🍀🌹 14, AUGUST 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹14, AUGUST 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 413 / Bhagavad-Gita - 413 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 41 / Chapter 10 - Vibhuti Yoga - 41 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 259 / Agni Maha Purana - 259 🌹
🌻. శివ పూజాంగ హోమ విధి - 4 / Mode of installation of the fire (agni-sthāpana) - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 125 / DAILY WISDOM - 125 🌹
🌻 4. తత్వశాస్త్రం ఒక తీవ్రమైన ఆచరణాత్మక శాస్త్రం / 4. Philosophy is an Intensely Practical Science🌻
5) 🌹. శివ సూత్రములు - 127 / Siva Sutras - 127 🌹
🌻 2-09. జ్ఞానం అన్నం - 4 / 2-09. Jñānam annam - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 14, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక శివరాత్రి, Masik Shivaratri 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 43 🍀*
*87. గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః |*
*మహాగీతో మహానృత్యో హ్యప్సరోగణసేవితః*
*88. మహాకేతుర్మహాధాతుర్నైకసానుచరశ్చలః |*
*ఆవేదనీయ ఆదేశః సర్వగంధసుఖావహః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనోమౌనం - మనోమౌనం సాధించాలంటే, వచ్చిన ప్రతి ఆలోచననూ త్రోసి వేయడమనేది సరియైన పద్ధతి కానేరదు. ఆలోచనలకు వెనుక, వాటి కంటె వేరై నిలిచి, బాహ్యవిషయాలట్లు వాటిని ప్రశాంతంగా తిలకించడం నేర్చుకోవాలి. అలోచనలను త్రోసివేయడం అపుడు సుసాధ్యం అవుతుంది ఒకవేళ అవి అలా ఎదుట కదలిపోతున్నా, నీ మనోమౌనాన్ని భంగపరుపవు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 10:26:33
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: పునర్వసు 11:07:39
వరకు తదుపరి పుష్యమి
యోగం: సిధ్ధి 16:39:30 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: వణిజ 10:26:33 వరకు
వర్జ్యం: 20:04:20 - 21:51:48
దుర్ముహూర్తం: 12:46:11 - 13:37:07
మరియు 15:19:00 - 16:09:56
రాహు కాలం: 07:34:10 - 09:09:41
గుళిక కాలం: 13:56:13 - 15:31:44
యమ గండం: 10:45:12 - 12:20:42
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: 08:27:00 - 10:13:40
మరియు 30:49:08 - 32:36:36
సూర్యోదయం: 05:58:40
సూర్యాస్తమయం: 18:42:45
చంద్రోదయం: 03:59:47
చంద్రాస్తమయం: 17:35:01
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 11:07:39 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 413 / Bhagavad-Gita - 413 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 41 🌴*
*41. యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |*
*తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంశసంభవమ్ ||*
*🌷. తాత్పర్యం : సంపన్నములును, సుందరములును, వైభవోపేతములును అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినదిగా తెలిసికొనుము.*
*🌷. భాష్యము : భౌతిక, ఆధ్యాత్మికజగముల యందలి ఎట్టి వైభవోపేతము లేదా సుందరసృష్టియైనను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణమే యని సర్వులు ఎరుగవలెను. కనుక విశేషవైభవముతో కూడినదేడైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 413 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 41 🌴*
*41. yad yad vibhūtimat sattvaṁ śrīmad ūrjitam eva vā*
*tat tad evāvagaccha tvaṁ mama tejo-’ṁśa-sambhavam*
*🌷 Translation : Know that all opulent, beautiful and glorious creations spring from but a spark of My splendor.*
*🌹 Purport : Any glorious or beautiful existence should be understood to be but a fragmental manifestation of Kṛṣṇa’s opulence, whether it be in the spiritual or material world. Anything extraordinarily opulent should be considered to represent Kṛṣṇa’s opulence.*-
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 259 / Agni Maha Purana - 259 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*
*🌻. శివ పూజాంగ హోమ విధి - 4 🌻*
*"ఓ దేవతలారా! మీరందరును విఘ్నములను తొలగించి ఈ బాలకుని (అగ్నిని) సంరక్షించుడు" అను శివాజ్ఞను ఆ దేవతలకు వినిపించి, స్రుక్-స్రువములను ఊర్ధ్వముఖములుగ గ్రహించి వాటిని మూడేసి సార్లు అగ్నిపై వెచ్చచేయవలెను. కుశమూల-మధ్య-అగ్రభాగముతో వాటిని స్పృశించుచు ఆ స్థానములందు క్రమముగ ఆత్మతత్త్వ-విద్యాతత్త- శివతత్త్వముల న్యాసము చేయవలెను. "ఓం హాం ఆత్మతత్త్వయ నమః" "ఓం హీం విద్యాతత్త్వాయ నమః" "ఓం హుం శివతత్త్వాయ నమః" అమనని న్యాసమంత్రములు పిమ్మట 'శక్త్యైనమః' "శివాయ నమః" అను మంత్రముతో స్రుక్ స్రువములపై శివశక్తిన్యాసము చేయవలెను.*
*మూడు పేటల రక్షాసూత్రమును స్రుక్ స్రువముల కంఠభాగమునందు చుట్టబెట్టవలెను. పుష్పాదులతో వాటిని పూజించి కుడి ప్రక్కన ఉన్న కుశలముపై ఉంచవలెను. గోఘృతము గ్రహించి దర్శనాదులచే దానిని పరిశుద్ధము చేసి. తాను బ్రహ్మమయుడని భావన చేయుచు ఆ ఘృతపాత్రమును హృదయమంత్రముతో అగ్నికుండముపై అగ్నేయమున త్రప్పి. మరల నేను విష్ణుస్వరూపుడనని భావన చేయుచు, ఘృతమును ఈశాన్యమునం దుంచి, కుశాగ్రభాగముచే ఘృతము తీసి "శిరసే స్వాహా" "విష్ణువే స్వాహా" అను మంత్రములతో విష్ణువునకు ఆ ఘృతబిందువులను హోమము చేయవలెను. నేను రద్రమయుడ నని భావన చేయుచు, ఘృతమును కుండనాభిస్థామందుంచి, దాని అప్లావనము చేయవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 259 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 75*
*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 4 🌻*
24-28. One should then make them hear this command of Śiva. He should then take the sacrificial spoon and the ladle, heat them on the fire and touch them with the base, middle and tips of the darbha with face downwards. In the place touched by the kuśa the three principles relating to the soul, knowledge and Śiva should be located duly with the sounds hāṃ, hrīṃ, hūṃ and saṃ. Having located the goddess in the sacrificial spoon and Śambhu (Śiva) in the sacrificial ladle with the hṛdaya mantra, their necks being girdled with three strings (of thread) and worshipped with flowers etc., kuśas should be placed on them and they should be placed on the right side.
29-32. Having gathered the clarified butter of the cow that has been purified by looking at it and after having contemplated one’s own Brahma form and carrying that clarified butter, one should wave it over the pit and move it round and round in the south-east. Again having contemplated the Viṣṇu form, one should hold the clarified butter and carry it towards the northeast, it should be offered to Viṣṇu (into the fire) with the tips of the kuśa and with the mantra of the head ending with svāhā. Similarly, one should conceive the form of Rudra (Śiva) as a point in one’s own navel and meditate. One should sprinkle water over that with two kuśas of the length of a span and held with the ring finger and thumb.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 125 / DAILY WISDOM - 125 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 4. తత్వశాస్త్రం ఒక తీవ్రమైన ఆచరణాత్మక శాస్త్రం 🌻*
*అత్యున్నతమైన స్వీయ జ్ఞానాన్ని పొందేందుకు తత్వశాస్త్రం అవసరమైన సాధనం. కానీ, అది మనస్సు యొక్క పనితీరు యొక్క ప్రక్రియగా నిర్వచించ బడినట్లయితే, అది ఎల్లప్పుడూ ఏకైక సాధనం కాదని మనం గమనించాలి; ప్లేటో, ప్లోటినస్ మరియు స్పినోజా వంటి స్వామి శివానందల తత్వశాస్త్రం కేవలం మనిషి యొక్క మేధస్సుకు మాత్రమే కాకుండా, హృదయానికి మరియు భావానికి కూడా అన్వయిస్తుంది. తత్వశాస్త్రం యొక్క బోధనలను అర్థం చేసుకోవడం మాత్రమే సరిపోదు, వాటిని ఒకరి హృదయ లోతుల్లో అనుభూతి చెందడం కూడా అవసరం. అనుభూతి అనేది అవగాహనను కొన్ని సందర్భాలలో అధిగమిస్తుంది, అయినప్పటికీ ఆ అనుభూతి, అర్థం చేసుకోవడం ద్వారా ఇంకా బలపడుతుంది.*
*తత్వశాస్త్రం అనేది ఆచరణాత్మక శాస్త్రం. 'తత్వశాస్త్రం మనిషి యొక్క ఆచరణాత్మక అవసరాలలో దాని మూలాలను కలిగి ఉంది. మనిషి అవలోకనా స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అతీంద్రియ విషయాల గురించి తెలుసు కోవాలి అనుకుంటాడు. మరణం, అమరత్వం, ఆత్మ యొక్క స్వభావం, సృష్టికర్త మరియు జగత్తు ఇత్యాది విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక అతనిలో ఉంటుంది. “తత్వశాస్త్రం అనేది మనిషిలో పెరుగుతున్న ఆత్మ యొక్క స్వీయ-వ్యక్తీకరణ. తత్వవేత్తలు దాని స్వరం” (తత్వశాస్త్రం మరియు బోధనలు). వేదాంతం అనేది వాస్తవికత యొక్క స్పష్టమైన అవగాహన ఆధారంగా విషయ వస్తువుల విలువను అర్థం చేసుకోవడానికి భారతదేశంలో వర్తించే సాధారణ పదం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 125 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 4. Philosophy is an Intensely Practical Science 🌻*
*Philosophy is a necessary means for the possession of the higher knowledge of the Self. But, if it is defined as process of the function of the intellect, we have to note that it is not always the sole means; for philosophy in Swami Sivananda, as in Plato, Plotinus and Spinoza, makes its appeal not merely to the intellect of man, but to the heart and the feeling as well. It is not enough to understand the teachings of philosophy, it is necessary also to feel them in the depths of one’s heart. Feeling, at least in certain respects, surpasses understanding, albeit that feeling is often strengthened by understanding.*
*Philosophy is an intensely practical science. “Philosophy has its roots in the practical needs of man. Man wants to know about transcendental matters when he is in a reflective state. There is an urge within him to know about the secret of death, the secret of immortality, the nature of the soul, the creator and the world.” “Philosophy is the self-expression of the growing spirit in man. Philosophers are its voice” (Philosophy and Teachings). The Vedanta is the general term applied in India to such a philosophy of wise adjustment of value based on an undeluded perception of Reality.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 127 / Siva Sutras - 127 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-09. జ్ఞానం అన్నం - 4 🌻*
*🌴. ఆత్మశుద్ధి కొరకు చేసే యఙ్యములో, మెలకువ, స్వప్న మరియు గాఢనిద్ర స్థితులలో మనస్సు మరియు ఇంద్రియాల కార్యకలాపాల నుండి ఉద్భవించి అజ్ఞానం, భ్రాంతి మరియు బంధనాలను కలిగించే అపవిత్ర జ్ఞానాన్ని హవిస్సుగా సమర్పించాలి 🌴*
*ఈ సూత్రం యొక్క అర్ధం, ఒకరి స్వీయ జ్ఞానమే వారి ఆహారం. ఇంద్రియ గ్రహణశక్తి లేకుండా ఎవరూ ఉనికిలో ఉండలేరని అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే సమయంలో ఆధ్యాత్మికత కేవలం మానసిక రంగంలో మాత్రమే వికసిస్తుంది కాబట్టి ఇంద్రియ గ్రహణాలు ఆధ్యాత్మిక సాధనలను బాధించకూడదు. ఆత్మ మరియు స్వయమాత్మ కలయిక ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే జరుగుతుంది. మనస్సు అనేది శివుడు మరియు శక్తి యొక్క ఆటస్థలం, కాబట్టి అది శాశ్వతంగా స్వచ్ఛంగా ఉండాలి. పతంజలి ఇలా అంటాడు, “అసాధారణమైన ఇంద్రియ గ్రహణశక్తిని తీసుకువచ్చే ఏకాగ్రతా లక్షణాలు మనస్సు యొక్క పట్టుదలను కలిగిస్తాయి (I.35).*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 127 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-09. Jñānam annam - 4 🌻*
*🌴. In the sacrifice of self-purification, impure knowledge which arises from the activities of the mind and senses in the wakeful, dream and deep sleep states and which causes ignorance, delusion and bondage should be offered as food in the sacrifice of self-purification 🌴*
*This aphorism is also interpreted to mean that knowledge of one’s own self is his food. It is important to understand that none can continue to exist without sensory perceptions. At the same time sensory perceptions should not afflict spiritual pursuits as spirituality blossoms forth only in the mental arena. The conjugation of self and Self takes place only in the spiritual arena. Mind is the playground of Śiva and Śaktī, hence It has to remain eternally pure. Patañjali says, “the forms of concentration that bring extraordinary sense perception cause perseverance of the mind (I.35). *
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments