🍀🌹 20, APRIL 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 20, APRIL 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 358 / Bhagavad-Gita - 358 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 20 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 205 / Agni Maha Purana - 205 🌹
🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 5 / Mode of installation of the image of Vāsudeva - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 070 / DAILY WISDOM - 070 🌹
🌻 10. సత్యం ఒక్కటే విజయవంతమవుతుంది / 10. Truth Alone Succeeds🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 335 🌹
6) 🌹. శివ సూత్రములు - 72 / Siva Sutras - 72 🌹
🌻 22. మహాహృదాను సంధానన్ మంత్ర విర్యానుభవః - 3 / 22. mahāhṛidānu saṁdhānān mantra vīryānubhavaḥ - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 20, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : చైత్ర అమావాస్య, సూర్య గ్రహణము, Chaitra gAmavasya, Surya Grahan 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 2 🍀*
*3. భాగ్యదో భోగదో భోగీ భాగ్యవాన్ భానురంజనః |*
*భాస్కరో భయహా భర్తా భావభూర్భవతారణః*
*4. కృష్ణో లక్ష్మీపతిర్దేవః పారిజాతాపహారకః |*
*సింహాద్రినిలయః శంభుర్వ్యకటాచలవాసకః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : దివ్యప్రేమానుభవం - మానవ ప్రేమ వలె దివ్య ప్రేమ ఒక భావావేశం కాదు. భావావేశాలకు అతీతులమై అంతర హృదయం ద్వారా పరమాత్మతో ఏకత్వం భజించి నప్పుడు అనుభవానికి వస్తుంది దివ్యప్రేమ. ఇంద్రియ సంబంధమైన భావావేశపు పరుగులు దాని నెంత మాత్రమూ అందుకొనజాలవు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: అమావాశ్య 09:43:42 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: అశ్విని 23:12:47 వరకు
తదుపరి భరణి
యోగం: వషకుంభ 13:00:06 వరకు
తదుపరి ప్రీతి
కరణం: నాగ 09:44:41 వరకు
వర్జ్యం: 19:18:10 - 20:51:18
దుర్ముహూర్తం: 10:09:08 - 10:59:33
మరియు 15:11:37 - 16:02:01
రాహు కాలం: 13:49:41 - 15:24:13
గుళిక కాలం: 09:06:07 - 10:40:39
యమ గండం: 05:57:05 - 07:31:36
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40
అమృత కాలం: 16:11:54 - 17:45:02
సూర్యోదయం: 05:57:05
సూర్యాస్తమయం: 18:33:16
చంద్రోదయం: 05:56:04
చంద్రాస్తమయం: 18:49:54
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 23:12:47 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 358 / Bhagavad-Gita - 358 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 20 🌴*
20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యజ్ఞైరష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే |
తే పుణ్యమాసాద్య సురేద్రలోకమ్ అశ్నన్తి దివ్యాన్దివి దేవా భోగాన్ ||
🌷. తాత్పర్యం :
స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగముల ననుభవింతురు.
🌷. భాష్యము :
*ఈ శ్లోకము నందలి “త్రైవిద్యా:” అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి మూడు వేదములను అధ్యయనము చేసిన బ్రహ్మణుడే “త్రివేది” యని పిలువబడును. ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము యెడ ఆకర్షణను కలిగియుండువాడు నిక్కముగా సంఘములో అత్యంత గౌరవనీయుడు కాగలడు. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపు అంతిమ ప్రయోజనమును తెలియని వేదపండితులే అధికముగా నున్నారు. కనుకనే ఆ త్రివేదులకు అంతిమలక్ష్యము తానేయని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణమునొంది అతని ప్రీత్యర్థమై భక్తియుక్తసేవలో నియుక్తులగుదురు.*
*అట్టి భక్తియోగము హరేకృష్ణ మహామంత్రమును జపించుటతోను మరియు అదేసమయమున కృష్ణుని గూర్చి నిజముగా అవగతము చేసికొనుట యత్నించుటతోను ఆరంభమగును. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపరులు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకు యజ్ఞములు చేయుట యందే మగ్నులగుదురు. అట్టి యత్నముచే వివిధ దేవతార్చకులు నిక్కముగా రజస్తమోగుణ సంపర్కము నుండి శుద్ధిపడినవారై మహర్లోకము, జనలోకము, తపోలోకము పలు ఊర్థ్వలోకములను(స్వర్గలోకములను) చేరుదురు. అట్టి ఉన్నతలోకములను చేరిన పిమ్మట వారు భూలోకమున్నను అనేక లక్షలరెట్లు అధికముగా సుఖముల ననుభవింతురు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 358 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 20 🌴*
*20. trai-vidyā māṁ soma-pāḥ pūta-pāpā yajñair iṣṭvā svar-gatiṁ prārthayante*
*te puṇyam āsādya surendra-lokam aśnanti divyān divi deva-bhogān*
🌷 Translation :
*Those who study the Vedas and drink the soma juice, seeking the heavenly planets, worship Me indirectly. Purified of sinful reactions, they take birth on the pious, heavenly planet of Indra, where they enjoy godly delights.*
🌹 Purport :
*The word trai-vidyāḥ refers to the three Vedas – Sāma, Yajur and Ṛg. A brāhmaṇa who has studied these three Vedas is called a tri-vedī. Anyone who is very much attached to knowledge derived from these three Vedas is respected in society. Unfortunately, there are many great scholars of the Vedas who do not know the ultimate purport of studying them. Therefore Kṛṣṇa herein declares Himself to be the ultimate goal for the tri-vedīs. Actual tri-vedīs take shelter under the lotus feet of Kṛṣṇa and engage in pure devotional service to satisfy the Lord. Devotional service begins with the chanting of the Hare Kṛṣṇa mantra and side by side trying to understand Kṛṣṇa in truth.*
*Unfortunately those who are simply official students of the Vedas become more interested in offering sacrifices to the different demigods like Indra and Candra. By such endeavor, the worshipers of different demigods are certainly purified of the contamination of the lower qualities of nature and are thereby elevated to the higher planetary systems or heavenly planets known as Maharloka, Janaloka, Tapoloka, etc. Once situated on those higher planetary systems, one can satisfy his senses hundreds of thousands of times better than on this planet.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 205 / Agni Maha Purana - 205 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 60*
*🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 5 🌻*
*నమస్కరించి, స్తుతించి, స్తోత్రాదులు పఠించి, అష్టాక్షర్యాదిమంత్రములు జపించుచు భగవంతు డచట సన్నిహితుడై యున్నాడని గ్రహింపవలెను.*
*పిమ్మట ఆచార్యుడు దేవాలయమునుండి బైటకు వచ్చి ద్వారమువద్ద నున్న చండ -ప్రచండులను ద్వారపాలకులకు పూజ చేయవలెను. మరల మండపములోనికి వెళ్ళి గరుత్మంతుని స్థాపింపవలెను. అన్ని దిక్కులందును ఆ యా దిక్పాలకులను, ఇతరదేవతలను స్థాపించి, శంఖచక్రాదులకు గూడ పూజ చేయవలెను. అందరు పార్షదులకును, భూతములకును బలి సమర్పింపవలెను. (యజమానుడు) ఆచార్యునకు గ్రామ-వస్త్ర-సువార్ణదులను దక్షిణగా ఈయవలెను. యజ్ఞమునకు ఉపయోగించు ద్రవ్యములు కూడ ఆచార్యున కీయవలెను. ఋత్విక్కులను ఆచార్యదిక్షిణలో సగ మీయవలెను. పిమ్మట బ్రాహ్మణులకు గూడ దక్షిణ ఇచ్చి భోజనము పెట్టవలెను. అచచటకు వచ్చు బ్రహ్మణు నెవ్వనిని అడ్డుపెట్టరాదు. అందరిని సత్కరించవలెను. పిమ్మట గురువు యజమానునకు ఫల మీయవలెను. భగద్విగ్రహప్రతిష్ఠ చేసిన పుణ్యాత్ముడు తన వంశీయు లందరిని తనతో పాటు శ్రీమహావిష్ణువు సమీపమునకు తీసికొని పోవును. ఇది అందరు దేవతలకును సాధారణమైన విధానము కాని ఆ యా దేవతల మూలమంత్రములు మాత్రము వేరు వేరుగ నుండను. మిగిలిన కార్యము లన్నియు సమానమే.*
*అగ్నిమహాపురాణమునందు వాసుదేవప్రతిష్ఠాది విధి యను ఆరువదవ అధ్యాయము సమాప్తము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 205 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 60*
*🌻Mode of installation of the image of Vāsudeva - 5 🌻*
29-30. (The priest) should infer the presence of the god from the yātrā[12] and varṣā[13]. Having saluted and sung the glories and recited the mantras of eight syllables[14] etc., the priest should come out and worship Caṇḍa and Pracaṇḍa (the two guardians) at the gate. (The priest) should go to the place of sacrificial fire, install the image of Garuḍa (the vehicle bird of Lord Viṣṇu) and worship.
31. Having installed and worshipped (the images) of different presiding deities of the quarters in their respective quarters, the priest should install the image of Lord Viṣvaksena[15] and worship the conch, disc etc.
32. Offerings should be made to the attendant gods and to the goblins. The priest should be given the fees—(which may be of the form of) proprietary right over a village, clothes and gold.
33. The materials required for (the performance of) sacrificial ceremony should be given to the principal priest. The attendant priests should be paid fees half of what was paid to the principal priest.
34. The other priests should be paid their fees. The brahmins should then be fed. Without any restraint the benefits of sacrifice should be extended to the patron-employer by the principal priest.
35. The consecrator of the image of Viṣṇu leads the self,. as well as his entire family (to the region of the god). This is the general mode of performance for all gods. Only the principal mantra would be different. The other formalities are the same.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 70 / DAILY WISDOM - 70 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 10. సత్యం ఒక్కటే విజయవంతమవుతుంది 🌻*
*ఉపనిషత్తులు దేనినీ పూర్తిగా అసత్యంగా పరిగణించవు. ప్రతిదీ సత్యమే, కానీ సాపేక్షంగా. నిమ్న సత్యం నుండి ఉన్నత సత్యానికి ఎదుగుతారు. ఉపనిషత్తులు విషయాలను ఒక విచిత్రమైన పద్ధతిలో పరికల్పిస్తాయి. ప్రతిచోటా సత్యమే ప్రబలంగా ఉంటుంది. సత్యమే విజయం సాధిస్తుంది-సత్యమేవ జయతే-అసత్యం కాదు, ఎందుకంటే అసత్యం అసలు ఉనికిలో లేదు. అందువల్ల, ఎదుగుదల అనేది సత్యం యొక్క తక్కువ సంపూర్ణత నుండి దాని పైన ఉన్న ఎక్కువ సంపూర్ణతకు ఉంటుంది.*
*ఇలా ఎదుగుతూ, వాస్తవానికి, మనం చివరికి, పరమ సంపూర్ణమైన బ్రహ్మాన్ని చేరుకుంటాము. అదే సమయంలో, ఇది ఒక ఆనంద స్థితి నుండి మరొక ఆనంద స్థితికి ఆత్మ యొక్క ఆరోహణ. మనం దుఃఖం నుండి సంతోషానికి ఎదగము, ఎందుకంటే దుఃఖం అనేది ఆనందం పట్ల తప్పుడు ధోరణి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. ఇది దుఃఖం లేదా వేదనగా మనకు అనుభూతికి వచ్చే ఒక స్థానభ్రంశ ఉనికి. అసత్యం లేనట్లే, దుఃఖం కూడా లేదు, ఎందుకంటే అవి తప్పుగా ఉంచబడిన విలువలు. వాటిని సరైన సందర్భాలలో ఉంచినప్పుడు, అవి అందంగా కనిపిస్తాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 70 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 10. Truth Alone Succeeds 🌻*
*The Upanishads do not regard anything as absolutely untrue. Everything is true, but relatively so. There is a passage from the lower truth to the higher truth. The Upanishads do not regard anything as absolutely untrue. Everything is true, but relatively so. There is a passage from the lower truth to the higher truth. The Upanishads have a strange way of envisaging things. The True alone prevails everywhere. Truth alone succeeds—satyameva jayate—not untruth, because untruth is not. Therefore, the rise is from a lesser wholeness of truth to the larger wholeness which is above it.*
*Actually, we reach, in the end, the Ultimate Wholeness which is Brahman, the Absolute. And also, simultaneously, it is an ascent of the soul from one condition of joy to another condition of joy. We do not rise from sorrow to joy, because sorrow is a misconceived tendency to happiness. It is a misplaced form of being which comes to us as a grief or agony. Just as untruth is not, sorrow also is not, because they are misplaced values, and when they are placed in their proper contexts, they look beautiful.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 335 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ధ్యానమంటే చైతన్యాన్ని సృష్టించే మార్గం. అది నిన్ను చురుగ్గా మెలకువగా వుండమంటుంది. నువ్వు చైతన్యంతో వుంటే నీ జీవితం మారడం మొదలుపెడుతుంది. నీ పని, నీ అస్తిత్వం గాఢమయిన సమశృతిలో సాగాలి. 🍀*
*హిపోక్రసీ అంటే నువ్వు ఒక లాంటివాడివి. కానీ యింకొకడిలా కనిపించాలని ప్రయత్నించడం. నీకు తెలుసు. ఆ విషయం నిన్ను బాధ పెడుతుంది. ఫలితం విషాదం. సమస్త ప్రపంచం వ్యక్తిత్వాన్ని, నీతిని సృష్టింస్తుంది. నాకు వ్యక్తిత్వం మీద ఆసక్తి లేదు. నీతిపైన ఆసక్తి లేదు. నేను జనాలకు నీతి లేకుండా వుండమని బోధిస్తాను. నేను జనాల్ని చైతన్యంగా వుండమని బోధిస్తాను. చైతన్యాన్ని సృష్టించమంటాను. ధ్యానమంటే అదే.*
*ధ్యానమంటే చైతన్యాన్ని సృష్టించే మార్గం. అది నిన్ను చురుగ్గా మెలకువగా వుండమంటుంది. నువ్వు చైతన్యంతో వుంటే నీ జీవితం మారడం మొదలుపెడుతుంది. నీ పని, నీ అస్తిత్వం గాఢమయిన సమశృతిలో సాగాలి. నీ చర్య, నీ అస్తిత్వం సమశృతిలో వుంటే జీవితం ఆనందంగా వుంటుంది, నాట్యంటాగా వుంటుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 072 / Siva Sutras - 072 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 22. మహాహృదాను సంధానన్ మంత్ర విర్యానుభవః - 3 🌻*
*🌴. చైతన్యం అనే మహా సముద్రంపై శ్రద్ధ గల ధ్యానం ద్వారా సర్వోత్కృష్టమైన 'నేను' యొక్క శక్తిని పొంది, మంత్రములు మరియు పవిత్ర శబ్దాలలో దాగి ఉన్న సమర్థత లేదా శక్తి యొక్క మేల్కొలుపును అనుభవిస్తారు.🌴*
*మనస్సు ద్వారా ఐక్యత అనేది లోపల దృష్టి కేంద్రీకరించడం ద్వారా విశ్వ చైతన్యంతో వ్యక్తిగత చైతన్యం యొక్క కలయిక. అంతర్ముఖ దృష్టి ఈ సంయోగానికి దారి తీస్తుంది, దీని ఫలితంగా శక్తి రూపంలో శివుని స్వయం చాలితమైన సర్వోన్నత శక్తి అనుభవంలోకి వచ్చి, బాహ్యానికి ప్రత్యక్షమవుతుంది. స్పంద కారికా (II.1) ఏమి చెబుతుందంటే, 'మంత్రం మరియు ఇతరాలతో కూడిన విశ్వం యొక్క అత్యున్నత అంశం ఆ సూత్రం నుండి ఉద్భవిస్తుంది, అది శక్తి ద్వారా వ్యక్తమవుతుంది మరియు దానిలో మాత్రమే విలీనం చేయబడుతుంది'. దీనర్థం సృష్టి మరియు లయ రెండూ పరమాత్మ చైతన్యం ద్వారానే జరుగుతాయి. ఈ ప్రక్రియలో, రెండు ఐక్యాలు ఉన్నాయి. మొదటిది శక్తితో మానసిక ఐక్యత, ఇక్కడ యోగి యొక్క చైతన్యం అత్యున్నత స్థాయి శివ చైతన్యంతో ఇక్యమవ్వడానికి అర్హత పొందేందుకు శక్తిని పొందుతుంది. మొదటి కలయికను అనుభవించకుండా, చివరి కలయిక సాధ్యం కాదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 072 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 22. mahāhṛidānu saṁdhānān mantra vīryānubhavaḥ - 3 🌻*
*🌴. By the attentive meditation on the great ocean of consciousness, the power of supreme I is attained. one experiences the awakening of shaktis who are hidden in the sacred letters and sounds.🌴*
*Union through mind is the union of individual consciousness with Universal consciousness by focusing within. Introverted focus leads to this conjugation, resulting in the experience of the Supreme power of autonomy of Śiva, in the form of highly potent Śaktī, from where manifestation unfolds extroversively. Spanda Kārikā (II.1) says, “Pure aspect of the universe consisting of mantra and others arises from that principle only is manifested by force and is merged in that only”. This means both creation and dissolution happens through Supreme I consciousness. In the process, there are two unions. The first one is the mental union with Śaktī, where the power of yogi’s consciousness gets energized to become eligible for union the highest level of pure consciousness, the Śiva consciousness. Without experiencing the first union, the final union is not possible.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments