🍀🌹 17, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 17, OCTOBER 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి 🌹*
🌹 Worship Maa Chandraghanta - Mata Annapurna Devi on the 3rd day of Navratri 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 443 / Bhagavad-Gita - 443 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 29 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 29 🌴
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 56 / Osho Daily Meditations - 56 🌹
🍀 56. స్థిర పడండి / 56. SETTLING DOWN 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 - 9 🌹
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 9 / Description of Nos. 485 to 494 Names - 9 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 17, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్రఘంట - అన్నపూర్ణ దేవి పూజ, ChandraGhanta - Annapurna Devi Pooja. 🌻*
*🌷. 3. చంద్రఘంట ప్రార్ధనా శ్లోకము :*
*పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।*
*ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥*
*🌷. శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం :*
*నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |*
*ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||*
*🌷. అలంకారము - నివేదనం :*
*అన్నపూర్ణ దేవి - లేత రంగు, కొబ్బరి అన్నం*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనస్సు శాంతం కావాలి - మనస్సులో స్థిరమైన శాంతినీ, నిశ్చల నీరవతనూ నెలకొల్పుకోడం సాధనలో చేయవలసిన మొట్టమొదటి పని. లేని యెడల నీ కొకవేళ అనుభవాలు కలిగినా ఏదీ స్థిరంగా వుండదు. శాంతమనస్సు నందే సత్య చేతనను ప్రతిష్ఠించడం సాధ్యమవుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీజ మాసం
తిథి: శుక్ల తదియ 25:27:43 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: విశాఖ 20:32:04 వరకు
తదుపరి అనూరాధ
యోగం: ప్రీతి 09:22:55 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 13:20:49 వరకు
వర్జ్యం: 01:25:04 - 03:04:48
మరియు 24:36:50 - 26:14:46
దుర్ముహూర్తం: 08:30:13 - 09:17:08
రాహు కాలం: 14:57:20 - 16:25:19
గుళిక కాలం: 12:01:22 - 13:29:21
యమ గండం: 09:05:25 - 10:33:23
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 11:23:28 - 13:03:12
సూర్యోదయం: 06:09:27
సూర్యాస్తమయం: 17:53:18
చంద్రోదయం: 08:12:53
చంద్రాస్తమయం: 19:39:04
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,
సర్వ సౌఖ్యం 20:32:04 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి / Worship Maa Chandraghanta - Mata Annapurna Devi on the third day of Navratri 🌹*
*📚 . ప్రసాద్ భరద్వాజ*
*🌷. 3. చంద్రఘంట ప్రార్ధనా శ్లోకము :*
*పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।*
*ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥*
*🌻. శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం :*
*నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |*
*ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||*
*🌷. అలంకారము - నివేదనం : అన్నపూర్ణ దేవి - పసుపు రంగు, క్షీరాన్నం, దద్దోజనం, గారెలు*
*🌷. మహిమ :*
*దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.*
*🌷. చరిత్ర :*
*దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.*
*నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.*
*ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.*
*ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.*
*మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Worship Maa Chandraghanta - Mata Annapurna Devi on the third day of Navratri 🌹*
*Maa Chandraghanta is the third manifestation of Devi Durga and is worshipped on the 3rd of Navratri. Since she has a Chandra or half moon, in the shape of a Ghanta (bell), on her forehead, she is addressed as Chandraghanta. A symbol of peace, serenity and prosperity, Maa Chandraghanta has three eyes and ten hands holding ten types of swords, weapons and arrows. She establishes justice and gives Her devotees the courage and strength to fight challenges.*
*Her appearance may be of a source of power which is always busy killing and suppressing the bad and wicked. However, for her devotees, Maa is serene, gentle and peaceful. By worshipping Maa Chrandraghanta, you will open the doors to great respect, fame and glory. Maa also helps you attain spiritual enlightenment. Her idol, which symbolises both beauty and bravery, gives you the strength the keep the negative energy away and repels all the troubles from your life.*
*You need to follow simple rituals to worship Goddess Chandraghanta. You should first worship all the Gods, Goddesses and Planets in the Kalash and then offer prayer to Lord Ganesha and Kartikeya and Goddess Saraswati, Lakshmi, Vijaya, Jaya - the family members of Goddess Durga. The pooja should be concluded by worshipping Goddess Chandraghanta followed by a heartfelt prayer to Lord Shiva and Lord Brahma.*
*The Mantra And Other Facts About Maa Chandraghanta*
*Maa Chandraghanta Dhyan: Pindaj Pravara Roodha Chand Kopaastra Kairyuta Prasaadam Tanute Mahyam Chandra Ghanteti Vishruta.*
*Maa Chandraghanta Mantra for the third day of Navratri: Om Cham Cham Cham Chandraghantaye Hrum. (Chant 108 times).*
*Colour of the third day: White.*
*Prasad of the third day: Revdi i.e. mixture of white sesame seeds and jaggery.*
*Governing Planet: It is believed that the planet Shukra is governed by Goddess Chandraghanta.*
*Performing Shukra Grah Shanti Puja proves to be highly beneficial for the native on this day and helps to strengthen weak Venus in the birth chart. It helps you to attain health, wealth, and prosperity.*
🌹 🌹 🌹🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 443 / Bhagavad-Gita - 443 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 29 🌴*
*29. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |*
*దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||*
*🌷. తాత్పర్యం : చావు కోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు.*
*🌷. భాష్యము : యుద్ధ రంగంలో ఏంతో మంది ఉత్తమ రాజులు మరియు యోధులు ఉన్నారు. వారందరూ అది తమ కర్తవ్యముగా పరిగణించి యుద్ధంలో పోరాడారు మరియు యుద్ధరంగంలో తమ ప్రాణములను విడిచి పెట్టారు. అర్జునుడు వారిని నదులు తమకుతామే వచ్చి సముద్రములో కలిసిపోవటంతో పోల్చుతున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు స్వార్థం కోసం మరియు దురాశతో యుద్ధ రంగానికి వచ్చారు. అర్జునుడు వారిని, అమాయకత్వంతో ఎర చూపబడి, అగ్నిలో పడి కాలిపోయే పురుగులతో పోల్చుతున్నాడు. ఈ రెంటిలో కూడా, ఆసన్నమైన మృత్యువు వైపు, వారు వడివడిగా పరుగులు పెడుతున్నారు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 443 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 29 🌴*
*29. yathā pradīptaṁ jvalanaṁpataṅgā viśanti nāśāya samṛddha-vegāḥ*
*tathaiva nāśāya viśanti lokās tavāpi vaktrāṇi samṛddha-vegāḥ*
*🌷 Translation : I see all people rushing full speed into Your mouths, as moths dash to destruction in a blazing fire.*
*🌹 Purport : There were many noble kings and warriors in the war, who fought as their duty and laid down their lives on the battlefield. Arjun compares them to river waves willingly merging into the ocean. There were also many others, who fought out of greed and self-interest. Arjun compares them with moths being lured ignorantly into the incinerating fire. But in both cases, they are marching rapidly toward their imminent death.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 56 / Osho Daily Meditations - 56 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 56. స్థిర పడండి 🍀*
*🕉. పనులు సజావుగా సాగితే ప్రేమికులు భయపడతారు. బహుశా ప్రేమ కనుమరుగై పోతోందని వారు భావించడం ప్రారంభిస్తారు. 🕉*
*ప్రేమ స్థిరపడినప్పుడు అంతా సాఫీగా మారుతుంది. అప్పుడు ప్రేమ మరింత స్నేహంగా మారుతుంది- దాని అందం వేరు. స్నేహం అనేది ప్రేమ యొక్క సారం, సారాంశం. కాబట్టి స్థిరపడండి! చింతించకండి, లేకపోతే ఎదో ఒక రోజు మీరు ఇబ్బందులను సృష్టించడం ప్రారంభిస్తారు. మనస్సు ఎల్లప్పుడూ ఇబ్బందిని సృష్టించాలని కోరుకుంటుంది, తన ప్రాధాన్యత చూపుకోవడం కోసం; ఇబ్బంది లేనప్పుడు, అది అప్రధానంగా మారుతుంది.*
*మనసు కూడా పోలీస్ విభాగం లాంటిది. నగరం ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంటే, వారికి బాధగా ఉంటుంది: దోపిడీ లేదు, అల్లర్లు లేవు, హత్యలు లేవు - ఏమీ లేదు! అవి దేనికీ అవసరం లేదు. అంతా నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనస్సుకు భయం ఉంటుంది, ఎందుకంటే మీరు నిజంగా స్థిరపడితే, మనస్సు ఇక ఉండదు. ఇది గుర్తుంచుకోండి. మనస్సు వెళ్ళి పోవాలి, ఎందుకంటే అది లక్ష్యం కాదు. మనసును దాటి వెళ్లడమే లక్ష్యం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండటానికి ఒకరికొకరు సహాయం చేసుకోండి మరియు విషయాలు సజావుగా సాగనివ్వండి. మరొకరు భయాందోళనకు గురైతే, సహాయం చేయడానికి ప్రయత్నించండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 56 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 56. SETTLING DOWN 🍀*
*🕉 Lovers become afraid when things go smoothly. They start feeling that perhaps love is disappearing. 🕉*
*When love settles, everything becomes smooth. Then love becomes more like friendship-and that has a beauty of its own. Friendship is the very cream, the very essence, of love. So settle! And don't be worried, otherwise sooner or later you will start creating trouble. The mind always wants to create trouble, because then it remains important; when there is no trouble, it becomes unimportant.*
*The mind is just like the police department. If the city is calm and quiet, they feel bad: no robbery, no riot, no murders--nothing! They are not needed for anything. When everything is silent and peaceful, the mind has a fear, because if you really settle, the mind will be no more. Just remember this. The mind has to go, because it is not the goal. The goal is to go beyond the mind. So help each other to be silent, and keep things going smoothly. If the other starts to get panicky, try to help.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 9 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।*
*దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*
*🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।*
*మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*
*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 9 🌻*
*లోపల వెలుపల అను భేదము దాటినవారే నిజమగు వీరులు. తాను యితరులు అను భేదము దాటినవారు వీరులు. వీరు మెలకువ, స్వప్నము, నిద్ర అను మూడు స్థితులే గాక, నాలుగవ స్థితి యగు తురీయ స్థితిని తెలిసినవారు. ఇట్టి వారిచే శ్రీమాత సృష్టి నిర్వహణము చేయుచు నుండును. వారికి వరములొసగి శక్తివంతులను జేసి కృతకృత్యులను చేయును. దివ్యాకర్షణ గల వాచక శక్తి గలవారిని కూడ వీరులందురు. వారు చేయు దివ్యబోధన ద్వారా జీవులుద్ధరింప బడుచుందురు. వారు బ్రహ్మ రసామృతమును పానము చేయుచు యితరులకు పంచి పెట్టుకొందురు. ఇట్టి వారిని కూడ శ్రీమాత అనుగ్రహించు చుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 9 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya*
*danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*
*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya*
*mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻*
*🌻 Description of Nos. 485 to 494 Names - 9 🌻*
*The real heroes are those who transcend the distinction between inside and outside. Those who transcend the distinction of self and others are heroes. They are aware of not only the three states of waking, dream and sleep, but also the fourth state of Turiya. Srimata manages the Creation through these people. She bestows boons on them and makes them powerful and accomplished. Those with divine attraction of oratory skills are also heroes. They uplift beings through divine teaching. They drink Brahma Rasamrita and distribute it to others. Srimata bestows her grace on such people too.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Комментарии