🍀🌹 16, FEBRUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 16, FEBRUARY 2023 THURSDAY, గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 327 / Bhagavad-Gita -327 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 17 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 174 / Agni Maha Purana - 174 🌹 🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 1 / The dimensions of different varieties of the Liṅga - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 039 / DAILY WISDOM - 039 🌹 🌻 8. పెద్దగా ఉండటానికి ప్రయత్నించవద్దు, చిన్నగా ఉండండి. / 8. Do not Try to be Big, but be Small 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 304 🌹
6) 🌹. శివ సూత్రములు - 41 / Siva Sutras - 41 🌹
🌻 13. ఇచ్ఛా శక్తి ఉమా కుమారి - 3 / 13. Icchā śaktir umā kumārī - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹16, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🍀. విజయ సర్వ ఏకాదశి శుభాకాంక్షలు, Good Wishes on Vijaya Sarva Ekadashi 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : విజయ సర్వ ఏకాదశి, Vijaya Sarva Ekadashi 🌺*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 27 🍀*
27. దిశంతు మే దేవ సదా త్వదీయాః
దయాతరంగాను చరాః కటాక్షాః
శ్రోత్రేషు పుంసా మమృతం క్షరంతీం
సరస్వతీం సంశ్రిత కామధేనుమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : శాంత కర్మాచరణ - ఆశాంతి లక్షణోపేతమైన బాహ్య చైతన్యంతో గాక, శాంతి సమన్వితమైన అంతశ్చైతన్యంతో అన్నిపనులూ నీవు చేయడం నేర్చుకోవాలి. పనులు చేస్తూనే శాంతిని చిక్కబట్టుకోడం సాధ్యమే. శాంతి అంటే మనస్సు శూన్యంగా వుండడం కాదు: ఏ పనినీ చేయక పోవడమూ కాదు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 26:50:53
వరకు తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: మూల 22:53:26 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: హర్షణ 07:03:15 వరకు
తదుపరి వజ్ర
కరణం: బవ 16:10:32 వరకు
వర్జ్యం: 08:09:00 - 09:37:24
దుర్ముహూర్తం: 10:34:14 - 11:20:37
మరియు 15:12:30 - 15:58:53
రాహు కాలం: 13:57:08 - 15:24:06
గుళిక కాలం: 09:36:16 - 11:03:14
యమ గండం: 06:42:22 - 08:09:19
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 16:59:24 - 18:27:48
సూర్యోదయం: 06:42:22
సూర్యాస్తమయం: 18:18:01
చంద్రోదయం: 02:50:39
చంద్రాస్తమయం: 14:03:02
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధూమ్ర యోగం - కార్య భంగం,
సొమ్ము నష్టం 22:53:26 వరకు తదుపరి
ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 327 / Bhagavad-Gita - 327 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 17 🌴*
*17. సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రాహ్మణో విదు: |*
*రాత్రిం యుగసహస్రాన్తాం తే(హోరాత్రవిదో జనా: ||*
🌷. తాత్పర్యం :
*మానవ పరిగణనము ననుసరించి వేయి యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగి యుండును.*
🌷. భాష్యము :
భౌతికజగత్తు యొక్క కాలపరిమాణము పరిమితమై కల్పములుగా తెలుపబడు చుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగటి సమయము. బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్య, త్రేత, ద్వాపర, కలియుగములు వేయిమార్లు మారుచుండును. అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవియును లేకుండా కేవలము, సద్గుణము, జ్ఞానము, ధర్మములను కూడియుండు సత్యయుగము 17,28,000 సంవత్సరముల కాలపరిమితి కలిగియుండును. త్రేతాయుగమునందు దుర్గుణము ప్రవేశించును.
ఆ యుగపు కాలపరిమితి 12,96,000 సంవత్సరములు. ద్వాపరయుగమున సద్గుణము మరియు ధర్మము మరింతగా నశించి దుర్గుణము వృద్దినొందును. దాని కాలపరిమితి 8,64,000 సంవత్సరములు. చివరిదైన కలిగియుగమునందు సద్గుణము దాదాపు లుప్తమై కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము, వ్యసనాది లక్షణము తీవ్రముగా విజృంభించును. ఈ యుగపు కాలపరిమితి 4,32,000 సంవత్సరములు ( ఈ యుగము గత 5,000 సంవత్సరములుగా మన అనుభవము నందున్నది). దీని యందు దుర్గుణము మరయు పాపము విపరీతముగా ప్రబలిపోవును కనుక యుగాంతమున శ్రీకృష్ణభగవానుడు కల్కిఅవతారమున దానవులను నిర్జించి, భక్తులను రక్షించి, వేరొక సత్యయుగమును ఆరంభించును. ఆ విధముగా జగత్కార్యము కొనసాగించబడును. అదేరీతి నాలుగుయుగములు వేయిమార్లు మారినప్పడు (చతుర్యుగచక్రము వేయిమార్లు తిరిగినప్పడు) అది బ్రహ్మదేవుని పగలును పూర్తిచేయును. అతని రాత్రియు అంతే పరిమాణము కలిగియుండును. బ్రహ్మదేవుడు అట్టి “శతసంవత్సరముల” కాలము జీవించి తదుపరి తన దేహమును త్యజించును.
మానవపరిగణన ప్రకారము బ్రహ్మదేవుని శతసంవత్సరముల కాలము 311 ట్రిలియన్లు 40 బిలియన్ల సంవత్సరములతో సమానము. ఈ సంఖ్యను బట్టి బ్రహ్మదేవుని ఆయు:పరిమితి అద్భుతముగను, అనంతముగను ఉన్నట్లు తోచినను, నిత్యత్వ దృష్టిలో అది ఒక మెరుపుమెరిసినంత కాలము మాత్రమే. కారణార్ణవ జలములలో అసంఖ్యాకములుగా బ్రహ్మలు సముద్రమునందలి బుడగలవలె ప్రత్యక్షమగుచు నశించుచుందురు. బ్రహ్మ మరియు అతని సృష్టి యనునవి భౌతికజగమునందలి భాగములు గనుక అవి నిత్యపరివర్తన శీలములై యున్నవి. అనగా భౌతికజగమున బ్రహ్మదేవుడు సైతము జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నుండి బయటబడియుండలేదు. కాని అతడు విశ్వకలాప నిర్వహణములో శ్రీకృష్ణభగవానుని సేవ యందు నియుక్తుడైనందున శీఘ్రమే ముక్తిని పొందగలడు. ఆ బ్రహ్మదేవుని లోకమైన బ్రహ్మలోకమునే ఉన్నతులైన సన్న్యాసులు పొందుదురు. అట్టి లోకము భౌతికజగత్తు నందు అత్యున్నతమైన స్వర్గాది ఊర్థ్వలోకములను పోషించుచున్నను, బ్రహ్మ మరియు ఆ బ్రహ్మలోకవాసులు ప్రకృతినియమము ప్రకారము మరణమునకు గురికావలసియే వచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 327 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 17 🌴*
*17 . sahasra-yuga-paryantam ahar yad brahmaṇo viduḥ*
*rātriṁ yuga-sahasrāntāṁ te ’ho-rātra-vido janāḥ*
🌷 Translation :
*By human calculation, a thousand ages taken together form the duration of Brahmā’s one day. And such also is the duration of his night.*
🌹 Purport :
The duration of the material universe is limited. It is manifested in cycles of kalpas.
A kalpa is a day of Brahmā, and one day of Brahmā consists of a thousand cycles of four yugas, or ages: Satya, Tretā, Dvāpara and Kali. The cycle of Satya is characterized by virtue, wisdom and religion, there being practically no ignorance and vice, and the yuga lasts 1,728,000 years.
In the Tretā-yuga vice is introduced, and this yuga lasts 1,296,000 years. In the Dvāpara-yuga there is an even greater decline in virtue and religion, vice increasing, and this yuga lasts 864,000 years.
And finally in Kali-yuga (the yuga we have now been experiencing over the past 5,000 years) there is an abundance of strife, ignorance, irreligion and vice, true virtue being practically nonexistent, and this yuga lasts 432,000 years.
In Kali-yuga vice increases to such a point that at the termination of the yuga the Supreme Lord Himself appears as the Kalki avatāra, vanquishes the demons, saves His devotees, and commences another Satya-yuga.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 174 / Agni Maha Purana - 174 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 54*
*🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 1 🌻*
హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను ఇతర లింగాదులను గూర్చి చెప్పెదను; వినుము లవణముతోను, ఘృతముతోను చేసిన శివలింగము బుద్ధిని వృద్ధి పొందించును. వస్త్రమయ లింగము ఐశ్వర్యదాయకము. అది తాత్కాలిక లింగము. మృత్తికతో నిర్మించిన లింగము పక్వము, అపక్వము అని రెండు విధములు. అపక్వము కంటె పక్వము శ్రేష్ఠము. దాని కంటె కఱ్ఱతో చేసిన లింగము అధిక పుణ్యదాయకము, పవిత్రము. దాని కంటె శిలా లింగము శ్రేష్ఠము. దాని కంటె ముత్యముల శివ లింగము. దాని కంటె సువర్ణ లింగము ఉత్తమములు వెండి, రాగి, ఇత్తడి, రత్నములు, పాదరసము వీటితో నిర్మించిన శివలింగము భోగమోక్షప్రదము, శ్రేష్ఠము, రసలింగమును రత్నములలోగాని, సువర్ణాది లోహములలో గాని బంధించి స్థాపించవలెను. సిద్ధాదులచే స్థాపింపబడిన స్వయం భూలింగాదులకు కొలతలు మొదలగునవి చేయుట యుక్తముకాదు.
బాణ లింగమున విషయమున కూడ (నర్మదోద్భవమునకు) ప్రమాణాదిచింత ఉండ కూడదు. అట్టి లింగములకై ఇచ్ఛానుసారముగా పీఠప్రాసాదాది నిర్మాణము చేయవచ్చును. సూర్యమండలస్థ శివలింగమును అద్దములో ప్రతిబింబింపజేసి పూజించవలెను. లింగముపై శివార్చన పరిపూర్ణము, సకలకామ ప్రదము, శివలింగము ఎత్తు హస్తము కంటె ఎక్కువ ఉండవలెను. కాష్ఠమయ శివలింగము కూడ అంతయే ఉండవలెను. చల శివలింగ స్వరూపమును అంగుళమానానుసారమును, స్థిర లింగ స్వరూపమును ద్వార- గర్భ-హస్తమానముల అనుసారము నిర్ణయింపవలెను. గృహములో పూజింపబడు చల లింగము ప్రమాణము ఒక అంగుళము మొదలు పదునైదు అంగుళముల వరకును ఉండవచ్చును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 174 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 54*
*🌻The dimensions of different varieties of the Liṅga - 1 🌻*
The Lord said:
1. I shall describe the measurement of the liṅga in a different way. Listen. I shall (now) speak about the liṅgas made of salt, (and) ghee (which when worshipped) increases (one’s) intellect.
2. A liṅga made of cloth (is worshipped) for the sake of wealth. It is known as temporal. The one made of earth is either burnt or half burnt of which the former is better.
3. Then, one made of wood is meritorious. One made of stone is more meritorious than that made of wood. (The liṅga) made of pearl is more meritorious than that of stone. Then (relatively merit-worthy) are the liṅgas made of iron, and gold.
4. The liṅgas made of silver, copper and brass yield enjoyment and release from bondage. The liṅgas made of red lead and mercury are excellent and confer enjoyment and release from bondage.
5. The installation of a liṅga on the earth made of mercury and iron etc or studded with gems increases one’s glory and grants success as desired.
6. If desired one can build temples and bases to these (emblems) on the left side. One may worship the image of the sun cast on the mirror.
7. Hara should be worshipped everywhere. The worship gets completed only (by the worship) of the liṅga. A liṅga made of stone or wood should be of a cubit length.
8. The movable liṅga should be of the size of a finger and encircled by the adytum. The liṅga worshipped in the house should be of the size of one to fifteen fingers.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 39 / DAILY WISDOM - 39 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 8. పెద్దగా ఉండటానికి ప్రయత్నించవద్దు, చిన్నగా ఉండండి.🌻*
*వినయంగా ఉండండి. ఓపికపట్టండి. పెద్దగా ఉండటానికి ప్రయత్నించవద్దు, చిన్నగా ఉండండి. మీరు ఆఖరికి దాదాపు ఏమీ లేని వ్యక్తిగా మారే వరకు ఈ ప్రయత్నం చేయండి. ఇది అందరి కళ్ళు మీ మీదే ఉండేటట్లుగా ప్రపంచంలోని పెద్ద వస్తువుగా ఉండటం కంటే ఇదే మీకు మంచిది. నిరీక్షణ ఉంది, కాబట్టి మీకు కావలసినది మీకు లభిస్తుందని ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండండి. ఎల్లప్పుడూ మూడు విషయాలను గుర్తుంచుకోండి: (1) మీకు ఏమి కావాలో అనే విషయం పట్ల స్పష్టంగా ఉండండి.*
(2) మీరు కోరుకున్నది మీకు లభిస్తుందని నమ్మండి; సంకోచించకండి. 'అవును, నేను ఖచ్చితంగా దాన్ని పొందబోతున్నాను.' అని మీరు మీకు నొక్కివక్కానించండి. (3) ఇప్పుడే ఆ ప్రయత్నంతో ప్రారంభించండి. ‘రేపు’ అనకండి. 'ఇప్పుడు నాకు ప్రతిదీ స్పష్టంగా ఉంది మరియు నేను దానిని ఇప్పుడే ప్రారంభిస్తాను.' ఈ మూడు సూత్రాలు మీకు మార్గదర్శకంగా మీ ముందు ఉంటే, మీరు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 39 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 8. Do not Try to be Big, but be Small 🌻*
*Be humble. Be patient. Do not try to be big, but be small, until you almost become a nothing, which is better for you than to be a large thing in the world, a cynosure of all eyes. There is hope, and so be always confident that you will get what you need. Always remember three things: (1) Be clear as to what you want.
*(2) Be sure that you will get what you want; do not be hesitant. Assert: “Yes, I am certainly going to get it.” (3) Start with that effort just now. Do not say ‘tomorrow’. “Everything is clear to me now, and I shall start at it.” If these three maxims are before you as your guiding lights, you will succeed always, and with everything.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 304 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఈ క్షణంలో నీ శక్తి కేంద్రీకరింప బడితే అనంతమయిన గాఢత ఏర్పడుతుంది. వర్తమానంలో జీవించడమే జీవించడానికి ఏకైక మార్గం. నీ శక్తితో జ్వలిస్తావు. కాంతితో కదుల్తావు. 🍀*
*వర్తమానంలో జీవించడమే జీవించడానికి ఏకైక మార్గం. నువ్వు వర్తమానంలో జీవిస్తే నిన్ను గతం లాగదు. భవిష్యత్తు లాగదు. ఈ క్షణంలో నీ శక్తి కేంద్రీకరింప బడితే అనంతమయిన గాఢత ఏర్పడుతుంది. అది వ్యామోహ పూరితమైన ప్రేమ వ్యవహారమవుతుంది. నీ శక్తితో జ్వలిస్తావు. కాంతితో కదుల్తావు. సంపన్నం కావడానికి అదొక్కటే మార్గం. ఎదుగుదలకు అదే దారి. తక్కినవన్నీ నీరసాలే. అది లేని వాళ్ళు ఎంత డబ్బున్నవాళ్ళయినా పేదవాళ్ళే.*
*ప్రపంచంలో రెండు రకాల పేదవాళ్ళున్నారు. పేదవాళ్ళయిన పేదవాళ్ళు, ధనవంతులయిన పేదవాళ్ళు, ఆస్తిపాస్తులు కూడ బెట్టుకోవడంలో ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఎట్లా జీవించాలి. జీవన కవిత్వాన్ని ఎట్లా పలికించాలి. అన్న వాటిని బట్టి ఐశ్వర్యం ఆధారపడి వుంటుంది. ఇవన్నీ కేవలం ధ్యానం మీద ఆధారపడి వుంటాయి. యింకో మార్గం లేదు. యింకో మార్గం వుండదు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 041 / Siva Sutras - 041 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 13. ఇచ్ఛా శక్తి ఉమా కుమారి - 3🌻*
*🌴. యోగి సంకల్పం శివుని శక్తి. దానిని ఉల్లాసభరితమైన ఉమ మరియు కుమారి అంటారు 🌴*
*యోగి యొక్క చైతన్యం అన్ని సమయాలలో తుర్య స్థితిలోనే ఉంటుంది, ఎందుకంటే తుర్య స్థితి మూడు దిగువ స్థాయి చైతన్యాలను కూడా కలిగి ఉంటుంది. మెలకువ, కల మరియు గాఢనిద్ర అనే మూడు సాధారణ స్థాయి చైతన్యాలు లేకుండా ఏ మనిషి ఉనికిలో ఉండలేడు. నిజమైన యోగి సాధారణ మనిషికి భిన్నంగా ఉంటాడు, ఎందుకంటే యోగి తన సాధారణ మానవ కార్యకలాపాల సమయంలో కూడా తన చైతన్యాన్ని ఎల్లప్పుడూ శివునితో (శాశ్వత ధ్యానం) స్థిరపరుస్తాడు.*
*యోగి యొక్క సంకల్ప శక్తి నిరంతరం ప్రకాశించే మరియు అద్భుతమైన విశ్వ శక్తి కేంద్రంలోకి ప్రవేశించగలదు. ఇది సంపూర్ణ ఏకీకృత దృష్టితో మరియు ఎటువంటి పరధ్యానాలు, మలినాలను కలిగి ఉండక, చివరికి తానే శివుడు అవుతుంది (అంటే అశాశ్వత స్వయం సంపూర్ణ స్వయం లో విలీనం అవుతుంది). ఒక నరుడు (ఇక్కడ, యోగి అని అర్థం) తన స్వచ్ఛమైన చైతన్యం (శక్తి) ద్వారా మాత్రమే శివుడిని చేరుకోగలడు, ఇది త్రిక తత్వశాస్త్రం యొక్క సారాంశం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 041 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 13. Icchā śaktir umā kumārī - 3 🌻*
*🌴. Yogi's will is the energy of Lord Śiva. It is called Playful Umā and Kumāri 🌴*
*The consciousness of the yogi at all times remains in turya state, as turya state also encompasses the three lower levels of consciousness. No man can exist without the three normal level of consciousness, awake, dream and deep sleep. A true yogi is different from an ordinary man as yogi always fixes his consciousness with Shiva (perpetual meditation) even during his normal human activities.*
*The will power of the yogi could enter into the luminous and brilliant cosmic energy centre of the universe, known as Shiva with absolute one-pointedness and devoid of any distractions and impurities and ultimately becomes Shiva Himself (meaning the merger of empirical self with the Supreme Self). A nara (here, meaning a yogi) can reach Shiva only through his pure consciousness (Śaktī), which is the nut shell of Trika philosophy.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comentarios