🍀🌹 22, APRIL 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 22, APRIL 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 359 / Bhagavad-Gita - 359 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 21 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 206 / Agni Maha Purana - 206 🌹
🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 1 / Consecration of doors of the temple and the erection of banner - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 071 / DAILY WISDOM - 071 🌹
🌻 11. భౌతిక విభజన ఉనికిలో లేదు / 11. Physical Division Does Not Exist 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 336 🌹
6) 🌹. శివ సూత్రములు - 73 / Siva Sutras - 73 🌹
🌻 22. మహాహృదాను సంధానన్ మంత్ర విర్యానుభవః - 4 / 22. mahāhṛidānu saṁdhānān mantra vīryānubhavaḥ - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 22, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
🍀. పరశురామ జయంతి, అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Parashurama Jayanti, Akshaya Tritiya to All. 🍀
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పరశురామ జయంతి, అక్షయ తృతీయ Parashurama Jayanti, Akshaya Tritiya 🌻*
*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 16 🍀*
*29. నమో హేమాదికర్షాయ భైరవాయ నమో నమః |*
*స్తవేనానేన సంతుష్టో భవ లోకేశభైరవ*
*30. పశ్య మాం కరుణావిష్ట శరణాగతవత్సల |*
*శ్రీభైరవ ధనాధ్యక్ష శరణం త్వాం భజామ్యహమ్ |*
*ప్రసీద సకలాన్ కామాన్ ప్రయచ్ఛ మమ సర్వదా*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : దివ్యప్రేమాభివ్యక్తి - మానవ ప్రేమతో ఉపక్రమించియే దివ్యప్రేమకు మనం చేరుకోవలసి వుంటుందనే మాట నిజం. దివ్యప్రేమ మానవ ప్రేమను మరింత సుస్నిగ్ధం గావించి తనలోనికి రూపాంతరం చెందించు కొంటుంది. దివ్య ప్రేమ అంటే అస్నిగ్ధమైన వస్తువుగా భావింపరాదు. అయ్యది అత్యంత స్నిగ్ధము, ఏకత్వ సంపన్నము, ఆనంద సంభరితమునై స్వీయాభివ్యక్తికి ప్రకృతిని సాధనంగా వినియోగించు కొంటుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల విదియ 07:50:08 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: కృత్తిక 23:25:39 వరకు
తదుపరి రోహిణి
యోగం: ఆయుష్మాన్ 09:24:56
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: కౌలవ 07:51:07 వరకు
అశుభఘడియలు
వర్జ్యం: 11:12:30 - 12:50:10
దుర్ముహూర్తం: 07:36:49 - 08:27:21
రాహు కాలం: 09:05:15 - 10:40:00
గుళిక కాలం: 05:55:46 - 07:30:30
యమ గండం: 13:49:30 - 15:24:15
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:39
అమృత కాలం: 20:58:30 - 22:36:10
సూర్యోదయం: 05:55:46
సూర్యాస్తమయం: 18:33:45
చంద్రోదయం: 07:19:53
చంద్రాస్తమయం: 20:45:18
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
23:25:39 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 359 / Bhagavad-Gita - 359 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 21 🌴*
*21. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి |
ఏవం త్రయిధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే ||*
🌷. తాత్పర్యం :
*విస్తృతమైన స్వర్గలోకభోగముల ననుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగివత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియభోగమును వాంచించువారు కేవలము జననమరణములనే మరల, మరల పొందుదురు.*
🌷. భాష్యము :
*ఊర్థ్వలోకములను పొందినవాడు అధిక ఆయుష్షును మరియు ఇంద్రియభోగమును అధికమైన వసతులను పొందగలిగినను శాశ్వతముగా అచ్చటనే ఉండుటకు అనుమతింపబడడు. పుణ్యకర్మఫలము నశించినంతనే అతడు తిరిగి భూలోకమునకు పంపబడును. వేదాంతసూత్రములందు (జన్మాద్యస్యయత:) తెలుపబడినరీతిగా సంపూర్ణజ్ఞానమును సాధించినట్టివాడు, అనగా సర్వకారణకారణుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనుటలో విఫలుడైనవాడు జీవితపు పరమలక్ష్యమును సాధించుటలో విఫలత్వము నొందినవాడగును.*
*తత్కారణముగా అతడు క్రిందికి, పైకి సదా తిరుగుచుండు రంగులరాట్నముపైన కూర్చున్నవాని వలె ఊర్థ్వలోకమునకు ఉద్ధరింపబడుచు, తిరిగి క్రిందకు చేరుచుండును. అనగా మనుజుడు మరల క్రిందికి తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మికలోకమును పొందక కేవలము ఊర్థ్వ, అధోలోకముల నడుమ జనన, మరణచక్రమందే తిరుగుచుండును. కావున మనుజుడు జ్ఞానానందపూర్ణమగు నిత్యజీవనమును అనుభవించుట ఆధ్యాత్మికలోకమును పొంది, తిరిగి ఈ దుఃఖకరమైన భౌతికస్థితికి రాకుండుట ఉత్తమము.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 359 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 21 🌴*
*21. te taṁ bhuktvā svarga-lokaṁ viśālaṁ kṣīṇe puṇye martya-lokaṁ viśanti*
*evaṁ trayī-dharmam anuprapannā gatāgataṁ kāma-kāmā labhante*
🌷 Translation :
*When they have thus enjoyed vast heavenly sense pleasure and the results of their pious activities are exhausted, they return to this mortal planet again. Thus those who seek sense enjoyment by adhering to the principles of the three Vedas achieve only repeated birth and death.*
🌹 Purport :
*One who is promoted to the higher planetary systems enjoys a longer duration of life and better facilities for sense enjoyment, yet one is not allowed to stay there forever. One is again sent back to this earth upon finishing the resultant fruits of pious activities. He who has not attained perfection of knowledge, as indicated in the Vedānta-sūtra (janmādy asya yataḥ), or, in other words, he who fails to understand Kṛṣṇa, the cause of all causes, becomes baffled about achieving the ultimate goal of life and is thus subjected to the routine of being promoted to the higher planets and then again coming down, as if situated on a ferris wheel which sometimes goes up and sometimes comes down.*
*The purport is that instead of being elevated to the spiritual world, from which there is no longer any possibility of coming down, one simply revolves in the cycle of birth and death on higher and lower planetary systems. One should better take to the spiritual world to enjoy an eternal life full of bliss and knowledge and never return to this miserable material existence.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 206 / Agni Maha Purana - 206 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 61*
*🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 1 🌻*
*హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను అవభృథస్నానమును గూర్చి చెప్పెదను. "విష్ణోర్నుకం వీర్యాణి" ఇత్యాదిమంత్రముతో హోమము చేయవలెను. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపమునందు కలశస్థాపన చేసి వాటి ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించవలెను. స్నానానంతరము గంధపుష్పాదులతో పూజించి, సమర్పించి, గురువును పూజించవలెను. ఇపుడు ద్వారప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. గురువు ద్వారము క్రింద బంగారము నుంచవెలను. ఎనిమిది కలశలతో అచట రెండు ఉదుంబరశాఖ లుంచవలెను. వైదికమంత్రములు చదువుచు, గంధాద్యుపచారములతో పూజించి కుండములందు స్థాపింపబడిన అగ్నిలో సమిధులు, ఆజ్యము, తిలలు మొదలగునవి హోమము చేయవలెను పిమ్మట శయ్యాదిదానము చేసి క్రింద ఆధారశక్తిని స్థాపింపవలెను. ఆ రెండు శాఖల క్రింద చండ-ప్రచండులను దేవతలను స్థాపించవలెను.*
*ఉదుంబరశాఖల పైభాగమున దేవవృందపూజితురా లగు లక్ష్మిని స్థాపించి శ్రీ సూక్తముతో యథోచితముగ పూజింపవలెను. పిమ్మట బ్రహ్మను పూజించి, ఆచార్యునకు శ్రీఫలము (నారికేళఫలము) మొదలగు దక్షిణ లీయవలెను. ప్రతిష్ఠిత మగు ద్వారముపై ఆచార్యుడు శ్రీహరిని స్థాపింపవలెను. (దేవాలయప్రతిష్ఠను "హృత్ప్రతిష్ఠా" ఇత్యాదిమంత్రముతో చేయవలెను. దానిని గూర్చి వినుము. వేదికంటె ముందు, (లేదా వేదికి తూర్పుగా) శుకనాస ఎచట సమాప్తమగునో అచట, గర్భగృహశిరోభాగమునందు బంగారు కలశను గాని, వెండి కలశను గాని స్థాపింపవలెను. దానిలో ఎనిమిది విధములైన రత్నములు, ఓషధులు, ధాతువులు, బీజములు, సువర్ణము ఉంచవలెను. ఆ కలశము కంఠమునకు వస్త్రము చుట్టి దానిని నీటితో నింపి, దానిని మండలముపై అధివాసితము చేయవలెను. దానిలో చిగుళ్ళు వేయవలెను. పిమ్మట నృసింహమంత్రముతో అగ్నియందు అజ్యధార పోయుచు హోమము చేసి నారాయణతత్త్వముతో ప్రాణన్యాసము చేయవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 206 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 61*
*🌻Consecration of doors of the temple and the erection of banner - 1 🌻*
The Lord said:
1. I shall describe the purificatory bathing of Viṣṇu. The offering to the fire is made (with the mantra) na tvā[1]. Having placed eighty-one pitchers (at their respective places) Lord Hari should be invoked and installed.
2. He should be worshipped with perfumes and flowers. Having made the offering, the priest should be worshipped. l shall describe the (mode of) consecrating the door. (A piece of) gold should be placed beneath the door (frame).
3. The priest should place shoots of udumbara (fig tree) in
the (mouth of the) eight pitchers and worship them with perfumes etc. and vedic mantras.
4. Twigs, fried paddy and sesamum should be offered unto the fire in the pits. Having offered the bed etc., the supporting energy should be placed underneath.
5. Gods Caṇḍa and Pracaṇḍa should be located at the bottom of the shoots, Goddess Lakṣmī worshipped by the celestials should be placed above (the shoot of) the fig (tree).
6. Having assigned the four-faced (Brahman) and duly worshipping (him) (by reciting) the śrīsūkta[2] the fruits of the bilva (tree) should be offered to him and the fees should be paid to the priest.
7. (I shall describe) the consecration of the divine edifice the doors of which have been consecrated and wherein the image of Hari has been duly installed. It is in the consecration of the adytum. Listen.
8-9. Pitcher made of gold, silver or bell-metal filled with eight kinds of gems, herbs, minerals, seeds of grains, iron and water and covered with a cloth should be placed on the darbha (grass) in a circle to the east of the altar after the śukanāsa (the keystone) has been got ready.
10. Fallen twigs which have been gathered should be offered into fire with (the mantra of) Nṛsiṃha. Then (the temple) should be enlivened with the principle known as nārāyaṇatattva.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 71 / DAILY WISDOM - 71 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 11. భౌతిక విభజన ఉనికిలో లేదు 🌻*
*భౌతిక విభజన అనేది లేదు అనే దానికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ విభజన అనేది ఊహ మాత్రమే. మనుషుల శరీరాలు భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే పంచ భూతాలతో ఏర్పడ్డాయి. మీ శరీరం అయినా, నా శరీరం అయినా, ప్రతి ఒక్కరి శరీరం ఈ పంచ భూతాలతో మాత్రమే ఏర్పడింది. ఒక వ్యక్తి యొక్క శరీరం, 'A' అనుకుందాం, మరొక వ్యక్తి యొక్క శరీరం 'B' అనుకుందాం. ఈ రెండూ శరీరాలు అదే ఐదు మూలకాలతో ఏర్పడినందున ఒకటే అయితే, ఒక శరీరానికి మరియు మరొక శరీరానికి మధ్య మనం చూసే వ్యత్యాసానికి గల కారణం ఏమిటి?*
*ఇది రెండు శరీరాల మధ్య ఉన్న ఖాళీయే కారణం. కానీ ఈ ఖాళీ (ఆకాశం) అనేది శరీరం యొక్క నిర్మాణంలో ఒక భాగం. కాబట్టి, ఇది వ్యత్యాసం యొక్క మూలకం ఎలా అవుతుంది? మనం ప్రాదేశికమైనదిగా పరిగణించేది, మరియు, బహుశా, మనం సాధారణంగా ఒక శరీరానికి మరియు మరొక శరీరానికి మధ్య ఉండే వ్యత్యాసానికి ఏకైక కారణం, శరీర నిర్మాణంలో తప్పనిసరిగా ఉండే ఒక మూలకం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 71 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 11. Physical Division Does Not Exist 🌻*
*I shall give you a small example of how physical division does not exist. It is only imaginary. The bodies of people are constituted of the five elements—earth, water, fire, air and ether. Your body, my body and everybody’s body are constituted of only these things, nothing else—earth, water, fire, air, ether. If the body of one individual, ‘A’, is substantially the same as the body of another individual, ‘B’, because of its being formed of the same five elements, what is the reason for the distinction or the difference that we make between one body and another body?*
*It is that which exists between the two bodies. The space is the cause. But space is a part of the very constitution of the body itself. So, how does this become an element of distinction? That which we regard as spatial, and, perhaps, the only reason for the distinction that we usually make between one body and another, is an element essentially present in the constitution of the body itself.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 336 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఒక వేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు. ఆత్మ లేదని నిరూపించినా అంతే. ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం. 🍀*
*మనిషి శతాబ్దాల నుండి అబద్దాలలో జీవిస్తున్నాడు. అందమైన అబద్ధాలు, కానీ అబద్ధాలే. మనం స్వర్గాన్నీ, నరకాన్నీ నమ్ముతూ పోతున్నాం. దేవుణ్ణి నమ్ముతూ పోతున్నాం. శాశ్వతత్వాన్ని, ఆత్మని నమ్ముతూ పోతున్నాం. ఇవన్నీ విశ్వాసాలు. విశ్వాసాలు అబద్ధాలు. నీ సొంతంగా ఏదీ తెలుసుకోకుండా ఆత్మ లోపల వుందో లేదో తెలుసుకోకుండా నమ్ముతున్నావు. ఒకవేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు.*
*ఆత్మ లేదని నిరూపించినా అంతే. ఆస్తికులున్నారు. నాస్తికులున్నారు. వాళ్ళందరూ ఒకే రకమయిన జీవితం గడుపుతున్నారు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళు. ఒకే రకంగా బతుకుతున్నారు. నీకు సన్నిహితమయినది నీ ఆత్మ. నువ్వు దానిని పరిశోధించలేదు. అట్లాంటప్పుడు ఎక్కడో వున్న స్వర్గ నరకాల గురించి ఆరాటమెందుకు? ప్రార్థనాలయాల్లో అంతా వీటి చర్చే. వాదనలే. ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 073 / Siva Sutras - 073 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 22. మహాహృదాను సంధానన్ మంత్ర విర్యానుభవః - 4 🌻*
*🌴. చైతన్యం అనే మహా సముద్రంపై శ్రద్ధ గల ధ్యానం ద్వారా సర్వోత్కృష్టమైన 'నేను' యొక్క శక్తిని పొంది, మంత్రములు మరియు పవిత్ర శబ్దాలలో దాగి ఉన్న సమర్థత లేదా శక్తి యొక్క మేల్కొలుపును అనుభవిస్తారు.🌴*
*ఈ 22వ సూత్రంతో, శివసూత్రాలలోని మొదటి అధ్యాయం పూర్తయింది. త్రికా తత్వశాస్త్రంలో ఉపాయాలు అని పిలువబడే మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి శాంభవోపాయ, శక్తోపాయ మరియు ఆనవోపాయ. ఈ మూడింటిలో శంభావోపాయలలో అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో ఒక యోగి దైవిక జోక్యంతో పరమాత్మ చైతన్యంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ, యోగి తనంతట తానుగా ఏమీ చేయనవసరం లేదు. శక్తోపాయలో మానసిక చింతన ముఖ్యమైనది. యోగి యొక్క అభ్యాసం మరియు పట్టుదల ఇక్కడ ముఖ్యమైనవి. అనవోపాయంలో శ్వాస నియంత్రణ, మంత్రాలు మొదలైన వాటి ద్వారా ప్రారంభం అవుతుంది. మొదటి ఇరవై రెండు సూత్రాలు ఉపాయాలలో అత్యున్నతమైన శాంభవోపాయంతో వ్యవహరిస్తాయి. పది సూత్రాలతో కూడిన తదుపరి విభాగం శక్తోపాయంతో వ్యవహరిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 073 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 22. mahāhṛidānu saṁdhānān mantra vīryānubhavaḥ - 4 🌻*
*🌴. By the attentive meditation on the great ocean of consciousness, the power of supreme I is attained. one experiences the awakening of shaktis who are hidden in the sacred letters and sounds.🌴*
*With this 22nd sūtra, the first chapter of Śiva Sūtra-s is completed. In trika philosophy there are three principal paths called upāya-s. They are śāmbhavopāya, śāktopāya and āṇavopāya. Out of the threeśāmbhavopāya is considered as the highest where a yogi enters Supreme Divine Consciousness with divine intervention. Here, a yogi need not do much on his own. In śāktopāya mental contemplation becomes important. The yogi’s practice and perseverance are significant here. Ināṇavopāya, a beginning is made through the means of breath control, mantra-s, etc. The fist twenty two aphorisms deal with the highest of upāya-s, the śāmbhavopāya. The next section consisting of ten sūtra-s deals with śāktopāya.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments