top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 14, APRIL 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 14, APRIL 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 14, APRIL 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 355 / Bhagavad-Gita - 355 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 17 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 202 / Agni Maha Purana - 202 🌹

🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 2 / Mode of installation of the image of Vāsudeva - 2 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 067 / DAILY WISDOM - 067 🌹

🌻 7. ఆనందం / 7. Happiness 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 332 🌹

6) 🌹. శివ సూత్రములు - 69 / Siva Sutras - 69 🌹

🌻. 21. శుద్ధవిద్యోద్యా చ్చక్రే ఈశత్వ-సిద్ధిః - 4 / 21. śuddhavidyodyāccareśatva-siddhiḥ - 4 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 14, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు :తమిళ నూతన సంవత్సరం , మేష సంక్రమణం, అశ్వినీ కారె్త, వైశాఖీ, అంబేద్కర్‌ జయంతి, Tamil New Year, Mesha Sankranti, Baisakhi, Puthandu, Ambedkar Jayanti🌻*


*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -40 🍀*


*40. చమ్పాలతాభదరహాస విరాజవక్త్రే*

*బిమ్బాధరేషు కపికాఞ్చి తమఞ్జువాణి ।*

*శ్రీస్వర్ణకుమ్భపరి శోభితదివ్యహస్తే*

*లక్ష్మి త్వత్వదీయ చరణౌ శరణం ప్రపద్యే ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఓంకారోపాసన - జాగ్రత్, స్వప్ని, సుషుప్తి, తురీయములు నాల్గింటిలోనూ విస్తరించుకొని వున్న బ్రహ్మ చైతన్యానికి ప్రతీక 'ఓమ్' కనుక, ఓంకారోపాసన స్థూల, సూక్ష్మ, కారణ, కారణాతీతము లందన్నిటా ఒకే చైతన్యాన్ని దీర్శించి అనుభవించే దివ్యజ్ఞాన అవిష్కా రానికి దోహదం చేసేది కావడం అవసరం. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: కృష్ణ నవమి 23:14:54 వరకు

తదుపరి కృష్ణ దశమి

నక్షత్రం: ఉత్తరాషాఢ 09:15:44

వరకు తదుపరి శ్రవణ

యోగం: సిధ్ధ 09:37:53 వరకు

తదుపరి సద్య

కరణం: తైతిల 12:24:29 వరకు

వర్జ్యం: 12:58:30 - 14:27:54

దుర్ముహూర్తం: 08:31:21 - 09:21:24

మరియు 12:41:34 - 13:31:36

రాహు కాలం: 10:42:43 - 12:16:32

గుళిక కాలం: 07:35:03 - 09:08:53

యమ గండం: 15:24:12 - 16:58:02

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:41

అమృత కాలం: 03:14:44 - 04:44:48

మరియు 21:54:54 - 23:24:18

సూర్యోదయం: 06:01:13

సూర్యాస్తమయం: 18:31:51

చంద్రోదయం: 01:35:57

చంద్రాస్తమయం: 12:55:33

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: కాలదండ యోగం - మృత్యు

భయం 10:44:00 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 355 / Bhagavad-Gita - 355 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 17 🌴*


*17. పితాహమస్య జగతో మతా ధాతా పితామహ: |*

*వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామ యజురేవచ ||*


🌷. తాత్పర్యం :

*నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము,యజుర్వేదములు కూడా నేనే.*


🌷. భాష్యము :

*స్థావరజంగమాత్మకమైన సమస్తసృష్టి శ్రీకృష్ణుని శక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. ప్రస్తుత భౌతికస్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థశక్తులేయైన వివిధజీవులతో వివధ సంబంధములను ఏర్పరచుకొనియున్నాము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా గోచరింతురు. కాని వాస్తవమునకు అట్లు గోచరించు వారందరును శ్రీకృష్ణుని అంశలే. అనగా తల్లి, తండ్రి ఆది వివిధరూపములలో గోచరించునది శ్రీకృష్ణుడే గాని వేరెవ్వరును కాదు. ఈ శ్లోకమునందలి “ధాత” యను పదమునకు “సృష్టికర్త” యని భావము. మన తల్లిదండ్రులే గాక, సృష్టికర్త, పితామహి, పితామాహాదులు సైతము శ్రీకృష్ణుడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలైయున్నందున ప్రతిజీవియు కృష్ణునితో సమానమే. కనుకనే వేదములన్నియును శ్రీకృష్ణుని వైపునకే కేంద్రీకరింపబడియున్నవి.*


*తత్కారణముగా మనము వేదముల నుండి ఏది తెలియ యత్నించినను అది శ్రీకృష్ణపరజ్ఞానమును పొందుటలో పురోగతియే యగును. మన స్థితి పవిత్రపరచు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అదే విధముగా వేదంనియమములను అవగతము చేసికొనుట యందు జిజ్ఞాసువైనవాడు సైతము శ్రీకృష్ణుని అంశయే. కనుక అతడును శ్రీకృష్ణుడే. వేదమంత్రములందు ప్రణవమని పిలువబడు పవిత్ర ఓంకారము కూడా శ్రీకృష్ణుడే. సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము మరియు అథర్వవేదములందలి అన్ని శ్లోకములలో ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని శ్రీకృష్ణునుగా అవగాహనము చేసికొనవలెను.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 355 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 17 🌴*


17. pitāham asya jagato mātā dhātā pitāmahaḥ

vedyaṁ pavitram oṁ-kāra ṛk sāma yajur eva ca


🌷 Translation :

*I am the father of this universe, the mother, the support and the grandsire. I am the object of knowledge, the purifier and the syllable oṁ. I am also the Ṛg, the Sāma and the Yajur Vedas.*


🌹 Purport :

*The entire cosmic manifestations, moving and nonmoving, are manifested by different activities of Kṛṣṇa’s energy. In the material existence we create different relationships with different living entities who are nothing but Kṛṣṇa’s marginal energy; under the creation of prakṛti some of them appear as our father, mother, grandfather, creator, etc., but actually they are parts and parcels of Kṛṣṇa. As such, these living entities who appear to be our father, mother, etc., are nothing but Kṛṣṇa. In this verse the word dhātā means “creator.”*


*Not only are our father and mother parts and parcels of Kṛṣṇa, but the creator, grandmother and grandfather, etc., are also Kṛṣṇa. Actually any living entity, being part and parcel of Kṛṣṇa, is Kṛṣṇa. All the Vedas, therefore, aim only toward Kṛṣṇa. Whatever we want to know through the Vedas is but a progressive step toward understanding Kṛṣṇa. That subject matter which helps us purify our constitutional position is especially Kṛṣṇa. Similarly, the living entity who is inquisitive to understand all Vedic principles is also part and parcel of Kṛṣṇa and as such is also Kṛṣṇa. In all the Vedic mantras the word oṁ, called praṇava, is a transcendental sound vibration and is also Kṛṣṇa. And because in all the hymns of the four Vedas – Sāma, Yajur, Ṛg and Atharva – the praṇava, or oṁ-kāra, is very prominent, it is understood to be Kṛṣṇa.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 202 / Agni Maha Purana - 202 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 60*


*🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 2 🌻*


*హోమము కొరకు ఇసుకతో ఒకటన్నర హస్తము విస్తారము గల, చతురస్రము, సుందరము అగు వేదిని ఏర్పరుపవలెను. ఎనిమిది దిక్కులందును. యథాస్థానమున కలశము లుంచవలెను. ఆ పూర్వాది కలశలకు ఎనిమిది రంగులు వేయవలెను. పిమ్మట అగ్నిని వేదిపై స్థాపించి, కుశలతో సంస్కారము చేసి 'త్వమగ్నేద్యుభిః" అను మంత్రముతోను, గాయత్రీ మంత్రముతోను సమిధులను హోమము చేయవలెను. అష్టాక్షరమంత్రముతో నూట ఎనిమిది అజ్యాహుతులుచేసి, పూర్ణహుతి ఇవ్వవలెను.*


*పిమ్మట నూరు పర్యాయములు మూలమత్రము జపించి అభిమంత్రించిన శాంత్యుదకమును మామిడి చిగుళ్ళతో ఇష్టదేవత శిరస్సుపై చల్లవలెను. ఆ సమయమున "శ్రీచ్చ లక్ష్మీశ్చ" ఇత్యాది మంత్రము పఠింపవలెను. "ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే" అను మంత్రముతో ప్రతిమనుపైకి ఎత్తి, బ్రహ్మ రథముపై నుంచి, "తద్విష్ణో" ఇత్యాదిమంత్రము పఠించుచు దేవాలయము వైపు తీసికొని వెళ్ళవలెను. అక్కడ శ్రీహరి ప్రతిమను పల్లకీపై ఎక్కించి నగరమునందు, గీత-వాద్య వేదమంత్రాది ధ్వనులతో ఊరేగించి, తిరిగి దేవాలయద్వారమువద్దకు తీసికొనిరావలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 202 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 60*

*🌻Mode of installation of the image of Vāsudeva - 2 🌻*


8. The ground for kindling the sacrificial fire should be made ready with sand. An excellent site should be of the measure of a. cubit and a half on all sides.


9. The pitchers also should be placed in the eight directions commencing with the east. The consecrated fire should be brought in uttering the eight letters (described already).


10. The twigs should be offered into the fire with (the mantras)—tvam agne dyubhiḥ[1] and gāyatrī. Clarified butter should be offered with (the recitation of) eight letters, eight hundred times.


11. The appeasing water sanctified hundred times by the principal mantra should be sprinkled on the head of the image with (the recitation of) the hymn śrīśca te.[2]


12. The image should be lifted up with (the mantra) brahmajajñāna[3] and should be led to the temple with the mantra uttiṣṭha brahmaṇaṣpate[4] and tadviṣṇoḥ[5].


13. Lord Hari should be placed in a palanquin and carried towards the divine edifice accompanied by songs and vedic hymns. He should be held at the gates of the temple.


14. Lord Hari should be bathed with waters from eight auspicious pitchers by women and brahmins. Then the priest should worship the image with perfumes etc. and with the principal mantra[6].


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 67 / DAILY WISDOM - 67 🌹*

*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 7. ఆనందం 🌻*


*కావాల్సిన వస్తువులతో మనస్సు యొక్క సంపర్కం కారణంగా ఆనందం పుడుతుంది అనే భావన ప్రజల మనస్సులలో ఉంది. ఇది నిజం కాదనేది ఇక్కడ చెప్పబడిన గొప్ప విషయం. సంతోషం కేవలం మనసుకు కావాల్సిన వస్తువుతో సంపర్కం వల్ల ఏర్పడదు. వస్తువు పట్ల వాంఛనీయత కూడా మనస్సు యొక్క స్థితే. ఇది వస్తువు యొక్క ఆకృతి, లక్షణాల పట్ల మనస్సు ఏర్పరచుకున్న ఒక ఆకర్షణ.*


*మనస్సు అనేది చైతన్యం యొక్క ఒక అమరిక. మీరు దీనిని చైతన్యం యొక్క ఒక కేంద్రీకృత రూపం అని పిలవవచ్చు. చైతన్యం ద్వారా తీసుకోబడిన ఆకారం, అలలలో సముద్ర జలాలు తీసుకునే ఒక ఆకారం వంటిది. స్థలం మరియు సమయాలలో చైతన్యం యొక్క ఒక నిర్దిష్ట అమరికను మనస్సు అని చెప్పవచ్చు. అది మానవ మనస్సు అయినా లేదా మరేదైనా కావచ్చు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 67 🌹*

*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 7. Happiness 🌻*


*There is a notion in the minds of people that happiness arises on account of the contact of the mind with desirable objects. That this is not true, is a great point that is made out here. Happiness does not merely arise on account of the contact of the mind with an object which is desirable. The desirability of the object is, again, a condition of the mind. It is a perception of the mind in the contour of the object, of certain characters which are necessitated by the mind. *


*The mind is a pattern of consciousness. You may call it a focused form of consciousness, a shape taken by consciousness, something like the shape the waters of the ocean may take in the surge of the waves. A particular arrangement of consciousness in space and time may be said to be a mind, whether it is a human mind or otherwise.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 332 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. సత్యాన్ని తప్పించుకోవడమంటే దుఃఖాన్ని ఆహ్వానించడమే. బాధ నీకు ఒక రకమయిన సుఖాన్నిస్తుంది. కాని అది తెలివితక్కువతనం. అబద్ధాలు వదిలి సత్యాన్ని అందుకున్నపుడే ఆనందకరమైన జీవితం సంభవం. 🍀*


*సత్యమంటే అనుభవం. సత్యం నమ్మకం కాదు. నమ్మకాలు ఎప్పుడూ అబద్ధాలే. అవి నీ జీవితాన్ని కొంత అనుకూలంగా మారుస్తాయి. అంతే అవి నెమ్మది పరుస్తాయి. సత్యం మెల్కొల్పుతుంది. మనిషికి నిద్రలోకి జారడం కాదు మేలుకోవడం కావాలి. మనిషి తరతరాలుగా మద్యానికి, యితర మత్తులకు బానిస. అనేకరకాలయిన మానసిక అభ్ఫిఆయాలకు బానిస. అవన్నీ సత్యాన్ని తప్పించుకోడానికే.*


*సత్యాన్ని తప్పించుకోవడమంటే దుఃఖాన్ని ఆహ్వానించడమే. బాధ నీకు ఒక రకమయిన సుఖాన్నిస్తుంది. కాని అది తెలివితక్కువతనం. అబద్ధాలు వదిలి సత్యాన్ని అందుకున్నపుడే ఆనందకరమైన జీవితం సంభవం. దురభిప్రాయాల్ని వదలినపుడే సత్యం ఆవిష్కారమవుతుంది. సత్యం ఆనందాన్ని తెస్తుంది. నా సమస్త ప్రయత్నం మిమ్మల్ని అన్వేషణలోకి పంపడం. సాధికారికమయిన పరిశీలన మనిషిని సత్యం దగ్గరకు తీసుకెళుతుంది. అపుడు ఆశీర్వాదము నీదే. ఆనందమూ నీదే.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 069 / Siva Sutras - 069 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻. 21. శుద్ధవిద్యోద్యాచ్చక్రేఈశత్వ-సిద్ధిః - 4 🌻*

*🌴. యోగి పరిమిత శక్తులను కోరకుండా, సార్వత్రిక జ్ఞానాన్ని పొందాలనే తపనతో ఉన్నప్పుడు స్వచ్ఛమైన జ్ఞానం పెరిగి , అతను విశ్వ చైతన్య నిపుణుడు అవుతాడు. 🌴*


*మొదటి దశలో, వ్యక్తిగత గుర్తింపు పూర్తిగా కరిగిపోదు, రెండవ దశలో వ్యక్తిగత ఉనికి ఉండదు. నిరంతర అభ్యాసం ద్వారా, 'నేను అది' అని స్థిరపడతాడు మరియు చివరికి అతను తనంతట తానే అవుతాడు, 'నేను ఉన్నాను' అనేది పూర్తిగా కరిగిపోవడానికి మార్గం సుగమం చేస్తుంది. ‘అది’ మాత్రమే మిగిలి ఉంది. అటువంటి దశలో మాత్రమే, ఈ సూత్రాలలో వివరించిన విధంగా సూపర్ హ్యూమన్ శక్తులు సాధించబడతాయి. ఒకడు శివునిగా మారినప్పుడు, సహజంగానే అతడు శివుని శక్తులను పొందుతాడు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 069 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 21. śuddhavidyodyāccakreśatva-siddhiḥ - 4 🌻*

*🌴. When yogī does not desire limited powers and is eager to attain the knowledge of universal being then pure knowledge rises and he becomes the master of the universal consciousness. 🌴*


*In the first stage, the individual identity is not totally dissolved, whereas in the second stage there is no individual existence. By persistent practice, ‘I am That’ gets firmed up and ultimately he becomes That Itself, paving way for dissolving ‘I am’ totally. There remains only ‘That’. Only in such a stage, super human powers as detailed in these sūtra-s are attained. When one transforms into Śiva, naturally he attains the powers of Śiva.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page