top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 17, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 17, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 17, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 207 / Kapila Gita - 207🌹

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 17 / 5. Form of Bhakti - Glory of Time - 17 🌴

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 799 / Vishnu Sahasranama Contemplation - 799 🌹

🌻799. సర్వవిజ్జయీ, सर्वविज्जयी, Sarvavijjayī🌻

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 760 / Sri Siva Maha Purana - 760 🌹

🌻. దేవాసుర యుధ్ధము - 1 / The battle of the gods - 1 🌻

5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 014 / Osho Daily Meditations - 014 🌹

🍀 14. దయ / 14. GRACE 🍀

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 3 🌹

🌻 464. 'కాంతిమతి' - 3 / 464. 'Kantimati' - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 17, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సోమావతి (హరియాళి) అమావాస్య, Somvati (Hariyali) Amavas 🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 39 🍀*


*79. కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రయః |*

*కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః*

*80. వణిజో వర్ధకీ వృక్షో వకుళశ్చందనఛ్ఛదః |*

*సారగ్రీవో మహాజత్రురలోలశ్చ మహౌషధః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : అసూయా ద్వేషాదుల విసర్జన - పూర్ణయోగ సాధనలో మానవ సంబంధాలు ప్రాణకోశము నాధారము చేసుకుని ప్రవర్తిల్లక ఆత్మస్థములై విలసిల్లడం అవసరం. ప్రాణకోశం అట్టి ఆత్మస్థితికి ఉపకరణం మాత్రమే కావాలి. అనగా, అసూయ, ద్వేషం, ఘర్షణ మొదలైన ప్రాణకోశ ప్రవృత్తులకు ఏవిధమైన మానవ సంబంధాలలోను తావీయరాదు. ఆధ్యాత్మిక జీవనంలో వాటికి స్థానం లేదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

శ్రావణ మాసం

తిథి: మావాశ్య 24:03:02 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: పునర్వసు 29:12:26

వరకు తదుపరి పుష్యమి

యోగం: వ్యాఘత 08:57:01 వరకు

తదుపరి హర్షణ

కరణం: చతుష్పద 11:04:18 వరకు

వర్జ్యం: 15:55:30 - 17:41:42

దుర్ముహూర్తం: 12:48:15 - 13:40:29

మరియు 15:24:57 - 16:17:11

రాహు కాలం: 07:28:19 - 09:06:15

గుళిక కాలం: 14:00:04 - 15:38:01

యమ గండం: 10:44:12 - 12:22:08

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48

అమృత కాలం: 26:32:42 - 28:18:54

మరియు 24:49:44 - 26:36:48

సూర్యోదయం: 05:50:22

సూర్యాస్తమయం: 18:53:54

చంద్రోదయం: 05:10:35

చంద్రాస్తమయం: 18:51:11

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: ధూమ్ర యోగం - కార్య

భంగం, సొమ్ము నష్టం 29:12:26 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 207 / Kapila Gita - 207 🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 17 🌴*


*17. మహతాం బహుమానేన దీనానామనుకంపయా|*

*మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ॥*


*తాత్పర్యము : మహాత్ములయెడ గౌరవభావమును,దీనుల యెడ కనికరమును చూపవలెను. తనతో సమానుని యందు మైత్రిని నెరపవలెను. యమ, నియమములను పాటింపవలెను.*


*వ్యాఖ్య : అసంగం కలగాలంటే పెద్దలను సేవించాలి, దీనులని చూచి జాలి చూపాలి. అసూయ అమర్షమూ ద్వేషమూ - ఇవే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపములు. పక్కవాడికి మనకన్నా ఏదో కొద్దిగా ఎక్కువ ఉంది అనగానే మనకు కలిగేది అసూయ. మనకంటే గొప్పవాన్ని చూస్తే అసూయ, మనకన్నా చిన్నవాన్ని చూస్తే అసహనం కలుగుతుంది. మనతో సమానున్ని చూస్తే అమర్షం కలుగుతుంది (ఉదా వాడు నా అంత వాడా? ) మనకంటే గొప్పవాన్ని చూసి సంతోషించాలి (మహతాం బహుమానేన), మనకంటే చిన్న వాడిని చూచి జాలిపడాలి (దీనానామనుకమ్పయా), మనతో సమానుడితో మైత్రి సలుపు (మైత్ర్యా చైవాత్మతుల్యేషు). ఇవి కలగాలంటే యమ నియమాదులు కలగాలి ( యమేన నియమేన చ). వేదాంత శాస్త్రమును వినడము వలన కలుగుతుంది. పురాణం వినాలన్న బుద్ధి ఎలా పడుతుంది - నామ సంకీర్తనతో పుడుతుంది.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 207 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 5. Form of Bhakti - Glory of Time - 17 🌴*


*17. mahatāṁ bahu-mānena dīnānām anukampayā*

*maitryā caivātma-tulyeṣu yamena niyamena ca*


*MEANING : The pure devotee should execute devotional service by giving the greatest respect to the spiritual master and the ācāryas. He should be compassionate to the poor and make friendship with persons who are his equals, but all his activities should be executed under regulation and with control of the senses.*


*PURPORT : It is recommended herewith that all the ācāryas be given the highest respect. It is stated, guruṣu nara-matiḥ. Guruṣu means "unto the ācāryas," and nara-matiḥ means "thinking like a common man." To think of the Vaiṣṇavas, the devotees, as belonging to a particular caste or community, to think of the ācāryas as ordinary men or to think of the Deity in the temple as being made of stone, wood or metal, is condemned. Niyamena: one should offer the greatest respect to the ācāryas according to the standard regulations. A devotee should also be compassionate to the poor. This does not refer to those who are poverty-stricken materially. According to devotional vision, a man is poor if he is not in Kṛṣṇa consciousness. A man may be very rich materially, but if he is not Kṛṣṇa conscious, he is considered poor. On the other hand, many ācāryas, such as Rūpa Gosvāmī and Sanātana Gosvāmī, used to live beneath trees every night. Superficially it appeared that they were poverty-stricken, but from their writings we can understand that in spiritual life they were the richest personalities.*


*A devotee shows compassion to those poor souls who are wanting in spiritual knowledge by enlightening them in order to elevate them to Kṛṣṇa consciousness. That is one of the duties of a devotee. He should also make friendship with persons who are on an equal level with himself or who have the same understanding that he does. For a devotee, there is no point in making friendships with ordinary persons; he should make friendship with other devotees so that by discussing among themselves, they may elevate one another on the path of spiritual understanding. This is called iṣṭa-goṣṭhī.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 799 / Vishnu Sahasranama Contemplation - 799🌹*


*🌻799. సర్వవిజ్జయీ, सर्वविज्जयी, Sarvavijjayī🌻*


*ఓం సర్వవిజ్జయినే నమః | ॐ सर्वविज्जयिने नमः | OM Sarvavijjayine namaḥ*


సర్వార్థ విషయం జ్ఞాన మసాస్తీతి స సర్వవిత్ ।

రాగాదీనాన్తరాన్ బాహ్యాన్ హిరణ్యాక్షాదికానరీన్ ॥

దుర్జయాన్ జేతు మప్యస్య శీలమస్తీత్యతో జయీ ।

జయీ చ సర్వవిచ్చాసా వుచ్యతే సర్వవిజ్జయీ ॥

జిదృక్షీత్యాది పాణిని వచనాదిని రుష్యతే ॥


*ఈతడు సర్వ విదుడును, జయియును. సర్వమును, తెలియ వలసినదంతయును, ప్రతియొకదానిని ఎరుగువాడు. సర్వవిషయకమగు జ్ఞానమును ఈతనికి గలదు. లోనుండెడి అభ్యంతరములు అగు రాగాది ద్వేషము, కామ క్రోధాదికము మొదలగు శత్రువులను, బాహ్యులగు హిరణ్యాక్షాదులను - ఇట్లు రెండు విధములగు శత్రువులను జయించుట తన శీలముగా కలవాడు గావున 'జయీ'. ఇట్లు పరమాత్ముడు సర్వ విషయక జ్ఞానమును సమగ్రముగా కలిగిన వాడును, ఎన్నడును ఓటమిని ఎరుగని జయశీలుడును అను అర్థము ఈ నామమునకు ఏర్పడుచున్నది. ఈ రెండు శబ్దములును ఒకే నామముగా గ్రహింపదగినవి.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 799🌹*


*🌻799. Sarvavijjayī🌻*


*OM Sarvavijjayine namaḥ*


सर्वार्थ विषयं ज्ञान मसास्तीति स सर्ववित् ।

रागादीनान्तरान् बाह्यान् हिरण्याक्षादिकानरीन् ॥

दुर्जयान् जेतु मप्यस्य शीलमस्तीत्यतो जयी ।

जयी च सर्वविच्चासा वुच्यते सर्वविज्जयी ॥

जिदृक्षीत्यादि पाणिनि वचनादिनि रुष्यते ॥


Sarvārtha viṣayaṃ jñāna masāstīti sa sarvavit,

Rāgādīnāntarān bāhyān hiraṇyākṣādikānarīn.

Durjayān jetu mapyasya śīlamastītyato jayī,

Jayī ca sarvaviccāsā vucyate sarvavijjayī.

Jidr‌kṣītyādi pāṇini vacanādini ruṣyate.


*In one Name, He being both Sarvavit and Jayī, He is Sarvavijjayī. Everything, what all can be known about, each and every aspect is known to Him. He has knowledge of everything hence Sarvavit. He has conquered the internal enemies like anger, greed etc., and also external adversaries like Hiraṇyākṣā and others, He is called Jayī.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

*उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥*

*ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥*

*Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,Arko vājasanaḥ śr‌ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥*


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 760 / Sri Siva Maha Purana - 760 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴*

*🌻. దేవాసుర యుధ్ధము - 1 🌻*


*సనత్కుమారుడిట్లు పలికెను - మరల అచటకు మచ్చిన ఆ రాక్షసుని గాంచి ఇంద్రాది దేవతలందరు భయముతో వణుకుతూ శీఘ్రముగా పలాయనమును చిత్తగించిరి (1). వారందరు బ్రహ్మగారిని ముందిడు కొని వైకుంఠమునకు వెళ్లి నమస్కరించి స్తుతించిరి (2).*


*దేవతలిట్లు పలికిరి - ఇంద్రియములకు ప్రభువైన వాడా! హేభగవాన్‌! గొప్ప బాహువులు గలవాడా! మధువు అను రాక్షసుని సంహరించిని వాడా! దేవదేవా! ఈశ్వరా! రాక్షసుల నందరినీ నశంపజేసినవాడా! నీకు నమస్కారము (3). హే విష్ణో! సత్యవ్రతుడనే పుణ్యశీలుడగు రాజుతో గుడి ప్రలయ కాలమునందు మత్స్యరూపముతో సముద్రమునందు విహరించి వేదములను కాపాడిని నీకు నమస్కారము (4). సముద్రమును మథించుటకు దేవతలు పెద్ద యత్నమును చేయుచుండగా కూర్మరూపమును దాల్చి మందరపర్వతమును మోసిన నీకు నమస్కారము (5). హే భగవాన్‌! నాథా! యజ్ఞవరాహరూపమును దాల్చి జనులకు ఆధారమైన బూమిని శిరస్సుపై ధరించిన నీకు నమస్కారము (6).*


*హే ప్రభో! వామనావతారములో నీవు ఇంద్రుని సోదరుడవై బ్రహ్మణ వేషముతో రాక్షసరాజైన బలిని మోసగించి బ్రహ్మాండమునంతనూ నీ అడుగులతో వ్యాపించినవు. అట్టి నీకు నమస్కారము (7). పాపులను సంహరించు నీవు పరశురాముడవై తల్లి హితము కొరకు క్రోధముతో భూమియందు క్షత్రియులు లేకుండగా చేయుటకు ఉద్యమించితివి. అట్టి నీకు నమస్కారము (8). లోకుల మనస్సులను రంజింప చుయువాడు, మర్యాదాపురుషోత్తముడు, సీతాపతి అగు రాముని రూపమును దాల్చి రావణుని సంహరించిన నీకు నమస్కారము (9).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 760🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴*


*🌻 The battle of the gods - 1 🌻*


Sanatkumāra said:—


1. On seeing the Asura coming again, the gods including Indra trembled with fear. They fled together.


2. With Brahmā at the head they went to Vaikuṇṭha. All of them including Prajāpati eulogised Viṣṇu after bowing down to him.

The gods said:—


3. O Hṛṣīkeśa of long arms, O lord, O slayer of Madhu, O lord of gods, Obeisance to you, O destroyer of all Asuras.


4. O Viṣṇu, of the form of fish[1] who redeemed the Vedas through king Satyavrata, obeisance to you who sport about in the ocean of Dissolution.


5. Obeisance to you of the form of Tortoise who bore the mountain Mandara of the gods who were attempting to churn the ocean.


6. Obeisance to you O holy lord, of the form of Boar. Obeisance to you who hold the earth, the support of people. Obeisance to Viṣṇu.


7. Obeisance to you, the Dwarf. Obeisance to Viṣṇu the younger brother of Indra, the lord who deceived the king of Asuras in the guise of a Brahmin.


8. Obeisance to Paraśurāma who exterminated the Kṣattriyas, who rendered help to your mother. Obeisance to you who are angry and inimical to the evil beings.


9. Obeisance to Rama who delighted the worlds and who set the limits of decent behaviour. Obeisance to you the destroyer of Rāvaṇa and the lord of Sītā.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 14 / Osho Daily Meditations  - 14 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 14. దయ 🍀*


*🕉. దయ అందాన్ని తెస్తుంది -- దయ అంటే మొత్తం విశ్రాంతిని చుట్టుముట్టే ప్రకాశం అని అర్థం. 🕉*


*మీరు ఆకస్మికంగా కదిలితే, ప్రతి క్షణం అది ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. ఈ క్షణం తదుపరిది నిర్ణయించ బడదు, కాబట్టి మీరు ప్రతి దానికి సిద్ధంగా ఉంటారు. తదుపరి క్షణం దాని స్వంత ఉనికిని నిర్ణయిస్తుంది; మీకు ప్రణాళిక లేదు, నమూనా లేదు, నిరీక్షణ లేదు. ఈ రోజు సరిపోతుంది; రేపటి కోసం లేదా తదుపరి క్షణం కోసం కూడా ప్రణాళిక చేయవద్దు. ఈ రోజు ముగుస్తుంది, ఆపై రేపు తాజాగా మరియు అమాయకంగా వస్తుంది, ఎటువంటి తికమక లేకుండా. ఇది దాని స్వంత ఒప్పందంతో మరియు గతం లేకుండా తెరుచుకుంటుంది. ఇది కృప.*


*ఉదయం పూవు విడవవడాన్ని చూడండి. చూస్తూనే ఉండండి... ఇది కృప. అస్సలు శ్రమ లేదు- పువ్వు ప్రకృతికి అనుగుణంగా కదులుతుంది. లేదా అప్రయత్నంగా, దాని చుట్టూ విపరీతమైన లావణ్య౦తో పిల్లిని మేల్కొనడం చూడండి. ప్రకృతి అంతా దయతో నిండి ఉంది, కానీ లోపల విభజనల కారణంగా మనం మనోహరంగా ఉండే సామర్థ్యాన్ని కోల్పోయాము. కాబట్టి కదలండి మరియు ఈ క్షణాన్ని నిర్ణయించు కోనివ్వండి--దానిని నిర్వహించడానికి ప్రయత్నించవద్దు. దీనినే నేను వదలడం (లెట్-గో) అని పిలుస్తాను - మరియు ప్రతిదీ దీని నుండి జరుగుతుంది. అవకాశం ఇవ్వండి!*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 14 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 14. GRACE 🍀*


*🕉. Grace brings beauty -- Grace simply means the aura that surrounds total relaxation.  🕉*


*If you move spontaneously, each moment itself decides how it will be. This moment is not going to decide for the next, so you simply remain open-ended. The next moment will decide its own being; you have no plan, no pattern, no expectation. Today is enough; don't plan for tomorrow, or even for the next moment. Today ends, and then tomorrow comes fresh and innocent, with no manipulator. It opens of its own accord, and without the past. This is grace.*


*Watch a flower opening in the morning. Just go on watching ... this is grace. There is no effort at all- the flower just moves according to nature. Or watch a cat awakening, effortlessly, with a tremendous grace surrounding it. The whole of nature is full of grace, but we have lost the capacity to be graceful because of the divisions within.  So just move, and let the moment decide--don't try to manage it. This is what I call it let-go --and everything happens out of this. Give it a chance!*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 464 - 3  / Sri Lalitha Chaitanya Vijnanam  - 464  - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*

*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*


*🌻 464. 'కాంతిమతి' - 3 🌻*


*పదార్థమయమగు విషయము లందాసక్తి కలిగిన మనస్సునకు కళాకళ లుండును. దివ్యమున కుమ్ముఖము చెందిన మనస్సునకు పూర్ణకళ యుండును. మనస్సు అద్దము వంటిది. దానిని భూమికి ఉన్ముఖము చేసిన పదార్థమయ రూపము గోచరించును. చెట్టు, పుట్ట, కొండ, కోతి కనిపించును. ఆకాశమునకు అద్దము నున్ముఖము చేసినచో వెలుగే ప్రతిబింబించును. ఆకాశమున విహరించు జీవులు కూడ గోచరించెదరు. ఇట్లు మనసు ఉన్ముఖత్వమును బట్టి కాంతివంతమగుట, కాంతిహీన మగుట జరుగును. యోగీశ్వరులు, పరమహంసలు, సిద్ధులు, దివ్య పురుషులు కాంతిమతులు. ఇక శ్రీమాత కాంతిమతి అనుట యందు ఎట్టి విశేషము లేదు. ఆమె సతతము శివుని యందే యున్నది. ఆమె శాశ్వత కాంతిమతి. ఇతర జీవులు ఆమె అనుగ్రహమున కాంతిమతులగు చున్నారు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 464 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*

*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*


*🌻 464. 'Kantimati' - 3 🌻*


*A mind that is oriented to the materialistic things have these phases. A mind that is focused on the divine will be always full. Mind is like a mirror. If it is only oriented to the physical objects, it sees only physical objects. If the mirror is turned towards the sky, the light will be reflected. Even the living beings who wander in the sky are seen. Thus, depending on the disposition of the mind, there will be light and darkness. Yogiswaras, paramahamsas, siddhas, divine men are luminaries. There is no doubt Srimata being called Kantimati. Her eternity belongs to Lord Shiva. She is an eternal light. Other beings became luminaries by her grace.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page