🍀🌹 16, JUNE 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 16, JUNE 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 385 / Bhagavad-Gita - 385 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 13 / Chapter 10 - Vibhuti Yoga - 13 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 232 / Agni Maha Purana - 232 🌹
🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 2 / Mode of conducting the bathing festival (snāna) - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 097 / DAILY WISDOM - 097 🌹
🌻 6. మానవులలో కూడా మనకు వివిధ స్థాయిలు ఉన్నాయి / 6. Even Among Human Beings We have Various Grades 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 363 🌹
6) 🌹. శివ సూత్రములు - 99 / Siva Sutras - 99 🌹
🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 2 / 2-07. Mātrkā chakra sambodhah - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 16, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 49 🍀*
*49. అష్టకష్టహరే దేవి అష్టభాగ్యవివర్ధిని ।*
*మఙ్గలం శ్రీమహాలక్ష్మి మఙ్గలం శుభమఙ్గలమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అణచి వేయదగని హృదయ భావావేశం - ఈశ్వరుని యెడ పరమ ప్రేమతో ఆనంద బాష్పములు రాల్చే హృదయ భావావేశాన్ని ఎన్నడూ అణచి వేయరాదు. అట్టి భావావేశం సాధనకు అత్యంత సహాయకం. ఇంద్రియ వాంఛా ప్రవృత్తులతో కలగాపులగ మైనప్పుడు మాత్రమే భావావేశం సాధనకు భంగకరంగా తయారవుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 08:41:48 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: కృత్తిక 15:08:28 వరకు
తదుపరి రోహిణి
యోగం: ధృతి 25:22:44 వరకు
తదుపరి శూల
కరణం: వణిజ 08:41:48 వరకు
వర్జ్యం: 02:39:30 - 04:19:10
దుర్ముహూర్తం: 08:19:42 - 09:12:22
మరియు 12:43:01 - 13:35:41
రాహు కాలం: 10:37:56 - 12:16:41
గుళిక కాలం: 07:20:27 - 08:59:12
యమ గండం: 15:34:10 - 17:12:55
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42
అమృత కాలం: 12:37:30 - 14:17:10
సూర్యోదయం: 05:41:43
సూర్యాస్తమయం: 18:51:40
చంద్రోదయం: 03:53:35
చంద్రాస్తమయం: 17:21:09
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ
లాభం 15:08:28 వరకు తదుపరి
మిత్ర యోగం - మిత్ర లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 385 / Bhagavad-Gita - 385 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 13 🌴*
*13. ఆహుస్త్వామృషయ: సర్వే దేవర్షిర్నారదస్తథా |*
*అసితో దేవలో వ్యాస: స్వయం చైవ బ్రవీషి మే ||*
🌷. తాత్పర్యం :
*నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాఋషులందరును నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమున నాకు తెలియజేయుచున్నావు.*
🌷. భాష్యము :
*ఇప్పుడు ఆ భగవానుని కరుణచే అర్జునుడు వేదానుసారముననే అతనిని పరతత్త్వముగా అంగీకరించు చున్నాడు. అనగా శ్రీకృష్ణుడు తన స్నేహితుడు కనుక అతనిని పరతత్త్వమనియు, దేవదేవుడనియు అర్జునుడు ముఖస్తుతి చేయుటలేదు. కేవలము వేదానుసారమే అతడట్లు కీర్తించెను. అర్జునుడు ఈ రెండు శ్లోకములలో పలికినదంతయు వేదములచే నిర్దారింపబడినది. భక్తియుతసేవను చేపట్టినవాడే శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనగలడుగాని ఇతరులు అందుకు సమర్థులు కారని వేదములు ద్రువీకరించుచున్నవి. అనగా అర్జునుడు పలికిన ప్రతిపదము కూడా వేదనిర్దేశముచే సమర్థింప బడుచున్నది.*
*పరబ్రహ్మము సర్వమునకు ఆశ్రయస్థానమని కేనోపనిషత్తు నందు తెలుపబడినది. అందుకు తగినట్లుగా శ్రీకృష్ణుడు సమస్తము తననే ఆశ్రయించియున్నదని పూర్వమే పలికియున్నాడు. సర్వమునకు ఆధారభూతుడైన భగవానుడు తననే సదా చింతించువానికి మాత్రమే అనుభూతుడగునని ముండకోపనిషత్తు ధ్రువపరచుచున్నది. అట్లు కృష్ణుని గూర్చి సదా చింతించుటయే నవవిధభక్తిమార్గములలో ఒకటైన స్మరణము. శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారానే మనుజుడు తన నిజస్థితినెరిగి భౌతికదేహము నుండి విడివడగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 385 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 13 🌴*
*13. āhus tvām ṛṣayaḥ sarve devarṣir nāradas tathā*
*asito devalo vyāsaḥ svayaṁ caiva bravīṣi me*
🌷 Translation :
*All the great sages such as Nārada, Asita, Devala and Vyāsa confirm this truth about You, and now You Yourself are declaring it to me.*
🌹 Purport :
*Vedic injunctions affirm that only one who takes to devotional service to the Supreme Lord can understand Him, whereas others cannot. Each and every word of this verse spoken by Arjuna is confirmed by Vedic injunction. In the Kena Upaniṣad it is stated that the Supreme Brahman is the rest for everything, and Kṛṣṇa has already explained that everything is resting on Him.*
*The Muṇḍaka Upaniṣad confirms that the Supreme Lord, in whom everything is resting, can be realized only by those who engage constantly in thinking of Him. This constant thinking of Kṛṣṇa is smaraṇam, one of the methods of devotional service. It is only by devotional service to Kṛṣṇa that one can understand his position and get rid of this material body.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 232 / Agni Maha Purana - 232 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 69*
*🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 2 🌻*
*మిగిలిన ఎనిమిది కుంభములలో పలాశ-అశ్వత్థ-వట-బిల్వ-ఉదుంబర-ప్లక్ష-జంబూ-శమీ-కపిత్థ వృక్షముల బెరుడునుండి తీసిన రసము పోయవలెను. అగ్నేయమునందున్న నవకమునందు మధ్య మధుపూర్ణ ఘటము నుంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో గోశృంగ-పర్వ-గంగాజల-గజశాలా-తీర్థ-క్షేత్ర(పొలము) ఖల (కల్ళము) ములమట్టి ఉంచవలెను. దక్షిణమున నున్న నవకమున మధ్యయందు తైలపూర్ణ ఘటము స్థాపింపవలెను. మిగిలిన ఘటములలో నారంగజంబీర-నింబ-ఖర్జూర-మృత్తికా-నారికేళ-పూగ-దాడిమ-పనసఫలము లుంచవలెను.*
*నైరృతిదిక్కున నవకమునందు మద్యక్షీర పూర్ణకుంభ ముంచి మిగిలిన ఎనిమిదిటిలో కుంకుమ-నాగపుష్ప-చంపక-మాలతీ-మల్లికా-పున్నాగ-కరవీర-కమలకుసుమములుంచవలెను. పశ్చిమ నవక మధ్యమున నారికేలజాలపూర్ణకలశ ముంచి, మిగిలిన ఎనిమిదింటిలో నదీ-సముద్ర-సరోవర-కూప-వర్షా-హిమ, నిర్ఘర-దేవనదుల జలము లుంచవలెను. వాయవ్య ననకమునందు మధ్య కదలీజలపూరితకుంభ ముంచి, మిగిలిన ఎనిమిది కుంభములందును సహదేవీ కుమారీ-సింహీ-వ్యాఘ్రీ-అమృతా-విష్ణుపర్ణీ-దుర్వా-వచా అను దివ్యౌషదుల నుంచవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 232 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 69*
*🌻 Mode of conducting the bathing festival (snāna) - 2 🌻*
10. The remaining eight pitchers should be filled with the earth taken from loosening by cow’s horn, elephant’s tusk, horse hoofs, mountains, Ganges bed, sacred spots, rivers and fields.
11-12. In the nine pitchers on the south, the central one should be filled with sesamum. The other eight pitchers should be filled with nāraṅga, jambīra, kharjūra, nārikela (coconut), pūga (arecanut), pomegranate, panasa fruits. In the nine pitchers on the south-west, the central pitcher should be filled with milk.
13-15. (The remaining eight pitchers should be) duly (filled with) saffron (kuṅkuma), nāga, campaka, mālatī, jasmine, punnāga, karavīra, and mahotpala flowers. In the nine pitchers on the west, the central pitcher should contain the coconut water. (The other pitchers should contain) waters of the river, ocean, tank, well, rain water, water from the melted ice, waters of the falls, and of the Ganges. In the nine pitchers on the north-west the central one should have banana fruits.
16. The divine herbs sahadevī, kumārī, siṃhī, vyāghrī, amṛtā, viṣṇuparṇā, śataśivā and vacā should be placed in the other eight pitchers.
17-19. In the east and the northern (directions) among the nine pitchers one should place the central one having curd. The other pitchers should duly be filled with the fragrant substances—cardamom, tvacā, kuṣṭha, bālaka, the two varieties of sandal, the kastūrikā creeper and the black agallochum. (In the central pitcher among the nine pitchers on the north east) one should fill waters for purification. In the other pitchers we should have (the materials) candra, tāra, śukla, girisāra (iron), trapu (tin), camphor, śīrṣa and gems.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 97 / DAILY WISDOM - 97 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 6. మానవులలో కూడా మనకు వివిధ స్థాయిలు ఉన్నాయి 🌻*
*ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రకారం, అత్యల్ప స్థాయి క్రూర చైతన్యం, ఇది పరిపూర్ణ భౌతిక ఉనికి నుండి విడదీయరానిది. రెండవ దశ, దీని పైన, ప్రకృతికి ప్రతిస్పందించే స్వీయ-సంరక్షక చైతన్యం. ఇది మొక్కల జీవితంలో గమనించదగినది. మూడవ దశ ఇతరులలో తనను తాను కనుగొనాలనే మానసిక కోరిక. అవసరం మరియు ప్రేమ సమక్షంలో ఇది వ్యక్తీకరించబడుతుంది. ఈ చైతన్యం ప్రత్యేకంగా పునరుత్పత్తిలో తనను తాను కేంద్రీకరిస్తుంది.*
*నాల్గవది స్వీయ-చైతన్యం యొక్క దశ. ఇది ప్రత్యేకమైన మానవ చైతన్య దశ. ఇది కేవలం బాహ్య ఉద్దీపనలకు ప్రతిచర్య రూపంలో ఉన్న స్వీయ-సంరక్షణ మరియు స్వీయ-పునరుత్పత్తి స్థాయి దాటిన చైతన్యం. అయినప్పటికీ, ఇక్కడ మానవ జీవితం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. మానవులలో కూడా మనకు వివిధ స్థాయిలు ఉన్నాయి: జంతు మనిషి, స్వార్థపరుడు, మంచి మనిషి, సాధువు మరియు దైవ మానవుడు అని ఉన్నాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 97 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 6. Even Among Human Beings We have Various Grades 🌻*
*According to Hegel, the renowned German philosopher, the lowest level is brute consciousness, which is inseparable from sheer material existence. The second stage, above this, is nature-reactive self-preservative consciousness, observable in plant life. The third stage is of a crude seeking of oneself in others, expressed in the presence of a psychological want, a need and a love which specifically concentrates itself in the reproductive consciousness.*
*The fourth is the stage of self-consciousness which is the special faculty of man, beyond the level of the mere animal satisfaction of self-preservation and self-reproduction in the form of reaction to external stimuli. Yet, human life here is incipient and not fully developed. Even among human beings we have various grades: there is the animal man, the selfish man, the good man, the saintly man and the God-man.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 362 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనసంటే ఆలోచనల ధూళి. వ్యక్తి ఆలోచన నుండి బయటపడితే స్వచ్ఛత నందుకుంటాడు. స్వచ్ఛమైన హృదయం నీతిబద్ధమైందే. కానీ నీతిమంతునికి స్వచ్ఛతతో పనిలేదు. నీతిమంతుడు 'మనసు'లోనే నివసిస్తాడు. అతని నీతి అతని మనసుపై అధికారం చెలాయిస్తుంది. 🍀*
*మనిషి అస్తిత్వంతో సంబంధ మేర్పరచు కోడానికి స్వచ్ఛమైన హృదయముండాలి. స్వచ్ఛంగా వుండడంతో బాటు నీలో మనసు ఆధిపత్య ముండకూడదు. మనసులో అధికారముంటే హృదయంలో స్వచ్ఛత వుండదు. అద్దానికి దుమ్ము పట్టినట్లు హృదయం పై మనసు పేరుకుని వుంటుంది. మనసంటే ఆలోచనల ధూళి. వ్యక్తి ఆలోచన నుండి బయటపడితే స్వచ్ఛత నందుకుంటాడు. స్వచ్ఛతకు నీతితో సంబంధం లేదు.*
*స్వచ్ఛమైన హృదయం నీతిబద్ధమైందే. కానీ నీతిమంతునికి స్వచ్ఛతతో పనిలేదు. నీతిమంతుడు 'మనసు'లోనే నివసిస్తాడు. అతని నీతి అతని మనసుపై అధికారం చెలాయిస్తుంది. కారణం అది అమాయకమైంది కాదు. అందువల్ల అది స్వచ్ఛమైంది కాదు. ఫలితంగా నీతి స్వచ్ఛతకు దారి తీయదు. స్వచ్ఛత తప్పక నీతిమంతమైందే అయితే మొదట స్వచ్ఛత వస్తుంది. నీతి దాన్ని అనుసరిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 099 / Siva Sutras - 099 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 2 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*
*పరిపూర్ణ అవగాహన అంటే ఏమిటి అనే తదుపరి ప్రశ్న తలెత్తుతుంది. ఇది మునుపటి సూత్రం యొక్క పొడిగింపు. ఇది ఒకరి జ్ఞానోదయంలో గురువు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. మునుపటి సూత్రంలో చర్చించబడినట్లు గురువు సహాయంతో, శిష్యుడు 'నేనే అది' అనే ధృవీకరణ యొక్క ప్రాముఖ్యతను సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. కేవలం ధృవీకరణ వల్ల ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఈ ధృవీకరణ ఆశించే వ్యక్తి యొక్క మానసిక రంగంలో జరగాలి. ఇది జరగడానికి ఒకరి గురువు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 099 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-07. Mātrkā chakra sambodhah - 2 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴*
*The next question arises as to what is meant by perfect understanding. This is an extension of the previous sūtra, which highlighted the importance of a guru in one’s enlightenment. With the help of the guru discussed in the previous sūtra, the disciple perfectly understands the significance of the affirmation “I am That”. Mere affirmation is of no use as this affirmation is to happen in the mental arena of the aspirant and one’s guru plays a significant role to make this happen.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
コメント