top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 22, AUGUST 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 22, AUGUST 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 22, AUGUST 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kalki Jayanti to All. 🍀

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 03 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 03 🌴

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263 🌹

🌻. శివ పూజాంగ హోమ విధి - 8 / Mode of installation of the fire (agni-sthāpana) - 8 🌻

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 31 / Osho Daily Meditations  - 31 🌹

🍀. 31. ప్రయోగం / 31. EXPERIMENTATION 🍀

5) 🌹. శివ సూత్రములు - 131 / Siva Sutras - 131 🌹

🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -3 / 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 22, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kalki Jayanti to All. 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కల్కి జయంతి, స్కందషష్టి, Kalki Jayanti, Skanda Sashti, 🌻*


*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 17 🍀*


34. క్రోధహర్తా తాపహర్తా భక్తాభయవరప్రదః |

భక్తానుకంపీ విశ్వేశః పురుహూతః పురందరః

35. అగ్నిర్విభావసుర్భాస్వాన్ యమో నిరృతిరేవ చ |

వరుణో వాయుగతిమాన్ వాయుః కుబేర ఈశ్వరః


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : భావన, జ్ఞానోపలబ్ధి - లక్ష్యమును గురించిన భావన వేరు, ఆధ్యాత్మిక జ్ఞానోపలబ్ధి వేరు. భావన ఆధ్యాత్మిక జ్ఞానోపలబ్ధికి నిన్ను అభిముఖునిగా జేయవచ్చును. అంతేతప్ప, అదే జ్ఞానోపలబ్ధి కానేరదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల షష్టి 27:07:30 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: చిత్ర 06:32:11 వరకు

తదుపరి స్వాతి

యోగం: శుక్ల 22:18:09 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: కౌలవ 14:34:16 వరకు

వర్జ్యం: 12:30:38 - 14:13:06

దుర్ముహూర్తం: 08:31:49 - 09:22:17

రాహు కాలం: 15:28:15 - 17:02:54

గుళిక కాలం: 12:18:57 - 13:53:36

యమ గండం: 09:09:40 - 10:44:19

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43

అమృత కాలం: 22:45:26 - 24:27:54

సూర్యోదయం: 06:00:23

సూర్యాస్తమయం: 18:37:32

చంద్రోదయం: 10:34:10

చంద్రాస్తమయం: 22:17:43

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన

నాశనం, కార్య హాని 06:32:11 వరకు

తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kalki Jayanti to All. 🍀🌹*

*- ప్రసాద్ భరద్వాజ*

22-8-2023


*🌻. శ్రీ కల్కి స్తోత్రం 🌻*


సుశాంతోవాచ |

జయ హరేఽమరాధీశసేవితం

తవ పదాంబుజం భూరిభూషణమ్ |

కురు మమాగ్రతః సాధుసత్కృతం

త్యజ మహామతే మోహమాత్మనః


తవ వపుర్జగద్రూపసంపదా

విరచితం సతాం మానసే స్థితమ్ |

రతిపతేర్మనో మోహదాయకం

కురు విచేష్టితం కామలంపటమ్


తవ యశో జగచ్ఛోకనాశకం

మృదుకథామృతం ప్రీతిదాయకమ్ |

స్మితసుఖేక్షితం చంద్రవన్ముఖం

తవ కరోత్యలం లోకమంగళమ్


మమ పతిస్త్వయం సర్వదుర్జయో

యది తవాప్రియం కర్మణాచరేత్ |

జహి తదాత్మనః శత్రుముద్యతం

కురు కృపాం న చేదీదృగీశ్వరః


మహదహంయుతం పంచమాత్రయా

ప్రకృతిజాయయా నిర్మితం వపుః |

తవ నిరీక్షణాల్లీలయా జగ-

-త్స్థితిలయోదయం బ్రహ్మకల్పితమ్


భూవియన్మరుద్వారితేజసాం

రాశిభిః శరీరేంద్రియాశ్రితైః |

త్రిగుణయా స్వయా మాయయా విభో

కురు కృపాం భవత్సేవనార్థినామ్


తవ గుణాలయం నామ పావనం

కలిమలాపహం కీర్తయంతి యే |

భవభయక్షయం తాపతాపితా

ముహురహో జనాః సంసరంతి నో


తవ జపః సతాం మానవర్ధనం

జినకులక్షయం దేవపాలకమ్ |

కృతయుగార్పకం ధర్మపూరకం

కలికులాంతకం శం తనోతు మే


మమ గృహం ప్రతి పుత్రనప్తృకం

గజరథైర్ధ్వజైశ్చామరైర్ధనైః |

మణివరాసనం సత్కృతిం వినా

తవ పదాబ్జయోః శోభయంతి కిమ్


తవ జగద్వపుః సుందరస్మితం

ముఖమనిందితం సుందరాననమ్ |

యది న మే ప్రియం వల్గుచేష్టితం

పరికరోత్యహో మృత్యురస్త్విహ


హయచర భయహర కరహరశరణ

ఖరతరవరశర దశబలదమన |

జయ హతపరభవ భరవరనాశన

శశధర శతసమరసభరమదన ||


ఇతి శ్రీకల్కిపురాణే శ్రీసుశాంతకృతం కల్కిస్తోత్రమ్ |

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 03 🌴*


*03. ఏవమేత ద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |*

*ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ||*


*🌷. తాత్పర్యం : ఓ పురుషోత్తమా! ఓ పరమేశ్వారా! నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థరూపమును నేను నా యెదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ నభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును.*


*🌷. భాష్యము : భౌతికవిశ్వమునందు తాను తన స్వీయప్రాతినిధ్యముచే ప్రవేశించియున్న కారణముగా అది సృష్టినొంది, నడుచుచున్నదని శ్రీకృష్ణభగవానుడు పలికెను. తనకు సంబంధించినంతవరకు అర్జునుడు శ్రీకృష్ణుని వచనములచే జ్ఞానవంతుడయ్యెను. కాని శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యని భావించు నవకాశము కలిగిన భావిజనులకు విశ్వాసము కలిగించుట కొరకు అతడు ఆ దేవదేవుని విశ్వరూపమునందు గాంచగోరెను. తద్ద్వారా ఏ విధముగా ఆ భగవానుడు విశ్వమునకు పరుడై యున్నను విశ్వకార్యము నొనరించునో అతడు తెలియనెంచెను. అర్జునుడు శ్రీకృష్ణుని “పురుషోత్తమ” అని సంబోధించు యందును ప్రాముఖ్యము కలదు. ఏలయన దేవదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుని అంతరమునందు నిలిచి అతని కోరికను ఎరిగియుండెను.*


*స్వీయ రూపమునందు గాంచుటనే సంపూర్ణముగా తృప్తిని బడసియున్నందున తనను విశ్వరూపమునందు నమ్మకమును కలిగించుటకే అతడు విశ్వరూపమును గాంచ గోరుచున్నాడనియు శ్రీకృష్ణుడు ఎరిగియుండెను. అనగా నిర్ధారణమును గూర్చి అర్జునుడు ఎట్టి స్వీయకోరికను కలిగియుండలేదు. భవిష్యత్తులో పలువురు తాము భగవానుని అవతారములని పలుకు అవకాశమున్నందున ఆ విషయమున ఒక ప్రమాణమును లేదా గురుతును ఏర్పరచుటకు అర్జునుడు విశ్వరూపమును గాంచగోరెనని శ్రీకృష్ణుడు అవగతము చేసికొనెను. కనుక తాము అవతారములని ప్రకటించుకొనివారి విషయమున జనులు జాగరూకులై యుండవలెను. తాను కృష్ణుడనని పలుకువాడు విశ్వరూపమును చూపి తన పలుకు సత్యమని జనులకు నిరూపణ చేయ సంసిద్ధుడై యుండవలెను.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 417 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 03 🌴*


*03. evam etad yathāttha tvam ātmānaṁ parameśvara*

*draṣṭum icchāmi te rūpam aiśvaraṁ puruṣottama*


*🌷 Translation : O greatest of all personalities, O supreme form, though I see You here before me in Your actual position, as You have described Yourself, I wish to see how You have entered into this cosmic manifestation. I want to see that form of Yours.*


*🌹 Purport : The Lord said that because He entered into the material universe by His personal representation, the cosmic manifestation has been made possible and is going on. Now as far as Arjuna is concerned, he is inspired by the statements of Kṛṣṇa, but in order to convince others in the future who may think that Kṛṣṇa is an ordinary person, Arjuna desires to see Him actually in His universal form, to see how He is acting from within the universe, although He is apart from it. Arjuna’s addressing the Lord as puruṣottama is also significant. Since the Lord is the Supreme Personality of Godhead, He is present within Arjuna himself; therefore He knows the desire of Arjuna, and He can understand that Arjuna has no special desire to see Him in His universal form, for Arjuna is completely satisfied to see Him in His personal form of Kṛṣṇa.*


*But the Lord can understand also that Arjuna wants to see the universal form to convince others. Arjuna did not have any personal desire for confirmation. Kṛṣṇa also understands that Arjuna wants to see the universal form to set a criterion, for in the future there would be so many imposters who would pose themselves as incarnations of God. The people, therefore, should be careful; one who claims to be Kṛṣṇa should be prepared to show his universal form to confirm his claim to the people.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*


*🌻. శివ పూజాంగ హోమ విధి - 8 🌻*


*యజ్ఞాగ్నికిని,శివునకును తనతో నాడీసంధానము చేసి శక్త్యను సారముగ మూలమంత్రముతో అంగసహితముగ దశాంశహోమము చేయవలెను. ఒక్కొక్క కర్షప్రమాణము గల ఘృత-క్షీర-మధులను,శుక్తిప్రమాణము గల పెరుగును. చారెడు పాయసమును హోమము చేయవలెను. లాజలు, సర్వభక్ష్యములు పిడికిలి ప్రమాణమున గ్రహించి హోమము చేయవలెను. మూలములు మూడు ముక్కలు ఒక ఆహుతిగా ఈయవలెను-ఫలములో వాటిప్రమాణ మెంత ఉండునో అంతే చేయవలెను. అన్నము ప్రమాణము గ్రాసములో సగము. చిన్న (కిన్‌మిస్‌ వంటి) వాటిని పర్యాయమునకు ఐదేసి గ్రహించి హోమము చేయవలెను. చెరకు ఒక కణుపు గ్రహించవలెను. లతలు రెండేసి అంగుళము లుండవలెను. పుష్పపత్రముల ప్రమాణము వాటి ప్రమాణము ననుసరించి ఉండవలెను. సమిధలు పది అంగుళములు పొడవుండవలెను.*


*కర్పూర-చందన-కేసర-కస్తూరీ-యక్షకర్దమములు కలాయ ప్రమాణమున (శనగగింజంత) ఉండవలెను. గుగ్గులు రేగి గింజంత ఉంచడవలెను. కందముల ఎనిమిదవ వంతుతో ఒక ఆహుతి చేయవలెను. ఈ విధముగ ఆలోచించి, యథావిధిగ ఆహుతుల నీయవలెను. ఈ విధముగ ప్రణవముతోను, బీజాక్షరములతోను హోమము సుసంపన్న మగు నటుల చేయవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 263 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 75*

*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 8 🌻*


46. Having established a union among the god of the sacrificial fire, god Śiva and his soul situated in his arteries, (the worshipper) should offer oblations with the principal mantra befitting one’s capacity and using one-tenth of mantras as a. supplement.


47. A kārṣika (a particular weight) of the clarified butter, milk and honey and a śukti (twice that of kārṣika) of the curd and a handful of sweet porridge (should be) offered.


48-49. The worshipper should offer as deemed fit the oblation with all the eatables, a handful of fried grains, three pieces of roots and an equal number of fruits. Five halfmouthfuls of cooked rice, bits of sugarcane of the length of a span and stems of sacrificial creepers measuring two fingers in length should be offered into the fire.


50. The oblations of flowers and leaves should be according to their own measure. The sacrificial twigs should measure ten fingers in length. The camphor, sandal, saffron, musk and an ointment made of camphor, aggallochum and kakkola in equal parts (should also be offered).


51. (The worshipper) should make an oblation of the kalāya (a leguminous seed) and guggulu (a fragrant (gum-resin) of the size of the kernel of the jujube fruit and eight parts of the roots as laid down.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 31 / Osho Daily Meditations  - 31 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀. 31. ప్రయోగం 🍀*


*🕉. ఎల్లప్పుడూ బహిరంగంగా మరియు ప్రయోగాత్మకంగా ఉండండి, మీరు ఇంతకు ముందెన్నడూ నడవని మార్గంలో నడవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎవరికీ తెలుసు? అది పనికిరాదని రుజువైనా, అది అనుభవమే. 🕉*


*ఎడిసన్ దాదాపు మూడు సంవత్సరాలు ఒక నిర్దిష్ట ప్రయోగంలో పని చేస్తున్నాడు మరియు అతను ఏడు వందల సార్లు విఫలమయ్యాడు. అతని సహచరులు మరియు అతని విద్యార్థులందరూ పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. ప్రతిరోజు ఉదయం అతను ల్యాబ్‌కి సంతోషంగా మరియు ఆనందంతో హుషారుగా వస్తాడు, మళ్లీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏడు వందల సార్లు మరియు మూడు సంవత్సరాలు వృధా! ఇది చాలా ఎక్కువ: ప్రయోగం వల్ల ఏమీ జరగబోదని అందరూ దాదాపుగా నిశ్చయించుకున్నారు. మొత్తానికి పనికిరానిది, ఊహ కందనిపించింది. వారంతా సమావేశమై ఎడిసన్‌తో, 'మనం ఏడు వందల సార్లు విఫలమయ్యాము. మనం ఏమీ సాధించలేదు. ఆపాలి.' ఎడిసన్ ఉలిక్కిపడి నవ్వాడు. అతను, 'ఏం మాట్లాడుతున్నావు? విఫలమైందా? ఏడువందల పద్దతులు ఎలాంటి సహాయం చేయవని తెలుసుకోవడంలో మనం విజయం సాధించాము. అన్నాడు.*


*మనం రోజురోజుకూ సత్యానికి దగ్గరగా వస్తున్నాం! ఆ ఏడు వందల తలుపులు మనం తట్టకుంటే మనకు తెలిసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము ఏడు వందల తలుపులు తప్పు అని నిశ్చయించుకున్నాము. ఇది గొప్ప విజయం! ఇది ప్రాథమిక శాస్త్రీయ దృక్పథం: ఏదైనా తప్పు అని మీరు నిర్ణయించ గలిగితే, మీరు సత్యానికి దగ్గరగా వస్తున్నారు. మార్కెట్‌లో సత్యం అందుబాటులో లేదు కాబట్టి నేరుగా వెళ్లి ఆర్డర్ చేయలేరు. ఇది రెడీమేడ్ కాదు, అందుబాటులో లేదు. మీరు ప్రయోగం చేయాలి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రయోగాత్మకంగా ఉండండి. మీరు చేసేది సరైనది అని ఎప్పుడూ అనుకోకండి. ఇది ఎప్పుడూ పరిపూర్ణమైనది కాదు. దానిపై మెరుగుపరచడం ఎల్లప్పుడూ సాధ్యమే; దానిని మరింత పరిపూర్ణంగా చేయడం ఎల్లప్పుడూ సాధ్యపడుతుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 31 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 31. EXPERIMENTATION 🍀*


*🕉 Always remain open and experimentative, always ready to walk a path you have never walked before. Who knows? Even if it proves useless, it will be an experience. 🕉*


*Edison was working on a certain experiment for almost three years, and he had failed seven hundred times. All his colleagues and his students became completely frustrated. Every morning he would come to the lab happy and bubbling with joy, ready to start again. It was too much: seven hundred times and three years wasted! Everybody was almost certain that nothing was going to come of the experiment. The whole thing seemed to be useless, just a whim. They all gathered and told Edison, "We have failed seven hundred times. We have not achieved anything. We have to stop." Edison laughed uproariously. He said, "What are you talking about? Failed? We have succeeded in knowing that seven hundred methods won't be of any help.*


*We are coming closer and closer to the truth every day! If we had not knocked on those seven hundred doors, we would have had no way of knowing. But now we are certain that seven hundred doors are false. This is a great achievement! This is the basic scientific attitude: If you can decide that something is false, you are coming closer to the truth. Truth is not available in the market so that you can go directly and order it. It is not ready-made, available. You have to experiment. So always remain experimentative. And never become smug. Never think that whatever you are doing is perfect. It is never perfect. It is always possible to improve on it; it is always possible to make it more perfect.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 131 / Siva Sutras - 131 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -3 🌻*


*🌴. ఆత్మశుద్ధి త్యాగంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి , ప్రపంచాన్ని శివుని స్వప్నంగా మరియు  అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴*


*సాంకేతికంగా చెప్పాలంటే, క్రియాశీల స్థితిలో ఉన్న సమయంలో నెరవేరని కోరికలు స్వప్న స్థితిలో ఉద్భవిస్తాయి. చిట్టచివరకు చైతన్యం మాత్రమే భగవంతునిగా వ్యక్తమవుతుంది. చైతన్యం యొక్క అత్యల్ప స్థాయి అంటే, భౌతిక జీవితంతో ముడిపడి ఉన్న ఆలోచన ప్రక్రియ. చైతన్యం యొక్క అత్యున్నత స్థాయి అంటే దేనితోనూ సంబంధం లేని ఆలోచన ప్రక్రియ, అది ఒంటరిగా ఉంటుంది. దీనిని ఎడారిలో ఒంటరి వ్యక్తితో పోల్చవచ్చు. మైళ్లకొద్దీ ఇసుక తిన్నెలను మాత్రమే చూస్తాడు. అతని మనస్సు క్రమంగా ఈ శూన్యతకు అలవాటు పడిపోతుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 131 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -3 🌻*


*🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge.   🌴*


*Technically speaking, unfulfilled desires during the active state emerge during dream state. Ultimately it is only the consciousness that manifests as God. The lowest level of consciousness means, the thought process associated with material life. The highest level of consciousness means the thought process that is not associated with anything at all, where it remains all alone. This can be compared to a lonely person in a desert. For miles and miles he sees only sand dunes. His mind gradually gets accustomed to this nothingness.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page