🍀🌹 18, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, MAY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 34 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 219 / Agni Maha Purana - 219 🌹
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 3 / Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 084 / DAILY WISDOM - 084 🌹
🌻 24. ప్రతి వ్యక్తి యొక్క కోరిక / 24. The Desire of Every Individual 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 349 🌹
6) 🌹. శివ సూత్రములు - 86 / Siva Sutras - 86 🌹
🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 2 / 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 18, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 6 🍀*
*11. రామో రామో రఘుపతిర్బుద్ధః కల్కీ జనార్దనః |*
*గోవిందో మాధవో విష్ణుః శ్రీధరో దేవనాయకః*
*12. త్రివిక్రమః కేశవశ్చ వాసుదేవో మహేశ్వరః* |
*సంకర్షణః పద్మనాభో దామోదరపరః శుచిః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : విశ్వచేతన మూలస్వరూప లక్షణం- సర్వజగత్తుతో ఏకత్వం మూలమందు స్వత స్సిద్ధంగానూ, స్వయం సంపూర్ణంగానూ ఉండనే ఉన్నది. ఆభివ్యక్తం చేసుకోవలసిన అవసరం దానికి లేదు. అయినా, ప్రేమ రూపంలో అది అభివ్యక్త మగునప్పుడు, ఎంతటి గాఢమైనదైనా దాని యందొక విధమైన విశాలత, ప్రశాంతత, విశ్వజనీనత తప్పనిసరిగా ఉండితీరుతుంది. విశ్వచేతనకు మూలస్వరూప లక్షణమిది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 21:44:17
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: అశ్విని 07:23:16 వరకు
తదుపరి భరణి
యోగం: సౌభాగ్య 19:36:11 వరకు
తదుపరి శోభన
కరణం: విష్టి 10:05:06 వరకు
వర్జ్యం: 03:25:40 - 05:00:36
మరియు 17:01:48 - 18:38:16
దుర్ముహూర్తం: 10:02:48 - 10:54:42
మరియు 15:14:11 - 16:06:05
రాహు కాలం: 13:49:51 - 15:27:10
గుళిక కాలం: 08:57:55 - 10:35:14
యమ గండం: 05:43:19 - 07:20:37
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 00:15:48 - 01:50:44
మరియు 26:40:36 - 28:17:04
సూర్యోదయం: 05:43:19
సూర్యాస్తమయం: 18:41:47
చంద్రోదయం: 04:31:48
చంద్రాస్తమయం: 17:35:09
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 07:23:16 వరకు తదుపరి పద్మ
యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 34 🌴*
*34. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమష్కురు |*
*మామేవైష్యసి యుక్వైవమాత్మానం మత్పరాయణ: ||*
🌷. తాత్పర్యం :
*నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము. నాకు నమస్కారము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.*
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన మొక్కటే కలుషితమైన భౌతికప్రపంచ బంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. భక్తియుతసేవను శ్రీకృష్ణభగవానునికే అర్పించవలెనని స్పష్టముగా ఇచ్చట తెలుపబడిన విషయమునకు అప్రమాణికులైన గీతావ్యాఖ్యాతలు కొన్నిమార్లు అర్థమును చెరచుదురు. దురదృష్టవశాత్తు వారు సాధ్యము కానటువంటి విషయముపైకి పాఠకుని మనస్సును మళ్ళింతురు. పరతత్త్వమేగాని సామాన్యుడు కానటువంటి శ్రీకృష్ణుని మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టి వారు తెలియజాలరు. శ్రీకృష్ణుడు, అతని దేహము, అతని మనస్సు అన్నియును ఏకమే. పరిపూర్ణమే.
ఈ విషయమునే “దేహదేహివిభేదో(యం నేశ్వరే విద్యతే క్వచిత్” యని చైతన్యచరితామృతము (ఆదిలీల పంచమాధ్యాయము 41-48) యొక్క అనుభాష్యమునందు శ్రీభక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారు కుర్మపురాణము నందు తెలుపబడినదానిని ఉదహరించియుండిరి. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు భేదభావమనునదియే లేదు. అతడు మరియు అతని శరీరము అభేదములు. కాని కృష్ణసంభందవిజ్ఞానము లేని కారణముగా అట్టి వ్యాఖ్యాతలు కృష్ణుని దేవదేవత్వమును మరుగుపరచి ఆ భగవానుడు అతని దేహము లేదా మనస్సు కన్నను అన్యుడని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది వాస్తవమునకు కృష్ణసంబంధవిజ్ఞాన రాహిత్యమేయైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుచుందురు.
శ్రీమద్భాగవతము యందలి “పరమగుహ్యజ్ఞానము” అను నవమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 372 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 34 🌴*
*34. man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru*
*mām evaiṣyasi yuktvaivam ātmānaṁ mat-parāyaṇaḥ*
🌷 Translation :
*Engage your mind always in thinking of Me, become My devotee, offer obeisances to Me and worship Me. Being completely absorbed in Me, surely you will come to Me.*
🌹 Purport :
In this verse it is clearly indicated that Kṛṣṇa consciousness is the only means of being delivered from the clutches of this contaminated material world. Sometimes unscrupulous commentators distort the meaning of what is clearly stated here: that all devotional service should be offered to the Supreme Personality of Godhead, Kṛṣṇa. Unfortunately, unscrupulous commentators divert the mind of the reader to that which is not at all feasible. Such commentators do not know that there is no difference between Kṛṣṇa’s mind and Kṛṣṇa.
Kṛṣṇa is not an ordinary human being; He is Absolute Truth. His body, His mind and He Himself are one and absolute. It is stated in the Kūrma Purāṇa, as it is quoted by Bhaktisiddhānta Sarasvatī Gosvāmī in his Anubhāṣya comments on Caitanya-caritāmṛta (Fifth Chapter, Ādi-līlā, verses 41–48), deha-dehi-vibhedo ’yaṁ neśvare vidyate kvacit. This means that there is no difference in Kṛṣṇa, the Supreme Lord, between Himself and His body. But because the commentators do not know this science of Kṛṣṇa, they hide Kṛṣṇa and divide His personality from His mind or from His body. Although this is sheer ignorance of the science of Kṛṣṇa, some men make profit out of misleading people.
Thus end the Bhaktivedanta Purports to the Ninth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Most Confidential Knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 219 / Agni Maha Purana - 219 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 64*
*🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 3 🌻*
*వరుణసూక్తము పఠించుచు పుష్ప-చామర-దర్పణ-ఛత్ర-పతాకలను సమర్పింపవలెను. మూలమంత్రము చదువుచు, 'ఉత్తిష్ఠ' అని పనికి లేవదీసి, ఆ రాత్రికి అధివాసనము చేయించవలెను. 'వరుణం వా' అను మంత్రముచే సంనిధీకరణము చేసి వరుణ సూక్తముచే పూజింపవలెను. మూలమంత్రముచే సజీవీకరణము చేసి చందనాదులతో పూజించవలెను. మండలమున వెనుక చెప్పిన విధమున అర్చన చేయవలెను. అగ్నికుండమున సమిధులతో హోమము చేయవలెను. వైదికమంత్రములతో గంగ మొదలగు నాలుగు గోవులను పిదుకవలెను. అన్నిదిక్కులందును యవలతో వండిన చరువు ఉంచి హోమము చేయవలెను. చరువును వ్యాహృతులచేతను, గాయత్రిచేతను లేదా మూలమంత్రముచేతను అభిమంత్రించిసూర్య-ప్రజాపతి-దివ్-అంతకనిగ్రహ-పృథ్వీ-దేహధృతి-స్వధృతి-రతి-రమతీ-ఉగ్ర-భీమ-రౌద్ర-విష్ణు-వరుణ-ధాతా-రాయస్పోష-మహేంద్ర-అగ్ని-యమ-నిరృతి-వరుణ-వాయు-కుబేర-ఈశ-అనంత-బ్రహ్మ-వరుణ నామములను చతుర్థ్యంతములు చేసి పలుకుచు అంతమున "స్వాహా" చేర్చి బలి ఇవ్వవలెను.. "ఇదం విష్ణుః" "తద్విప్రాసః" అను మంత్రములచే అహుతుల నీయవలెను. "సోమో ధేనువు" ఇత్యాది మంత్రములతో ఆరు ఆహుతు లిచ్చి "ఇమం మే వరుణ" అను మంత్రముతో ఒక ఆహుతి ఇవ్వవలెను. 'అపో హిష్ఠా' ఇత్యాది మంత్రత్రయముతోను 'ఇమా రుద్రా' ఇత్యాదిమంత్రముతోను కూడ ఆహుతుల నీయవలెను.*
*పిమ్మట పది దిక్కులందును బలు లిచ్చి గంధపుష్పాలతో పూజించవలెను. ప్రతిమను ఎత్తి మండపము మీద స్థాపించి గంధపుష్పాదుల చేతను, సువర్ణ పుష్పాదుల చేతను పూజించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు ఎనిమిది దిక్కులందును రెండేసి జానల చెరువులను, ఇసుకతో ఎనిమిది వేదికలను నిర్మింపవలెను. 'వరుణస్య' ఇత్యాది మంత్రము చదువుచు, ఘృతముతోను, యవలతో వండిన చరువుతోను వేరు వేరుగ నూటఎనిమిది హోమములు చేయవలెను. శాంతి జలము తీసికొని వచ్చి దానితో వరుణుని శిరస్సుపై అభిషేకము చేసి, సజీవీకరణము చేయవలెను. తన ధర్మపత్నియగు గౌరితో కూడిన వరుణుడు నదీనదములతో పరివేష్టితుడై యున్నట్లు ధ్యానము చేయవలెను. ఓం వరుణాయ నమః అను మంత్రముతో పూజించి సాంనిధ్యకరణము చేయవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 219 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 64*
*🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 3 🌻*
21. The invocation should be performed with the vyāhṛtis, gāyatrī and the principal mantra. Oblation should be done with the mantra sūryāya prajāpataye dyauḥ svāhā cāntarikṣakaḥ.
22. (Ceremony is to be performed) for the earth, Dehadhṛti, Svadhṛti, Rati, Ugra, Bhīma, Raudraka.
23-24. Viṣṇu, Varuṇa, Dhātṛ, Mahendra the furtherer of riches, Agni, Yama, Nairṛta, Varuṇa, Vāyu, Kubera, Īśa, Ananta, Brahman and the lord of waters should be propitiated. with oblations reciting svāhā and (the mantras) idaṃ viṣṇuḥ[28] and tad viprāsa[29].
25. Having made oblation six times with somo dhenu[30], oblation should be made with imaṃ me[31]. Again oblation should. be done thrice with āpo hi ṣṭhā[32] (and once) with imā rudrā[33].
26. Bali (offering) should be made in the ten directions. The image should be worshipped with perfumes and flowers. The image should be lifted and placed in a mystic diagram by a wise man.
27-28. (The image) should be worshipped with perfumes. and flowers as well as golden flowers duly. The excellent priest should lay eight raised platforms filled with sand after having made ready the water tanks measuring two feet. Then clarified. butter (should be given as oblation) hundred and eight times with (the mantra) varuṇasya[34].
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 84 / DAILY WISDOM - 84 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 24. ప్రతి వ్యక్తి యొక్క కోరిక 🌻*
*విరాట్ స్వరూపంగా మారాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఏ కోరికకైనా ఇదే అర్థం. ఒక కప్పు టీ తీసుకున్నా, మన కోరిక ఒక్కటే; మనం సర్వవ్యాపులమవ్వాలని అనుకుంటాము. సర్వంతో ఏకత్వం చెందాలని మన అంతర్గత మనస్సు ఇచ్చే ప్రేరేపణ కోరికగా వ్యక్తమవుతుంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాడు సర్వస్వం అవుతాడు, అని ఉపనిషత్తు చెబుతోంది. ఇది జీవులకు ఉపనిషత్తులు ఇచ్చే ఒక గొప్ప జ్ఞానం. ఈ సృష్టి ఎలా జరిగింది, చైతన్యం అన్ని వస్తువులుగా ఎలా మారింది, ఈ విషయాలను తెలుసుకుంటే, కోరిక యొక్క మూల రూపం మీకు అర్థమవుతుంది.*
*ఇది మనచే సరిగ్గా గ్రహించబడినట్లయితే, ఈ అభివ్యక్తికి కారణమైన దానిగా మనం మారవచ్చు. అది తెలిసినవాడు దైవం అవుతాడు. అందరికీ ఉపనిషత్తు యొక్క ముగింపు మరియు ఓదార్పు సందేశం ఇదే: జ్ఞానమే అస్తిత్వం. ఈ రహస్యాన్ని మనం తెలుసు కోగలిగితే, మనం స్వయంపాలన యొక్క రహస్యంలోకి లోతుగా వెళ్ళవచ్చు, తద్వారా కోరిక ఆగిపోతుంది. చైతన్యం వస్తువు ప్రాదేశికంగా మరియు తాత్కాలికంగా తన నుండి వేరు చేయబడిందని భావించడం కోరికకు కారణం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 84 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 24. The Desire of Every Individual 🌻*
*The desire of every individual is to become the Virat. This is the meaning of any desire. Even if we take a cup of tea, our desire is only that; we want to become one with everything. It is a stimulation of the inner psyche towards the unification of oneself with all things. One who knows this mystery can become everything, says the Upanishad, which is a great consolation and a comfort for created beings. If we can understand what all this drama means, how this creation has taken place, how Consciousness has become all things, what desire means actually in its intention.*
*if this is comprehended properly by us, we can become That, which has been the cause of this manifestation. One who knows it, becomes ‘That’. So is this concluding, solacing message of the Upanishad to everyone: Knowing is Being. If we can know this secret, we can go deep into the secret of self-mastery, so that desire ceases. The assumption by Consciousness that the object is spatially and temporarily cut off from itself is the cause of desire.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 349 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. అనుభవాలు మంచివైనా, చెడ్డవైనా బాధ కలిగించేవైనా, ఆనందం కలిగించేవైనా, వాటి గుండా మనిషి మెల్లమెల్లగా మేలుకుంటాడు. అట్లా జీవించిన జీవితం సంపన్న జీవితం. జీవన గాఢతని అందుకున్న వ్యక్తి కళ్ళు తెరవడానికి సమర్థుడవుతాడు. 🍀*
*ప్రతి మనిషీ గుడ్డివాడుగా పుట్టాడు. ప్రతి మనిషికీ అంధకారం నించీ బయటపడే శక్తి వుంది. మనిషి గుడ్డిగా పుడతాడు. ఎందుకంటే అచేతనంగా వుంటాడు. మెలకువతో వుండడు. కేవలం జీవితం గుండా, దాని అనుభవాలు మంచివైనా, చెడ్డవైనా బాధ కలిగించేవైనా, ఆనందం కలిగించేవైనా, వాటి గుండా మనిషి మెల్లమెల్లగా మేలుకుంటాడు. అట్లా జీవించిన జీవితం సంపన్న జీవితం. జీవన గాఢతని అందుకున్న వ్యక్తి కళ్ళు తెరవడానికి సమర్థుడవుతాడు. అప్పుడు ఒక సందర్భంలో వ్యక్తిలో విప్లవాత్మక పరివర్తన జరుగుతుంది. అప్పుడు జీవితం వెనకటిలా వుండదు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 086 / Siva Sutras - 086 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 2 🌻*
*🌴. మాయతో నిండిన మలినమైన శరీరంలో చిత్తం వికసించినప్పుడు, పరిమిత శక్తులతో కూడిన స్వప్నం లాంటి అస్పష్టమైన జ్ఞానం పుడుతుంది. 🌴*
*ఒక సాధారణ మనస్సు ఉన్న వ్యక్తి తన శరీరం వెలుపల లేదా అతని చైతన్యం వెలుపల భగవంతుని కోసం చూస్తాడు. అతను భగవంతుని యొక్క స్థూల రూపాలతో అనుబంధం కొనసాగిస్తాడు. భగవంతుడు చాలా సూక్ష్మ స్వభావం కలిగినవాడు మరియు మానవ గ్రహణశక్తికి మించినవాడు. అలాంటి వ్యక్తులు మతపరమైనవారు కానీ ఆధ్యాత్మికవాదులు కాదు. మతపరంగా ఉండడం వల్ల ముక్తి లభించదు. గరిష్టంగా, ఇది ఆధ్యాత్మికతకు పునాది వేయగలదు. భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోగలరు తప్ప స్థూల రూపంతో చూడలేరు. అందుకే, భగవంతుడిని ఎల్లప్పుడూ స్వయంలో దర్శిస్తారు. కానీ స్వయం అనేది మీకు స్థూల మానవ రూపాన్ని మాత్రమే సూచిస్తుంది. భ్రాంతితో బాధపడుతున్న మనస్సు ద్వంద్వవాదానికి దారి తీస్తుంది, ఇది భగవంతుడిని భిన్నమైన వ్యక్తిగా చూపుతుంది. స్వీయం (స్థూల మానవ రూపం) గురించిన జ్ఞానం అజ్ఞానమని, కలతో పోల్చబడింది. అలాంటి మనుష్యులు భగవంతుని దర్శనం చేసుకునే బదులు భగవంతుడిని చూడడానికి విఫల ప్రయత్నాలు చేస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 086 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 2 🌻*
*🌴. From the flowering of the chitta in an impure body which is filled with maya, there arises dreamlike indistinct knowledge with limited powers. 🌴*
*A person with an ordinary mind will look for the Lord either outside his body or beyond his consciousness and he continues to be associated with gross forms of Lord. Lord is extremely subtle in nature and beyond human perception. Such persons are religious but not spiritual. Being religious does not lead to liberation. At the most, it can lay a foundation for spiritualism. The Lord can only be realised and cannot be seen with a gross form. That is why, Lord is always referred as Self and self only refers to gross human form. A mind afflicted with illusion leads to dualism, which shows Lord as a different entity. The knowledge about self (gross human form) is said to be ignorant and compared to a dream. Such men make abortive attempts to see the Lord instead of visualizing Him.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments