top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 18, FEBRUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 18, FEBRUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 18, FEBRUARY 2023 SATURDAY, గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

*🌹. మహా శివరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికీ, Good Wishes on Maha Shivaratri to All. 🌹*

🌻. విశిష్టత - శివమంగళాష్టకం 🌻

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 328 / Bhagavad-Gita -328 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 18 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 175 / Agni Maha Purana - 175 🌹 🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 2 / The dimensions of different varieties of the Liṅga - 2 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 040 / DAILY WISDOM - 040 🌹 🌻 9. వాస్తవికత కోసం అన్వేషణ అనేది తత్వశాస్త్రం యొక్క అంశం / 9. The Search for Reality is the Subject of Philosophy 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 304 🌹

6) 🌹. శివ సూత్రములు - 42 / Siva Sutras - 42 🌹

🌻 14. దృశ్యం శరీరం - 1 / 14. Dṛśyaṁ śarīram - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 18, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*🍀. మహా శివరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికీ, Good Wishes on Maha Shivaratri to All. 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహా శివరాత్రి, Maha Shivaratri🌻*


*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 8 🍀*

15. నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే |

ఉన్మూలనకర్మఠాయ హ్యలక్ష్మ్యా సర్వదా నమః

16. నమో లోకత్రయేశాయ స్వానందనిహితాయ తే |

నమః శ్రీబీజరూపాయ సర్వకామప్రదాయినే


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : అంతఃస్ఫురణం - నీ లోపలకు నీవు ప్రవేశించగల సామర్థ్యంపై అంతఃస్ఫురణ మీద ఆధారపడి వుంటుంది. ఒకొక్కప్పుడది భక్తి మొదలగు వానిచే లోతెక్కిన చైతన్యము నందు దానంతటదే స్ఫురించ వచ్చును. లేక ఒక్కొక్కప్పుడు విషయ నివేదన మొనర్చి జవాబు నాలకించు అభ్యాసముచే నైననూ అనుభవానికి రావచ్చును, 🍀*


*🌻. విశిష్టత - విధి - శివ మంగళాష్టకం 🌻*


*మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి. శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగ రూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: కృష్ణ త్రయోదశి 20:03:57

వరకు తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: ఉత్తరాషాఢ 17:42:05

వరకు తదుపరి శ్రవణ

యోగం: వ్యతీపాత 19:36:13

వరకు తదుపరి వరియాన

కరణం: గార 09:50:38 వరకు

వర్జ్యం: 03:33:20 - 04:58:12

మరియు 21:12:20 - 22:36:28

దుర్ముహూర్తం: 08:14:19 - 09:00:49

రాహు కాలం: 09:35:41 - 11:02:52

గుళిక కాలం: 06:41:20 - 08:08:30

యమ గండం: 13:57:14 - 15:24:25

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53

అమృత కాలం: 12:02:32 - 13:27:24

మరియు 29:37:08 - 31:01:16

సూర్యోదయం: 06:41:20

సూర్యాస్తమయం: 18:18:47

చంద్రోదయం: 04:57:39

చంద్రాస్తమయం: 16:17:40

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: రాక్షస యోగం - మిత్ర

కలహం 12:26:00 వరకు తదుపరి

చర యోగం - దుర్వార్త శ్రవణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. మహా శివరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికీ, Good Wishes on Maha Shivaratri to All. 🌹*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻.విశిష్టత - శివ మంగళాష్టకం 🌻*


*మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి.*


*శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగ రూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.*


*శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.*


*ఉపవాసము ఉండి, రాత్రి నాలుగు ఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగ రూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.*


*నాలుగు ఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.*


*🍀. శ్రీ శివ మంగళాష్టకం 🍀*


*1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |*

*కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్*

*2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |*

*పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్*

*3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |*

*రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్*

*4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |*

*సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్*

*5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |*

*త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్*

*6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |*

*ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్*

*7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |*

*ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్*

*8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |*

*అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్*

*9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |*

*సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 328 / Bhagavad-Gita - 328 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 18 🌴*


*18. అవ్యక్తాద్ వ్యక్తయ: సర్వా: ప్రభవన్త్యహరాగమే |

రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే ||*


🌷. తాత్పర్యం :

*బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరు అవ్యక్తస్థితి నుండి వ్యక్తము చెంది, పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు.*


🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 328 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 18 🌴*


*18 . avyaktād vyaktayaḥ sarvāḥ prabhavanty ahar-āgame*

*rātry-āgame pralīyante tatraivāvyakta-saṁjñake*


🌷 Translation :

*At the beginning of Brahmā’s day, all living entities become manifest from the unmanifest state, and thereafter, when the night falls, they are merged into the unmanifest again.*


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 175 / Agni Maha Purana - 175 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 54*


*🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 2 🌻*


ద్వారమానమును బట్టి లింగము మూడు విధములగును. వీటిలో ఒక్కొక్క దానికి గర్భమానమును బట్టి, తొమ్మిదేసి భేదములగును. హస్తమానముచే తొమ్మిది భేదములగును. వీటిని దేవాలయములో పూజింపవలెను. ఈ విధముగ అన్నింటిని కలపగా ముప్పదియారు లింగములు. ఇది లింగముల జ్యేష్ఠమానము. మధ్యమమాన-కనిష్ఠ మానముల ఛేత కూడ ముప్పదియారు-ముప్పదియారు శివలింగము లగును. ఈ విధముగ అన్ని లింగములను కలుపగానూట ఎనిమిదిలింగము లగును. ఒకటి మొదలు ఐదు అంగులముల వరకు కనిష్ఠము (చిన్నది) ఆరునుండి పది అంగుళములవరకు చల లింగము మధ్యమము. పదకొండు నుండి పదునైదు అంగుళముల వరకు చల శివలింగము జ్యేష్ఠము. చాలమూల్యముగల రత్నములతో నిర్మించిన లింగము ఆరు అంగుళములు, సాధారణ రత్న నిర్మితము తొమ్మిది అంగుళములు, సువర్ణ నిర్మితము పండ్రెండు అంగుళములు ఇతర పదార్థ నిర్మితము పదునైదు అంగుళములు ఉండవలెను.


లింగ శిలను పదునారు భాగములు చేసిపై నాలుగు భాగములలో ప్రక్కనున్న రెండు భాగములను తీసివేయవలెను. మరల ముప్పది రెండు భాగములు చేసి దాని రెండు కోణములందును ఉండు పదునారు భాగములు తీసివేయవలెను. మరల దానిలో నాలుగు భాగములు కలుపగా కంఠము ఏర్పడును. అనగా ఇరువది భాగములు కంఠముగా ఏర్పుడను. రెండు ప్రక్కలను పడ్రెండు భాగములను తీసివేయుటచే జ్యేష్ఠ చల లింగము ఏర్పడును. ప్రాసాద (దేవాలయ)ము ఎత్తును పదునారు భాగములుగా విభజింపగా, నాలుగు, ఆరు, ఎనిమిది భాగముల ఎత్తుచే వరుసగా కనిష్ఠ-మధ్య-జ్యేష్ఠద్వారము లేర్పుడును. ద్వారము ఎత్తులో నాల్గవ వంతు తగ్గించగా అది లింగము ఎత్తు అగును. లింగ శిలాగర్భము ఎత్తులో సగము ఎత్తుగల శివలింగము కనిష్ఠము. పదునైదు భాగముల ఎత్తు గలది జ్యేష్ఠము. ఈ రెండింటి మధ్య ఏడు చోట్ల సూత్రపాతము చేయవలెను. ఈ విధముగ తొమ్మిది సూత్రము లగును ఈ తొమ్మిది సూత్రములలో ఐదు సూత్రముల ప్రమాణము గల లింగము మధ్యమము, లింగముల ఎత్తు రెండేసి భాగముల తేడాతో ఉండును. .


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 175 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 54*

*🌻The dimensions of different varieties of the Liṅga - 2 🌻*


9. The liṅgas are classified into three groups according to the measure of the doorway or into nine groups according to the measure of the adytum. These liṅgas should be worshipped in one’s residence.


10. Thus there are thirty-six liṅgas in the first class, thirty-six in the second class and thirty-six in the third class.


11. Thus totally there would be one hundred and eight liṅgas. The liṅgas (measuring) one to five fingers (known as) the short are said to be movable.


12. The movable liṅgas measuring six to ten fingers are known as middle. Those measuring eleven to fifteen fingers are known as the best.


13. (Those made) of excellent gems (should measure) six fingers. (Those made) of other gems (should measure) nine fingers. The golden ones (should be) twelve (fingers). The rest of the liṅgas (should be) fifteen (fingers).


14. The four sets of corners from the top should be successively cut into four or sixteen equal sides, and those again into thirty-two and sixty-four (in turn so as to make it a polygon of sixty-four equal sides).


15. The two sides being thus lopped off, the neck of a solid liṅga should be twenty-six parts from the rectangular space at its foot.


16. (The face of the liṅga) should gradually be decreasing by four, six and eight parts from its base (and similarly) the middle part of the liṅga should be gradually less than the height at its beginning by a foot.


17. That which is equal to half (the size of) the adytum is (said to be) the lowest (variety of) liṅga. That which is fifteen (fingers in length) is the excellent. Seven equal lines should be drawn in the central portion of these liṅgas.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 40 / DAILY WISDOM - 40 🌹*

*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 9. వాస్తవికత కోసం అన్వేషణ అనేది తత్వశాస్త్రం యొక్క అంశం 🌻*


*సరిగ్గా చెప్పాలంటే, తత్వశాస్త్రం యొక్క విషయం సత్యం లేదా వాస్తవికత యొక్క స్వభావానికి సంబంధించినది. మనం అవాస్తవాలు, అభూత కల్పనలు లేదా గతించిన వస్తువులను వెంబడించడం లేదని మనకు స్పష్టంగా తెలుసు; మనం ఈ విషయాల కోసం వెతకడం లేదు. మనకు గణనీయమైనది, శాశ్వతమైనది ఏదో, అది అవసరం. అంటే ఏంటి? మనం నిజమని లేదా సత్యం అని పిలిచే ఆ శాశ్వతమైన విషయం ఏమిటి? సత్యం కోసం అన్వేషణ అనేది తత్వశాస్త్రం యొక్క అంశం.*


*ఇప్పుడు మనం రెండవ అంశానికి వద్దాము. అది ఏమిటంటే వ్యక్తిగత స్వభావం, మన వ్యక్తిత్వ నిర్మాణం. వ్యక్తులుగా మన అంతర్గత నిర్మాణాన్ని విశ్లేషిస్తే అది మనస్తత్వ శాస్త్రం లో చాలా అంశాలుగా పరిగణించబడుతుంది. దానినే మానసిక విశ్లేషణ అని కూడా అంటారు. అవన్నీ వ్యక్తి యొక్క అంతర్గత విశ్లేషణ అనే ఒకే విషయం కిందకి చేర్చబడ్డాయి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 40 🌹*

*🍀 📖 Philosophy of Yoga 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 9. The Search for Reality is the Subject of Philosophy 🌻*


*Properly speaking, the subject of philosophy is concerned with the nature of Truth, or Reality. It is quite obvious that we are not after unrealities, phantoms or things that pass away; we are not in search of these things. We require something substantial, permanent. And what is this? What do we mean by the thing that is permanent, which is the same as what we call the Real? The search for Reality is the subject of philosophy.*


*Then we come to the second issue, the individual nature, the structure of our personality, the nature of our endowments. An analysis of the entire internal structure of ourselves as individuals in search of anything is comprehended under the various branches of psychology and even what we call ‘psychoanalysis. They all are subsumed under this single head of an internal analysis of the individual.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 042 / Siva Sutras - 042 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 14. దృశ్యం శరీరం - 1 🌻*

*🌴. ఈ శరీరం కనిపించే నేను. ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది. 🌴*


*దృశ్యం అంటే కనిపించే వస్తువు మరియు ఈ సందర్భంలో, ఇది వస్తు ప్రపంచాన్ని సూచిస్తుంది. శరీరం అంటే స్థూల శరీరం. ఈ సూత్రానికి రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైన వివరణలు ఉన్నాయి. దృశ్యం శరీరంపై ఆధారపడిన మొదటి వివరణ ఏమిటి అంటే ప్రపంచం, అతని (యోగి) ఇంద్రియాల ద్వారా గ్రహించబదిన ప్రపంచం తానే అయి ఉంటాడు అని. రెండవ వివరణ శరీరం దృశ్యం మీద ఆధారపడి ఉంటుంది.*


*దీనర్థం అతను తన స్వంత శరీరాన్ని ఇతర వస్తువులలాగే పరిగణిస్తాడని అర్థం. అవగాహన స్థాయి ఇక్కడ ముఖ్యమైన అంశం. మొదటి వివరణలో, అతను ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తన ఇంద్రియ అవయవాలను (కళ్ళు) ఉపయోగించి వస్తు ప్రపంచానికి మరియు అతని అంతర్గత స్వయానికి మధ్య ఎటువంటి భేదం లేదని గ్రహించడానికి తన మనస్సును ఉపయోగిస్తాడు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 042 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 14. Dṛśyaṁ śarīram - 1 🌻*

*🌴. The body is the visible self. It houses the true self, which is invisible.🌴*


*Dṛśyaṁ means a visible object and in this context, it refers to the perceived objective world and śarīram means the gross body. There are two interpretations possible for this sūtrā that is opposite to each other. The first interpretation based on dṛśyaṁ śarīram means that the world, comprehended through his (yogi) senses (dṛṣṭi – faculty of seeing) is his own self. The second interpretation is based on śarīram dṛśyaṁ.*


*This means that he considers his own body just like any other object. Level of perception is the significant factor here. In the first explanation, he uses his sensory organs (eyes) to comprehend the world and uses his mind to perceive that there is no differentiation between the objective world and his inner Self.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Commentaires


bottom of page