top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 18, APRIL 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 18, APRIL 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 18, APRIL 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 357 / Bhagavad-Gita - 357 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 19 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 204 / Agni Maha Purana - 204 🌹

🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 4 / Mode of installation of the image of Vāsudeva - 4 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 069 / DAILY WISDOM - 069 🌹

9. అన్ని సత్యాల సత్యం / 9. The Truth of All Truths 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 334 🌹

6) 🌹. శివ సూత్రములు - 71 / Siva Sutras - 71 🌹

🌻 22. మహాహృదాను సంధానన్ మంత్ర విర్యానుభవః - 2 / 22. mahāhṛidānu saṁdhānān mantra vīryānubhavaḥ - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 18, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక శివరాత్రి, Masik Shivaratri🌻*


*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - ధ్యానం 🍀*


*ప్రతప్తస్వర్ణవర్ణాభం సంరక్తారుణలోచనమ్ |*

*సుగ్రీవాదియుతం ధ్యాయేత్ పీతాంబరసమావృతమ్*

*గోష్పదీకృతవారాశిం పుచ్ఛమస్తకమీశ్వరమ్ |*

*జ్ఞానముద్రాం చ బిభ్రాణం సర్వాలంకారభూషితమ్*

*వామహస్తసమాకృష్టదశాస్యాననమండలమ్ |*

*ఉద్యద్దక్షిణదోర్దండం హనూమంతం విచింతయేత్*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : పూర్ణయోగలక్ష్యం - జగత్తులోనికి దివ్యప్రేమానందములను గొనిరావడమే పూర్ణయోగపు ముఖ్య లక్ష్యం. కాని, అది సిద్ధించాలంటే, వాటికి ఆధారంగా దివ్యజ్ఞాన శక్త్యావిర్భావం జరగాలి. లేని యెడల మానవ సహజమైన దౌర్బల్యాలచే ప్రేమ కప్పబడిపోతుంది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: కృష్ణ త్రయోదశి 13:28:52

వరకు తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: ఉత్తరాభద్రపద 25:02:38

వరకు తదుపరి రేవతి

యోగం: ఇంద్ర 18:08:01 వరకు

తదుపరి వైధృతి

కరణం: వణిజ 13:29:52 వరకు

వర్జ్యం: 11:29:36 - 12:59:52

దుర్ముహూర్తం: 08:29:18 - 09:19:35

రాహు కాలం: 15:24:11 - 16:58:29

గుళిక కాలం: 12:15:36 - 13:49:54

యమ గండం: 09:07:01 - 10:41:18

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40

అమృత కాలం: 20:31:12 - 22:01:28

సూర్యోదయం: 05:58:26

సూర్యాస్తమయం: 18:32:47

చంద్రోదయం: 04:37:56

చంద్రాస్తమయం: 16:56:38

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: సిద్ది యోగం - కార్య

సిధ్ధి , ధన ప్రాప్తి 25:02:38 వరకు

తదుపరి శుభ యోగం - కార్య జయం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 357 / Bhagavad-Gita - 357 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 19 🌴*


*19. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్స్రుజామి చ |*

*అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||*


🌷. తాత్పర్యం :

*ఓ అర్జునా! వేడినొసగువాడను, వర్షము నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్, అసత్తులు రెండును నా యందే యున్నవి.*


🌷. భాష్యము :

*శ్రీకృష్ణభగవానుడు తన వివిధశక్తులచే విద్యుత్,సూర్యుల ద్వారా వేడిని, వెలుతురును ప్రసరించుచుండును. వేసవి కాలమున వర్షము పడకుండా ఆపునది మరియు వర్షకాలమున కుండపోత వర్షములు కురిపించినది ఆ శ్రీకృష్ణుడే. జీవితకాలమున పొడగించుచు మనలను పోషించు ప్రాణశక్తి అయిన అతడు అంత్యమున మృత్యువుగా మనకు దర్శనమిచ్చును.*


ఈ శక్తులన్నింటిని విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎత్తి భేదము లేదని మనము నిశ్చయించుకొనగలము. అనగా సత్, అసత్తులు రెండును అతడే. కనుకనే కృష్ణభక్తిరసభావన యందు పురోగమించిన స్థితి యందు మనుజుడు సత్, అసత్తుల భేదమును గాంచక సర్వమునందు కృష్ణునే గాంచును. సత్, అసత్ లు రెండును శ్రీకృష్ణుడే అయినందున సర్వ భౌతికసృష్టులను కలిగియున్న విశ్వరూపము కుడా శ్రీకృష్ణుడే. అంతియేగాక ద్విభుజ మురళీధర శ్యామసుందరుని రూపమున అతడు ఒనరించిన బృందావనలీలలు ఆ దేవదేవునివే.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 357 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 19 🌴*


*19. tapāmy aham ahaṁ varṣaṁ nigṛhṇāmy utsṛjāmi ca*

*amṛtaṁ caiva mṛtyuś ca sad asac cāham arjuna*


🌷 Translation :

*O Arjuna, I give heat, and I withhold and send forth the rain. I am immortality, and I am also death personified. Both spirit and matter are in Me.*


🌹 Purport :

*Kṛṣṇa, by His different energies, diffuses heat and light through the agency of electricity and the sun. During the summer season it is Kṛṣṇa who checks rain from falling from the sky, and then during the rainy season He gives unceasing torrents of rain. The energy which sustains us by prolonging the duration of our life is Kṛṣṇa, and Kṛṣṇa meets us at the end as death.*


*By analyzing all these different energies of Kṛṣṇa, one can ascertain that for Kṛṣṇa there is no distinction between matter and spirit, or, in other words, He is both matter and spirit. In the advanced stage of Kṛṣṇa consciousness, one therefore makes no such distinctions. He sees only Kṛṣṇa in everything. Since Kṛṣṇa is both matter and spirit, the gigantic universal form comprising all material manifestations is also Kṛṣṇa, and His pastimes in Vṛndāvana as two-handed Śyāmasundara, playing on a flute, are those of the Supreme Personality of Godhead.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 204 / Agni Maha Purana - 204 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 60*


*🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 4 🌻*


*పరమేశ్వరా! నీవే ఆ జీవచైతన్యము. నీవు హృదయమునుండి ప్రతిమలో ప్రవేశించి స్థిరముగా నుండుము. ఈ ప్రతిమను సజీవము చేయుము. అన్ని దేహములందును అంగుష్ఠమాత్రపురుషుడున్నాడు. అతడు జ్యోతిఃస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు; ఏకమాత్ర అద్వితీయపరబ్రహ్మ" ఈవిధముగ ప్రతిమను సజీవము చేసి ప్రణపముతో భగవంతుని మేల్కొల్పవలెను. పిదప భగవంతుని హృదయము స్పృశించి పురుషసూక్తమును జపించవలెను. దీనికి సానిధ్యకరణకర్మ" యని పేరు భగవద్ధ్యానము చేయుచు ఈ రహస్యమంత్రమును పఠింపవలెను*


*"ప్రభూ! నీవు సకలదేవాధీసుడవు. సంతోషవైభవస్వరూపుడవు. నీకు నమస్కారము. జ్ఞానవిజ్ఞానములు నీ స్వరూపము. త్రిగాణాతీతము. నీవు అంతర్యామివి; పరమాత్మవు. నాశరహితు డగు పురాణపురుషుడవు. నీకు నమస్కారము. మహావిష్ణూ! నీ విచట సంనిహితుడవు కమ్ము. నీ పరమతత్త్వము, జ్ఞానమయశరీరము ఒక సంఘాతముగ ఏర్పడీ ఈ అర్చావిగ్రహమునందు అవిర్భూతమగు గాక". ఈ విధముగ శ్రీహరి సాంనిధ్యకరణము చేసి అతని ఎదుట బ్రహ్మదిపరివారదేవతలను స్థాపింపవలెను. వారి ఆయుధములను ముద్రలను కూడ స్థాపింపవలెను. శ్రీహరిదరశనార్థమై వచ్చువారియాత్రలను బట్టియు. వర్షాదులను బట్టియు శ్రీహరి అచట సన్నిహితుడై యున్నాడను విషయమును గ్రహింపవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 204 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 60*

*🌻Mode of installation of the image of Vāsudeva - 4 🌻*


20-21. O Supreme Lord! you become firmly established in the image. I invoke you, the spirit of supreme happiness, one devoid of (three states) waking, dreaming and deep sleep, one who is devoid of a body, sense-organs, intellect, life and egoism, and one who resides in the hearts of all beings beginning with Brahman and ending with a dump of grass.


22. You make the image imbued with your soul both inside and outside. You have taken your abode in this image (of the size of) a thumb with attributes.


23. Having invoked (the god in the image), the supreme brahman, lustrous form of knowledge and who is one without a second, that is deemed as alive by the use of (the mantra) Oṃ.


24. The act of bringing the god near consists in uttering (the mantra) and touching the heart (of the image). (The priest) should recite the puruṣasūkta[11] and should recite the following (mantra) in secret.


25-27. Salutations to the Lord of celestials who is of the form of happiness and fortune, of the form of knowledge and wisdom and who attends on the lustre of the supreme brahman. (Salutations to) the one who is beyond properties, the great being, devoid of decay, old age. O Viṣṇu, you be present here. Whichever is the supreme principle in you and that which is your form verily (made up) of knowledge, all that be present here in this form. May you awake!


28. Stationing oneself in from of the deity, (the priest) should establish Brahman and other attendant gods as well as the respective weapons (by showing) the mudrā (different postures shown with the hand).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 69 / DAILY WISDOM - 69 🌹*

*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 9. అన్ని సత్యాల సత్యం 🌻*


*ఉపనిషత్తు మనల్ని ఆచారాల నుండి ఆరాధనలకు, ఆపై ఆధ్యాత్మిక భావనలకు తీసుకువెళుతుంది. ఆలోచనకు బాహ్యం నుండి అంతరానికి మరియు అంతరం నుండి విశ్వానికి క్రమంగా ఆరోహణ ఉంది. మనము ఈ బాహ్య ప్రవర్తనా విధానాలనుంచి అంతర్గత మానసిక విషయాల్లోకి వెళ్తాము. ఈ మానసిక విషయాలే బాహ్య ప్రవర్తనలకు కారణం. అప్పుడు ఈ మానసిక కారకాలకు సైతం కారణమైన అస్తిత్వం గురించి ధ్యానిస్తాము.*


*మనం బయట చేసేది మన మనస్సులో ఏమనుకుంటున్నామో దాని వల్ల నిర్ణయించబడుతుంది. మన మనస్సులో మనం ఏమనుకుంటున్నామో అది మన నిజస్వభావాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇక్కడ బాహ్య నామ,రూప కర్మల స్థాయి నుంచి అంతర్గత ఆలోచనా విధానాల వరకు ధ్యానం వృద్ధి చెందుతుంది. అక్కడ నుంచి తన స్వంత ఆలోచనా విధానాల నుంచి విశ్వ ఆలోచనా ప్రక్రియలకు, అక్కడనుంచి అన్ని ఉనికిలకు కారణమైన, ఉపనిషత్తుల్లో సత్యస్య సత్యంగా చెప్పబడిన విశ్వ అస్తిత్వం లోకి ఎదుగుతుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 69 🌹*

*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 9. The Truth of All Truths 🌻*


*The Upanishad takes us from ritualistic concepts to religious adorations, and then to spiritual visualisations. There is, again, a gradual ascent of thought, from the outward to the inward, and from the inward to the Universal. We withdraw from the outward mode of behaviour to the inward psychological factors which determine these external modes of behaviour, and then we contemplate the Being that is precedent even to psychological behaviour.*


*What we do outside is determined by what we think in our minds, and what we think in our minds is conditioned by what we are in our true selves. So, there is a process of the rise of contemplative action from the outer realm of name, form and action to the inward thought-processes of the individual, and to thought process in general, leading to ‘being’, not merely to the individual’s apparent being, but to the Being of all beings, which the Upanishad would describe as satyasya satyam, or the Truth of all truths.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 334 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. వ్యక్తిత్వాన్ని సృష్టించు కోవడమే పొరపాటు. అది ద్వంద్వ ప్రవృత్తి. ఒక వ్యక్తి యిద్దరవుతాడు. నీ అసలు తత్వాన్ని, సహజతత్వాన్ని అణగదొక్కి యితరులు చేసిన కొన్ని పద్ధతులకు, నియమాలకు లొంగడం. 🍀*


*వ్యక్తిత్వాన్ని సృష్టించుకోవడమే పొరపాటు. అది ద్వంద్వ ప్రవృత్తి. ఒక వ్యక్తి యిద్దరవుతాడు. అక్కడ అణచివేత వుంది. అక్కడ నీ అసలు తత్వాన్ని, సహజతత్వాన్ని అణగదొక్కి యితరులు చేసిన కొన్ని పద్ధతులకు, నియమాలకు లొంగడం. వాళ్ళు ఈప్పొప్పుల్ని, మంచీ చెడ్డల్ని నిర్ణయిస్తారు. వాళ్ళు నీ కోసం టెన్ కమాండ్ మెంట్స్ ని యిస్తారు. నువ్వు వాటిని అనుసరించాలి.*


*అప్పుడు నువ్వు నీ సహజతత్వంతో ఏం చేస్తావు? నీ సహజతత్వాన్ని అణచేస్తావు. దాన్ని నిర్లక్ష్యం చేస్తావు. సహజతత్వాన్ని ఈ మార్గంలో మార్చలేవు. అది లోపలి నించీ నిన్ను గిల్లుతూ వుంటుంది. నువ్వు తయారు చేసుకున్న వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. యిదంతా హిపోక్రసీ.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 071 / Siva Sutras - 071 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 22. మహాహృదాను సంధానన్ మంత్ర విర్యానుభవః - 2 🌻*

*🌴. చైతన్యం అనే మహా సముద్రంపై శ్రద్ధ గల ధ్యానం ద్వారా సర్వోత్కృష్టమైన 'నేను' యొక్క శక్తిని పొంది, మంత్రములు మరియు పవిత్ర శబ్దాలలో దాగి ఉన్న సమర్థత లేదా శక్తి యొక్క మేల్కొలుపును అనుభవిస్తారు.🌴*


*దైవీ సాగరం మన అంతరంలో ఉంటుంది. దీనిని "నా" చైతన్యం అంటారు. ఈ "నా" ఉద్దేశ్యం అహం కాదు. తనను తాను శివునికి భిన్నంగా గుర్తించడానికి అహంకారమే కారణం. ఈ సందర్భంలో, "నా" శివచైతన్యాన్ని సూచిస్తుంది. సదా శివునితో ఐక్యంగా ఉండే శక్తి యొక్క సృజనాత్మక శక్తి కారణంగా శివ చైతన్యం యొక్క సూక్ష్మ రూపం వివిధ ఆకారాలు మరియు రూపాలుగా వ్యక్తమవుతుంది. ఒకరు లేనిదే మరొకటి జడమవుతుంది. శివుడు సృష్టించాలనే సంకల్పం శక్తికి తెలుసు మరియు అర్థం చేసుకుంది. ఆమె వివిధ శక్తి స్థాయిల ద్వారా సృష్టిని కలిగిస్తుంది, వాటిలో ఒకటి ధ్వని. మొత్తం యాభై ఒక్క అక్షరాల యొక్క సామూహిక ధ్వని అహం (अहं), స్వయం చైతన్యం యొక్క పునాది సూత్రానికి దారి తీస్తుంది. ఇది అహంకారానికి భిన్నంగా ఉంటుంది, ఈ అహం వ్యక్తిగత గుర్తింపును సృష్టించడానికి కారణం. స్వయం చైతన్యమే శివ చైతన్యం.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 071🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 22. mahāhṛidānu saṁdhānān mantra vīryānubhavaḥ - 2 🌻*

*🌴. By the attentive meditation on the great ocean of consciousness, the power of supreme I is attained. one experiences the awakening of shaktis who are hidden in the sacred letters and sounds.🌴*


*The ocean of divinity is localized within. This is called I consciousness. This I does not mean ego. Ego is the cause for identifying oneself as a different entity from Śiva. In this context, I refer to Śivaconsciousness. The subtle form of Śiva consciousness is manifested in the form of different shapes and forms due to the creative power of Śaktī, who always stands united with Śiva. The one without the other becomes inert. She knows and understands the will of Śiva to create. She causes the creation through different energy levels, one of them being the sound. The collective sound of all the fifty one letters leads to ahaṁ (अहं), the foundational principle of I consciousness. This is different from ego, the cause for creation of individual identity. I consciousness is Śiva consciousness.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

コメント


bottom of page