిన్న అంశగా దర్శించాడు.*


*తన చిన్ననాటి లీలలలో, శ్రీ కృష్ణుడు తన విశ్వ రూపమును తల్లి యశోదకు కూడా చూపించాడు. ఆ సర్వేశ్వరుడు తన దివ్య వైభవములను మరుగున దాచి, భక్తుల ఆనందం కోసం ఒక చిన్నపిల్లవానిలా నటించాడు. శ్రీ కృష్ణుడు తన పుత్రుడే అనుకుంటూ, ఎన్ని సార్లు వద్దని చెప్పినా మన్ను తింటున్నాడని, ఒకసారి యశోదమాత, బాలుడిని గట్టిగా మందలించింది. నోట్లో పరీక్షించటానికి బాల కృష్ణుడిని నోరు తెరవమని అడిగింది. కానీ, కృష్ణుడు నోరు తెరిచినప్పుడు, ఆ తల్లికి సంభ్రమాశ్చర్యంగా, ఆయన తన యోగమాయా శక్తిచే, దానిలో విశ్వరూపమును చూపించాడు. యశోదమ్మ తన చిన్ని బాలకుని నోటిలో అనంతమైన బ్రహ్మాండములు, అద్భుతములు చూసి పూర్తిగా భ్రమకు లోనయ్యింది. ఆ యొక్క మహాశ్చర్యాన్ని తట్టుకోలేక ఆమె మూర్చిల్లబోయింది, శ్రీ కృష్ణుడు ఆ తల్లిని ముట్టుకుని మరలా మామూలు మనిషిని చేసాడు.*


*యశోదా మాతకి చూపించిన అదే విశ్వ రూపమును, భగవంతుడు, తన మిత్రుడైన అర్జునుడికి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇప్పుడిక సంజయుడు విశ్వ రూపమును దర్శించిన అర్జునుడి ప్రతిస్పందనను తెలియ చేస్తున్నాడు.*


🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 427 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 13 🌴*


*13. tatraika-sthaṁ jagat kṛtsnaṁ pravibhaktam anekadhā*

*apaśyad deva-devasya śarīre pāṇḍavas tadā*


*🌷 Translation : At that time Arjuna could see in the universal form of the Lord the unlimited expansions of the universe situated in one place although divided into many, many thousands.*


*🌹 Purport : The word tatra (“there”) is very significant. It indicates that both Arjuna and Kṛṣṇa were sitting on the chariot when Arjuna saw the universal form. Others on the battlefield could not see this form, because Kṛṣṇa gave the vision only to Arjuna. Arjuna could see in the body of Kṛṣṇa many thousands of planets. As we learn from Vedic scriptures, there are many universes and many planets. Some of them are made of earth, some are made of gold, some are made of jewels, some are very great, some are not so great, etc. Sitting on his chariot, Arjuna could see all these. But no one could understand what was going on between Arjuna and Kṛṣṇa.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 788 / Sri Siva Maha Purana - 788 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴*


*🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 6 🌻*


*తరువాత కైలాస పర్వత సానువులయందు ప్రమథ గణములకు రాక్షసులకు మధ్య శస్త్ర - అస్త్రములతో అల్లకల్లోలముగనున్న ఘోరయుద్ధము జరిగెను (44). భేరీలు, మృదంగములు, శంఖములు ధ్వని చేయుచూ వీరులకు ఉత్సాహము కలిగించుచుండెను. ఏనుగులు, గుర్రములు మరియు రథముల శబ్దములచే భూమి మారుమ్రోగి కంపించెను (45). శక్తి, తోమర, ముసల, పాశ, పట్టిశములను ఆయుధములతో మరియు బాణసమూహములతో నిండియున్న ఆకాశము అంతయూ ముత్యములను వెదజల్లినట్లు ప్రకాశించెను (46). సంహరింపబడిన ఏనుగులతో, గుర్రములతో మరియు పదాతిసైనికులతో నిండియున్న భూమి, పూర్వము వజ్రముచే కొట్టబడిన పర్వతశ్రేష్ఠములచే కప్పబడి ఉన్న స్థితిని పోలియుండెను (47). ప్రమథుల చేతిలో అనేక రాక్షసులు, రాక్షసులు చేతిలో అనేక గణములు సంహరింపబడిరి. వారి రక్త మాంసముల బురదతో నిండి భూమి యొక్క ఉపరితలము కాలుపెట్టుటకు వీలులేనిదై ఉండెను (48).*


*ప్రమథులచే సంహరింపబడిన రాక్షసులనందరినీ శుక్రాచార్యుడు మృతసంజీవని యొక్క బలముచే పలుమార్లు యుద్ధములో మరల బ్రతికించుచుండెను (49). గణములందరు వారిని చూచి కంగారుపడి భయపీడితులై శుక్రుని ఆ కార్యమును గూర్చి దేవదేవుడగు శివునకు విన్నవించిరి (50). ఆమాటలను విని రుద్రభగవానుడు తీవ్రమగు కోపమును పొందెను. ఆయన మిక్కిలి రౌద్రాకారమును పొంది భయమును గొల్పెను. ఆయన తన తేజస్సుచే దిక్కులను మండునట్లు చేసెను (51).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 788 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴*


*🌻 The fight between the Gaṇas and the Asuras - 6 🌻*


44. Then at the ridges, valleys and sides of Kailāsa, a terrible battle was fought between the leaders of the Pramathas and the Daityas. Weapons clashed with weapons.


45. The whole earth shook resonant with the sounds of great war drums, Mṛdaṅgas and conches that inspired the heroes as well as the sounds of elephants, horses and chariots.


46. The whole atmosphere was filled with javeline, iron clubs, arrows, great pestles, iron rods, pikes etc. as if strewn with pearls.


47. With the dead elephants, horses and foot soldiers, the earth shone in the same way as before when great mountains were scattered, smitten by the thunderbolt of Indra.


48. With the groups of Daityas killed by the Pramathas, and with the Gaṇas killed by the Daityas, the whole ground was filled with suets, flesh and streams of blood. It became so marshy as it became impassable.


49. With the power of Sañjīvanī, Bhārgava resuscitated the forces of the Daityas killed by the Pramathas in the battle again and again.


50. On seeing them, all the Gaṇas were agitated and terrified. They intimated to the lord of the gods what Śukra did.


51. On hearing it, lord Śiva became terribly furious. He became terrific blazing the quarters as it were.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 41 / Osho Daily Meditations  - 41 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 41. సామాన్యత 🍀*


*🕉. ఎటువంటి సామాన్యతను ఎప్పుడూ అంగీకరించ వద్దు. ఎందుకంటే అది జీవితానికి వ్యతిరేకంగా చేసే అన్యాయం. జీవితం ప్రమాదం లేకుండా ఉండాలని ఎప్పుడూ అడగవద్దు మరియు భద్రత కోసం ఎప్పుడూ అడగవద్దు, ఎందుకంటే అది మరణం కోసం అడగడమే. 🕉*


*చాలా మంది ప్రజలు ఎలాంటి ఇబ్బందిని తీసుకోకుండా సాదా మైదానంలో, సురక్షితంగా జీవించాలని నిర్ణయించుకున్నారు. వారు ఎప్పుడూ లోతులకు పడిపోరు, ఎత్తుకు ఎదగరు. వారి జీవితం ఒక నిస్తేజమైన వ్యవహారం, మందమైన విషయం, మార్పులేనిది. శిఖరాలు లేవు, లోయలు లేవు, రాత్రులు లేవు, పగలు లేవు. వారు రంగులు లేకుండా బూడిదరంగు ప్రపంచంలో నివసిస్తున్నారు - ఇంద్రధనస్సు వారికి ఉనికిలో లేదు. వారు బూడిదరంగు జీవితాన్ని గడుపుతారు, మరియు వారు కూడా మధ్యస్థంగా మారతారు. దైవభక్తి యొక్క గొప్ప శిఖరాలను చేరుకోవడం మరియు నరకం యొక్క గొప్ప లోతులకు పడిపోవడమే గొప్ప ప్రమాదం. భయపడకుండా ఈ రెండింటి మధ్య ప్రయాణీకుడిగా మారండి. క్రమంగా మీకు ఒక పరమార్థం ఉందని అర్థం అవుతుంది.*


*మీరు శిఖరం లేదా లోతు కాదు, శిఖరం లేదా లోయ కాదు అని మీకు తెలుస్తుంది. మీరు చూసేవారు, సాక్షి అని మీ ద్వారా మరియు మీరు తెలుసుకుంటారు. మీ మనస్సులో ఏదో శిఖరానికి వెళుతుంది, మీ మనస్సులో ఏదో లోయకు వెళుతుంది, కానీ అంతకు మించినది ఎల్లప్పుడూ ఉంటుంది-చూడండి, దానిని గమనించడం-మరియు అది మీరు. రెండు ధ్రువణాలు మీలో ఉన్నాయి, కానీ మీరు రెండూ కాదు-మీరు రెండింటి కంటే ఎత్తైన టవర్. నేల ఎత్తు మరియు తక్కువ, స్వర్గం మరియు నరకం రెండూ ఉన్నాయి, కానీ మీరు రెండింటికీ ఎక్కడో దూరంగా ఉన్నారు. మీరు దాని మొత్తం ఆటను, చైతన్యం యొక్క మొత్తం ఆటను చూడండి*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 41 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 41. MEDIOCRITY 🍀*


*🕉.  Never settle jar any mediocrity, because that is a sin against life. Never ask that life should be without risk, and never ask for security, because that is asking for death. 🕉*


*Many people have decided to live on the plain ground, safe, not taking any risks. They never fall to the depths, they never rise to the heights. Their life is a dull affair, a drab thing, monotonous-v.ith no peaks, no valleys, no nights, no days. They just live in a gray world, without colors-the rainbow doesn't exist for them. They live a gray life, and by and by they also become gray and mediocre. The greatest danger is to reach to the greatest peaks of godliness and to fall to the greatest depths of hell. Become a traveler between these two, unafraid. By and by you will come to understand that there is a transcendence.*


*By and by you will come to know that you are neither the peak nor the depth, neither the peak nor the valley. By and by you will come to know that you are the watcher, the witness. Something in your mind goes to the peak, something in your mind goes to the valley, but something beyond is always there-just watching, just taking note of it-and that is you. Both polarities are in you, but you are neither-you tower higher than both. The ground is high and low, both heaven and hell are there, but you are somewhere far from both. You simply watch the whole game of it, the whole play of consciousness.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 484 -3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।*

*అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀*


*🌻 484. 'డాకినీశ్వరీ' - 3 🌻*


*ఇందు విశుద్ధి చక్రము ఆకాశ తత్వమునకు సంబంధించినది. అందు శబ్దము ప్రధానమగు గుణము. విశుద్ధి చక్రమందున్న శ్రీమాతను డాకినీ దేవి అని పిలుతురు. ఈ డాకినీ దేవి పదునాలుగు దళములు గల పద్మము యొక్క కర్ణిక యందు పాటలీపుష్పముతో సమానమైన రంగు కలిగి యుండును. ఈ పుష్పము కేంద్రమున తెల్లని రంగు చుట్టునూ ఎఱుపు రంగుతో కూడి సుకుమారముగ నుండును. డాకినీ దేవి మూడు కన్నులు కలదియై యుండును. ఖట్వాంగమను ఆయుధమును ధరించును. ఖట్వాంగ మనగా వెన్నెముకకు తగిలించిన పుట్టెవలె గోచరించు ఆయుధము. మిగిలిన మూడు హస్తముల యందు పాశము, అంకుశము, వరముద్ర ధరించి యుండును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari*

*amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻*


*🌻 484. 'Dakinishwari' - 3 🌻*


*In this, Vishuddhi Chakra is related to Akasha Tattva. Here sound is the main quality. Sri Mata in Vishuddhi Chakra is called Dakini Devi. This Dakini Devi has the same color as a palm flower in the atrium of a fourteen-armed lotus. This flower has a red color around the white color in the center. Dakini Devi has three eyes. Wears the weapon by name Khatwanga. Khatwanga is a weapon that looks like a sword attached to our spine. In the remaining three hands he wears Pasha, Ankusha and Varamudra.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comentarios


bottom of page