top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 18, AUGUST 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 18, AUGUST 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 18, AUGUST 2023 FRIDAY శుక్రవారం, బృగువాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 415 / Bhagavad-Gita - 415 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 01 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 01 🌴

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261 🌹

🌻. శివ పూజాంగ హోమ విధి - 6 / Mode of installation of the fire (agni-sthāpana) - 6 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 127 / DAILY WISDOM - 127 🌹

🌻 6. ప్రపంచం సంపూర్ణత మీద ఆధారపడి ఉంది / 6. The World is Based on the Absolute 🌻

5) 🌹. శివ సూత్రములు - 129 / Siva Sutras - 129 🌹

🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -1 / 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 18, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మళయాల నూతన సంవత్సరం, Malayalam New Year 🌻*


*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 05 🍀*


*09. ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా ।*

*పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ ॥*

*10. అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ ।*

*పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : పూర్ణయోగలక్ష్య విశిష్టత - పూర్ణయోగ లక్ష్యం భగవత్సాక్షాత్కారం మాత్రమే కాదు, భగవచ్చేతన అభివ్యక్తికి యోగ్యమై భగవత్కర్మ సాధనమయ్యే రీతిగా బహిరంగ అంతర్జీవనమును భగవదంకితం గావించి పరివర్తన మొందించడం. మామూలు యమ నియమాదుల కంటె ఎంతో కఠినతరమైన అంతరంగిక శిక్షణ దీనికి కావలసి వుంటుంది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల విదియ 20:03:17 వరకు

తదుపరి శుక్ల తదియ

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 22:58:31

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: శివ 20:28:21 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: బాలవ 06:49:32 వరకు

వర్జ్యం: 04:58:40 - 06:46:36

దుర్ముహూర్తం: 08:31:42 - 09:22:24

మరియు 12:45:15 - 13:35:58

రాహు కాలం: 10:44:49 - 12:19:54

గుళిక కాలం: 07:34:39 - 09:09:44

యమ గండం: 15:30:04 - 17:05:09

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44

అమృత కాలం: 15:46:16 - 17:34:12

సూర్యోదయం: 05:59:33

సూర్యాస్తమయం: 18:40:15

చంద్రోదయం: 07:22:30

చంద్రాస్తమయం: 20:03:40

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,

ధన ప్రాప్తి 22:58:31 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 415 / Bhagavad-Gita - 415 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 01 🌴*


*01. అర్జున ఉవాచ*

*మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |*

*యత్త్వయోక్తం వచస్తేన మోహో(యం విగతో మమ ||*


*🌷. తాత్పర్యం : అర్జునుడు పలికెను: ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.*


*🌷. భాష్యము : శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడని ఈ అధ్యాయము తెలియజేయును. ఎవని నుండి భౌతికవిశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువునకు శైత్యము అతడే కారణము. అట్టి శ్రీకృష్ణుడు అవతారము కాదు. సర్వావతారములకు కారణుడైన అవతారి. ఈ విషయము గడచిన అధ్యాయమున విశదముగా వివరింపబడినది. ఇచ్చట అర్జునుడు తన మోహము తొలగిపోయినట్లుగా పలికినాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్యమానవునిగా లేక తన స్నేహితునిగా భావించక, సర్వమునకు కారణమైనవానిగా తెలియగలిగినాడు. అతడు పరమ్ ఉత్తేజితుడై తనకు కృష్ణుని వంటి గొప్ప స్నేహితుడు లభించినందులకు పరమానందభరితుడైనాడు. కాని తాను శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా ఆంగీకరింపరేమోనని అతడు యోచింప నారంభించెను.*


*కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరచుటకు అతడు తన విశ్వరూపమును చూపుమని ఈ అధ్యాయమున శ్రీకృష్ణుని ప్రార్థించెను. వాస్తవమునకు శ్రీకృష్ణుని విశ్వరూపము గాంచినపుడు ఎవరైనను అర్జునుని వలె భీతి నొందెదరు. కాని కరుణాంతరంగుడైన ఆ భగవానుడు విశ్వరూపమును చూపిన పిమ్మట తన మూలరూపమును పొందియుండెను. “నీ హితము కొరకు నేనిది ఉపదేశించుచున్నాను” అని పలుమార్లు శ్రీకృష్ణుడు పలికిన విషయమును సంపూర్ణముగా అంగీకరించిన అర్జునుడు అంతయు శ్రీకృష్ణుని కరుణ చేతనే జరుగుచున్నదని కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడనియు మరియు సర్వుల హృదయమునందు పరమాత్మరూపమున వసించియున్నాడనియు అర్జునుడు ఇప్పుడు సంపూర్ణ నిశ్చయమునకు వచ్చెను.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 415 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 01 🌴*


*01. arjuna uvāca*

*mad-anugrahāya paramaṁ guhyam adhyātma-saṁjñitam*

*yat tvayoktaṁ vacas tena moho ’yaṁ vigato mama*


*🌷 Translation : Arjuna said: By my hearing the instructions You have kindly given me about these most confidential spiritual subjects, my illusion has now been dispelled.*


*🌹 Purport : This chapter reveals Kṛṣṇa as the cause of all causes. He is even the cause of the Mahā-viṣṇu, from whom the material universes emanate. Kṛiṣṇa is not an incarnation; He is the source of all incarnations. That has been completely explained in the last chapter. Now, as far as Arjuna is concerned, he says that his illusion is over. This means that Arjuna no longer thinks of Kṛṣṇa as a mere human being, as a friend of his, but as the source of everything. Arjuna is very enlightened and is glad that he has such a great friend as Kṛṣṇa, but now he is thinking that although he may accept Kṛṣṇa as the source of everything, others may not. So in order to establish Kṛṣṇa’s divinity for all, he is requesting Kṛṣṇa in this chapter to show His universal form.*


*Actually when one sees the universal form of Kṛṣṇa one becomes frightened, like Arjuna, but Kṛṣṇa is so kind that after showing it He converts Himself again into His original form. Arjuna agrees to what Kṛṣṇa has several times said: Kṛṣṇa is speaking to him just for his benefit. So Arjuna acknowledges that all this is happening to him by Kṛṣṇa’s grace. He is now convinced that Kṛṣṇa is the cause of all causes and is present in everyone’s heart as the Supersoul.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*


*🌻. శివ పూజాంగ హోమ విధి - 6 🌻*


*పిమ్మట బాలకుడైన అగ్ని యొక్క ముఖమునందున్న నేత్రత్రయస్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనము చేయుటకై, ఘృతపూర్ణ మగు స్రువముతో "ఓం హామగ్నయే స్విష్టకృతే స్వాహా" అను మంత్రమునుచ్చరించుచు నాల్గవ ఆహుతి ఇవ్వవలెను., "ఓం హాం హృదయాయ నమః" ఇత్యాద్యంగ మంత్రములు ఆరును ఉచ్చరించుచు ఆజ్యమును అభిమంత్రించి, ధేనుముద్రతో మేల్కొల్పవలెను. కవచమంత్రముచే (హుం) ఆచ్ఛాదించి, శరమంత్రముచే ఘృతబిందూత్‌క్షేపణము చేసి, అభ్యుక్షణశోధనములు చేయవలెను. శివస్యరూప డగు అగ్ని యొక్క ఐదు ముఖములకు అభిఘూరహోమము, అనుసంధానహోమము, ముఖముల ఏకీకరణమునకై చేయు హోమమును చేయవలెను.*


*"ఓం హాం సద్యోజాతాయ స్వాహా, ఓం హాం వామదేవాయ స్వాహా, ఓం హాం అఘోరాయ స్వాహా, ఓం హాం తత్పురుషాయ స్వాహా, ఓం హాం ఈశానాయ స్వాహా" అను ఐదు మంత్రములచే, ఐదు ముఖములకొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అజ్యాహుతిచేసి, ఆ ముఖములను అభిఘారము చేసిన ఆజ్యముతో అప్లావితము చేయవలెను. ఇది ముఖాభి ఘార హోమము. పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వవలెను. ఇది ముఖానుసంధానమహోమము. దానిని_"ఓం హాం సద్యోజాత వామదేవాభ్యాం స్వాహా, ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహా, ఓం హాం అఘోరతత్పురుషాభ్యాం స్వాహా, ఓం హాం తత్పురుషేశానాభ్యాం స్వాహా" అను మంత్రములతో చేయవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 261 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 75*

*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 6 🌻*


38. The fourth oblation should be offered with the sacrificial ladle filled with clarified butter. Oṃ hāṃ oblation to firegod for the offering of a right sacrifice. After having consecrated in the six parts of one’s body, (the fire god) should be invoked with the dhenumudrā (posture with the fingers representing a cow).


39. Having covered it with the armour, the clarified butter should be protected by the mantra of the shaft. The clarified butter should be purified by sprinkling water and offering a drop of it into the fire along with the hṛd (mantra).


40. The rites of uniting the mouths of the fire should be performed as follows. Oṃ hāṃ oblations to Sadyojāta. Oṃ hāṃ oblations to Vāmadeva. Oṃ hāṃ oblations to Aghora. Oṃ haṃ oblations to Tatpuruṣa. Oṃ hāṃ oblations to Īśāna. Thus with oblations to one by one, one should do the union of the (different) faces.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 127 / DAILY WISDOM - 127 🌹*

*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 6. ప్రపంచం సంపూర్ణత మీద ఆధారపడి ఉంది 🌻*


*తత్వం, అనుభూతిక ప్రపంచం కంటే ఉన్నతమైనది అయినప్పటికీ, ఉన్నత సత్యం ఇక్కడికి తీసుకురావడానికి అనుభూతిక ప్రపంచ విషయాల సహాయాన్ని తీసుకుంటుంది. తత్వం అంతర్ప్రపంచం యొక్క భాష ఇక్కడ అర్థం కాదు కాబట్టి, ఆ సత్యం ఇక్కడ చెప్పడానికి స్థూల ప్రపంచ భాషలో మాట్లాడుతుంది. అతిమానవ జ్ఞానాన్ని మానవ స్థాయికి తీసుకురావడానికి స్థూల ప్రపంచ విషయాలను తత్వం ఉపయోగిస్తుంది.*


*తత్వంలో అంతర్లీనంగా ఉన్నత ప్రపంచ జ్ఞానం ఇమిడి ఉంటుంది. ఇది అర్థం చేసుకునే మనస్సుకు స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తత్వం జ్ఞానేంద్రియాలపై ఆధారపడినప్పటికీ అది ఇంద్రియాల ఆవల చూస్తుంది. అంతర్దృష్టి తత్వశాస్త్రం యొక్క మూలం, హేతువు దాని శరీరం. అంతర్దృష్టి అంటే కొంతమంది పాశ్చాత్య తత్వవేత్తలు చెప్పే ఇంద్రియ అంతర్దృష్టి కాదు. అఖండంతో అభిన్నమైన చైతన్యం యొక్క సమగ్ర అంతర్దృష్టి. ప్రపంచం సంపూర్ణతపై ఆధారపడి ఉంది; అది సంపూర్ణత యొక్క అభివ్యక్తి. ఇంద్రియాలకు జగత్తుగా కనిపించేది ప్రవహిస్తున్న, చలనంలో ఉన్న ఈ సంపూర్ణతే.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 127 🌹*

*🍀 📖 The Philosophy of Life 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 6. The World is Based on the Absolute 🌻*


*Philosophy soars above empiricality, though it takes the help of empirical concepts and categories for the sake of proclaiming to the world the truths declared by intuition. It speaks to the world in the language of the world, for the language of intuition is unintelligible to the world of experience. The form and shape of philosophy has necessarily to depend on the stuff out of which the world of experience is made, on account of its having to perform the function of transmitting the knowledge of the super-mundane ideal to the realm of mundane values.*


*It has always within itself a living undercurrent of significance and implication which gives a vivid picture of the nature of the ultimate end to the understanding mind. Philosophy stands on the shoulders of the senses, but looks beyond them. Intuition is the soul of philosophy, and reason is its body. By intuition, again, we do not mean the sensory intuition of certain Western philosophers, but the integral intuition of Consciousness, which is non-different from the Absolute. The world is based on the Absolute; it is a manifestation of the Absolute. It is the Absolute flowing and moving that appears to the senses as the world.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 129 / Siva Sutras - 129 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -1 🌻*


*🌴. ఆత్మశుద్ధి త్యాగంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి, శివుని స్వప్నంగా ప్రపంచాన్ని మరియు అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴*


*విద్య - జ్ఞానం యొక్క సాధారణ స్వచ్ఛమైన రూపం (పూర్ణ స్వచ్ఛమైనది కాదు), శుద్ధ విద్య అని పిలుస్తారు; సంహారే – శోషణ; తదు – ఎందుకంటే; ఉత్త – ముందుకు వస్తున్నది; స్వప్న – స్వప్న స్థితి; దర్శనం - ఉద్భవిస్తున్నది. మనస్సు నేను (అహం) మరియు ఇది (ఇదం) రెండింటితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఉన్న ద్వంద్వ చైతన్యాన్ని శుద్ధ విద్య అంటారు. స్పృహ యొక్క తదుపరి దశకు దారితీసే ఈ జ్ఞానాన్ని గ్రహించే సమయంలో, మునుపటి దశ (ద్వంద్వ స్పృహ) కలగా మారి వెళ్లి పోతుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 129 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -1 🌻*


*🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge.  🌴*


*Vidyā – pure form of knowledge (not purest), known as suddha vidyā; saṁhāre – absorption; tád – because; uttha – coming forth; svapna – dream state; darśanam – emerging. When the mind is associated with both I (aham­) and this (idam), the dual consciousness is known as suddha vidyā. At the time of absorption of this knowledge leading to the next stage of consciousness emerges, the previous stage (dual consciousness) passes off as a dream.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comentarios


bottom of page