🍀🌹 21, SEPTEMBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 21, SEPTEMBER 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 431 / Bhagavad-Gita - 431 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 17 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 17 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 792 / Sri Siva Maha Purana - 792 🌹
🌻. గణాధ్యక్షుల యుద్ధము - 3 / Description of the Special War - 3 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 44 / Osho Daily Meditations - 44 🌹
🍀 45. అసలైన ఇల్లు / 45. REAL HOME 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 7 🌹
🌻 484. 'డాకినీశ్వరీ' - 7 / 484. 'Dakinishwari' - 7 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 21, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి ఆవాహనం, Gauri Avahana 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 22 🍀*
*43. తపోరేతస్తపోజ్యోతిస్తపాత్మా చాత్రినందనః |*
*నిష్కల్మషో నిష్కపటో నిర్విఘ్నో ధర్మభీరుకః*
*44. వైద్యుతస్తారకః కర్మవైదికో బ్రాహ్మణో యతిః |*
*నక్షత్రతేజో దీప్తాత్మా పరిశుద్ధో విమత్సరః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : గురువు : ఆత్మసమర్పణ - భగవంతునికి ఆత్మ సమర్పణం, గురువుకు ఆత్మ సమర్పణం ఒకటి కాదు. గురువుకు ఆత్మ సమర్పణం చేసుకొనడంలో, సాధకుడు ఆత్మ సమర్పణ ఒక మానవమాత్రునికీ చేసుకొనేది ఆయనలోని భగవంతునికే. ఆత్మ సమర్పణమైతే అది ఫలప్రదాయకం కానేరదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల షష్టి 14:15:35 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: అనూరాధ 15:35:37
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: ప్రీతి 25:44:13 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 14:10:35 వరకు
వర్జ్యం: 21:11:00 - 22:47:00
దుర్ముహూర్తం: 10:07:41 - 10:56:16
మరియు 14:59:12 - 15:47:48
రాహు కాలం: 13:40:15 - 15:11:21
గుళిక కాలం: 09:06:57 - 10:38:03
యమ గండం: 06:04:44 - 07:35:51
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 04:55:50 - 06:34:10
మరియు 30:47:00 - 32:23:00
సూర్యోదయం: 06:04:44
సూర్యాస్తమయం: 18:13:33
చంద్రోదయం: 11:15:40
చంద్రాస్తమయం: 22:29:39
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 15:35:37 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 431 / Bhagavad-Gita - 431 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 17 🌴*
*17. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వత్రో దీప్తిమన్తమ్ |*
*పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్ దీప్తానలార్క ద్యుతి మప్రమేయమ్ ||*
*🌷. తాత్పర్యం : జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కుల యందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీతములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్జ్వల రూపమును సర్వత్ర నేను గాంచుచున్నాను.*
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 431 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 17 🌴*
*17. kirīṭinaṁ gadinaṁ cakriṇaṁ ca tejo-rāśiṁ sarvato dīptimantam*
*paśyāmi tvāṁ durnirīkṣyaṁ samantād dīptānalārka-dyutim aprameyam*
*🌷 Translation : Your form is difficult to see because of its glaring effulgence, spreading on all sides, like blazing fire or the immeasurable radiance of the sun. Yet I see this glowing form everywhere, adorned with various crowns, clubs and discs.*
🌹 Purport :
.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 792 / Sri Siva Maha Purana - 792 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴*
*🌻. గణాధ్యక్షుల యుద్ధము - 3 🌻*
*అపుడు గజాననుడు శంభుని పరశువుతో హృదయమునందు కొట్టి నేలప్తె బడవేసి మూషకమునధిష్ఠించెను (17). మరల విఘ్నేశ్వరప్రభుడు యుద్ధమనకు సంసిద్ధుడాయెను. శుంభుడు నవ్వి పెద్ద ఏనుగును అంకుశముతో కొట్టిన విధంబున ఆయనను కోపముతో కొట్టెను (18). కాలనేమి మరియు నిశుంభుడు వీరిద్దరు కలిసి క్రోధమును ప్రదర్శిస్తూ ఏకకాలములో, సర్పముల వలె ప్రాణాంతకములగు బాణములతో గజాననుని ఒక్కుమ్మడిగా ముట్టడించిరి (19). ఇట్లు వ్యథను పొందియున్న గజాననుని గాంచి మహాబలుడగు వీర భద్రుడు కోటి భూతములతో గూడి వేగముగా ఆతని వ్తెపునకు పరుగెత్తెను (20) ఆయనతో బాటు కూష్మాండులు, భైరవులు, వేతాలులు, యోగనీగణములు, పిశాచములు, డాకిన్యాది గణములు కూడ వచ్చినవి (21).*
*అపుడు భూమి కిలకిలారావములతో, సింహనాదములతో, గర్జనలతో మరియు డమరుక ధ్వనులతో నిండి కంపించెను (22). అపుడు భూతములు యుద్ధ భూమిలో వేగముగా పరుగులెత్తుచూ రాక్షసులను తినుచుండెను; ప్తెకి ఎత్తి క్రింద పారవేయుచుండెను? మరియు నాట్యమాడుచుండెను (23). ఓ వ్యాసా! ఇంతలో నంది మరియు గుహుడు సంజ్ఞను పొంది నిలబడిరి. వారు అపుడా యుద్ధరంగములో అనేక పర్యాయములు గర్జించిరి (24).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 792 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴*
*🌻 Description of the Special War - 3 🌻*
17. Then Gaṇeśa hit Śumbha in his chest with his axe and felled him to the ground. Thereafter he mounted his mouse again.
18. Lord Gaṇeśa of elephantine face got ready for the fight. He hit him mockingly and angrily as if hitting a great elephant with a goad.
19. Kālanemi and Śumbha simultaneously attacked Gaṇeśa furiously with arrows as ruthless as serpents.
20. On seeing him afflicted, the powerful Vīrabhadra accompanied by a crore goblins rushed in.
21. The Kūṣmāṇḍas, Bhairavas, Vetālas, Yoginīs, Piśācas, Ḍākinīs and Gaṇas came there with him.
22. The Earth, resonant with various kinds of noise, shouts of joy, leonine roars and the sounds of Ḍamarukas, quaked.
23. Then the Bhūtas ran here and there devouring the Dānavas. They jumped up and danced in the battle field and threw the Asura on the ground.
24. In the meantime, O Vyāsa, Nandin and Guha regained their consciousness and got up. They roared in the battlefield again.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 45 / Osho Daily Meditations - 45 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 45. అసలైన ఇల్లు 🍀*
*🕉. మన అసలు ఇల్లు దొరికేంత వరకు మనం ప్రయాణం సాగించాలి, ప్రయాణం చేయాలి. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిజమైన ఇల్లు కూడా దూరంగా కూడా లేదు. 🕉*
*మనం అనేక గృహాలు కడతాం కానీ అసలు ఇంటి వైపు చూడము. మనం కట్టే గృహాలు అన్ని ఏకపక్షంగా ఉంటాయి; అవి ఇసుక కోటలు లేదా పేక ఇళ్లు: ఆటల్లో బొమ్మలు. అవి నిజమైన గృహాలు కావు, ఎందుకంటే మరణం వాటన్నింటినీ నాశనం చేస్తుంది. నిజమైన ఇంటికి నిర్వచనం శాశ్వతమైనది అని. దేవుడు మాత్రమే శాశ్వతుడు; మిగతావన్నీ తాత్కాలికమే.*
*శరీరం తాత్కాలికం, మనసు తాత్కాలికం; డబ్బు, అధికారం, పలుకుబడి- అన్నీ తాత్కాలికమే. వీటిల్లో మీ ఇంటిని కట్టుకోవద్దు. నేను ఈ విషయాలకు వ్యతిరేకం కాదు. వాటిని ఉపయోగించండి, కానీ అవి కేవలం యాత్రా స్థలాలని గుర్తుంచుకోండి; రాత్రిపూట బస చేయడానికి అవి మంచివి, కానీ ఉదయం మనం వెళ్లాలి. చాలా దగ్గరగా ఉన్నందున మనం మన నిజమైన ఇంటిని కోల్పోతాము; అది దగ్గరగా కూడా లేదు, అది మనలోనే ఉంది. లోపల దాని కోసం వెతకండి. లోపలికి వెళ్ళిన వారు ఎల్లప్పుడూ దానిని కనుగొన్నారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 45 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 45. REAL HOME 🍀*
*🕉. Unless we find our real home we have to go on traveling, we have to go on journeying. And the most surprising thing is that the real home is not jar away. 🕉*
*We make many homes, and we never look at the real home. The homes that we make are all arbitrary; they are sandcastles or palaces made of playing cards: just toys to play with. They are not real homes, because death destroys them all. The definition of the real home is that which is eternal. Only God is eternal; everything else is temporary.*
*The body is temporary, the mind is temporary; money, power, prestige-all are temporary. Don't make your home in these things. I am not against these things. Use them, but remember that they are just a caravansary; they are good for an overnight stay, but in the morning we have to go. We go on missing our real home because it is very close; it is not even close, it is within ourselves. Search for it within. Those that have gone in have always found it.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 7 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।*
*అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀*
*🌻 484. 'డాకినీశ్వరీ' - 7 🌻*
*ఈ పదహారు శక్తులు పదహారు దళముల యందుండును. ఈ పదహారు శక్తులును సంస్కృత భాషయందలి పదహారు అచ్చులుగ తెలియబడుచున్నవి. అవి 'అ' నుండి 'అః' వరకు పదహారు అక్షరములు. అచ్చులు అమృత మయములు. వాని వలననే హల్లులు ఆధారపడి యుండును. అచ్చులు లేని హల్లులు పలుకుటకు వీలుపడదు. ఉదాహరణకు 'హ' అనినపుడు 'హ్ + అ' అయి వున్నది. అట్లే 'రి' అనినపుడు 'ర్ + ఇ' అయి వున్నది అట్లు హరి యందు హ్, అ, ర్, ఇ వున్నవి. అట్లు అచ్చులు లేని హల్లులు పలుక ప్రయత్నించుటకు వీలుపడదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -7 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari*
*amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻*
*🌻 484. 'Dakinishwari' - 7 🌻*
*These sixteen powers are sixteen petals. These sixteen powers are known as sixteen vowels in Sanskrit language. They are sixteen letters from 'A' to 'Ah'. Vowels are nectars. Consonants depend on him. Consonants without vowels cannot be pronounced. For example, when 'Ha' is 'H + A'. So when 'ri' is 'r + e' then Hari has h, a, r and e. It is not possible to attempt to pronounce consonants without such vowels.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments