top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 19, OCTOBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 19, OCTOBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 19, OCTOBER 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 5. స్కందమాత - సరస్వతీ దేవి 🌹

🌹 Worship Maa Skandamata on the 5th day of Navaratri 🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 444 / Bhagavad-Gita - 444 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 30 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 30 🌴

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 57 / Osho Daily Meditations  - 57 🌹

🍀 57. గుడ్డు పెంకులో / 57. IN AN EGGSHELL 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 10 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 - 10 🌹

🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 10 / Description of Nos. 485 to 494 Names - 10 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 19, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద మాత - మహాచండి పూజ, సరస్వతి పూజ, లలితా పంచమి, Skanda Mata-Maha Chandi Pooja, Saraswathi pooja, Lalita Panchami 🌻*


*🌷. స్కంద మాత ప్రార్ధనా శ్లోకము :*

*సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా*

*శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ*


*🌷. శ్రీ మహా చండీ కవచము :*

*అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతో రణే |*

*విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః *

*న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే |*

*నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం న హి *


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : మనోనిశ్చలతకు లక్షణం - ఒక ప్రశాంత సీమ గుండా బాటసారులు ఎక్కడినుంచో వస్తూ కదలిపోతున్నట్లు, వాయు సంచలనం లేని ఆకాశం గుండా ఒక పక్షుల గుంపు ఎక్కడి నుంచో అలా సాగిపోతున్నట్లు, ఆలోచనలు వగైరాలను నీ మానసిక చేతన చూడగలుగుతూ వాటితో తాను తాదాత్మ్యం చెందకుండా వుంటే, అదే మనస్సు నిశ్చలమైనదాని లక్షణం. ఎన్నెన్ని రూపాలు, ఎటువంటి దారుణ సంఘటనలు ఆ విధంగా కదలిపోయినా నీ నిశ్చలతకు భంగం వాటిల్లదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల పంచమి 24:33:34

వరకు తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: జ్యేష్ఠ 21:04:32 వరకు

తదుపరి మూల

యోగం: సౌభాగ్య 06:54:14 వరకు

తదుపరి శోభన

కరణం: బవ 12:52:58 వరకు

వర్జ్యం: 02:38:28 - 04:14:36

మరియు 28:56:40 - 30:31:12

దుర్ముహూర్తం: 10:03:59 - 10:50:47

మరియు 14:44:47 - 15:31:35

రాహు కాలం: 13:28:44 - 14:56:29

గుళిక కాలం: 09:05:29 - 10:33:14

యమ గండం: 06:09:59 - 07:37:44

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 12:15:16 - 13:51:24

సూర్యోదయం: 06:09:59

సూర్యాస్తమయం: 17:52:01

చంద్రోదయం: 10:10:35

చంద్రాస్తమయం: 21:20:21

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు : కాలదండ యోగం - మృత్యు

భయం 21:04:32 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 5. స్కందమాత - సరస్వతీ దేవి / Worship Maa Skandamata on the 5th day of Navaratri 🌹*

*📚 . ప్రసాద్ భరద్వాజ*


*🌷. స్కంద మాత ప్రార్ధనా శ్లోకము :*

*సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా*

*శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ*


*🌷. శ్రీ సరస్వతి దేవి స్తోత్రము :*

*నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే*

*యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా భక్త జిహ్వాగ్రసదనా శమాది గుణదాయినీ*


*🌷. అలంకారము - నైవేద్యం : సరస్వతి మాత దేవి - తెలుపు రంగు - కేసరి, పరమాన్నం, దద్దోజనం*


*🌷. మహిమ - చరిత్ర :*

*దుర్గా మాతయొక్క ఐదవ స్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కంద భగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించ బడుతుంది.*


*🌻. సాధన :*

*ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధ చక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.*


*నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి.*


*విశుద్ధ చక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధముల నుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన ధ్యాన వృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.*


*స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాత కొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.*


*కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Worship Maa Skandamata on the 5th day of Navaratri 🌹*


*The 5th day of Navratri is dedicated to Goddess Skandamata, the 5th manifestation of Goddess Durga and the mother of Lord Kartikeya, who was chosen by the devatas as their commander in chief in the war against the demons. The image of Devi Skandamata portrays Her holding Lord Skanda in his infant form and a lotus in her right hand. She has four arms, three eyes and a bright complexion. She is also called as Padamasani since She is often depicted seated on a lotus flower in a her idol. She is also worshiped in the form of Parvati, Maheshwari or Mata Gauri. The left arm of the goddess is in a pose to grant boons with grace to her devotees.*


*The legend says that Tarkasur, a great demon, once pleased Lord Brahma with his great devotion and extremely tough penance. He asked Lord Brahma to shower His blessings and make him immortal. Lord Brahma denied him this blessing, saying none can escape death. Tarkasur acted smart and asked for the death by the son of Lord Shiva, since he thought Lord Shiva would never get married. Tarkasur started tormenting the people on the earth. Fearing his strength would cause destructions, the devatas requested Lord Shiva to get married. He agreed and married Goddess Parvati. Their child, Lord Kartikeya/ Skand Kumar, demolished Tarkasur. Devi Skandmata is a symbol of the mother-son relationship.*


*By worshipping Her, you get immense love and affection from her and gets all his desires fulfilled. You may attain supreme joy even in this very mortal world. Her worship automatically includes the worship of Lord Kartikeya (in his child form).*


*🍀. Spiritual Significance :*


*As Skanda Mata , the Goddess is Mother to Kartikeya . Kartikeya is known as Deva Senapati , the commander in chief of Gods . He takes down all the negativity / Asuras which are offsprings of material desires in mind . As her son he clears the path for her devotee by defeating all the compulsions in mind . Once peace and silence takes over mind , the devotee becomes meditative and he experiences the Divine consciousness which is Devi , or Skanda Mata . Skanda or Kartikeya has six heads , which represents his victory over six kinds disorders in human mind . He holds the shoola which is given by his Mother to fight against evil. Worship of Skandmata , bestows the grace of both Kartikeya swami and Jagadamba to a devotee. We invoke the blessings of fifth manifestation of Devi Durga on Sri Panchami of Sharad Navaratri .*


*🌻 Mantra and other facts*


*Recite the below-mentioned Mantras to get the blessing from the almighty Skanda Mata.*


*ॐ देवी स्कन्दमातायै नमः*

*Om Devi Skandamatayai Namah॥*

*या देवी सर्वभू‍तेषु माँ स्कन्दमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः*

* Ya Devi Sarvabhuteshu Ma Skandamata Rupena Samsthita*


*Namastasyai Namastasyai Namastasyai Namo Namah ||*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 444 / Bhagavad-Gita - 444 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 30 🌴*


*30. లేలిహ్యసే గ్రసమాన: సమన్తా లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భి: |*

*తేజోభిరాపూర్వ జగత్సమగ్రమ్ భాసస్తవోగ్రా: ప్రతపన్తి విష్ణో ||*


*🌷. తాత్పర్యం : ఓ విష్ణూ! నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుండియు మ్రింగి వేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి, భయంకరములును మరియు తాపకరములును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు.*


*🌷. భాష్యము : భగవంతుడు సమస్త జగత్తును మహా శక్తులైన సృష్టి, స్థితి, మరియు లయములచే నియంత్రిస్తూ ఉంటాడు. ప్రస్తుతం, అన్ని దిక్కులా తన మిత్రులను, శ్రేయోభిలాషులు అందరినీ గ్రసిస్తూ ఉన్న, సర్వ భక్షక శక్తిగా, ఇప్పుడు అర్జునుడికి అగుపిస్తున్నాడు. ఆ యొక్క విశ్వరూపములో, భవిష్యత్తులో జరిగే సంఘటనల దివ్యదర్శనంలో, ప్రారంభంకానున్న యుద్ధములో, తన శత్రువులు నిర్మూలించబడటం అర్జునుడు చూస్తున్నాడు. ఏంతో మంది తమ పక్షం వారు కూడా మృతువు పట్టులో ఉండటం గమనించాడు. తను చూసే అద్భుతమైన స్వరూపం వల్ల భయంలో బిగిసిపోయి, అర్జునుడు తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడి ఎదుట ప్రణమిల్లుతున్నాడు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 444 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 30 🌴*


*30. lelihyase grasamānaḥ samantāl lokān samagrān vadanair jvaladbhiḥ*

*tejobhir āpūrya jagat samagraṁ bhāsas tavogrāḥ pratapanti viṣṇo*


*🌷 Translation : O Viṣṇu, I see You devouring all people from all sides with Your flaming mouths. Covering all the universe with Your effulgence, You are manifest with terrible, scorching rays.*


*🌹 Purport : The Lord controls the world with grandiose forces of creation, maintenance, and annihilation. At present, he is being perceived by Arjun in this mode as the all-devouring force that is engulfing his friends and allies from all sides. Viewing the apparition of future destined events in the cosmic form of God, Arjun sees his enemies being wiped out in the imminent battle. He also sees many of his allies in the grip of death. Petrified by the spectacle he is seeing, Arjun supplicates before Shree Krishna in the next verse.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 57 / Osho Daily Meditations  - 57 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 57. గుడ్డు పెంకులో 🍀*


*🕉. మీరు మీ నియంత్రణల నుండి బయటికి రాగలిగినప్పుడు, మీరు స్వేచ్ఛగా ఉంటారు, మీరు కేవలం మనిషి మాత్రమే. అది నిజమైన స్వేచ్ఛ! అప్పుడు మీరు మీ చుట్టూ షరతుల భారం మోయరు. కవచం విరిగిపోయింది. 🕉*


*పక్షి గుడ్డులో ఉన్నప్పుడు ఎగరదు. మనం 'ఇండియన్' లేదా 'జర్మన్' లేదా 'ఇంగ్లీష్' లేదా 'అమెరికన్' అయినప్పుడు మనం గుడ్డు పెంకులో ఉంటాము. మనం ఎగరలేము, మన రెక్కలు తెరవలేము, ఉనికి అందుబాటులోకి తెచ్చే మన విపరీతమైన స్వేచ్ఛను ఉపయోగించలేము. నిబంధన పొరల మీద పొరలు ఉన్నాయి. ఒకరు జర్మన్‌గా, ఒకరు అమెరికన్‌గా షరతులు విధించుకుంటారు. ఒకరు పురుషునిగా, మరొకరు స్త్రీగా ఉండాలని నిబంధనలు పెట్టారు. నేను జీవ సంబంధమైన వ్యత్యాసం గురించి మాట్లాడటం లేదు. అది సరే, దానికి నిబద్ధతతో సంబంధం లేదు. కానీ మనిషి మనిషిగా ఉండాలని నిబంధన చేయబడింది.*


*మీరు నిరంతరం గుర్తుంచుకుంటారు మీరు ఒక పురుషుడు, మీరు ఒక స్త్రీ కాదు అని. మీరు పురుషునిలా ప్రవర్తించాలి - మీరు ఏడవకూడదు, కన్నీళ్లు అనుమతించ బడవు, అది కేవలం స్త్రీ మాత్రమే చేస్తుంది అని. కాని అది నిజం కాదు. మీ నుండి అలా ఆశించ బడింది. ఇది ఒక షరతు. ఇది మీ చుట్టూ ఉన్న పొరలు. నిజంగా స్వేచ్ఛాయుతమైన వ్యక్తి పురుషుడు లేదా స్త్రీ కాదు - జీవసంబంధమైన వ్యత్యాసం అదృశ్యమవుతుందని కాదు, కానీ మానసిక వ్యత్యాసం అదృశ్యమవుతుంది. స్వేచ్ఛా వ్యక్తి నలుపు లేదా తెలుపు కాదు-నలుపు తెల్లగా మారడం మరియు తెలుపు నల్లగా మారడం కాదు. చర్మం మునుపటిలానే ఉంటుంది, కానీ మానసిక రంగు ఇప్పుడు లేదు. ఇవన్నీ తగ్గినప్పుడు, మీరు భారం లేకుండా ఉంటారు. మీరు భూమికి ఒక అడుగు పైన నడుస్తారు; మీకు, గురుత్వాకర్షణ ఇకపై పనిచేయదు. మీరు రెక్కలు విప్పి ఎగరవచ్చు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 57 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 57. IN AN EGGSHELL 🍀*


*🕉  When you can come out of your conditioning, you are free, you are simply a human being. And that is real freedom! Then you don't carry a crust around you. The capsule has broken. 🕉*


*When the bird is in the egg, it cannot fly. When we are “Indian” or “German” or “English” or “American” we are in egg shell. We cannot fly, cannot open our wings, cannot use our tremendous freedom that existence makes available. There are layers upon layers of conditioning. One is conditioned as a German, one is conditioned as a Christian, and so on. One is conditioned as a man and another is conditioned as a woman. I am not talking about the biological difference-that's okay, that has nothing to do with conditioning - but the man is conditioned as a man.*


*You continuously remember that you are a man, that you are not a woman, that you have to behave like a man-that you are not to cry, that tears are not to be allowed, that that is just feminine, it is not expected of you. This is conditioning, this is a crust around you.  A really free person is neither man nor woman-not that the biological difference disappears, but the psychological difference disappears. A free person is neither black nor white-not that the black becomes white and the white becomes black. The skin remains as it was before, but the psychological color is no longer there. When all these things drop, you are unburdened. You walk one foot above the earth; for you, gravitation doesn't function anymore. You can open your wings and fly.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 485 - 494 - 10 / Sri Lalitha Chaitanya Vijnanam  - 490 - 494 - 10 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।*

*దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*

*🍀  101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।*

*మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*


*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 10 🌻*


*అనాహత మందలి శ్రీమాతను వివరించుటకు భాష చాలదు. అనుభూతి పరముగ తెలియ వలసినదే. ఈమె అనురాగ స్వరూపిణి గనుక 'రాగిణీ' అని లలితా సహస్రనామ మందు కీర్తించుట జరిగినది. రాగిణి సరళ శబ్దము. రాకినీ పరుష శబ్దము. రాకిని రాగిణియే. శ్రీమాత అనురాగ స్వరూపిణియే కదా! అందువలననే రాగిణి. ఇటుపై నామములు ఉదర వితానమునకు దిగువ నున్న ప్రజ్ఞా కేంద్రముల వివరణ మగుట వలన మరియొక సంపుటమున వివరింప బడుచున్నవి.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 485 to 494 - 10 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya*

*danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*

*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya*

*mahavirendra varada rakinyanba svarupini  ॥ 101 ॥ 🌻*


*🌻 Description of Nos. 485 to 494 Names - 10 🌻*


*Words are not enough to describe Srimata at Anahata. It is to be known by experience. As she is the embodiment of love, in Lalita Sahasranama she is glorified as 'Ragini'. Ragini is a subtle sound. Rakini is a crude sound. Rakini is Ragini only. Isn't Srimata the embodiment of love! That's why Ragini. Henceforth the names are explained in another volume as the description is of Prajna Kendras that are below the abdominal cavity.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Commenti


bottom of page